Naga Shaurya Is Back With Varudu Kavalenu: Rana Daggubati

* ‘వరుడు కావలెను‘ తో నాగశౌర్య ఈజ్‌ బ్యాక్‌ – రానా దగ్గుబాటి

*‘వరుడు కావలెను’ చేసినందుకు గర్వ పడుతున్నా – హీరో నాగశౌర్య
*వినోద భరితంగా జరిగిన ‘ వరుడు కావలెను‘ ట్రైలర్ విడుదల వేడుకప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రానా దగ్గుబాటి ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం…రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘నాగశౌర్యని చూస్తే ‘రాముడు మంచి బాలుడు’ అన్న సామెత గుర్తొస్తుంది. ఈ సినిమాకు హీరో ఎవరనేది చెప్పకపోయినా టైటిల్‌ని బట్టి నాగశౌర్య హీరో అని చెప్పగలను. ట్రైలర్‌ బావుంది. థియేటర్లు మొదలయ్యాయి. సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాతో నాగశౌర్య ఈజ్‌  బ్యాక్‌ అని చెప్పగలను. ఈరోజు ఇక్కడికి గెస్ట్‌లా రాలేదు. మా ‘భీమ్లా నాయక్‌’ నిర్మాత కోసం వచ్చాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’’ అని అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ …‘
‘చలో ‘ సక్సెస్‌ పార్టీలో సౌజన్య వచ్చి ‘తమ్ముడు నీకో కథ చెబుతా చేస్తావా’ అని అడిగింది. లైన్‌ నచ్చి వెంటనే ఓకే చేశా. కథ వినగానే సూపర్‌హిట్‌ అని ఫిక్స్‌ అయ్యా. ఇలాంటి కథను ఎంత చెడగొట్టాలన్నా చెడగొట్టలేము. ఎందుకంటే పేపర్‌ మీద ఈ కథ హిట్‌. తెరపై కూడా అంతే హిట్‌ అవుతుందని చెప్పగలను. మొదట చిన్న సినిమా అనుకున్నా. సితార బ్యానర్‌ తోడు అవ్వడంతో సినిమా స్థాయి పెరిగింది. చినబాబు గారు , నాగవంశీ గారు ఫలానా హీరోకి ఇంతే బడ్జెట్‌ పెట్టాలనుకునే నిర్మాతలు కారు. ‘డబ్బు ఎలా రాబట్టాలి అనే దానికంటే కథకు ఎంత పెట్టాలి’ అని ఆలోచన ఉన్న  వారిని మేకర్స్‌ అంటారు. అలాంటి వారే చినబాబు గారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. తెరపై ఆర్టిస్ట్‌లంతా ఫ్రెష్‌గా కనిపించడానికి కారణం డైలాగ్‌లు. గణేష్‌ రావూరి చక్కని సంభాషణలు రాశారు. నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం మా డిఓపీ వంశీ పచ్చిపులుసు. ఆయన కెమెరా పనితనానికి నాతో నేనే లవ్‌లో పడిపోయా. విశాల్‌ చంద్రశేఖర్‌ చక్కని బాణీలు ఇచ్చారు. సౌజన్య అక్క నన్ను, సినిమాను ఎంతో ప్రేమించి ఈ సినిమా చేసింది. ఈ సినిమాతో సౌజన్య అక్క కల నెరవేరబోతోంది. రీతు చాలా అద్భుతంగా యాక్ట్‌ చేసింది. తను వేరే షూటింగ్‌లో ఉండి రాలేకపోయింది. మంచి కథతో ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నా. ట్రైలర్‌ విడుదల చేయడానికి వచ్చిన రానా అన్నకి థ్యాంక్స్‌’ అని అన్నారు.
‘‘రియల్‌ లైఫ్‌లో నేను కూల్‌గా ఉంటాను. వైఫ్‌ డామినేటింగ్‌ ఉన్నా నాకు పర్వాలేదు. అలాగని అన్ని ఈ విషయాల్లో అడస్ట్‌ కాను. ఎక్కడ రివర్స్‌ అవ్వాలో అక్కడ అవుతాను. నా గత చిత్రానికి ఈ సినిమాకు పదహారు కేజీల వెయిట్‌ తగ్గాను. అదే పెద్ద యునీక్‌నెస్‌. చాలా క్లాసిక్‌ సినిమా ఇది. కుటుంబ సభ్యులంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు’’ అని అభిమానులు అడిగిన ప్రశ్నలకు నాగశౌర్య సమాధానమిచ్చారు.నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…
మా సంస్థ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ మీదే ఎక్కువ దృష్టి పెడుతుంది. మాకు అవే బాగా కలిసొచ్చాయి. ఇది ఫ్యామిలీ, కమర్షియల్‌ సినిమా. సెకెండాఫ్‌లో ఒక సస్పెన్స్‌ ఉంది. అది యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది’’ అని అన్నారు.
దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ‘బిజీ షెడ్యూల్‌లో కూడా రానాగారు ట్రైలర్‌ లాంచ్‌ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు.మాటల రచయిత గణేష్‌ రావూరి మాట్లాడుతూ…
‘‘భూమిలాంటి అమ్మాయిని ఇంప్రెస్‌ చేయాలంటే ఆకాష్‌లాంటి అబ్బాయి కావాలి. ఈ చిత్రంలో మా హీరోహీరోయిన్ల పాత్రలు అంత ప్లజెంట్‌గా ఉంటాయి. ఫన్‌, ఎమోషన్స్‌, అద్భుతమైన సంగీతం అన్ని ఉన్న చిత్రమిది. నాగశౌర్య కథ వినగానే బ్లాక్‌బస్టర్‌ అవుతుందని చెప్పారు. బయటి టాక్‌ కూడా అలాగే వినిపిస్తుంది. రీతువర్మ ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. నదియా పాత్ర సినిమాకు చాలా కీలకం. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

గేయ రచయిత రాంబాబు గోశాల మాట్లాడుతూ

 ఈ చిత్రంలో ‘కోల కళ్లే ఇలా’ పాట రాశాను. పాటకు చక్కని పదాలు కుదిరాయి. అంతే అద్భుతంగా సిద్‌ శ్రీరామ్‌ పాడారు. ఈ పాటలో నాగశౌర్య, రీతు చాలా గ్లామర్‌గా కనిపిస్తారు. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ…
‘‘నా కామెడీని మిస్‌ అయిన అందరినీ ఇందులో నవ్వులతో చీల్చి చెండాడతా. సెకెండాఫ్‌లో అంతగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. ఈ పాత్ర నేనే చేయాలి అని దర్శకనిర్మాతలు నాకీ అవకాశం ఇచ్చారు’’ అని అన్నారు.సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ
‘‘మంచి పాటలు కుదిరాయి. సింగర్స్‌, మ్యుజిషియన్స్‌ చాలా సపోర్ట్‌ చేశారు. తమన్‌ సంగీతం అందించిన రెండు పాటలూ నాకు నచ్చాయి. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Naga Shaurya Is Back With Varudu Kavalenu: Rana Daggubati

~ Proud To Be Part Of Varudu Kavalenu: Naga Shaurya
~ Varudu Kavalenu Trailer Launch Was Fun-Filled Event

Successful production house Sithara Entertainments is producing Naga Shaurya and Ritu Varma-starrer Varudu Kavalenu. The film marks the directorial debut of Lakshmi Sowjanya and is all set for grand theatrical release on 29th October, 2021. The trailer of the film was unveiled last night in Hyderabad in a grand event which had the attendance of Rana Daggubati. The event was fun-filled and thoroughly entertaining with Naga Shaurya, director Lakshmi Sowjanya and producer Naga Vamsi interacting with the social influencers and answering their funny questions.

Speaking at the event, Rana Daggubati said, “Naga Shaurya is a symbol for good guy. The proverb that comes to one’s mind about Shaurya is ‘Ramu is a good boy’. ‘Varudu Kavalenu’ is a great title and it is apt for Shaurya. Even if one doesn’t reveal the hero’s name, looking at the title we can expect that Naga Shaurya is the hero of the film. Trailer is interesting and promising. Theatres are back. Movies are back. Naga Shaurya is also back with ‘Varudu Kavalenu’. I wish all the best for the entire team. Today, I didn’t come here as a guest. I came for my ‘Bheemla Nayak’ producer Naga Vamsi. I came from straight from the shooting location. I’m sure he will score success with ‘Varudu Kavalenu’ too.”

Talking at the trailer launch, Naga Shaurya said, “During Chalo success party, director Sowjanya Akka came to me and asked me whether I would do a film if I like her story. She had told me the storyline of ‘Varudu Kavelnu’ and I was mighty impressed. After hearing the whole story, I decided that the movie is going to be a big hit. On paper itself, movie is a hit. I’m sure the movie will be big hit on big screens as well. Initially I had thought it was a small movie. But with the addition of a prestigious banner like Sithara Entertainments, the film has become bigger. Producers Chinna Babu Garu and Naga Vamsi Garu are very passionate. They understand the cinema well. They don’t confine a budget to a film based on the hero. They provide budget to the film based on its story and the scale required for the story. Chinna Babu Garu is a true maker. He knows best what all a film requires. ‘Varudu Kavalenu’ caters to all sections of audiences. The film is well balanced such that both family audiences and youth audiences would enjoy thoroughly. The film has really shaped up well. Final output is very good and we’re all quite confident of the film’s success. All the characters in the film really look fresh. Thanks to Ganesh Ravuri’s dialogues which are appealing. The credit for showing me handsome on screen goes to our Cinematographer Vamsi Pachipulusu. His camera work is so nice such that I fell in love with myself after seeing me on screen. Music composer Vishal Chandrasekhar has delivered good tunes. Director Sowjanya Akka has made it so easy and comfortable for me. She has loved the film a lot. Finally, her dreams are turning into real with this movie. Ritu Varma has acted so well. She couldn’t make it to the today’s event as she is busy shooting for another movie. I’m really proud to choose the story of ‘Varudu Kavalenu’ and being part of the film. Thanks to Rana Daggubati Anna for coming all the way and releasing our film’s trailer.”

Responding to some funny questions posed by onlookers and social influencers who attended the trailer launch event, Naga Shaurya said, “I’m very cool in real-life. I’m okay even if my future wife is dominating. At the same time, I won’t adjust in all the matters. I know very well when to reverse. I have reduced 16 kilos of my weight from my previous film. This is the change and uniqueness you can see in me on screen in ‘Varudu Kavalenu’. It is a classic film where family audiences can enjoy it to the core.”

Speaking after the trailer launch, Producer Naga Vamsi said, “Family entertainments have always been top of our priority. We at Sithara Entertainments were fortunate to taste successes with this genre. ‘Varudu Kavalenu’ is a family entertainment with commercial touch. It will appeal to family audiences as well as youth audiences. There is a suspense element in the second half of the film which will stand out. Youth will connect to that suspense element.”

Director Lakshmi Sowjanya thanked Rana Daggubati for gracing the event and launching the film’s trailer. Dialogue writer Ganesh Ravuri said Bhumi and Akash are well-designed characters who are perfect match. He said that the characters are so pleasant to watch on screen. He said the film has fun, emotions and good music in right proportions. “After listening to the story, hero Naga Shaurya Garu said the movie will be a blockbuster. He is right. The outside talk about the film is also the same. Ritu Varma has never played such character. She is perfect for Bhumi’s character. Nadiya’s role is very crucial in the film. I thank my producers for giving me this opportunity to pen dialogues in the film,” said dialogue writer Ganesh Ravuri.

Song writer Rambabu Gosala, who penned the song ‘Kola Kalle Ila’, said he has penned good lyrics for the song. He said music director Vishal Chandrasekhar has done magic with music. He said Sid Sriram has sung the song nicely. Rambabu added that lead actors Naga Shaurya and Ritu Varma are looking glamorous in this song. He said Sithara Entertainments is encouraging him and thanked them for their support.

Comedian Sapthagiri said, “Those who missed my comedy will get a feast with my character in ‘Varudu Kavalenu’. Especially, second-half will have out-and-out entertainment. The word ‘lag’ will play significant role in the film which everyone will enjoy on screen. My character is a tailor-made one and the director, producers wanted me to play it. I thank them.”

Music composer Vishal Chandrasekhar shared, “Songs in ‘Varudu Kavalenu’ have come out really well. Singers and musicians have given their best. The two songs composed by Thaman are so nice. I’m glad to be part of this film.”

Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.For this movie
Dialogues: Ganesh Kumar Ravuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
PRO: Lakshmivenugopal
Presents by: P.D.V Prasad
Produced by: Surya Devara NagaVamsi
Story- Direction:Lakshmi Sowjanya
6R3B3522 6R3B3524 6R3B3616 6R3B3626 DSC_3162