Jun 16 2023
Vijay Devarakonda, Sree Leela, Sithara Entertainments, Fortune Four film, VD12 commences shoot
*విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, శ్రీలీల, సితార ఎంటర్ టైన్మెంట్స్ సినిమా VD 12 రెగ్యులర్ షూటింగ్ మొదలు.*
విజయ్ దేవరకొండ 12వ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఈరోజు సారథి స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.
అవార్డ్ విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కథానాయిక గా ప్రకటించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకులలో ఒకరైన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబందించి విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్ యూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో గన్ పట్టుకొని విజయ్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు.
తారాగణం: విజయ దేవరకొండ, శ్రీలీల
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
Vijay Devarakonda, Sree Leela, Sithara Entertainments, Fortune Four film, VD12 commences shoot
It is known that Tollywood heartthrob Vijay Deverakonda is collaborating with Jersey fame, Gowtam Tinnanuri for an intense action thriller which is tentatively titled VD12.
The latest news pertaining to the project is that it has commenced the shooting in Hyderabad earlier today. The shooting started at Saradhi Studios in Hyderabad and the lead cast and crew took part in the same.
The makers unveiled a new poster featuring Vijay. In the poster, we see Vijay holding a gun and he looks dapper in the same. This is an out focus poster so we don’t get a glimpse of his look.
The film is directed by Gowtam and it has Sree Leela in the leading lady role. Sithara Entertainments and Fortune Four Cinemas are producing it. Anirudh is composing the music for the film.