Feb 1 2021
Puvvalle Melukunnadi Song from FCUK (Father Chitti Uma Karthik) movie released by Baby Prakruthi
‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)
జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత టైటిల్ రోల్స్ పోషించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)
రీల్ హీరోల స్థానంలో రియల్ హీరోలతో ఈ చిత్రంలోని నాలుగు పాటలను చిత్ర బృందం విడుదల చేయిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ముందుండి అవిశ్రాంతంగా సేవలందిస్తూ వస్తున్న వైద్య-ఆరోగ్య, మునిసిపల్, పోలీస్, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజెయ్యాలనే సత్సంకల్పంతో వారి చేతుల మీదుగా నాలుగు పాటలను విడుదల చేశారు. అవి సంగీత ప్రియులను బాగా అలరిస్తున్నాయి.
లేటెస్ట్‌గా పాపులర్ సింగర్ గీతామాధురి కుమార్తె బేబి ప్రకృతి చేతుల మీదుగా “పువ్వల్లే మేలుకున్నది” అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పాటను మధురంగా ఆ తల్లీకూతుళ్లు ఆలపించడం విశేషం.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, ఈ పాట పిల్లలు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధానికి సంబంధించిందనీ, “పువ్వల్లే మేలుకున్నది” పాట ఆవిష్కరణలో బేబి ప్రకృతి, అమ్మ గీతామాధురి మధ్య ఆ అనుబంధమే ప్రతిఫలించడం చూడ్డానికి ఎంతో బాగుందనీ అన్నారు.
గీతామాధురి మాట్లాడుతూ, నిజంగా పాట చాలా బాగుందనీ, సినిమా అంతకు మంచి బాగుంటుందని ఆశిస్తున్నాననీ అన్నారు. ఫిబ్రవరి 12న విడుదలవుతున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ఒక చక్కని పాటను తల్లీకూతుళ్లు గీతామాధురి, బేబి ప్రకృతి విడుదల చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందనీ, ఫిబ్రవరి 6న ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తామనీ తెలిపారు.
రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన క్యారెక్టర్ లుక్ పోస్టర్లు కానీ, టీజర్ కానీ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. టీజర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
తారాగణం:
జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్.
సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూసర్: వాసు పరిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీకాంత్‌రెడ్డి పాతూరి
సహనిర్మాత: యలమంచిలి రామకోటేశ్వరరావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్.
As announced earlier, Baby Prakruthi Daughter of acclaimed singer Geethamadhuri released Puvvalle Melkunnadi song from FCUK (Father Chitti Uma Karthik) movie. The intense attachment and love between the cute baby and her famous mother was on show as they crooned the song from FCUK (Father Chitti Uma Karthik) Movie to launch it. Music Director Bheems Ceciroleo speaking on the occasion said this song was specifically about the magic of the relationship between children and parents and it was wonderful to see the same being reflected in the launch between Baby Prakruthi and her mother Geethamadhuri. Geetamadhuri said the song is amazing and she wished the movie the best and also said that he is looking forward to see the movie when it releases on February 12th. Hero Ram Kaarthik thanked the daughter and mother for releasing the song and announced that the full video song will be released on February 6th. The movie has been directed by Vidyasagar Raju and produced by K L Damodar Prasad of Sri Ranjith Movies which has a phenomenal record of highly successful movies that have set standards in Tollywood.