Surender Reddy unveils MisMatch trailer, movie to release on Dec 6th


* డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ‘మిస్ మ్యాచ్’ ట్రైలర్ విడుదల

* డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు !!!‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  ’మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  ఇప్పటికే ప్రకటించారు..

 సెన్సార్ ‘యు’  సర్టిఫికెట్ ను పొందిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
రచయిత భూపతి రాజా మాట్లాడుతూ…’మిస్ మ్యాచ్’ సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. రెండు కుటుంబాల మధ్య జరిగే కథను దర్శకుడు నిర్మల్ బాగా  చూపించారు కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమా ఇది అవుతుందని తెలిపారు.మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ మాట్లాడుతూ..నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు, అందరికి నచ్చే పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబర్ 6 న విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

దర్శకుడు నిర్మల్ మాట్లాడుతూ…నా మొదటి తెలుగు సినిమా ఇది. నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు, మ్యూజిక్ బాగా రావడానికి కారణమైన గిఫ్టన్ గారికి థాంక్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఈ మూవీకి ఉన్నాయి. తప్పకుండా ఆడియన్స్ అందరికి ఈ సినిమా నచ్చుతుందని తెలిపారు

నిర్మాత జి.శ్రీరామ్ రాజు మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. దర్శకుడు నిర్మల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భూపతి రాజా గారు మంచి కథ ఇచ్చారు. ఈ చిత్ర టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో  కష్టపడి పని చేశారు. ఉదయ్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…మా చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సురేందర్ రెడ్డి గారికి థాంక్స్, మంచి కథ, కథనాలు ఉన్న సినిమ ‘మిస్ మ్యాచ్’. నిర్మల్ కుమార్ గారు సినిమాను అందంగా తెరకెక్కించారు. తొలిప్రేమ చిత్రంలోని ఈ మనసే సాంగ్ ఈ సినినిమాలో రీమిక్స్ చేశాం, అందరికి నచ్చుతుంది. డిసెంబర్ 6న మీ ముందుకు వస్తున్న మా సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.

ముఖ్య అతిధి దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ…’మిస్ మ్యాచ్’ టైటిల్ బాగుంది. హీరో ఉదయ్ బాగా చేసాడు. కథ అందించిన భూపతి గారికి, డైరెక్టర్ నిర్మల్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. డైరెక్టర్ నిర్మల్ తమిళ్ లో చేసిన చదరంగ వెట్టై పెద్ద హిట్, అదే విధంగా తాను తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ‘మిస్ మ్యాచ్’ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను, ఈ చిత్రంలో నటించిన  నటీనటులకు, సాంకేతిక నిపుణులకు గుడ్ లక్. తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను  అన్నారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
 90567 (6) 90567 (5) 90567 (4) 90567 (3) 90567 (2) 90567 (1)
Surender Reddy unveils MisMatch trailer, movie to release on Dec 6th
Starring Uday Shankar and Aishwarya Rajesh in lead roles, MisMatch is gearing up for release on December 6th. Adhiroh creative science LLP bankrolled the film. The trailer of the film was unveiled by ace filmmaker Surender Reddy.The writer of the film, Bhupathi Raja said MisMatch has an interesting subject and will attract family audience.

The music director Gifton said the audio album is a really good one and it has feel-good songs.

The director, Nirmal said this is his first film and hopes the audience will like the film’s theme and content.

The producer sreeram raaju  thanked Surender Reddy for releasing the trailer. He thanked the technicians for the brilliant efforts.

The male lead, Uday said the film has enough emotions and gripping elements to keep the viewers engaged all the way through.

Director Surender Reddy said the lead actor, Uday acted well in the film and wished the entire team all the very best for the film. “I hope the film becomes a huge hit,” he said.

Other co actors sanjay swaroop,Pradeep rawath ,roopalaxmi,sharanya

Music Director: Gifton Elias, Director of Photography: Ganesh Chandrra Story: Bhupathy Raja Dialogue writer: Rajendra Kumar, Madhu

Lyrics: Sirivennela Sitarama Sastry, Suddhala Ashok teja,Oruganti Dharma teja,Shreshta,  Art Director: Mani Vasagam Director: NV NirmalKumar Producers: G. Sriram Raju,K. Bharath Ram
Special thanks to Stylish Ace Director @DirSurender Garu for launching #MisMatch Trailer!Watch the Lovely trailer here
▶️ 

@USUdayShankar @aishu_dil @Dir_nirmalkumar #GSriramRaju #KBharatRam @GiftonElias @Ganeshchandhrra @venupro @AdhirohCS

#MisMatchOnDec6th