About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Mahesh’s Guntur Kaaram: Mass Euphoria

‘గుంటూరు కారం’ ఘాటు చూపిస్తున్న మహేష్ బాబు-త్రివిక్రమ్’అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. గుంటూరు మిర్చిలా ఉన్నాడంటూ అభిమానులు మురిసిపోయారు. వెండితెరపై వింటేజ్ మహేష్ ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్ ని, గ్లింప్స్ ని విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించినప్పటి నుంచి అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఇందులో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. బుధవారం నాడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో  ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్, గ్లింప్స్ విడుదల వేడుక వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ అభిమానుల కేరింతల నడుమ, అభిమానుల చేతుల మీదుగానే సాయంత్రం 6:03 గంటలకు ‘మాస్ స్ట్రైక్’ పేరుతో గ్లింప్స్ ను విడుదల చేశారు.

మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ కి ‘గుంటూరు కారం’ అనే శక్తివంతమైన టైటిల్ పెట్టారు. టైటిల్ ని బట్టి చూస్తే, ఇది గుంటూరు నేపథ్యంలో రూపొందుతోన్న యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. టైటిల్ ని వెల్లడిస్తూ విడుదల చేసిన ‘మాస్ స్ట్రైక్’ అంచనాలకు మించి ఉంది. మహేష్ చిటికెతో గ్లింప్స్ ప్రారంభమైంది. కర్రసాముతో రౌడీ గ్యాంగ్ ని చితక్కొడుతూ ఆయన అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా ధరించి, తలకి ఎర్ర కండువా చుట్టుకొని ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేష్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో త్రివిక్రమ్ చూపించబోతున్నారని స్పష్టమైంది. నోటిలో నుంచి బీడీని తీసి, దానిని స్టైల్ గా వెలిగించి “ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ 3D లో కనపడుతుందా” అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలాగే ఫిదా చేశారు మహేష్. భారీ బ్లాస్ట్ తో జీప్ గాల్లో ఎగరగా, మహేష్ తన కాలి దుమ్ముని దులుపుకొని నడుస్తున్నట్లుగా వీడియోని ముగించిన తీరు మెప్పిస్తోంది. అలాగే తమన్ నేపథ్యం సంగీతం కట్టిపడేసేలా ఉంది. మొత్తానికి ‘మాస్ స్ట్రైక్’ చూస్తుంటే కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు, మాస్ అభిమానులు అందరూ కన్నుల పండుగలా ఉంది.

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.

తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌
నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Mahesh’s Guntur Kaaram: Mass Euphoria

A mass and powerful title Guntur Kaaram is locked for superstar Mahesh Babu’s 28th film under the direction of Trivikram Srinivas.

On superstar Krishna’s birth anniversary, the makers released a small glimpse to announce the title and also the tagline- Highly Inflammable.

Guntur Kaaram is a powerful title and the tagline offers mass euphoria to the super fans. S Thaman’s high-octane music with oora mass background score creates a double impact.

As the title suggests, the story of the movie is set in Guntur backdrop, and Guntur Kaaram seems to be high on action and mass laced with family elements.

Mahesh Babu transformed himself into a slick and stylish get-up to play an action-packed character in the movie.

Trivikram Srinivas who brings the best out of his actors will be presenting Mahesh Babu in a never-seen-before avatar.

S Radhakrishna of Haarika & Hassine Creations is prestigiously making the movie on a massive budget with Pooja Hegde and Sreeleela playing the heroines.

The movie Guntur Kaaram is set to make Sankranthi festivities more entertaining, as the movie is arriving for the festival.

Cast & Crew Details:Stars: Super Star Mahesh Babu, Pooja Hegde, Sreeleela

Written & Directed by Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Presenter – Smt. Mamatha
Banner – Haarika & Hassine Creations
Pro: Lakshmi Venugopal

#GunturKaaram-Still-2 #GunturKaaram-Still 16X25A 16X25-B

Pawan Kalyan and Sai Dharam Tej’s stylish-combo look from Bro, directed by Samuthirakani, launched

‘బ్రో’ నుంచి పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం పోస్టర్ విడుదల
* పోస్టర్లతోనే అంచనాలు పెంచేస్తున్న ‘బ్రో’
* ఫస్ట్ లుక్ పోస్టర్లను మించేలా ‘బ్రో ద్వయం’ పోస్టర్
మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ద్వయం కలిసున్న పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.
‘బ్రో ద్వయం’ పేరుతో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసున్న పోస్టర్ ను మే 29న ఉదయం 10:08 గంటలకు విడుదల చేశారు. బైక్ మీద ఒక కాలు పెట్టి పవన్ కళ్యాణ్ నిల్చొని ఉండగా, ఆయన మోకాలిపై చేతులు ఉంచి సాయి ధరమ్ తేజ్ నిల్చొని ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ చేతులపై పవన్ కళ్యాణ్ చేయి ఉండటం చూస్తుంటే నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ కంటిచూపుతోనే దేన్నైనా శాసించగలరనే అంతలా శక్తివంతంగా కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ముఖంలో మాత్రం సున్నితత్వం ఉట్టిపడుతోంది. మొత్తానికి మామ-అల్లుడు ద్వయం పోస్టర్, సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.
మే 18న ‘బ్రో’ టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. “కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకంతో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. ఇక మే 23న, ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న మార్క్ అలియాస్ మార్కండేయులు పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కి కూడా విశేష స్పందన లభించింది. “బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకంతో శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో ఆయన పాత్రను పరిచయం చేయడం అమితంగా ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన ‘బ్రో ద్వయం’ పోస్టర్ ఆ రెండు పోస్టర్లను మించేలా ఉంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోంది. ‘కార్తికేయ-2′, ‘ధమాకా’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో ‘బ్రో’ వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో మొదటిసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం, పైగా ఇందులో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
‘బ్రో’ సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి కానుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ , సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా,తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్, నర్రాశ్రీను, యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్
రచన, దర్శకత్వం: పి. సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీఓపీ: సుజిత్ వాసుదేవ్
సంగీతం: ఎస్.ఎస్. థమన్
ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
ఫైట్స్: సెల్వ
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: నిఖిల్ కోడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
కో-డైరెక్టర్: బి. చిన్ని
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Pawan Kalyan and Sai Dharam Tej’s stylish-combo look from Bro, directed by Samuthirakani, launched
People Media Factory, one of the major production houses in Telugu cinema, that backed hits like Karthikeya 2, Dhamaka are back with another biggie. Their next, in collaboration with ZEE Studios, is Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues.
Every promotional material from Bro, including the title motion poster to the first look posters of Sai Dharam Tej and Pawan Kalyan were a hit with fans.
Much to the delight of fans, after the individual first looks, a combo poster featuring the both the stars of Bro was out today.
Sporting a grey tee and an off-white pant with black shades tied to them, Pawan Kalyan places his right leg on a bike as Sai Dharam Tej watches on, gracefully smiling and donning an off-white over-coat with a brick-red shirt. Both stars look dapper and stylish in their new avatars in Bro.
While Pawan Kalyan was introduced as the titular character (Bro), Sai Dharam is cast as Mark a.k.a Markandeyulu. S Thaman scores the music. The powerful Sanskrit hymn ‘Kaala triguna samshlesham…’ penned by lyricist Kalyan Chakravarthy was one of the major highlights in the recent promos that created new records.
“I thank the fans of Pawan Kalyan, Sai Dharam Tej for appreciating the promos immensely. I’m thrilled how audiences are making an effort to understand the deeper meaning of the sloka. The hymn, on the lines of the ‘kalah pachati bhutani’ from Mahabharatam, was customised as per the film. Time is the hero of the story and with Thaman’s suggestion, I tried to blend the title in the lyrics. I am indebted to everyone in the team for the opportunity,” lyricist Kalyan Chakravarthy expressed his happiness.
Bro is the first time that Pawan Kalyan is teaming up with his nephew for a film, making it one of the most anticipated on-screen collaborations in Telugu cinema. The film is a family drama with an element of fantasy, spirituality and the promos have set the bar high already. Currently in its last leg of shoot, the film’s post-production formalities are being wrapped up simultaneously. The drama is set to release in theatres on July 28 this year.
Ketika Sharma, Priya Prakash Varrier, Samuthirakani, Rohini, Rajeswari Nair, Raja, Tanikella Bharani, Vennela Kishore, Subbaraju, Prudhvi Raj, Narra Srinu, Yuva Lakshmi, Devika, Ali Reza and Surya Srinivas play other important roles in Bro. Sujith Vaasudev cranks the camera for the film.
Written & Directed by: P. Samuthirakani
Screenplay | Dialogues: Trivikram
Producer : T G Vishwa Prasad
Co-producer: Vivek Kuchibhotla
D.o.p: Sujith Vaasudev
Music: S Thaman
Art: A S Prakash
Editor : Navin Nooli
Fights: Selva
Vfx supervisor : Nikhil Koduri
Executive producer: S. Venktrathnam
Co- Director: B. Chinni Gatakala
Pro: Lakshmivenugopal
still (8) 30X40-001

*Takkar film has Unique Love Story with lot of Action and Romance: Siddharth*

టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ ఉన్న ఒక సినిమా – హీరో సిద్దార్థ్*

* ఆద్యంతం సరదాగా జరిగిన టక్కర్ మీడియా మీట్

నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ వివరాల్లోకి వెళితే….

సహనిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ…
ఈ సినిమా మంచి కంటెంట్, సిద్దార్థ్ గారు మంచి పెరఫార్మర్, ఈ సినిమా సిద్దార్థ్ గారికి మళ్ళీ ఆ స్థాయి  హిట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్దార్థ్ గారిని చూస్తాం.

దర్శకుడు కార్తిక్ జి క్రిష్ మాట్లాడుతూ….
నేను ఏ కంటెంట్ రాసిన ఈ సినిమా కంటెంట్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చాలామంది చెప్పారు. ఇప్పటివరకు సిద్దార్థ్ ను మీరు ఒక లవర్ బాయ్ గా చూసారు.
సిద్దార్థ్ ఒక రగ్గడ్ లవర్ బాయ్ గా ఇందులో చూపించాను.ఈ సినిమా అన్ని సినిమాలలా కాకుండా, కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమాలో లవ్ , కామెడీ, రొమాన్స్ అన్ని ఉంటాయి. ఇది న్యూ జనరేషన్ సినిమా అని చెప్పొచ్చు.

హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ….
నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే ఈ సినిమా. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్ లా చూసారు. మిమ్మల్ని నేను కంప్లీట్ డిఫరెంట్ చూపించబోతున్నాను అని చెప్పాడు.
పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అన్నారు. తదనంతరం పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.

*Takkar film has Unique Love Story with lot of Action and Romance: Siddharth*

Talented actor Siddharth, known for films like Bommarillu and Nuvvostanante Nenoddantana, is set to woo crowds in a refreshing avatar for his upcoming Tamil-Telugu action romance Takkar. Written and directed by Karthik G Krish, the film features Divyansha Kaushik as the female lead.

Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, in collaboration with People Media Factory, Abhishek Agarwal Arts, and Passion Studios, Takkar releases in theatres on June 9 in Telugu and Tamil. After hogging the limelight for the action-packed trailer, teaser and the three songs, the team is now busy with promotions.

Today makers held a grand press meet in Hyderabad to share more details about the film.  Total team attended the event and they’ve shared thier best experience. Co-producer Vivek Kuchibotla said, “This film has good content, Siddharth is a fantastic performer, and this film will be a success for Siddharth. The director has done an excellent job with this film. With this film, we will see our Vintage Siddharth again.”

“Many people said that every content I’ve written will definitely be liked by Telugu audience,” director Karthik G Krish said. You’ve only seen Siddharth as a lover boy so far.
In this film, I portrayed Siddharth as a rugged lover boy. This film will be unique and distinct from all others. This film contains love, comedy, and romance.”

Hero Siddharth said “Many people have asked me when I plan to make a full-length commercial film, and this is the answer. So far, you’ve been treated me as a lover boy. This time, I’ll show you a completely different avatar of mine. This film was directed by Karthik G. Krish as a full-fledged commercial entertainer. This love story is full of action and romance.”

“This August, I will complete his 20-year career as a hero,” he added. I’m still happy to have a half-dozen films in my possession. In this film, I learned martial arts and performed action scenes. For 35 days, action scenes were shot. Divyansha’s role in this film is quite different. This film’s unique love story will undoubtedly impress this generation.”

The team then answered several questions asked by the journalists during Q&A session.

GANI4982 GANI4991

#VS11 – Rags Look – Vishwak Sen and Sithara Entertainments gives tribute to NTR!

శక్తివంతమైన సామాన్యుడి పోస్టర్ తో ‘ఎన్టీఆర్’కి నివాళులర్పించిన ‘VS11′ చిత్ర బృందం

* విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పే ప్రచారచిత్రం

* పాత్రలో ఒదిగి పోయిన విశ్వక్ సేన్

కథానాయకుడు విశ్వక్ సేన్ ఓ వైవిధ్యభరితమైన చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. ఇది నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ యొక్క ప్రయాణాన్ని వర్ణించే చిత్రం.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందిస్తోంది. ప్రతిభావంతులైన దర్శకులను ప్రోత్సహిస్తూ విభిన్న చిత్రాలతో కుటుంబంలోని ప్రతి వ్యక్తిని అలరించడానికి కృషి చేస్తోంది.

సితార సంస్థ యూనివర్సల్ అప్పీల్‌ ఉన్న కథలను ఎంచుకుంటోంది. VS11 మరో మైలురాయి లాంటి చిత్రమవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.

VS11 చిత్రం చీకటి మరియు క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. ఈ ప్రపంచానికి నైతికత లేదు, దేనినీ పట్టించుకోదు. అలాంటి ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే.. తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి అతనికి ప్రేరణ, స్ఫూర్తి అవసరం.

‘తెలుగు వారి ఆత్మగౌరవం’, ‘లెజెండ్ ఆఫ్ లెజెండ్స్’గా పేరుగాంచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆ మహనీయుడిపై తమకున్న ప్రేమను చాటుకుంది చిత్ర బృందం.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీస్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గంగానమ్మ జాతర పోస్టర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు నివాళిగా విడుదల చేసిన పోస్టర్ తెలుగువారి హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు.

తారాగణం: విశ్వక్ సేన్
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్

#VS11 – Rags Look – Vishwak Sen and Sithara Entertainments gives tribute to NTR!

Vishwak Sen has joined hands with Sithara Entertainments and Fortune Four Cinemas for a film that depicts journey of a grey man in moral-less society.

Sithara Entertainments have been producing some of the best entertainers in different genres in Telugu Cinema. They have been looking to encourage talented filmmakers to come up with variety of entertainers that engage and entertain every person in a family.

They look at the Universal appeal in a script and VS11 is going to another feather in their cap, believes the team.

VS11 narrates the story of a determined and motivated man who grows from rags to riches in a dark and unapologetically cruel world. This world has no morals and doesn’t care for anything. If a man needs to survive in such a world, he needs inspiration and motivation to determine his path.

Honouring the man who become “Telugu Vaari Atmagouravam” and “Legend of Legends” on his Centenary, that is, 100th Birth Anniversary, VS11 has released The Rags Look poster to show the character’s love for the great man.

Yuvan Shankar Raja is composing music for the film. Krishna Chaitanya is directing the magnanimous project on a huge scale.

Already, Ganganamma Jathara still has raised hype and buzz for the film. This tribute has also touched the hearts of Telugu people. More details about the film will be announced soon.

The film is produced by Suryadevara Naga Vamsi & Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas & Co-Produced by Venkat Upputuri & Gopi Chand Innamuri

Starring: Vishwak Sen
Director: Krishna Chaitanya
Music: Yuvan Shankar Raja
Co-Producers: Venkat Upputuri & Gopi Chand Innamuri
Producers: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios

#VS11-TheRagsLook (1) #VS11-TheRagsLook-Still (1)

The title, glimpse of Superstar Mahesh Babu and director Trivikram’s next to be unveiled by ‘Super’ fans in theatres screening Mosagallaku Mosagaadu

మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్ ప్రకటన
 
- సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘ఎస్ఎస్ఎంబి 28′ నుంచి ‘మాస్ స్ట్రైక్’ విడుదల
‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించింది. వెండితెరపై వింటేజ్ మహేష్ బాబుని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ‘ఎస్ఎస్ఎంబి 28′ టైటిల్ ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా చిత్ర బృందం టైటిల్ వెల్లడికి ముహూర్తం ఖరారు చేసింది. లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మే 31న టైటిల్ ని రివీల్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక్కడ మరో విశేషం ఉంది. కృష్ణ గారు నటించిన ఆల్ టైం హిట్స్ లో ఒకటైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ఆయన జయంతి కానుకగా మే 31న 4K లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ‘ఎస్ఎస్ఎంబి 28′ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో కూడిన గ్లింప్స్ ని విడుదల చేయనున్నారు. పైగా ఈ విడుదల కార్యక్రమం అభిమానుల చేతుల మీదుగా జరగనుంది. అభిమానుల చేతుల మీదుగా ‘మాస్ స్ట్రైక్’ పేరుతో విడుదలవుతున్న ఈ గ్లింప్స్ అభిమానులకి మాస్ ఫీస్ట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఇక తండ్రి జయంతి సందర్భంగా ఆయన సినిమా మళ్లీ విడుదల కావడం, ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో కొడుకు సినిమా గ్లింప్స్ విడుదల చేయడం అనేది సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన ఘటనకు ‘ఎస్ఎస్ఎంబి 28′ శ్రీకారం చుట్టింది.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28′ సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌
నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు)
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
 
The title, glimpse of Superstar Mahesh Babu and director Trivikram’s next to be unveiled by ‘Super’ fans in theatres screening Mosagallaku Mosagaadu
Superstar Mahesh Babu and director filmmaker Trivikram are joining hands for one of the most anticipated projects by movie buffs and fans. Pooja Hegde, Sreeleela play the female leads in the action entertainer bankrolled by leading producer Suryadevara Radha Krishna (China Babu) under Haarika and Hassine Creations.
While there are several titles under speculation for the massive project, the update around the same will be revealed by the fans of the star themselves. In addition, a glimpse of the film will also be unveiled. Yes, you heard it right. For the first time ever, the title and the first glimpse of a Mahesh Babu project will be launched by his fans in theatres on Superstar Krishna’s birthday i.e. May 31.
The glimpse will be screened in all theatres that are screening the redefined version of Superstar Krishna’s classic Mosagallaku Mosagadu, that’s re-releasing on the same day. “A MASS Feast For Fans and By Fans! #SSMB28MassStrike to thunder its way on 31ST MAY! SUPER FANS will unveil Striking video at the Theatres!!Super Star @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash @haarikahassine,” the production house Haarika & Hassine Creations tweeted.
The update announcement poster has a massy Mahesh Babu, with a cloth wrapped around his head, smoking a cigarette. S Thaman scores the music for the film whose technical team includes cinematographer PS Vinod, editor Navin Nooli and art director AS Prakash.
Mahesh Babu and Trivikram’s earlier collaborations, Athadu and Khaleja, continue to entertain and amaze audiences even today and expectations are running high on their third project together that’s touted to be the wholesome entertainer. SSMB28 is presented by Mamatha.
Cast & Crew Details:
Stars: Super Star Mahesh Babu, Pooja Hegde
Written & Directed by Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Presenter – Smt. Mamatha
Banner – Haarika & Hassine Creations
Pro: Lakshmi Venugopal
#SSMB28-MassStrike-FinalDesign-Still #SSMB28-MassStrike-FinalDesign