Nithin and Samantha team up with Trivikram

‘త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం : సెప్టెంబర్ 3 వ వారంలో ప్రారంభం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
వరుసగా ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత నాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక కూడా ఈ చిత్రం లో నటించ బోతున్నారు, ఆ వివరాలతో పాటు ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత రాధాకృష్ణ.
సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్-కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి,డి.వి.ప్రసాద్, సమర్పణ శ్రీమతి మమత, నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్

1 (1)

Noted director Trivikram, who’s well known as ‘Wizard of words’, is going to make a movie under the banner of ‘Haarika and Hassine Creations’, which’s a third movie for the director in the same banner and this is the third venture for the producer Suryadevara Radhakrishna (chinababu), who made ‘Julai’ and ‘S/o Satyamurthy’ under the same Trivikram, which’re back to back stupendous hits.

This is the first time Nithin teams up with Trivikram and third time for heroine Samantha, who played the female lead in ‘Attarintiki Daredi’ and ‘S/o Satyamurthy’ under the direction of Trivikram, previously.

According to the producer the film will go to the sets on the third week of September.The film is slated to be released on sankranthi 2016. The film has another heroine, to be selected and the star cast will be announced later.

The film has the script and directed by Trivikram. And the sound designed by Vishnugovind and sri sankar. and the crew is including music – anirudh, cinematography- nataraj subramaniyan, art-rajevan, editing-kotagiri venkateswararao, Excutive producer – pdv prasad
The film is presented by smt mamata.

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ చిత్రం తొలి ప్రచార చిత్రాలు , చిత్రం టీజర్ విడుదల

మెగా పవర్ స్టార్ ’రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ’శ్రీను వైట్ల’ ల తో  సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి  ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం  ప్రస్తుతం  హైదరాబాద్ లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది.
 
‘మెగాస్టార్ చిరంజీవి’ స్పెషల్ అప్పియరెన్స్ :
‘నిజమే.. ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది’. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం లో నటించే విషయం పై దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ పై విధంగా అన్నారు. చిరంజీవిగారు ఎంతో ఎనర్జిటిక్ గా, మరింత గ్లామరస్ గా ఉన్నారు. ఆయన నటించే సన్నివేశాలను త్వరలో చిత్రీకరించ బోతున్నాము. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా ఓ మాట మాత్రం  చెప్పగలను. అభిమానుల ఆనందం అంబరాన్ని తాకేలా మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించే సన్నివేశాలు తెరకెక్క బోతున్నాయని తెలిపారు దర్శకుడు శ్రీను వైట్ల. 
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ ఫస్ట్ లుక్ మరియు ‘టీజర్’ 
 
మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంభందించిన మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు నిర్మాత  దానయ్య డి.వి.వి. అలాగే ఈ రోజు రాత్రి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సమక్షంలో చిత్రం ‘టీజర్’ ను కూడా విడుదల చేయ నున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య  డి.వి.వి. మాట్లాడుతూ..’ మెగాస్టార్ చిరంజీవి గారు మా బ్యానర్లో అందులోనూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘స్పెషల్ అప్పియరెన్స్’ లో కంపించనుండటం ఎంతో  సంతోషంగా ఉంది. ఆయన కనిపించేది కొద్ది నిమిషాలే అయినా అవి మెగాభిమానులకు కన్నుల పండుగలా అనిపిస్తాయని తెలిపారు నిర్మాత దానయ్య డి .వి.వి. 
 
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో పాటు  ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను హైదరాబాద్ లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు  తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.
 
ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ 
లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , 
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ 
సమర్పణ : డి. పార్వతి 
నిర్మాత : దానయ్య డి.వి.వి.

First Look and teaser release 

First Look stills of Mega Power Star Ram Charan and Super Director Srinu Vytla’s film have been released on the eve of Mega Star Chiranjeevi’s 60th Birthday, The film is being produced by Danayya DVV, under the banner of DVV Entertainments. The regular shooting  is going on continuously and the film is going to a Dussehra gift for all the fans.

 

Megastar Chiranjeevi’s Special Appearance

Director Srinu Vytla in reply to Megastar’s special appearance in the film said ” I am very excited. Megastar is looking more younger, energetic and glamorous than he was ten years back. I cannot wait to shoot Megastar’s part in the film. I can confidently say that his appearance will be a feast for one and all and a festival for his fans.We will be shooting Megastar’s part in the film very soon.”

Producer Danayya DVV said “I am ecstatic as Megastar is making a special appearance in our banner and that too in our own Megapowerstar Ram Charan’s film. Though he is in the film briefly, i am sure his appearance will be vibrating through out.” . First look and teaser to be released on the occasion of Megastar chiranjeevi’s birth day.

Kona Venkat and Gopimohan are penning this Action – Entertainer with Sreenu Vaitla. Rakul Preet Singh is pairing up with Mega Power Star Ram Charan for the first time in this film. SS Thaman is composing the music while Manoj Paramahamsa is handling Cinematography.

Starcast: Rakul Preeth Singh, Brahmanandam, Nadiya, Kriti Karbandha, Tanikella Bharani, Mukesh Rishi, Rao Ramesh, Shayaji Shinde, Jayaprakash Reddy, Sampath, Posani Krishna Murali, Brahmaji, Prithvi, Sapthagiri, Karumanchi Raghu, Ravi Raj, Satya, Ravi Prakash, Surekha Vani, Pavithra Lokesh, Kashmira Shah.

Technicians:

Story: Kona Venkat, Gopi Mohan, Dialogues: Kona Venkat, Music: Thaman SS, Cinematography: Manoj Paramahamsa, Art Director: Narayana Reddy, Editor: MR Varma, Stunts: Anal Arasu.

Executive Producer: VY Praveen Kumar

Line Producer: Krishna

Presents: Smt D Parvathy.

Producer: Danayya DVV

Original Story – Screenplay – Direction:  Srinu Vaitla

1 copy 4a copy

Sardaar Gabbar Singh lunches First Look

FB Profile Cover (1) Press Still - SGS SGS - First Look (1) 

At the stroke of midnight on the eve of the Independence Day “Sardaar Gabbar Singh” revealed its first look saluting the Nation. Sardaar Gabbar Singh is a stand alone story and it’s neither sequel nor a prequel.

The First look has generated a phenomenal response with both, fans and the general audience finding the Poster most dynamic and striking.

Producer Sharrath Marar said “Power Star Pawan Kalyan completely focused on building the story and screenplay of Sardaar Gabbar Singh. He has put together the design, the look and the feel of the film and first look of the film is a reflection of all the elements and emotions in the film”.

Sardaar Gabbar Singh is Produced by Northstar Entertainment Pvt Ltd, Pawan Kalyan Creative Works Pvt Ltd and EROS International. The Film is directed by K.S.Ravindranath (Bobby), Music is being composed by Devi Sri Prasad, Cinematography is by Jayanan Vincent, Art by Brahma Kadali, Action is by Ram-Lakshman and the film is edited by Gautham Raju.

The film will head into its third schedule from the first week of September.

శ్రీలంక వెళ్లనున్న యాక్షన్ కింగ్ ‘అర్జున్’, నాయిక’లక్ష్మీరాయ్’, ప్రముఖ దర్శకుడు ‘కోడిరామకృష్ణ’ ల చిత్రం ‘రాణీ రాణమ్మ’

IMG_6866 IMG_7337 IMG_7375 IMG_7510 IMG_8767 IMG_9956 SRI_9669 SRI_9706
రాణీ రాణమ్మ
యాక్షన్ కింగ్ ‘అర్జున్’, నాయిక’లక్ష్మీరాయ్’, ప్రముఖ దర్శకుడు ‘కోడిరామకృష్ణ’ ల చిత్రం.
శైలజ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరుచి గల నిర్మాత ఆర్.రామచంద్ర రాజు తెలుగు,తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారీ చిత్రాన్ని. దాదాపు 60 శాతానికి పైగా పూర్తయిన ‘రాణీ రాణమ్మ’ గురించి నిర్మాత
మాట్లాడుతూ…
శ్రీలంక నేపధ్యంలో జరిగే కధ ఇది. ‘ 
”తెలుగు రాష్ట్రం లో నివసిస్తున్నఓ తమిళ యువకుడు  (కధానాయకుడు అర్జున్) కి అమాయకురాలైన ఓ చిన్నపాప పరిచయం అవుతుంది. ఆ పాప యువకుడి  కుటుంబానికి ఎంతో దగ్గర అవుతుంది. వారితో కలసి పోతుంది. తెలుగు రాని ఆ పాప ఎవరో, తల్లి దండ్రులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఆ పాప స్వస్థలం శ్రీలంక అని తెలుస్తుంది కధానాయకునికి. ప్రభుత్వ అధికారుల సహకారంతో ఆ పాపను శ్రీలంక కు తీసుకు వెళ్ళటానికి చేసిన ప్రయత్నాలు ఎలా జరిగాయి, శ్రీలంక లో మిలిటరీ అధికారిని కలసిన తరువాత   ఏమైంది, అక్కడ ఎలాంటి పరిస్థితులను వీరు ఎదుర్కొన్నారు..? చివరకు ఏమైంది..?” అన్న అంశాన్ని దర్శకుడు కోడిరామకృష్ణ తెరకెక్కిస్తున్న తీరు తెరపై చూడాల్సిందే అన్నారు నిర్మాత రామచంద్ర రాజు.
సెంటిమెంట్,యాక్షన్ డ్రామా మిళితమైన కధాంశం తో కూడిన చిత్రమిది. దర్శకుడు కోడిరామకృష్ణ,అర్జున్ ల కలయికలో వస్తున్న6వ చిత్రమిది. ఆ చిత్రాల విజయాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం రూపొందుతోందని తెలిపారాయన. ప్రతి సన్నివేశం  మనసును ఎంతగానో హత్తుకుంటుంది.రాజేంద్రకుమార్ సంభాషణలు ఎంతో బాగా  రాశారు. ఎస్.ఏ.రాజ్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. కధానాయకుని పాత్రలో రెండు కోణాలు ఉంటాయి. పతాక సన్నివేశాలు ఉత్కంట భరితంగా సాగుతాయి అని తెలిపారు నిర్మాత. ఈ చిత్రం మలయాళ మాతృక ‘కాల్చ’(మమ్ముట్టి,పద్మప్రియ, 3 రాష్ట్ర అవార్డ్ లు గెల్చుకున్న చిత్రం) హక్కులుతీసికొన్న ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ వద్ద మేము ‘తెలుగు, తమిళం’ లో పునర్నిర్మాణ హక్కులు తీసుకోవటం జరిగింది.అద్భుతమైన చిత్రమిది.
 
అక్టోబర్ నుంచి శ్రీలంక లో చిత్రం చివరి షెడ్యూల్  ప్రారంభ మవుతుంది. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలకు సిద్ధ మవుతుందని నిర్మాత తెలిపారు.
అర్జున్,లక్ష్మీరాయ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో బేబి అన్షు నటిస్తోంది. ఆశిష్ విద్యార్ధి,తో పాటు సంగీత దర్శకుడు ఎస్.ఏ.రాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి మూలకధ: బ్లెస్సి: మాటలు:రాజేంద్ర కుమార్: ఫోటోగ్రఫి: కోడి లక్ష్మణ్, వెంకట్: సంగీతం ఎస్.ఏ.రాజ్ కుమార్: 
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోడి రామకృష్ణ: 
నిర్మాత: ఆర్. రామచంద్రరాజు 

‘బ్యాంకాక్’ లో భారీ పతాక సన్నివేశాల చిత్రీకరణలో మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ‘శ్రీను వైట్ల’ ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం :

DGA_2318 DGA_2322 DGA_2335 DGA_2340 విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ  నిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం గత నెల (జులై)  27 నుంచి బ్యాంకాక్ లో జరుగుతోంది. 
ఈ చిత్రం గురించి  బ్యాంకాక్ నుంచి నిర్మాత దానయ్య డి .వి.వి మాట్లాడుతూ …’  మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో  భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ నుంచి  ఈ నెల 12న హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య. 
మరల హైదరాబాద్ లో ఈ నెల 13 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ‘శ్రీను వైట్ల’ మాట్లాడుతూ ” ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ ‘కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని  ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో,  అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అన్నారు. 
ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ 
 
లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , 
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ 
సమర్పణ : డి. పార్వతి 
నిర్మాత : దానయ్య డి.వి.వి.
మూలకథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీను వైట్ల