Aravinda sameta veera raghava new stills

may 0014 copy may 0020 copy may 0379 copy copy STILL

శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య

 DSC_3205 DSC_3208 DSC_3213 DSC_3309
శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య
యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య , అను ఇమాన్యూల్ జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ లో నాగ‌వంశి.ఎస్‌, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన హిలేరియ‌స్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రం వినాయ‌క‌చ‌వితి సంధ‌ర్భంగా సెప్టెంబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌య్యి మెద‌టిరోజు 12 కోట్లు వ‌సూలు చేయ్య‌ట‌మె కాకుండా మూడురోజుల‌కి దాదాపు 23 కోట్ల  రూపాయిలు వ‌సూలు చేసి పీపుల్స్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌రణ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, మారుతి కాంబినేష‌న్ లో రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలుచేయ‌బోతున్న సంద‌ర్భంలో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయల్  మారుతి, న‌రేష్‌, 30 ఇయ‌ర్స్ పృధ్వి, సినిమాటోగ్రాఫ‌ర్ నిజార్ ష‌ఫి, నిర్మాత నాగ‌వంశి పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య మాట్లాడుతూ..  ఫ‌స్ట్ తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.  మా శైల‌జారెడ్డి అల్లుడు కి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. మెద‌ట ఈ కలెక్ష‌న్స్ చెప్పిన‌ప్పుడు న‌మ్మ‌లేక‌పోయాను. ముఖ్యంగా మౌత్ టాక్ ని చాలా పాజిటివ్ గా స్ప్రెడ్ చేసిన వారంద‌రికి, చేస్తున్న‌వారంద‌రికి థ్యాంక్యూ సో మ‌చ్‌. నాకు ఈ సినిమాకి వ‌చ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నా లుక్ చాలా ఫ్రెష్ గా ఢిఫ‌రెంట్ గా క‌నిపిస్తున్నాన‌ని అలానే బాడిలాంగ్వేజ్ చాలా ఎన‌ర్జిటిక్ గా వుంద‌ని అంటున్నారు.. ఒక యాక్ట‌ర్ కి ఇదే బెస్ట్ కాంప్లిమెంట్ థ్యాంక్యూ మారుతి గారు. నా కెరియ‌ర్ లో మంచి హిట్ కావాలి అన్న‌ప్పుడు ప్రేమ‌మ్ చిత్రం ఇచ్చారు.. ఇప్ప‌డు శైల‌జారెడ్డి అల్లుడు ఇచ్చారు. నిర్మాతలకు  థ్యాంక్యూ. అలాగే హీరోయిన్ అను చాలా బాగా చేసింది, న‌రేష్ గారితో 100 ల‌వ్ నుండి మంచి స‌పోర్ట్ వుంది, నిజార్ సినిమాటోగ్ర‌ఫి బాగుంది. పృద్వి గారి గురించి చాలా మంచి కామెంట్స్ వ‌స్తున్నాయి. మాణిక్యం గా  చాలా బాగా చేశారు.  ఈ సినిమాని ఇలానే ఆద‌రించాల‌ని దీనికి స‌హ‌క‌రిస్తున్న మీడియా వారికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.
ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. శైల‌జారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్ష‌కులు వాళ్ళ ఇంటి సొంత అల్లుడి లా ఆదరిస్తున్నారు. మెద‌టి రోజు క‌లెక్ష‌న్లు కాని ఈ మూడురోజులు క‌లెక్ష‌న్లు కాని మాకు చాలా ఆనందాన్ని ఎన‌ర్జిని ఇచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ అంద‌రూ నాకు సూప‌ర్ ఎన‌ర్జిని ఇచ్చారు..ఈ జోనర్ కు ముఖ్యంగా యూత్ కూడా వచ్చి అప్రిషియేట్ చేశారు. ఫ్యామిలీస్ సినిమా బాగుందని ఫోన్స్ చేస్తున్నారు. నా గత చిత్రాల కంటే బాగుందన్నారు. టీం అందరికీ చాలా చాలా థాంక్స్ చెప్పాలి. చైతన్య గారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ రావడం… అది నా సినిమాతో రావడం చాలా హ్యాపీగా ఉంది.  ఆయనతో మరో సినిమా చేయాలనేంత ఎనర్జీ ఇచ్చారు. నా సినిమాలో నటించిన అందరికీ చాలా చాలా థాంక్స్. ఈ సినిమా విజయం నాలో మరింత బాధ్యత పెంచింది. నా టీమ్ అంద‌రూ అలానే సితార ఎంట‌ర్‌టైన్ మెంట్ కి నా థ్యాంక్స్‌. మా హీరో నాగ‌చైత‌న్య గారికి, అను గారికి మా శైల‌జారెడ్డి ర‌మ్య‌కృష్ణ మేడమ్ కి నా స్పెష‌ల్ థ్యాంక్స్‌.. ఈచిత్రాన్ని ఇలానే ఆద‌రించాల‌ని కొరుకుంటున్నా.
అను ఇమ్మాన్యుయల్  మాట్లాడుతూ… ముందు ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పాలి. ఈ సక్సెస్ మీట్ కి కారణం మీరు. శైలజా రెడ్డి అల్లుడు దర్శకుడు మారుతికి, హీరో నాగచైతన్య కు చాలా చాలా థాంక్స్. సినిమా చూడని వాళ్లు థియేటర్ కి వెళ్లి  తప్పకుండా చూడండి. అని అన్నారు.
సక్సెస్ మీట్ లో నటుడు పృథ్వీ మాట్లాడుతూ… సినిమా థియేటర్లో చూశాను. జనాలు ఫుల్ ప్యాక్ డ్ గా ఉన్నారు. డైరెక్టర్ మారుతి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రకాలుగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి కుటుంబం, హ్యూమన్ రిలేషన్స్, ఇగోల గురించి చక్కగా చెప్పారు. ఈగోయిస్ట్ క్యారెక్టర్లో అను కరెక్ట్ గా సరిపోయారు. నాగ చైతన్య గారు సూపర్బ్ పెర్ ఫార్మెన్స్. కొన్ని చోట్ల నాగార్జున గారు కనిపిస్తున్నారని రివ్యూస్ లో రాశారు. క్యారెక్టర్లో లీనమై నటించారు. నరేష్ గారు ఉంటే షూటింగ్ సరదాగా జరిగేది. కామెడీగా స్ఫూఫులు చేసే నాకు మారుతి బాబు బంగారంలో మంచి పాత్ర ఇచ్చారు. ఇప్పడు శైలజా రెడ్డిలో మాణిక్యం అనే క్యారెక్టర్ ఇచ్చారు. చాలా మంది ఇలాగే కంటిన్యూ చేయి అంటున్నారు. మా నిర్మాత వంశీకి బాగా  డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మారుతి గారి దగ్గర పనిచేస్తే డెబిట్ కార్డ్ వచ్చినట్టే. డైరెక్టర్, బ్యానర్ నిలబడితే చాలా ఫ్యామిలీస్ నిలబడతాయి. రమ్యకృష్ణ గారు అద్భుతంగా నటించారు అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి మాట్లాడుతూ…. అందరికీ సినిమా నచ్చిందంటున్నారు. థాంక్స్ టూ మారుతి గారు వంశీ గారు. ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ… శైలజా రెడి అల్లుడు సూపర్ హిట్ శుభాకాంక్షలు. పీపుల్స్ డైరెక్టర్ మారుతికి కంగ్రాట్స్. అందరి పల్స్ క్యాప్చర్ చేసిన ఈ జెనరేషన్ డైరెక్టర్. నాగచైతన్య లవర్ బాయ్ రోల్స్ అద్భుతంగా చేస్తూ…. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా హయ్యెస్ట్ గ్రాసర్ సొంతం చేసుకున్నాడు. రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్ డే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక హాసిని సంస్థల తో నాకు మంచి రిలేషన్ ఉంది. వరుసగా హిట్స్ అందిస్తున్నారు. పృథ్వీ అద్భుతమైన సీన్స్ చేశాడు. షూటింగ్ అప్పుడే పృథ్వీ సీన్స్ పేలతాయని అర్థమైంది. అను టాలీవుడ్ లో సూపర్ హిరోయిన్ అవుతుంది. అక్కినేని ఫ్యాన్స్ కి నేను ముందే చెప్పాను ఈ వినాయక చవితి మీదే అని. వినాయకచవితి కుడుముల లాగ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా మారుతి అందించాడు. నాకు భలే భలే మగాడివోయ్ సినిమాతో నరేష్ మళ్లీ కామెడీ చేయగలగడని నిరూపించింది. మారుతి స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్న దమ్మున్న డైరెక్టర్. మురళీ శర్మ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ బాగా పండింది. నాగచైతన్య యూత్ ని, రమ్యకృష్ణ ఫ్యామిలీస్ ని, అను కుర్రాళ్లని థియేటర్లకు రప్పిస్తున్నారు. ఈ ఏడాది ఫస్ట్ పండగలో, ఫస్ట్ హిట్ లో నేనుండడం చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

Many Thanks To Telugu Audience For Making Shailaja Reddy Alludu A Blockbuster: Yuva Samrat Naga Chaitanya
Yuva Samrat Naga Chaitanya and gorgeous Anu Emmanuel are the lead cast in the hilarious family entertainer Shailaja Reddy Alludu directed by Maruthi and produced jointly by Naga Vamsi S and PDV Prasad under Sithara Entertainments banner with S Radha Krishna (Chinnababu) presenting it.
The film released on the special occasion of Vinayaka Chavithi has become people’s blockbuster by collecting 12 Cr on opening day and 23 Cr overall in its first weekend. The Naga Chaitanya and Maruthi combination is doing wonders at box office. Meanwhile, the film unit organized thanks meet which was attended by Yuva Samrat Naga Chaitanya, director Maruthi, Naresh, 30 Years Prithvi, Cinematographer Nizar Shafi and producer Naga Vamsi.
While speaking on the occasion, Yuva Samrat Naga Chaitanya said, “First of all many thanks to Telugu audience for making Shailaja Reddy Alludu a blockbuster. Our film has got excellent openings. I didn’t initially believe when I was told about collections. I really thank everyone for spread positive talk. The best compliment I got for the film was I looked fresh and quite differently with an energetic body language. I really thank Maruthi garu for this. After Premam, Shailaja Reddy Alludu is another special film in my career. Heroine Anu gave her best. I have been getting good support from Naresh gaaru since 100% Love. Nizar’s cinematography is a big asset. Prithvi did wonderful job as Manikyam. I thank everyone for the support. Special thanks to media.”
Director Maruthi said, “Telugu audience are treating Shailaja Reddy Alludu like their own Alludu (son-in-law). The first day and 3 days collections have boosted our confidence. Akkineni fans have given additional energy with their response and encouragement. Happy to see youth appreciating a family entertainer. Families are calling me to give positive feedback. According to them, Shailaja Reddy Alludu is highly entertaining compared to my previous films. I wholeheartedly thank my team for their support in making the film. I’m really contended that Naga Chaitanya got career best openings with my film. I’m eager to work for another film with Chaitu. My responsibilities have been multiplied with the humongous success. My special thanks to producers of Sithara Entertainments, my hero Naga Chaitanya, heroine Anu Emmanuel and Ramya Krishna madam. I wish audience will continue to encourage our film.”
Anu Emmanuel said, “Firstly, I need to thank audience. You are the real reason for the success meet. I also thank hero Naga Chaitanya and director Maruthi. Those who haven’t yet watched the film, please go watch it.”
Prithvi said, “I have watched the film in a packed theater. I know how much efforts Maruthi has put in for the film. Each and every section of audience are giving overwhelming response for the film. Topics like joint families, human relations and egos were narrated precisely. Anu Emmanuel was apt for the role of an egoist. Naga Chjaitanya has given wonderful performance. I’ve read in few reviews that, Chaitu looked like his dad Nagarjuna in few scenes. He just lived in the character. Shooting will be very pleasant in Naresh’s presence. Maruthi had given me a funny role in Babu Bangaram and now in Shailaja Reddy Alludu. I wish producer Vamsi will pocket huge profits. Working with Maruthi is like getting debit card. Ramya Krishna too played her role efficiently. Many families will survive if producers and directors attain hits.”
Nizar Shafi said, “Everybody is appreciating the film. Thanks to Vamsi gaaru and Maruthi gaaru. I’m really happy work with this team.”
Senior actor Naresh said, “Congratulations to the entire team of Shailaja Reddy Alludu for the success. I also congratulate people’s director Maruthi. He is the director of this generation who has captured pulse of all section of audience. Besides doing lover boys roles, Naga Chaitanya attained highest grosser with a  family entertainer. I wish Ramya Krishna gaaru a very happy birthday. I have good affiliation with Sithara Entertainments and Haarika & Hassine Creations. They are making incessant blockbusters. Prithvi has tickled our bunny bones. It was evident while shooting that; Prithvi’s scenes will be a hilarious treat. Anu will become a star heroine in Tollywood. I have already told Akkineni fans that, this Vinayaka Chavithi will belong to them. Maruthi has provided a wholesome entertainer like Vinayaka Chavithi Kudumulu. Maruthi has good command over script. Bhale Bhale Magadivoy proved that I still can do comedy. Vennela Kishore and Murali Sharma characters too worked well. Naga Chaitanya, Ramya Krishna and Anu bringing youth, families and youngsters to theaters respectively. I’m really happy that, I’m part of first hit of first festival of this season.”

 

మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ట్ చేసిన‌ `శైల‌జారెడ్డి అల్లుడు` నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి – కింగ్ నాగార్జున‌

 

DSC_11320036 DSC_11740069 DSC_11770072 DSC_13190032 DSC_13200033 DSC_08510012 DSC_08530014 DSC_08780035 DSC_08800036 DSC_09190073 DSC_09340087 DSC_09520105 DSC_10970002 DSC_11020007 DSC_11140018 DSC_11210025 DSC_11220026 DSC_11380041 DSC_11450047 DSC_11470048 DSC_11480049 DSC_11560051 DSC_11880083 DSC_11940089 DSC_12050009 DSC_12130015 DSC_12350032 DSC_12450042 DSC_12500047 DSC_12640059 DSC_12860005 DSC_12950013 DSC_13040021 DSC_13060022 DSC_13140029
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు  కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా..
 
చైతులో చిలిపిత‌నం కూడా ఉంది
 
కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ”చైతన్యను ఇప్పుడు అందరూ శైలజారెడ్డి అల్లుడు అని అంటున్నారు. కానీ తను అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున పెద్ద కొడుకు. నాన్నకు ప్రేమ కథా చిత్రాలైనా, ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలైన స్ట్రాంగ్‌ ఉమెన్‌ క్యారెక్టర్స్‌ ఉండటాన్ని ఇష్టపడతారు. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు చైతన్య తీసుకున్నారు. చైతన్య సాఫ్ట్‌ అనుకుంటారు. కానీ తనలో చిలిపితనం కూడా ఉంది. దాన్ని మారుతిగారు చక్కగా వాడుకున్నారు. రమ్యకృష్ణ, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అన్ని పెద్ద హిట్స్‌. ఇప్పుడు తను చైతన్యకు అత్తయ్య అయింది. బాహుబలి తర్వాత రమ్య అంటే ఇప్పుడు భారతదేశంలో తెలియనివారు లేరు. తను ఏ సీన్‌ చేసినా చక్కగా పండుతుంది. నాతో అల్లరి అల్లుడు సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడులో అత్త పాత్రలో చైతుతో నటించింది. గోపీసుందర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కేరళకు సమస్యలు వచ్చినా… డేడికేషన్‌తో మంచి సాంగ్స్‌, రీరికార్డింగ్‌ ఇచ్చారు. అందుకు గోపీసుందర్‌కు థాంక్స్‌. ఎంతో మందికి అన్నం పెడుతున్న నిర్మాణ సంస్థ చినబాబుగారికి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుతిగారి సినిమాలన్నీ చూస్తుంటాను. మాస్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు. మా అక్కినేని అభిమానులకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. గత నెల నా మనసుకు దగ్గరైన ఇద్దరూ వదలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య. ఎవరినైనా నేను అన్నా!.. అని పిలుస్తాను అంటే తననే. మా బాధ్య, బంధం మీకు చెప్పుకోలేను. ఆయన వెళ్లిపోయిన రోజు.. నా పుట్టినరోజు. పొద్దున నిద్ర లేవగానే తెలిసిన న్యూస్‌. ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే మా ఆత్మీయుడు రవీందర్‌ రెడ్డిగారు. ఆయన్ను చాలా మిస్‌ అవుతున్నాం. మాకు సంబంధించి ఏ ఫంక్షన్‌ ఉన్నా ఆయన ముందుండేవారు. ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలి. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా నిండా నవ్వులే. ఎక్కడా సాంగ్‌ ఉండాలి. ఎక్కడ ఫైట్‌ ఉండాలి. ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలో తెలిసిన దర్శకుడు మారుతి చేసిన సినిమా. చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
 
బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి
 
నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ”ఈ ఫంక్షన్‌కి రావడానికి రెండు కారణాలు.. మారుతి, టీమ్‌ అందరూ ఒక కారణమైతే..రెండో కారణం, నాగార్జునగారితో దేవదాస్‌ షూటింగ్‌ అయిపోయింది. దాసుగారిని దేవాగా మిస్‌ అయ్యానని వచ్చాను. ఇక సినిమా విషయానికి వస్తే.. చైతన్యను చూసి అసూయగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను ఎంత ఎంజాయ్‌ చేసుంటాడో నాకు అర్థమవుతుంది. మారుతిగారు ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌. అలాంటి వ్యక్తి ఆరు నుండి తొమ్మిది నెలలు ఓ సినిమాపై వర్క్‌ చేశాడంటే సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నిర్మాత నాగవంశీ.. నా క్లాస్‌మేట్‌. నేను, చైతన్య దాదాపు ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. ఇంతకు ముందు జనరేషన్‌లో బెస్ట్‌ సాంగ్స్‌ అన్ని నాగార్జునగారికి పడితే.. ఈ జనరేషన్‌లో బెస్ట్‌ సాంగ్స్‌ అన్ని చైతన్యకే పడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి మంచి పాటలు రాసి పెట్టి ఉన్నాయోమో.. ఈ సినిమాలో కూడా పాటలు చాలా బావున్నాయి. టీజర్‌, ట్రైలర్‌ చాలా బావున్నాయి. అల్లరి అల్లుడులాంటి సినిమా అని నాగార్జునగారు అన్నారు. ఆయన అలా అన్నారంటే సినిమా ఎంత బావుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అనుఇమ్మాన్యుయేల్‌ నా మజ్నుతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ అయ్యింది. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎంటైర్‌ యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాలి” అన్నారు.
 
అభిమానులే మా బ‌లం.. ఎంక‌రేజ్ మెంట్‌ 
 
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ”అక్కినేని అభిమానులే మా బలం. వారి వల్లే నాకు ఎంకరేజ్‌మెంట్‌ దొరుకుతుంది. మీరిచ్చే ప్రేమకు హిట్‌ సినిమానే కోరుకుంటారు తప్ప.. మరేం కోరుకోరు. ఇప్పటి నుండి ప్రతి సినిమాకు అభిమానులను మైండ్‌లో పెట్టుకుంటాను. అక్కినేని అభిమానులనీ గర్వపడేలా చేస్తానని మాట ప్రామిస్‌ చేస్తున్నాను. ఈ సినిమా అలాంటి సినిమా. మారుతిగారు సూపర్బ్‌ సినిమా ఇచ్చారు. నా కంటే మీకు ఏం కావాలనే దాన్ని మారుతిగారే ఎక్కువగా పట్టించుకుంటారు. కొత్త బాడీ లాంగ్వేజ్‌, ఎనర్జీతో నన్ను ప్రెజంట్‌ చేసిన మారుతిగారికి థాంక్యూ సో మచ్‌. నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు ఈ సినిమాను మారుతిగారు ప్లాన్‌ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్‌. నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌గారు రెండేళ్ల క్రితం నాకు మరచిపోలేని సినిమా ప్రేమమ్‌ను ఇచ్చారు. రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు మారుతిగారితో మంచి కాంబినేషన్‌ను సెట్‌ చేశారు. ఈ జర్నీ వారితో ఇలాగే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాను. రమ్య మేడమ్‌ నుండే మాకు బిగ్గెస్ట్‌ సపోర్ట్‌ వచ్చింది. రమ్య మేడమ్‌ను దృష్టిలో పెట్టుకునే మారుతిగారు నాకు ఈ కథను చెప్పారు. ఆవిడ చేయకుండా సినిమా ఇంత బాగా వచ్చేది కాదు.హీరోయిన్‌గా చేసిన అను ఇమ్మాన్యుయేల్‌ ఈ ఈ సినిమాతో ఇంకా హైట్స్‌కి రీచ్‌ అవుతుంది. గోపీసుందర్‌గారు ప్రేమమ్‌ తర్వాత మరో సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. కెమెరామెన్‌ నిజార్‌, సీనియర్‌ నరేష్‌, పృథ్వీ అందరికీ థాంక్స్‌. పండగక్కి పండగలాంటి సినిమా. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది” అన్నారు.
పండ‌గలా ఉంటుంది
 
రమ్యకృష్ణ మాట్లాడుతూ - ”శైలజారెడ్డి అల్లుడు ఓ పెద్ద పండుగలా ఉండబోతుంది. నాగచైతన్యగారు చిలిపి నాగచైతన్యగా ఆకట్టుకుంటారు. ఎంటర్‌టైనింగ్‌ మూవీ. మారుతిగారు, నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.
పెద్ద స‌క్సెస్ కొట్ట‌బోతున్నాం
 
అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ - ”మారుతిగారు కరెక్ట్‌ టైమ్‌లో కరెక్ట్‌ హీరోను పట్టారు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. చేసుకోగానే ఫేస్‌లో గ్లో వచ్చేసింది. ట్రైలర్‌, సాంగ్స్‌ చూస్తుంటే ‘ఏమున్నాడ్రా బాబు మా అన్నయ్య’ అనిపిస్తుంది. సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. రమ్యకృష్ణగారు, అను, నిర్మాతలకు అభినందనలు. నాన్న చెప్పినట్లు అల్లరి అల్లుడు లాగానే ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ కొట్టబోతున్నామని అనిపిస్తుంది” అన్నారు.
అభిమానులు కోరుకునే సినిమా
 
చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ”అక్కినేని అభిమానులు కోరుకున్నట్లు నాగచైతన్యగారు తెరపై కనపడతారు. వారిచ్చిన ఎనర్జీతోనే సినిమాను చక్కగా చేశాను. ఈ సినిమా నుండి ఆయన యువ సామ్రాట్‌. నేను ట్యాగ్‌ వేస్తున్నాను. శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్‌ చూసి 80-90లో చూసిన అత్త, అల్లుడు మధ్య నడిచే పోట్లాట, చాలెంజింగ్‌ సినిమా కథ కాదు. మంచి లవ్‌స్టోరి. దీనికి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంత యాడ్‌ చేయాలో అంత చేశాం. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా రావడానికి ఎంతో సపోర్ట్‌ చేశారు. నిజార్‌షఫీగారు మంచి విజువల్స్‌ ఇచ్చారు. గోపీసుందర్‌గారు చాలా కష్టపడి క్వాలిటీ తగ్గకుండా సినిమాకు పాటలు, రీరికార్డింగ్‌ ఇచ్చారు. రమ్యకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమెతో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆమెతో శైలాజరెడ్డిగా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అను ఇమ్మాన్యుయేల్‌ తన పాత్రకు న్యాయం చేసింది. నాకు ఒక యాక్టర్‌గా అయినా.. హీరోగా పరిచయం అయినా.. చైతన్య క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. సినిమాతో సంబంధం లేకుండా మా జర్నీ సాగింది. వినాయక చవితికి, ఈనెల 13న సినిమా విడుదలవుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత రాధాకృష్ణగారు, నాగవంశీగారు, పి.డి.వి.ప్రసాద్‌గారికి థాంక్స్‌. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అలాగే నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌” అన్నారు.
 
అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – ‘‘చైతన్యతో పనిచేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. రమ్యకృష్ణగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఆమె చాలా ఇన్‌స్పైర్‌ చేశారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌” అన్నారు.
సీనియర్‌ నరేశ్‌ మాట్లాడుతూ - ”ఎంటర్‌టైనింగ్‌ మూవీ శైలజారెడ్డి అల్లుడు. అన్ని సెంటర్స్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మారుతిగారు తనదైన స్టయిల్‌లో ప్రేక్షకులను మెప్పిస్తారు. మారుతి నేచురల్‌ టాలెంటెడ్‌. నాకు చాలా మంచి పాత్రను ఇచ్చారు. రమ్యకృష్ణ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నాగచైతన్య ప్రతి సినిమాను సిన్సియర్‌ అప్రోచ్‌తో చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో కూడా తన సిన్సియర్‌ అప్రోచ్‌ కనపడుతుంది. ఎంటైర్‌ టీమ్‌కు అభినందనలు” అన్నారు.

‘Shailaja Reddy Alludu’ pre-release event held amid fanfare

The pre-release event of ‘Shailaja Reddy Alludu’ was held on Sunday evening in Hyderabad.  Nagarjuna and Nani graced the occasion as main guests.  To be released on Sept 13, the family-comedy entertainer has been directed by Maruthi and produced by S Naga Vamsi and PDV Prasad.

‘King’ Nagarjuna said, “Everybody is calling Naga Chaitanya as a ‘shailaja reddy alludu’.  But he is a grandson of Akkineni Nageswara Rao garu and elder son of Nagarjuna.  I have always liked love stories and entertainers with strong women characters in my career.  Chaitanya is taking my legacy forward.  People think that Chaitanya is a soft guy.  But he is also naughty.  Maruthi has portrayed it so well in this film.  I and Ramya Krishna have acted in many movies.  And they were big hits.  She is now Chaitanya’s ‘Atthamma’ in ‘SRA’.  After ‘Baahubali’, there is nobody in the country who doesn’t know Ramya Krishna.  Whichever scene it may be, she carries herself so well.  Gopi Sundar is in great form.  Despite what happened in Kerala, he has completed his works on ‘SRA’ with dedication.  I wish that Chinababu garu, whose production house is providing livelihoods to many, scores a big hit with ‘SRA’.  I have watched Maruthi’s movies.  He knows the pulse fo the mass audience.  This film is a laugh riot.  Maruthi knows best where to have the fights, songs, etc.”
Nag said that, last month, two of his dearest people passed away.  “I used to call Harikrishna garu ’Anna’.  He died on my birthday and when I came to know about it, I was at a loss to understand what to make out of it!  Ravindar Reddy (Akkineni fans association president) is the other person.  He used to be at the forefront of every single event related to our family films,” the ‘Devadas’ actor said.
Natural Star Nani said, “There are two reasons why I have attended this function.  If Maruthi and his team are one reason, the other reason is that I am missing Nagarjuna garu ever since the shooting of ‘Devadas’ was over.  I am jealous of Chaitanya.  It’s because I can gauge how much he must have enjoyed while shooting for ‘SRA’. Maruthi garu is an entertaining person.  And his films are always entertaining.  Naga Vamsi, this film’s producer, was my classmate.  I and Chaitanya had started our careers around the same time.  In the previous generation, Nagarjuna garu used to walk away with the best songs.  In this generation, it’s the turn of his son.  Akkineni family heroes are lucky in that respect.  I have loved the Teaser and Trailer for ‘SRA’.  Nagarjuna garu has said that ‘SRA’ is like an ‘Allari Alludu’.  We can understand how entertaining the film must be.  Anu Emmanuel was introduced as the heroine with ‘Majnu’.  I wish her and the entire team all the best.”
Akkineni Akhil said, “Maruthi garu has got the right hero at the right time.  He got married only recently.  As soon as he got married, his face started glowing!  ‘Emundra babu maa annayya’ is what I am thinking seeing the trailer.  I am waiting for the movie.  I feel this one will be a big hit like Allari Alludu.”
Naga Chaitanya said, “Akkineni fans are my biggest strength.  In return for the love that you shower on us, you seek only a hit from us.  I will keep the fans in mind before doing every film from now.  I promise that I will make you people proud.  Maruthi garu has made a superb film.  More than me, it’s he who knows best what the audience wants.  He has presented me with a new body language and energy.  I thank him for that.  Naga Vamsi and PDV Prasad garu gave me ‘Premam’ a couple of years ago.  And now, it’s ‘SRA’.  I hope this journey of ours will go on.  Ramya Krishna madam gave us support throughout.  Maruthi garu narrated the story to me keeping her in mind.  But for her, this film wouldn’t have come out this well.  Anu will reach greater heights.  After ‘Premam’, Gopi Sundar has given me one more nice album.  Cinematographer Nizar Shafi, senior Naresh garu, Prudhvi and all have done a nice job.”
Maruthi said, “Akkineni fans will see Naga Chaitanya the way they have always wanted to see him.  With the support they gave me, I have made this film well.  With this film, Chaitanya is a Yuva Samrat.  I am giving him this tag.  ‘SRA’ is not a typical Attha vs Alludu story that we used to see in the 90s.  It’s a new story.  From the cinematographer to Gopi Sundar, everybody has made it all the more entertaining.  I have grown up watching Ramya Krishna garu’s movies.  I am very happy to have worked with her.  Anu has done full justice to her role.  Chatainya is a close friend now.  Our bond goes beyond the professional one.  I thank the producers for making this movie without compromising anywhere.”
Ramya Krishna said, “This film is going to arrive like a big festival.  Naga Chaitanya will entertain you as a naughty Naga Chaitanya.  I thank the prdocuers and the director.”
Anu Emmanuel said, “It was very comfortable to work with Chaitanya.  I have learned many things from Ramya Krishna garu.  She used to inspire me a lot.  I thank everybody for all the support.”
Senior Naresh said, “‘SRA’ is an entertaining movie.  It will entertain the audience of all centres.  Maruthi garu has a style of his won.  He has given me a nice role in the movie.  Chaitanya approaches every scene with sincerity.”

‘anaganaga o prema kadha’ film First look has been launched by MEGA PRINCE ‘VARUNTEJ’

‘anaganaga o prema kadha’ film First look has been launched by MEGA PRINCE ‘VARUNTEJ’

 A feel good love story Movie titled  Anaganaga o premakatha is produced by

K . L .N . RAJU under banner THOUSAND LIGHTS MEDIA PVT LTD  ,introducing marthand k venkatesh nephew viraj j ashwin as hero and riddhi kumar as heroine has finished shooting part and movie team is busy in  undergoing post production works, like CGI,DI AND DTS works . First look of this movie is launched by MEGA PRINCE “VARUN TEJ “on his twitter account and wished entire team all the best . producer of the movie k l n raju expressed his happiness and thanked VARUN TEJ for lauching first look . a r Rahman associate kc anjan composed  music for this film, edurolu raju wored as a cinematographer and the film is edited by marthand k venkatesh.Producer k l n  raju is planning to release this movie in October 2018.5R0A1497 AC1A5002 correction-3 plan correction-3 WhatsApp Image 2018-09-06 at 6.34.59 PM WhatsApp Image 2018-09-06 at 6.36.32 PM

Thousand Lights Media Pvt.Ltd

“ANAGANAGA O PREMAKATHA”

Producer :K.L.N Raju
KLN Raju  Garu son in law of noted producer late DVS Raju .he is associated with Telugu film industry for past 30 years financing leading Producers . After a short gap of producing film ,he  kick started to the new banner Thousand Lights Media under which our new project Anaganaga O Prema Katha. He decided to continue  producing  promising film from now onwards  

Movie Details :Anaganaga O Prema Katha
Coming to detailing, the movie is a pure love story with one interesting new scientific element fascinatingly connecting the love story to all the five human senses. To say it is an out and out “U” rated youth and family oriented unique love story.
Programming has been done with one schedule at Hyderabad the second at Vizag and the rest is being planned abroad.

Director: Pratap.T
Finally captain of the ship promising Director Pratap, has his start up working as a programming director for a few channels and has stepped into the film industry working as an assistant director under famed director N Shankar and also has his experience working as an associate for a couple of films. Now it’s time to take charge as the captain directing his debut film associating with such prestigious cast and crew.

Cast Details
Male Lead: Viraj J Ashwin
Introducing Viraj J  Ashwin as the main lead who is the nephew of renowned editor Marthand K Venkatesh who has his record of nearly 400 film editing’s. Ashwin making his debut is definitely a promising actor who has made a couple of  Promotionals who has also been trained by the Star Maker Sathyanand.

Female Lead :Riddhi kumar
Coming up next is the heroine lead which is being played by Ridhi hailing from pune has done a few commercials, she has that promising look that made her the lead in a female role.

Female  Lead: Radha Bangaru
Nextly introducing Radha Bangaru as the second lead in the film. She has her experience working as a VJ for a few channels and has also been a trained actress.

Banner                                                    : Thousand lights media pvt ltd

Movie                                                      : ANAGANAGA O PREMA KATHA

Producer                                                 : K L N RAJU

Story & Screenplay

&Dialogues& Director                          : Pratap Tatamsetti


Artist                                                        : Viraj j Ashwin

                                                                      Riddhi kumar

                                                                      Radha bangaru

                                                                      Kasi viashwanath

                                                                      Anish krurvilla

                                                                      Venu (tillu) and others

Music                                                      : KC . ANJAN

Art director                                            : Ramanjaneyulu


CIinematographer                                 : EDUROLU RAJU

Lyrics                                                       : srimani

Dance master                                        : Aneesh

Fight master                                           : Ramkrishna

‘అనగనగ ఓ ప్రేమకథ’ తొలి ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన హీరో మెగా ప్రిన్స్ ‘వరుణ్ తేజ్’ 
 ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలకు ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాత గా థౌజండ్ లైట్స్ మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. 
ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని యువ కథానాయకుడు వరుణ్ తేజ్ తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ‘ట్విట్టర్’ లో ఆవిష్కరించి, చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత కె ఎల్ ఎన్ రాజు గారు మాట్లాడుతూ..,థౌజండ్ లైట్స్ మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ని స్థాపించి ఈ సినిమా ధ్వారా నూతన హీరో హీరోయిన్ లను పరిచయం చేస్తున్నాం ., ప్రతాప్ గారు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ చిత్రం విజయంసాధించాలని ఆశిస్తున్నాను అని తెలిపారు. చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని వరుణ్ తేజ్ గారు ఆవిష్కరించటం సంతోషంగా ఉందని, కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.
 
ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ గారు ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి హీరో గా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ లుగా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు
 
దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.. కె ఎల్ ఎన్ రాజు గారు బ్యానర్ స్థాపించి మొట్టమొదటి సినిమా నాకు దర్శకుడిగా అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది  అన్నారు.
హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ ఈ  సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి