Superstar Mahesh Babu Trivikram Srinivas, Haarika Hassine Creations’ Guntur Kaaram first single, Dum Masala, Spices up this Diwali!

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్ ల ‘గుంటూరు కారం’ మొదటి పాట ‘దమ్ మసాలా’ దీపావళికి మరింత ఘాటు తీసుకొచ్చిందిసూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 13 ఏళ్ళ విరామం తర్వాత ‘గుంటూరు కారం’తో కలిసి వస్తున్నారు. గతంలో వారు ‘అతడు’, ,ఖలేజా, వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించారు. వీరి కలయికలో మరో చిరస్మరణీయ చిత్రం వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అత్యంత విజయవంతమైన నిర్మాత ఎస్.రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ ని మూడోసారి చేతుల కలిపేలా చేసిన ఘనత నిర్మాత రాధాకృష్ణ దే. ఈ కలయికలో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి, అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు కావాలంటూ పదే పదే కోరుతున్నారు.

షూటింగ్ ఎప్పుడు జరుగుతోంది, సినిమా ఎలా రూపొందుతోంది మరియు ఎలాంటి పాటలు కంపోజ్ చేస్తున్నారు, ఇలా సినిమా గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకున్నారు.

రూమర్‌లను అరికట్టడంలో మరియు సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వడంలో మేకర్స్ గొప్పగా పని చేసారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ టీజర్ తర్వాత, గుంటూరు కారం నుండి మొదటి గీతం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అటు మహేష్ బాబుకి, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కి అద్భుతమైన ఆడియోలను అందించిన ఎస్.ఎస్. థమన్ ఈ భారీ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు, ‘దమ్ మసాలా’ వంటి స్పైసీ ట్రాక్‌తో దీపావళిని జరుపుకోవాలని మేకర్స్ నిర్ణయించారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7వ తేదీ సాయంత్రం 04:05 గంటలకు ‘దమ్ మసాలా’ పాట విడుదల చేయబడింది. సరస్వతీ పుత్ర రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. పాటలోని సాహిత్యం కథానాయకుడి పాత్ర తీరుని తెలుపుతోంది.

థమన్ అందించిన ట్యూన్, బీట్ సరికొత్తగా ఉన్నాయి. “నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి”, “నేనో నిశబ్దం, అనునిత్యం నాతో నాకే యుద్ధం” వంటి పంక్తులతో గీత రచయిత పాత్రలోని లోతును ఆవిష్కరించారు. ఈ పాట రాబోయే పండుగలకు అభిమానుల వేడుకలకు గొప్ప వంటకం అవుతుంది.

యువ సంచలన నటి శ్రీలీల ఈ చిత్రంలో మహేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. అలాగే, గుంటూరు కారం తారాగణంలో మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సూపర్ మాస్ చిత్రంగా రూపొందుతోన్న ‘గుంటూరు కారం’ 2024, సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Superstar Mahesh Babu Trivikram Srinivas, Haarika Hassine Creations’ Guntur Kaaram first single, Dum Masala, Spices up this Diwali!

Superstar Mahesh Babu and wizard of words, legendary writer-director Trivikram Srinivas are coming together after a gap of 13 years with Guntur Kaaram. They delivered cult classic films like Athadu and Khaleja. Fans have been eagerly waiting for their combination to come together and deliver another memorable film.

Highly successful producer, Haarika Hassine Creations, S. Radhakrishna, have brought this highly awaited combination together for the film. Ever since, the movie has been announced fans of the combination have been asking for updates regarding the film at every juncture.

They wanted to know when the shoot is happening, how the movie is shaping up and what kind of songs are being composed, literally, everything about the film, they ought to know, they sort out to know.

Makers did a great job in keeping the rumours at bay and give right information at right time. After the special teaser released for Superstar Krishna’s birthday, fans have been awaiting for first single release from Guntur Kaaram.

SS Thaman, who has delivered great audios for Mahesh Babu and Trivikram Srinivas, separately, is composing music for this hugely anticipated film. Now, the makers have decided to celebrate Diwali with a spicy track like Dum Masala.

Also, the track has been released on the occasion of birthday of director Trivikram Srinivas on 7th November at 04:05 PM. Dum Masala song lyrics is written by Sarawasthi Putra Ramjogayya Sastry and crooned by Sanjith Hegde and Jyothi Nooran. Lyrics bring out the attitude of the lead actor, Mahesh Babu’s character in a massy way. His swag and place hailing from are beautifully interlinked in words to give an insight into his character.

The tune from Thaman uses instruments to give explosive sound design to on screen narrative of the character. With lines like “Naa Navvula Kotani nene enduku padagottali”, “Anunithyam naa tho naake yuddham”, lyricist also brought out depth in the character. This song will be a great recipe for fan celebration for upcoming festivals.

Latest sensational actress, Sreeleela, got a huge opportunity to share screen with Mahesh in this film. Also, Guntur Kaaram cast includes hugely popular and most sought after names like Meenakshi Chaudhary, Jagapathi Babu, Jayaram, Prakash Raaj, Ramya Krishnan.

Highly regarded Manoj Paramahamsa is handling cinematography while AS Prakash is handling production design. National Award winning editor Navin Nooli is editing the film while Ram Laxman masters are composing action sequences. Guntur Kaaram with a promise to be Super Massy film from Mahesh Babu and Trivikram Srinivas combination is gearing for release this Sankranthi, 2024 season. More details will be announced soon.

GKStill1 GKStill2 GKStill3 GKStill4

Samantha for “Sapta Sagaralu Dhaati Side B” – People Media Factory Proudly Presents the film to Telugu Audience on November 17th

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు సగర్వంగా అందిస్తున్న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” కోసం సమంత

ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

నవంబర్ 4న సాయంత్రం 06:06 గంటలకు అగ్ర కథానాయిక సమంత ఈ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్, దానిలోని ఆసక్తికరమైన మరియు ప్రత్యేక లక్షణాల కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల మేకర్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. నవంబర్ 17 నుండి థియేటర్‌లలో ప్రేక్షకులు ఈ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఆస్వాదిస్తారని విశ్వసిస్తున్నారు.

తెలుగులో “సైడ్ ఎ” ఘనవిజయం సాధించినట్లుగానే, “సైడ్ బి” కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ప్రతిభావంతుడైన హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి తన కెమెరా పనితనంతో కట్టి పడేయగా, చరణ్ రాజ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు.

ట్రైలర్ లాంచ్ ఈ ఆకర్షణీయమైన ప్రయాణంలో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ అద్భుతమైన సినిమా ప్రయాణాన్ని తెలుగు ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

నవంబర్ 17న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” ఘనంగా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిత్రం: సప్త సాగరాలు దాటి
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్
రచన– దర్శకత్వం : హేమంత్ ఎం రావు
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల

Samantha for “Sapta Sagaralu Dhaati Side B” – People Media Factory Proudly Presents the film to Telugu Audience on November 17th

November 4th: T.G. Vishwa Prasad & Vivek Kuchibhotla of People Media Factory are delighted to announce the highly-anticipated trailer for “Sapta Sagaralu Dhaati Side B,” promising another remarkable cinematic experience for Telugu film enthusiasts on November 17th.

The trailer was digitally launched by Samantha Garu on November 4th at 06:06 PM. This eagerly awaited trailer has garnered significant attention due to its intriguing and unique qualities, setting it apart from Part A. We’re enthusiastic about the audience’s response, and we are confident that they will thoroughly enjoy the film in theaters starting from November 17th.

Following the immense success of Side A in Telugu, we are certain that “Side B” will once again capture the hearts of Telugu audiences. The film, directed by the talented Hemanth Rao, boasts an impressive cast featuring Rakshit Shetty, Rukmini Vasanth, and Chaithra J Achar in the lead roles. Advaitha Gurumurthy, renowned for his remarkable cinematography, serves as the Director of Photography, while the music, an integral part of this film, is composed by Charan Raj.

The trailer launch marks the beginning of an exciting new chapter in this captivating saga, and we eagerly anticipate sharing this incredible cinematic journey with you.

Stay tuned for more updates and mark your calendars for the grand release of “Sapta Sagaralu Dhaati Side B” on November 17th.

 

19 - Trailer Announcement PLAIN 27 - 3 hours to go PLAIN SSE SIDE B ANNOUNCEMENT

Panja Vaisshnav Tej and Sreeleela starrer Sithara Entertainments’ Aadikeshava grand release on November 24th, worldwide

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సితార సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొని, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. అలాగే జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ‘సిత్తరాల సిత్రావతి’, ‘హే బుజ్జి బంగారం’, ‘లీలమ్మో’ విడుదలై విశేష ఆదరణ పొందాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాత ఎస్. నాగవంశీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడంలేదు. అందుకే నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన ‘ఆదికేశవ’ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, “ఈ వరల్డ్ కప్ ఫీవర్ చూస్తున్నారు కదా.. ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు సినిమాల వసూళ్ళపై ప్రభావం పడటం మేం గమనించాం. పైగా ఇప్పుడు సెమీ ఫైనల్స్ వస్తున్నాయి. ఇండియా ఫైనల్ కి వెళ్ళి, వరల్డ్ కప్ గెలుస్తుందనే అంచనాలు అందరిలో ఉన్నాయి. అందుకే ఈ సమయంలో విడుదల చేయడం కరెక్ట్ కాదని చిత్ర బృందం, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో చర్చించి నవంబర్ 24న విడుదల చేయాలని నిర్ణయించాం. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌, మాస్‌ ఆడియన్స్‌ని కూడా ఈ సినిమా అలరిస్తుందని అన్నారు.
‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ‘ఆదికేశవ’ అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
 
Panja Vaisshnav Tej and Sreeleela starrer Sithara Entertainments’ Aadikeshava grand release on November 24th, worldwide
Sithara Entertainments has delivered a huge blockbuster with MAD recently and they are hoping to continue the success spree with Aadikeshava.
Panja Vaisshnav Tej after hyper successful debut with Uppena, has been trying his hand at different genres and this time, he is coming up with Aadikeshava, a raw action entertainer.
Joju George, National Award winning Malayalam actor and Aparna Das, Dada fame actress are debuting in Telugu with this film.
Current sensation of Telugu Cinema, Sreeleela is playing leading lady role in  Aadikeshava and the songs released by the team, recently,  have gone viral.
Majorly Sreeleela and Panja Vaisshnav dance moves in Leelammo have become hugely popular and Instagram reels have been high on this recent number, too.
National Award winning composer, GV Prakash Kumar has composed music for the film and he is doubly happy with the success of tracks like Sittharala Sithravathi, Leelammo.
Earlier Aadikeshava team has announced the movie release for Diwali, on 10th November, worldwide. As they say, certain things cannot be planned, team had to postpone the release of the film.
Suryadevara Naga Vamsi, producer of the film, has announced that they have decided to postpone the release of the film to 24th November from 10th November.
The postponement has been forced by Cricket World Cup, 2023. India has reached Semi-Finals for sure and probably they might go on to play in Finals, too. Having such important games during the film release and running period would affect the collections.
Hence, team has decided to go for 24th November, release with hoping for a big World Cup win for India at home and global blockbuster success for the film, Aadikeshava.
Writer-director Srikanth N Reddy is debuting as director with the film and he also expressed huge confidence about the film. He stated that the movie will entertain family audiences and youth, mass audiences alike.
Suryadevara Naga Vamsi and Sai Soujanya of Fortune Four Cinemas, are producing the film. Srikara Studios is presenting the film, Aadikeshava. National Award winning editor, Navin Nooli is editing the film. More details will be announced, soon.

DSC_8437

Pindam is a sensible, well-made emotional drama sans vulgarity: Sriram

కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రం ‘పిండం‘
-హీరో శ్రీరామ్
*పిండం చిత్రం టీజర్ ను అభినందించిన చిత్ర ప్రముఖులు
*చిత్ర ప్రముఖుల సమక్షంలో  ‘పిండం‘ టీజర్ విడుదల వేడుక 
ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇటీవల మేకర్స్ ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఈరోజు(అక్టోబర్ 30) ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ, “దీనికి ముందు నాలుగు సినిమాలు స్టార్ట్ చేశాం. అవన్నీ ఇంకా పూర్తి కాలేదు. కానీ రెండే నెలల్లో ఈ సినిమా పూర్తయింది. కరెక్ట్ గా మొదలై, కరెక్ట్ గా పూర్తయింది. మన మనస్సు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. ఇంత మంచి నిర్మాతలను నా జీవితంలో చూడలేదు. మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు చాలా క్లారిటీ ఉన్న మనిషి. ఏం కావాలో స్పష్టంగా తెలుసు. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియనంతగా షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు పిల్లలు రియల్ సూపర్ స్టార్స్. ఒక నటుడిగా వాళ్ళ నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. నటీనటులు గానీ, సాంకేతిక నిపుణులు గానీ ఈ టీమ్ అందరితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అని చెప్పడం వల్ల భయపడి సినిమాకి రాకుండా ఉండకండి. ఏంటి మమ్మల్ని భయపడతారా అనుకొని సినిమాకి రండి. ఖచ్చితంగా సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అనవసరమైన పాటలు, రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రమిది. ఇలాంటి మంచి టీమ్ గెలవాలి. ఇలాంటి మంచి సినిమాని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, “సినిమా తీయడానికే భయపడుతున్న ఈ రోజుల్లో భయపెట్టే సినిమా తీశాడు సాయి. ముందుగా దానికి మెచ్చుకోవాలి. సాయి ఎంతో ప్రతిభావంతుడు. ఐటీ జాబ్ చేస్తూ, సినిమా మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చాడు. 2020 లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మా బ్యానర్ లోనే దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. అది అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వీసాలు రాలేదు. ఆ తర్వాత సిద్ధు డీజే టిల్లు తో బిజీ అయ్యాడు. ఇంతలో సాయి ఈ సినిమా చేసుకొని వస్తా అన్నాడు. ఇలాంటి ప్రతిభావంతులు పరిశ్రమకి కావాలి. అప్పుడే వైవిధ్యమైన సినిమాలు వస్తాయి. పిండం అనేది జననానికి, మరణానికి సంబంధించినది. ఈ పిండం సాయి కిరణ్ లాంటి ప్రతిభగల దర్శకుడి పుట్టుకకు కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ టాలెంట్ త్వరలో ప్రపంచం చూడబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.
ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ, ” హారర్ జానర్ లో సినిమా తీద్దాం అనుకోవడంతోనే నిర్మాతలు సగం విజయం సాధించారు. హారర్ సినిమాల వల్ల అన్ని విభాగాలు తమ పనితనాన్ని చూపించుకోవచ్చు. అయితే మామూలుగా హారర్ సినిమాల్లో దెయ్యంగా ఎందుకు మారింది అనేది చివరిలో ఓ రెగ్యులర్ ఫార్మాట్ లో చెప్తారు. కానీ దీనిని పిండం అనే టైటిల్ పెట్టడం వల్ల, ఇది రెగ్యులర్ హారర్ ఫిల్మ్ కాదు అనిపిస్తోంది. చావుకి, పుట్టుకకి వారధి లాంటిది ఈ కథ, వెంటనే చూడాలి అనే ఆసక్తి కలుగుతోంది. ఈ సినిమాలో ఎందరో ప్రతిభగల నటీనటులు ఉన్నారు. టీజర్ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.” అన్నారు.
చిత్ర నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ, “కళాహి మీడియా బ్యానర్‌పై ఇది మా మొదటి సినిమా. చాలా రోజుల నుంచి ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించాలని ఎంతో హోంవర్క్ చేశాము. అలాంటి వర్క్ లో నుంచి వచ్చినదే పిండం. కళాహి మీడియా బ్యానర్‌పై ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేస్తాం. ఇక నుంచి మా బ్యానర్ పేరు వింటూనే ఉంటారు. పిండం సినిమా గురించి చెప్పాలంటే.. డైరెక్టర్ గారు ఎలాంటి సోది లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా హారర్ మూవీ అంటే హారర్ మూవీ లాగా చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతిభగల నటీనటులు, సాంకేతిక నిపుణులు దొరకడం వల్లే సినిమాని ఇంత త్వరగా, ఇంత బాగా తీయగలిగాం.” అన్నారు.
చిత్ర దర్శకుడు సాయి కిరణ్ మాట్లాడుతూ, ” పిండం అనే కథ ఎలా మొదలైంది అంటే.. ఒకసారి మా అమ్మమ్మ ఊరిలో జరిగిన ఓ క్రూరమైన ఘటన గురించి చెప్పారు. అది నా మైండ్ లో అలాగే ఉండిపోయింది. దానిని ఎలా చెప్పాలి అని ఆలోచిస్తే.. హారర్ జానర్ చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఘటన చుట్టూ హారర్ జానర్ కి తగ్గట్టు కథ అల్లుకొని రాయడం జరిగింది. ఇదొక ఇంటెన్స్ హారర్ ఫిల్మ్. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాకి పిండం అనే టైటిల్ ఎందుకు పెట్టారని చాలామంది అడుగుతున్నారు. సినిమా చూశాక ఈ కథకి ఇదే సరైన టైటిల్ అని మీరే అంటారు. పిండం అనేది నెగటివ్ టైటిల్ కాదు. మనిషి ఆరంభం, అంతం రెండూ దానితో ముడిపడి ఉంటాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల అందరి సహకారంతో ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసినప్పుడు, సాయి కిరణ్ గారు చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను. చాలా నచ్చింది. అది చూసి నేను సాయి కిరణ్ గారితో వర్క్ చేయాలి అనుకున్నాను. దర్శకుడు, నిర్మాత కలిసి ఒక టీమ్ గా పనిచేస్తేనే మంచి సినిమా వస్తుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. కళాహి మీడియా ముందు ముందు మరిన్ని సినిమా నిర్మించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
చిత్ర కథానాయిక ఖుషీ రవి మాట్లాడుతూ, ” తెలుగులో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. శ్రీరామ్ గారు అద్భుతమైన నటుడు, మంచి మనసున్న వ్యక్తి. ఈ టీమ్ తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.” అన్నారు.
‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనే ఉప శీర్షికకు తగ్గట్టుగానే ‘పిండం’ టీజర్ సాగింది. “ఇది అన్ని కుక్కల్లా లేదు. ఇదేదో వేరే జంతువులా ఉంది. దీనిని వెంటనే పూడ్చి పెట్టండి. లేదంటే ఈ ఊరికే ప్రమాదం” అంటూ ఈశ్వరీ రావు చెప్పే మాటతో టీజర్ ప్రారంభమైంది. ఈశ్వరీ రావు ఒక ఇంటిలోకి వెళ్ళి ఆత్మ ఆవహించిన అమ్మాయితో మాట్లాడుతుంది. ఆ తర్వాత “మీ కెరీర్ లో మోస్ట్ కాంప్లికేటెడ్ కేస్ ఏదైనా ఉందా?” అని అవసరాల శ్రీనివాస్ అడగగా.. “ఉంది. అది చాలా ప్రత్యేకమైనది. దానిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా అటువంటి దాని గురించి వినలేదు. అదొక అపారవంతమైన శక్తి కలిగి ఉన్న ఆత్మ కథ.” అంటూ ఈశ్వరీ రావు సమాధానం చెప్తుంది. శ్రీకాంత్ శ్రీరామ్ కుటుంబం నివసిస్తున్న ఇంట్లో అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులంతా చావు భయంతో వణికిపోతుంటారు. అసలు ఆ ఇంట్లో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఎవరు? ఆ ఆత్మ కథేంటి? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ టీజర్ ని రూపొందించారు. ఇక “కళ్ళకు కనిపించే భౌతిక ప్రపంచం చాలా చిన్నది. దాని సరిహద్దులు మనకు అర్థమవుతాయి. కానీ లోపల ప్రపంచానికి సరిహద్దులు ఉండవు. అది అంత తేలికగా అర్థంకాదు.” అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో టీజర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్, బీజీఎం తో రూపొందిన ఈ థ్రిల్లింగ్ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
‘పిండం‘ అనేది కంప్లీట్ హారర్ చిత్రంగా ఉండబోతుంది. ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. మూడు కాలక్రమాలలో జరిగేదిగా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుంది.
తారాగణం: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు
కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
డీఓపీ: సతీష్ మనోహర్
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
ఆర్ట్: విష్ణు నాయర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ
పోరాటాలు: జష్వ
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ. వి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి
Pindam is a sensible, well-made emotional drama sans vulgarity: Sriram
Teaser of Pindam, horror thriller starring Sriram, Kushee Ravi, launched; team confident of delivering a hit
Roja Poolu, Okariki Okaru fame Sriram and Dia fame Kushee Ravi are coming together for Pindam, a horror thriller directed by a debutant Saikiran Daida. Yeshwanth Daggumati produces the film under Kalaahi Media. After wrapping up the shoot, the film is gearing up for a November release; the promotional campaign commenced recently, with the launch of the first look.
Ahead of the release, the makers have now launched the teaser with renewed enthusiasm. The glimpse lives up to the ‘scariest film ever’ caption, where a spirit healer recounts one of the most spooky experiences pertaining to a middle-class household in her life. The teaser does well to pique the curiosity of the viewer, with the treatment, slick visuals, haunting sound design and technical finesse.
Apart from the cast and crew, popular writers Kona Venkat, BVS Ravi, director Sree Harsha Konuganti were the chief guests at the teaser launch in Hyderabad. Here’s what they had to say at the event.
Actor Sriram : I am thankful to all the guests who’ve gathered. A genuine team put together this project and finished it within two months, we lost track of time. The producer, director are all like family, took good care of us and they were open-minded in their approach during shoot. Kushee Ravi is a method actor. The kids are the true stars of the film. Pindam is a sensible, emotional drama sans vulgarity without any forced masala elements or songs. I’m sure it’ll succeed.
Actress Kushee Ravi: Telugu is a new language for me and I’m still learning. I didn’t imagine I would be seen in a Telugu film someday. You’ve welcomed me with so much warmth through Dia. I am thankful to my producer and director for believing in me.  I was nervous but they helped me with the lines. Sriram is a very friendly actor, made me feel at ease. I am grateful to the entire team for making me feel comfortable.
Director Saikiran: The film is based on a true incident I’d heard from my grandma. It’s a cruel crime and I thought horror is the best genre to tell this story. Pindam is an apt title for the film, the word has many meanings and there’s nothing negative about it. The actors and technicians did a fine job, they were very efficient with their craft. I hope crowds encourage our effort.
Writer Kona Venkat: I was supposed to introduce Saikiran as a filmmaker with Siddu as the hero through a crime comedy. I found many talents who’ve migrated to the US – Pravin Lakkaraju, Sreejo and Sai. Saikiran looks at cinema through a new lens. I hope Pindam gives a good start to his career and also to Sriram, Kushee Ravi and others. I am keen on watching the film.
Writer B V S Ravi: Saikiran left Dallas to move here and made a quality product with a good team, it’s a huge task and he has succeeded with it. Only passion drove them. It takes conviction to make a pure genre-based film and provides an opportunity for everyone to showcase their technical finesse. The horror film has broken norms and I wish the team the very best.
Director Sree Harsha Konuganti: In Hushaaru, I’d stated how nothing is impossible when a group of four friends think of fulfilling their dream. The team of Pindam is a true example of it. I already know the story of Pindam and I hope they taste success.
Producer Yeshwanth Daggumati: This is our first production at Kalaahi Media; Pindam is a product of our passion. We’ll be making movies regularly. Pindam is a proper horror film with a gripping screenplay. Sriram is a friendly actor, we’re proud to say Srinivas Avasarala, Kushee Ravi and others are single-take performers. I thank my technicians and the film has shaped up very well.
Actor Srinivas Avasarala: I said yes to Pindam after watching a short film that I was very impressed about. I hope Kalaahi Media makes bigger movies in the times to come. The director and the producer worked together as a single team and I can sense a success. I was in awe of the cinematographer Satish within the first shot.
Actor Ravi Varma: As a character, I’ll be heard more and seen less in the film. I went into the project without expectations, it felt I was waiting all my life for this role. Every minute on the set was exciting. There is a beautiful message in this genre and I hope it reaches audiences. I am eager to watch the film on the big screen as well.
Writer Kavi Siddhartha: Pindam is a title related to nature and it’s important to look at it positively. The director has strived to present it visually and he has all the makings of a good filmmaker.
0014