MY FILMS

4 Letters posters

4 Latters Desing 1 4 Latters Desing 2 PHOTO-2018-12-30-20-06-40

“Anaganaga o Premakadha’ december 14th Release

థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

నిర్మాత కె.ఎల్‌.ఎన్ రాజు మాట్లాడుతూ – “మంచి ప్రేమ‌క‌థ‌. అశ్విన్‌, రిద్ది, రాధా బంగారు స‌హా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హకారంతో మంచి ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఓ కూతురుని మంచి దారిలో పెట్ట‌డానికి తండ్రి ఏం చేశాడ‌నేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్‌. డిసెంబ‌ర్ 14న సినిమాను గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ తాతం శెట్టి మాట్లాడుతూ – “మంచి క్యూట్ ల‌వ్ స్టోరీ. అహ్లాద‌క‌రంగా ఉంటుంది. కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి స‌హాయంతో సినిమాను పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డిసెంబ‌ర్ 14న విడుద‌లవుతోన్న మా ప్ర‌య‌త్నాన్ని ఆదరిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

సున‌య‌న మాట్లాడుతూ – “మా మామ‌గారు కె.ఎల్.ఎన్ రాజుగారు చిన్న సినిమాల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో.. ఈ సినిమా చేశాం. సినిమా కోసం అంద‌రం క‌ష్ట‌పడ్డాం. ఈ నెల 14న మా సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది“ అన్నారు.

విరాట్‌జె.అశ్విన్ మాట్లాడుతూ – “రాజుగారు లేకుంటే సినిమా లేదు. ఆయ‌న బ్యాన‌ర్‌లో హీరోగా ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను. మావ‌య్య మార్తాండ్ కె.వెంక‌టేశ్‌గారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. డిసెంబ‌ర్ 14న విడుద‌ల‌వ‌తున్న మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

రిద్ది కుమార్ మాట్లాడుతూ – “తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. మంచి పాత్ర చేశాను. ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పిస్తాను“ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

KUM_59690034 KUM_60440083 KUM_60470086 KUM_60680095 KUM_60760100 KUM_60900103 KUM_60970110 KUM_61060113 KUM_61180122

Releasing on Dec 14th Anaganaga o premakadha”

థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో…

నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజు మాట్లాడుతూ – ”సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్‌ యు సర్టిఫికేట్‌ పొందింది. డిసెంబర్‌ 14న సినిమాను విడుదల చేస్తున్నాం. క్లీన్‌ లవ్‌స్టోరీ. మంచి సస్పెన్స్‌ కూడా ఉంటుంది. సినిమా చూసినవారు అప్రిషియేట్‌ చేస్తున్నారు. హీరో విరాజ్‌, హీరోయిన్స్‌ రిద్దికుమార్‌, రాధా బంగారు సహా కాశీవిశ్వనాథ్‌ ఇతర నటీనటులు అందరూ చక్కగా నటించారు. దర్శకుడు ప్రతాప్‌ తాతం శెట్టి సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఎడిటర్‌ మార్తాండ్‌ వెంకటేశ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె.సి.అంజన్‌ తదితరులు సినిమా మంచి అవుట్‌పుట్‌ కోసం బాగా కేర్‌ తీసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాను గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ విడుదల చేస్తుంది” అన్నారు.

కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ – ”కె.ఎల్‌.ఎన్‌.రాజుగారు ఎన్నో సినిమాలకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. ఎన్నో చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఆయన నిర్మాణంలో రూపొందిన ‘అనగనగా ఓ ప్రేమకథ’ సాంగ్స్‌, ట్రైలర్‌ చాలా బావున్నాయి. ప్రతాప్‌ సినిమాను చక్కగా తెరకెక్కించారు. మార్తాండ్‌ వెంకటేశ్‌గారి మేనల్లుడు హీరో విరాజ్‌ హ్యండ్‌సమ్‌గా ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉంది. ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ మాట్లాడుతూ -”మా విరాజ్‌ను హీరోను చేసిన కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి సహాయాన్ని మరచిపోలేను. సాంగ్స్‌, ట్రైలర్స్‌ అందరికీ నచ్చాయి. సినిమా కూడా అందరినీ మెప్పిస్తుంది” అన్నారు.

విరాజ్‌ జె.అశ్విన్‌ మాట్లాడుతూ – ”హీరో కావాలనే నా కల నిజమైంది. కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి నిర్మాతగా చేసిన సినిమా ద్వారా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతాప్‌ నా క్యారెక్టర్‌ను ఫుల్‌ ఎనర్జీతో తీర్చిదిద్దారు. మా యూనిట్‌ కుటుంబ సభ్యుల్లా నాకు అండగా నిలబడ్డారు. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు ప్రతాప్‌ తాతం శెట్టి మాట్లాడుతూ – ”ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయ్యింది. మంచి లవ్‌ స్టోరీ. టచ్‌ హేస్‌ ఎ మెమరీ అనే ట్యాగ్‌ లైన్‌ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజుగారు లేకుంటే ఈ సినిమాయే లేదు. ఆయనకి థాంక్స్‌. ఆయన కుమారుడు సతీష్‌గారు, కోడలు సునైనగారు ఎంతగానో ఎంకరేజ్‌ చేస్తూ వచ్చారు. కొత్త వాళ్లతో సినిమా చేయడం చాలా గొప్ప విషయం. వారికి థాంక్స్‌. ఇప్పుడున్న వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఎడిటర్స్‌లో ఒకరైన మార్తాండ్‌ కె.వెంకటేశ్‌గారు బెస్ట్‌ ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. అంతే కాకుండా ఆయన మేనల్లుడిని హీరోగా కూడా ఇచ్చారు. డిసెంబర్‌ 14న సినిమా విడుదలవుతుంది. మా ప్రయతాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

 

 ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
 
సమర్పణ: సతీష్ రాజు 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 
 
 KUM_16780004 KUM_16870007 KUM_17110021 KUM_17130023 KUM_17260034 KUM_17310038 KUM_17360042 KUM_17410047

‘Anaganaga O Prema Katha’ film theatrical Trailer Launched by Action Hero ‘Gopichand”

ZN9A3151 ZN9A3159 ZN9A3166 ZN9A3170 (1) ZN9A3172
 
Anaganaga O Prema Katha a romantic love story with a new scientific element with a tag line called Touch Has a Memory produced by K L N Raju under banner thousand lights media presented by K Satish Kumar and directed by Pratap T. This movie started promotions in unique way starting from teaser launching with big celebrities and also getting good appreciation from every one . For any movie to get connected with audience and bringing them to theatres is TRAILER ,so the movie team prepared to launch the trailer with HERO GOPICHAND . Hero Gopichand   launched trailer at his office and after watching trailer in his words “Ananganaga O Premakatha movie produced under banner thousand lights media directed by pratap and produced by k l n raju introducing Viraj Ashwin and I know Ashwin from childhood as he is nephew of marthand K Venkatesh , he is our family member . trailer is very promosing and Ashwin u did a great a job with nice ease in terms of acting , dance and fights, definitely you will get success and even directed did a good job with promosing trailer and personally wish producer  k l n raju all the best “. Producer K l n raju “I’m thankful to hero Gopichand for launching our movie trailer and Most successful personalities from film industry  like Daggubati Rana lauched our movie teaser and songs  by mani ratnam ,puri jaganadh , parasuram , sekhar kammula  and Trailer by Hero Gopichand ,definitely I wish this movie also get a big success as it is launched by successful people “ ,Hero viraj Ashwin “ today  our movie Anaganaga O Prema Katha trailer launched by hero GOPICHAND and I know him from my childhood and he is very inspiration for me and I ‘m happy that he’s launching our movie trailer and thanks Gopichand anna for lauching. Starring Viraj Ashwin , Riddhi kumar ,Radha Bangaru , Anish Kuruvilla ,kasi viswanath , venu  (tillu ) and other   Editor : marthand k venkatesh , DOP : Edurolu Raju , Music : K C Anjan 

Artists : Viraj j Ashwin,Riddhi kumar,Radha banga

Music :  KC . ANJAN
Editor: Martand.k.venkatesh
CIinematographer  :  Edurolu Raju
Lyrics  :  Srimani
Art director  :  Ramanjaneyulu
Dance master  : Aneesh
Fight master    :  Ramkrishna
Presents: k.satish kumar
Producer  :  K L N  RAJU
Story,Screenplay,Dialogues,
Director  : Pratap Tatamsetti
Banner  :  Thousand lights media pvt ltd  
 
 
అనగనగా ఓ ప్రేమకథ ‘ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ యాక్షన్ హీరో ‘గోపీచంద్’ 
 
‘అనగనగా ఓ ప్రేమకథ ‘
 ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను  ఈరోజు ఉదయం  ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా ‘ట్విట్టర్’ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్, దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి, నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు లు పాల్గొన్నారు.
 
 హీరో గోపీచంద్  మాట్లాడుతూ…’అనగనగ ఓ ప్రేమకథ’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన  చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు. మార్తాండ్.కె.వెంకటేష్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన అక్క కొడుకు అశ్విన్. ఈ చిత్ర హీరో. సన్నివేశాలలో గానీ, సంభాషణలు పలకటం లోగానీ, పోరాటాలలో గానీ అశ్విన్ మంచి ప్రతిభ కనబరిచారు. ఇదే అతని తొలి చిత్రం అనిపించటం లేదు. అంతలా నటించాడు. మంచి హీరో అవ్వాలని అభినందిస్తున్నాను. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. 
తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు  విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ..’ ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను  ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు.  ఈ చిత్రం హైదరాబాద్, అరకు, విశాఖపట్నం , మలేసియా లలోని పలు లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. త్వరలోనే చిత్రం  విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత  తెలిపారు.
 
హీరో విరాజ్.జె .అశ్విన్ మాట్లాడుతూ…’ అన్నయ్య గోపీచంద్ చిత్రాలు చూసి పెరిగాను. ఈ రోజు నేను హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని అంటూ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. 
 
విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా  ‘అనగనగా ఓ ప్రేమకథ’  పేరుతో ఈ చిత్రం నిర్మితమవుతోంది. కె.సతీష్ కుమార్ సమర్పణలో  ప్రతాప్ తాతంశెట్టి   దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
 సమర్పణ: కె.సతీష్ కుమార్ 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 

 

‘anaganaga o premakadha’ dussehra greetings poster

design-18 copy