news

ప్రేమసాగరం టి . రాజేందర్ ‘ప్రేమదాసు’ ఈ నెల 18 న ప్రారంభం

T Rajendher 1
ప్రేమ సాగరం, ప్రేమసామ్రాజ్యం, మైధిలి నా ప్రేయసి, హలో మై డియర్ మొనీషా, వరపుత్రుడు, కుర్రాడొచ్చాడు వంటి చిత్రాల నిర్దేశకుడు సుప్రసిద్ధ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత టి. రాజేందర్ ఓ ప్రేమకధా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ‘శింబు సినీ ఆర్ట్స్’ పతాకంపై ‘ప్రేమదాసు’ పేరుతొ తెలుగు లో తెరకెక్కే ఈ చిత్రానికి కధ , స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, కెమెరా పర్యవేక్షణ, దర్శకత్వం వహిస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.

ఈ సందర్భంగా టి . రాజేందర్ మాట్లాడుతూ ‘పూర్తిగా గోదావరి తీర ప్రాంతాలలో, పచ్చదనంలో, పల్లెటూరి వాతావరణంలో సాగే స్వచ్ఛమైన అచ్చతెలుగు ’సంగీత భరిత ప్రేమకధా చిత్రం ఈ ‘ప్రేమదాసు’ అని అన్నారు. ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం లో నాయికగా నీహారిక నటిస్తున్నారు. ఈ నెల 18 న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే చిత్రం షూటింగ్ ఆ తరువాత గోదావరి ప్రాంతానికి చేరుకుంటుంది.  ‘మే’ నెలాఖరునాటికి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తవుతాయని టి . రాజేందర్ తెలిపారు.

ఇతర ప్రధాన పాత్రలలో సీతానారాయణన్, ఏవీయస్, నాగినీడు, దినేష్, అనంత్, ధనరాజ్, నల్లవేణు, తిరుపతిప్రకాష్, సుమన్ షెట్టి, ప్రభ, జయలలిత లు నటిస్తున్నారు. కెమెరా: సావై  సహదేవన్; రచనా సహకారం: బోస్ బాబు. జి; ఆర్ట్: మహి; ఎడిటింగ్: సుధాకర్; సహ నిర్మాత: ఉషా రాజేందర్.

కధ – మాటలు- పాటలు- సంగీతం- కెమెరా పర్య వేక్షణ- నిర్మాత- దర్శకత్వం: టి. రాజేందర్

‘శ్రీకాంత్’ హీరోగా గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, ఇ స్క్వేర్ చిత్రం

Untitled-1 copy

‘శ్రీకాంత్’ హీరోగా దండుపాళ్యం దర్శకుని

             ద్వి భాషా  చిత్రం 

యదార్ధ సంఘటన ఆధారంగా రూపొంది అటు కన్నడ, ఇటు తెలుగునాట కూడా విజయం సాధించిన ‘దండుపాళ్యం’
చిత్ర దర్శకుడు ‘శ్రీనివాసరాజు’ దర్శకత్వంలో  శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. గతంలో శ్రీకాంత్ హీరోగా గోల్డెన్ లయన్ 
ఫిలిమ్స్ పతాకంపై ‘మహాత్మ’ చిత్రాన్ని నిర్మించిన సి.ఆర్.మనోహర్,ఇ స్క్వేర్ ‘ సంస్థ  విజయ్ లు సంయుక్తంగా కలసి ఈ చిత్రాన్ని
 నిర్మించనున్నారు, తెలుగు, కన్నడ భాషలలో భారీ వ్యయం తో రూపొందే ఈ చిత్రాన్ని మిత్రుడు ‘శ్రీకాంత్’ హీరోగా
నిర్మించటం ఎంతో ఆనందంగా ఉన్నదని నిర్మాతలు సి.ఆర్.మనోహర్,విజయ్ లు తెలిపారు. జూన్ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి 
వెళ్లనుందని, ఇతర నటీ నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే తెలియపరుస్తామన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.వైవిధ్యమైన కధాంశంతో రూపొందే ఈ చిత్రం తెలుగు,కన్నడ భాషలో .’దండుపాళ్యం’ లానే విజయం 
సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు. మిత్రులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించటం సంతోషం గా ఉందని శ్రీకాంత్ అన్నారు.
 చిత్ర కధ,కధనాలు కొత్తదనాన్ని కలిగి ఉంటాయని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు.
బ్యానర్: ‘గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, ఇ స్క్వేర్ ‘

నిర్మాతలు : సి.ఆర్.మనోహర్, విజయ్  కధ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీనివాసరాజు

ఆస్ట్రేలియాలో కృష్ణ పోస్టల్ స్టాంప్

stamp mr.krishna

‘Gifts2surprise.in’ online gift portal launching

 

page0001 gifts teluguDSC_00330014 DSC_00410022 DSC_00370018 DSC_00900065 DSC_00540033 DSC_00730049

ఎస్.పి.బాలు కు సన్మానం