SUDIGAADU FILM

‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి; జూన్ లో విడుదల

 ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి : జూన్ లో విడుదల 
హాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘అరుంధతి’  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు’ అన్నది ఉప శీర్షిక. 

వినోదం లక్ష్యం గా ‘సుడిగాడు’
 సాధారణంగా నరేష్ చిత్రాలన్నీ వినోదాన్ని పునాదిగా చేసుకునే రూపొందుతాయి. ఈ ‘సుడిగాడు’ కూడా వినోదాన్నే అందిస్తాడు. కానీ అది ఎంతో కొత్త తరహాలో ఉంటుంది. విజయ వంతమైన చిత్రాలలోని పలు ఆసక్తి కరమైన సన్నివేశాలను పేరడీ చేస్తూ, చిత్ర కధనాన్ని వినోదంతో పరుగెత్తిస్తూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటం ఈ చిత్రం ప్రత్యేకత.
అదే ఈ ‘సుడిగాడు’ ను నరేష్ చిత్రాలలో వైవిధ్యాన్ని సంతరించు కునేలా చేస్తోందని దర్శక,నిర్మాతలు అంటున్నారు.
జూన్ లో విడుదల:
షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జూన్ ప్రధమార్ధం లో ఉంటుంది. అదే నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలన్న దిశగా  నిర్మాణ కార్య క్రమాలు జరుగు తున్న్నాయని నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి అన్నారు.

‘సుడిగాడు’ కు మూలకధ: అముదన్; రచనా సహకారం: అనిల్,నారాయణ,హరి,గోపి; సంగీతం: శ్రీవసంత్; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, భీమనేని రోశితా సాయి; కెమేర: విజయ్ ఉలఘనాధన్; ఎడిటింగ్: గౌతంరాజు; ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: చంద్రశేఖర్.డి.రెడ్డి; కధ-మాటలు-స్క్రీన్ ప్లే – దర్శకత్వం; భీమనేని శ్రీనివాసరావు.

సుడిగాడు పోస్టర్ డిజైన్

‘సుడిగాడు’ మ్యాటర్ అండ్ స్టిల్ల్స్

నరేష్, భీమనేని శ్రీనివాసరావు ల ‘సుడిగాడు’: ఒక టిక్కెట్ పై 100 సినిమాలు