Release of Keerthy Suresh’s poster from ‘Rang De’ movie.

‘రంగ్ దే’ చిత్రం  లో ‘ కీర్తిసురేష్‘ ప్రచార చిత్రం విడుదల
 ’ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్‘ పుట్టినరోజు సంధర్భంగా ‘ రంగ్ దే‘ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్.
చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది.
ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్  హైదరాబాద్ లో ప్రారంభమై నితిన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్ కు సంబంధించి సేఫ్టీ మెజర్స్  పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ‘ఇటలీ‘ లో పాటలచిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి  కానుకగా చిత్రం విడుదల అవుతుంది.
యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ
‘రంగ్ దే’.  ‘తొలిప్రేమ’,'మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.
సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి

Release of Keerthy Suresh’s  poster from ‘Rang De’ movie.

Range De is a family oriented movie belonging to the love genre. The movie unit has released a poster of the female protagonist, Keerthy Suresh, on the occasion of her birthday. The bright motion poster of the leading lady is attractive at the first glance which is sure to spread pleasent vibes and smiles.
After a long break the movie shooting resumed recently in Hyderabad. Along with actor Nithin, other prominent actors from the industry participated in the shooting and succesfully completed the schedule. The team took all the safety measures and precautions throughout the shoot. The unit is set to fly to ‘Italy’  this month end  to shoot a few important scenes and songs pertaining to the movie. The principal photography is due to be completed with this schedule. This movie would release a 2021 Sankranti treat for the audience.

Rang De’ is the first movie to have the combination of ‘Yuva Kathanayakudu’ Nithin and  ‘Mahanati’ Keerthy Suresh as the lead pair. The movie is being bankrolled under the banner of Sithara Entertainments.
After expertly crafting the love genre with ‘Tholi Prema’ and ‘Mr.Majnu’, highly skillful and young Director Venky Atluri has been entrusted with the role of directing this movie by producer ‘Suryadevara Nagavamsi’.

Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam, Suhas and others are acting in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.

RangDe - Keerthy Bday Poster RangDe - Keerthy Still