Apr 14 2016
‘అ ఆ’ టీజర్ విడుదల
త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం ’అ ఆ’ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక )
‘త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం ‘అ ఆ’ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక )
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందిస్తున్న ఈ చిత్రం టీజర్ నిన్న సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ ప్రసంశ లందుకుంది ఈ ‘అ ఆ’ టీజర్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ‘ ఈ ‘అ ఆ’ టీజర్ అందరి మన్ననలు అందుకోవటం ఎంతో ఆనందం గా ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ను ప్రేక్షకులు మే లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు. చిత్రం ఆడియో ను ఈ నెలలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. మిక్కి.జె.మేయర్ సంగీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మే నెల ప్రధమార్ధంలో ‘అ ఆ’ విడుదల అవుతుందని తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో నదియ, అనన్య,ఈశ్వరీ రావు, సన,గిరిబాబు,పోసాని,నరేష్, రావురమేష్, అవసరాల్ శ్రీనివాస్, ప్రవీణ్,రఘుబాబు, పమ్మి సాయి, శ్రీనివాస్ రెడ్డి. నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం-మిక్కి.జె.మేయర్ , కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి. ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్
|