ఈ నెల 16 న హీరో శ్రీకాంత్ ‘మొండోడు’ ఆడియో విడుదల

 హీరో శ్రీకాంత్ కధానాయకునిగా యాక్షన్.సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మొండోడు’.  రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ  నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా  నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16 న  చిత్రం ఆడియో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. మధుర ఆడియో కంపనీ ద్వారా విడుదల అవుతోంది ఈ చిత్ర సంగీతం. ఆగస్టు నెలలోనే  చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆయన అన్నారు.

 
కధానాయకుడు శ్రీకాంత్ ‘దొంగ’ గా, కనిపిస్తారీ చిత్రం లో. పాత్ర తీరు తెన్నులు వైవిధ్యంగా ఉంటాయి. తన బిడ్డ కాదు అసలు తానెవరో కూడా తెలియని ఓ చిన్న పాపకోసం ప్రాణాలు ఇవ్వటానికైనా,ప్రాణాలు తీయటానికి అయినా సిద్ధ పడే ఓ దొంగ కధే ఈ ‘మొండోడు’ అని దర్శకుడు జర్నలిస్ట్ ‘ప్రభు’ తెలిపారు.పూర్తి వినోదం తో పాటు అంతర్లీనం గా ఓ మంచి సందేశం ఉంటుంది ఈ చిత్రంలో అని తెలిపారు దర్శకుడు ‘జర్నలిస్ట్ ప్రభు’
 
ఇతర పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు.
కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి: సంగీతం: సాయికార్తీక్:పాటలు: శ్యాం కాసర్ల  ఎడిటింగ్: నాగిరెడ్డి :సమర్పణ: జ్యోత్స్నారెడ్డి : నిర్మాత:రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి: స్క్రీన్ ప్లే – దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు 
 Mondodu  (3)