Feb 27 2020
ఈ నెల 29 న వైజాగ్ లో ‘భీష్మ’ విజయోత్సవ వేడుక
ప్రపంచ వ్యాప్తంగా చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని వైభవంగా ఓ వేడుకను జరపాలని నిర్ణయించుకున్నారు చిత్ర యూనిట్. వాటి వివరాల్లోకి వెళితే…ఈ నెల 29 న వైజాగ్ లోని ‘గురజాడ కళాకేత్రం’ లో ‘భీష్మ’ చిత్ర విజయోత్సవ వేడుక ను నిర్వహించ నున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. హీరో నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలచిన ‘భీష్మ’ వేడుకను, ఇంతటి ఘన విజయాన్ని తమకు అందించిన ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శనివారం( 29 ) సాయంత్రం వైజాగ్, వుడా కాంప్లెక్స్, సిరిపురం లోని ‘గురజాడ కళాకేత్రం’ లో 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ విజయోత్సవ వేడుకలో చిత్రకథానాయకుడు నితిన్, నాయిక రష్మిక మందన్న లతోపాటు చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. ఆరోజు జరిగే వేడుక ఆద్యంతం అభిమానులను అలరించనుంది.