Sep 17 2016
కింగ్ నాగార్జున చేతుల మీదుగా ‘మన ఊరి రామాయణం’ ఆడియో విడుదల
జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కన్నడలో ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన మన ఊరి రామాయణం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ దసపల్లా హోటల్లో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరై బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ…ఈ ఆడియో ఫంక్షన్‌కు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి మనిషిలో రాముడు, రావణాసురుడు ఉంటారు. ఎన్టీఆర్‌గారు చేసిన రావణాసురుడు రోల్ చూశాను. పుస్తకాల్లో చదివాను. అందుకే రావణాసురుడు అంటే నాకు కూడా ఇష్టమే. ప్రకాష్ రాజ్ జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తాడు. తనలా ఉండటానికి నేనెంతో ప్రయత్నించాను. ఏ పని చేసినా ప్రకాష్ ఎంజాయ్ చేస్తాడు. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో మనవూరి రామాయణం రూపొందడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మంచి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నాయి. ఇలాంటి టర్నింగ్ మూమెంట్లో మనవూరి రామాయణం విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రకాష్ రాజ్‌గారికి దర్శకుడిగా కూడా నేషనల్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ…ఒక దర్శకుడిగా ఈ చిత్ర కథ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ చిత్రంలోని నదిలాంటి ఆ పాత్రను చేయడానికి ప్రియమణియే కరెక్ట్ అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ రోల్. ముగ్గురి జీవితంలో మార్పును, వేరే కోణాన్ని చూపించి వెళ్ళిపోయే క్యారెక్టర్. ప్రియమణి లేకుండా ఈ కథను ఊహించుకోలేను. తను ఇంటెన్స్ నటి. సత్య, పూరి జ్యోతిలక్ష్మి సినిమా చూసినప్పుడు యాక్టర్ అవుదామని వచ్చిన నటుడుగా గుర్తించాను. నా కథకు కావాల్సిన వ్యక్తిని నేను తనలో చూశాను. తను అద్భుతమైన నటుడు. కెమెరామెన్ ముకేష్కి సూపర్బ్ విజుల్ సెన్స్ ఉంది. ఇళయరాజాగారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అభిషేక్ పిక్చర్స్‌కు థాంక్స్. సినిమా చేయగలను కానీ, రిలీజ్ చేయకుండా చాలా నష్టపోయాను. కాబట్టి నేను అభిషేక్ పిక్చర్స్ వారిని కలిసి సినిమా చూడమన్నాను. సినిమా చూసినప్పటి నుండి రిలీజ్‌కు వారెంతో సపోర్ట్ చేశారు.
అందరూ నన్ను మహానటుడు, గొప్ప నటుడు అంటున్నారు. దాంతో నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాను. కానీ నేను ఒక విద్యార్థిలా నిలబడటానికే ఇష్టపడతాను. అందుకే దర్శకుడయ్యాను. అంతే కాకుండా నాకు ఒక తరహా కథలను చెప్పాలని ఉంటుంది. అందుకే దర్శకుడినయ్యాను. నేను నటించే సినిమాలు వేరు, నేను డైరెక్ట్ చేసే సినిమాలు వేరు. నేను కమర్షియల్ సినిమాలు చేయలేను. నాకు తెలిసింది మాత్రమే చేయగలను. దర్శకత్వం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నటుడిగా ఒక పని చేస్తున్నాను. కానీ దర్శకుడిగా మారిన తర్వాత చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. దర్శకుడిగా నేను చేసిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి నాకు ఊపునిస్తారని అనుకుంటున్నాను అన్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ…నా సినిమాల్లో కథ పరంగా, పాత్రల పరంగా ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమాలపై ఆయనకున్న నాలెడ్జ్ అపారం. ఆయనకెంత తెలుసో నాకు తెలుసు. మన ఊరి రామాయణం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ…ప్రకాష్ ఎక్కడుంటే అక్కడ పచ్చగా ఉంటుంది. తనొక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడకెళ్లి అందరితో కలుస్తుంటాడు. ఐ లవ్ ప్రకాష్ రాజ్..! ప్రియమణి చాలా మంచి నటి. సత్యను ఈ సినిమాలో తీసుకోమని నేనే ప్రకాష్‌రాజ్‌కు ఓ రకంగా రికమెండ్ చేశాను. తనెంతో మంచి నటుడని మెచ్చుకున్నాడు. మంచి టీంతో చేసిన ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ…నా మొదటి సినిమా భద్ర, దాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. భద్ర అనే కథకు ఒక పిల్లర్ రవితేజగారైతే మరో పిల్లర్ ప్రకాష్రాజ్గారే. ఒక మంచి విషయం ప్రజల్లోకి వెళ్లాలనుకుంటే మంచి నటుడు అవసరం. భద్ర సినిమాలో ప్రకాష్ రాజ్‌గారు చేసిన క్యారెక్టర్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సినిమా సక్సెస్‌లో ఆయన కూడా ఓ భాగం. అలా మొదటి సక్సెస్‌లో సపోర్ట్ చేసిన వారిలో ప్రకాష్‌రాజ్‌గారు ఒకరు. ఎంతో మంది దర్శకులు వారు డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో కాకుండా వేరే దర్శకుల సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ ప్రకాష్ రాజ్‌గారు దర్శకత్వంతో పాటు నటిస్తున్నారు. తప్పకుండా మనవూరి రామాయణం ప్రాణం పెట్టి చేసుంటారు. కాబట్టి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ…దర్శకులందరూ ప్రకాష్ రాజ్‌గారితో సినిమా చేయాలనుకుంటారు. ఈ జనరేషన్లో అలాంటి గౌరవాన్ని పొందిన వ్యక్తి ప్రకాష్‌రాజ్‌గారు. ఎంతో మంది దర్శకులు విలక్షణ శైలితో, అంత కంటే ఇంకా బెటర్మెంట్తోనో ఈ సినిమా చేసుంటారని చెప్పగలను. నటుడుగా దర్శకుల నుండి కావాల్సిన విషయాన్ని రాబట్టుకోగల మంచి నటుడు ప్రకాష్‌రాజ్‌గారు. ఒక పక్క నటిస్తూ, దర్శకత్వం వహించడమంటే మామూలు విషయం కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ సినిమా అతి పెద్ద హిట్ కావాలి. ఆల్ ది బెస్ట్ అన్నారు.
సత్య మాట్లాడుతూ…నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే కారణం ఇద్దరు వ్యక్తులు అందులో ఒకరు పూరి జగన్నాథ్‌గారు అయితే మరొకరు ప్రకాష్‌రాజ్‌గారు. తిరునాళ్ళలో చిన్నపిల్లాడిని ఓ పెద్ద వ్యక్తి తన భుజాలపై మోసుకుని అందరినీ చూపించే విధంగా పూరిగారు నాకు ఇండస్ట్రీ అంటే ఏంటో చూపించారు. అలాగే నేను ఒక యాక్టర్ కావడానికి ప్రకాష్రాజ్గారే ఇన్స్పిరేషన్. ఆయన్ను దూరంగా చూస్తే చాలనుకున్నాను. కానీ ఆయన దర్శకత్వంతో సినిమా చేయడమే కాదు, నటించడం కూడా మరచిపోలేను కూడా. మాటలు రావడం లేదు. తన నటనతో నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఇళయరాజాగారి సంగీతంలో ఓ సినిమా చేశానని గొప్పగా చెప్పుకునే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ప్రకాష్‌రాజ్‌గారు, ప్రియమణిగారు, శ్రీకర్‌ప్రసాద్‌గారు, ఇళయరాజాగారు వంటి టెక్నిషియన్‌తో పనిచేసే అదృష్టం కలిగింది. ప్రతి మనిషిలో రాముడు, రావణుడు ఉంటారు. వారి ఇద్దరి మధ్య ఉండే సంఘర్షణే మన వూరి రామాయణం. అక్టోబర్ 7న విడుదలవుతుంది అన్నారు.
ప్రియమణి మాట్లాడుతూ…ప్రకాష్‌రాజ్‌గారి దర్శకత్వంలో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రకాష్రాజ్గారిలాంటి నటుడితో ఇప్పటి వరకు పనిచేయలేదని చెప్పగలను. తను అంత మంచి నటుడు. ఆయన ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఉంది నువ్వే చేయాలని చెప్పగానే, వెంటనే ఓకే చెప్పేశాను. చాలా స్పెషల్ క్యారెక్టర్. ప్రకాష్‌గారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను మంచి సినిమాను మిస్ అయ్యేదాన్ని. డెఫనెట్‌గా అందరికీ నచ్చే చిత్రమవుతుంది. అలాగే ఇళయరాజాగారితో నేను చేసిన రెండో సినిమా ఇది. మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుంది అన్నారు.
The audio of ’Mana Oori Ramayanam’ was released on the hands of ‘King’ Nagarjuna yesterday at a Hyderabad hotel.
Nagarjuna said, “There is a Rama and Ravana in each one of us. I have watched NTR garu’s portrayal of Ravana. I have read about Ravana in books. That’s why, I like him. Prakash Raj garu is someone who enjoys life every moment. I try to be like him. It’s happy to see such a film coming from him. Winds of change have been blowing across Indian cinema, of late. It’s good that this movie is coming at this juncture. I wish that Prakash Raj garu gets the National Award for Best Direction for this movie”.
Prakash Raj said, “As a director, I felt that this character that flows like a river is best played by Priyamani. It’s a very interesting role. It’s a character that points at unknown nature in three characters. I can’t imagine this movie without her. She is a very intense actor. I recognised Sathya as an actor after watching Puri Jagannadh’s ‘Jytothi Lakshmi’. I saw the character in him. Mukesh has a superb visual sense. The cinematography has come out very well. Ilaiyaraja garu’s music is wonderful. I thank Abhishek Pictures. I could make the film, but suffered losses as I couldn’t get it released. Ever since they watched the movie, Abhishek Pictures got interested in it”.
He also said that he was going into a comfort zone with everybody praising him as a great actor. ”
I want to be a student for life. That’s why I have become a director. Moreover, I want to tell certain kind of stories. The kind of movies I act in and the kind of movies I direct are different. Direction gives me a lot of satisfaction. I am learning a lot of things after turning a director. I hope the audience will like the movie and encourage my efforts”, he said.
Bommarillu Bhaskar said, “Prakash Raj garu has amazing grip over the craft. He helped me as an actor and in writing. I know how much he knows”.
Puri Jagannadh said, “Wherever he is there, that place becomes a happy one. He has adopted a village recently. I love Prakash Raj. Priyamani is a very good actor. I kind of recommended him to cast Sathya for this movie. He praised Sathya as a good actor”.
Boyapati Sreenu said, “For my first movie ‘Bhadra’, if Ravi Teja was one pillar, Prakash Raj garu was another pillar. We need a good actor to convey a good message across. Everybody got connected to Prakash Raj garu’s character in ‘Bhadra’. There are directors who are acting in others’ movies. Prakash Raj garu is doing both at the same time. He must have given his best shot for this one”.
Sukumar said, “All directors want to work with Prakash Raj. He is one of the few actors of our generation to have that reverence as an actor. He is an actor who extracts the best out of a director. It’s not an ordinary thing to do both acting and direction. He is a multi-faceted talent”.
Sathya said, “I am here because of two people: Puri Jagannadh garu and Prakash Raj garu. Puri garu has treated me like a child and introduced me to film industry. He is like that elder in a fair who does it with a child by carrying him on his shoulders. Prakash Raj garu is an inspiration to me for becoming an actor. I was thinking it’s enough to watch him by standing at a distance. But here I got an opportunity to work in his direction. I am happy to have worked in a movie music-directed by Maestro Ilaiyaraja garu. It’s great working with such talent as Prakash Raj garu, Ilaiyaraja garu, Priyamani, and Srikar Prasad garu. This film is about the fight between the Rama and Ravana in each of us”.
Priyamani said, “I am feeling lucky to have acted in Prakash Raj’s direction. I can say that I have not acted with an actor like him in the past. I said OK to him as soon as he offered me the project. It’s a very special character. If not for his offer, I would have missed out on a beautiful film. This one will be liked by one and all