Jan 17 2020
*జనవరి 19న వైజాగ్ లో ‘అల… వైకుంఠపురంలో’ వైభవంగా విజయోత్సవ వేడుకలు !!!*
*జనవరి 19న వైజాగ్ లో ‘అల… వైకుంఠపురంలో’ వైభవంగా విజయోత్సవ వేడుకలు !!!*
‘అల… వైకుంఠపురంలో’ చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ అత్యద్భుతంగా ఉంది. విడుదలైన అన్ని చోట్ల ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదు చేసుకుంది.. గతానికి భిన్నంగా ఓవర్ సీస్ లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం గమనార్హం. సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు.
జనవరి 19న వైజాగ్ లో అల వైకుంఠపురంలో సక్సెస్ సెల్రబ్రేషన్ గ్రాండ్ గా చేయబోతున్నారు చిత్ర యూనిట్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని నిర్మించగా, త్రివిక్రమ్ తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఈ ఇయర్ బిగినింగ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ఈ ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రాన్ని.. సంక్రాంతి సందర్భంగా 2020, జనవరి 12న విడుదల అయిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డుగా నమోదు వైపు దూసుకు వెళుతోంది.
Allu Arjun’s Ala Vaikunthapurramuloo is going on a rampage at the box office. The film is doing extremely well across all circuits and it is putting up a good show in overseas and domestic market alike. On the joyous occasion, the movie unit is holding a grand success celebrations never.
Ala Vaikunthapurramuloo’s grand success celebrations will be held in Vizag on January 19th. Haarika Hassine creations and Geetha Arts bankrolled the film and Trivikram is at the helm. The film has Pooja Hegde in the lady lead role and had an excellent music album, which added huge buzz ahead of its release.