డబ్బింగ్ చెప్తున్నంతసేపూ ‘భీష్మ’ చాలా క్యూట్ ఫిల్మ్ అనిపించింది – రష్మికా మందన్న

“డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది” అన్నారు రష్మికా మందన్న. నితిన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా ‘భీష్మ’లో ఆమె నాయికగా నటించారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రష్మికతో మీడియా ప్రతినిధుల మాటామంతీ…

‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు?
అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం.

సినిమా చూశారా?
లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా.

‘భీష్మ’లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు?
మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు.

అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది?
ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను.

ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది?
మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ ‘భీష్మ’లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. ‘భీష్మ’ అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘భీష్మ’ చాలా మంచి ఫిల్మ్.
వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా?
రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు.
నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా?
మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. ‘పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?’ అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్.

నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
నేను సరదాగా చెప్పడం లేదు. ‘అ ఆ’లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు  నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం.

మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది?
నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు?
ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు ‘భీష్మ’ను నిర్మించారు.

‘ఛలో’ నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు.

వేలంటైన్స్ డేని ఎలా గడిపారు?
వేలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అలా నా వేలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వేలంటైన్స్ డేని గడిపి ఉండరు.

పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు?
కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి.  కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. ‘భీష్మ’ ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా.

అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు?
మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు.

*While I was dubbing…. I feel ‘Bheeshma’ seemed to be quite a cute film, – Rashmika Mandanna*

Rashmika Mandanna said: “The dubbing is what the film looks like, but the chemistry between Nithiin and me is very good. Very cute film. She is the heroine of the film ‘Bheeshma’ produced by Suryadevara Naga vamsi under the banner of Sithara Entertainment directed by Venky Kudumula, the movie is releasing on February 21st. Rashmika spoke with media representatives…
Tag line ‘single Forever’ What do you want to do now?
Yes, Nithiin is Engaged .. Director Venky and I sat down and made fun of this movie.
Have you seen the movie?
No. I saw my portion while dubbing. Looking forward to the film. Now I am enjoying the promotions of the film.
What kind of role Rashmika can be expected in ‘Bheeshma’?
You can expect good entertainment. But I can’t judge my film. In this I have played a character named Chaitra. Nice character. I work at Bheeshma Organics Company. I can’t say that you get it that and this.. from my character. Generally speaking, the movie is super funny….people wil say Rashmika performs well, dances and sings well with this film.

How is working with Ananth Nag?
He was like a Father figure. I worked in his combinations for four days. Since he too hails from Karnataka, we two have always spoken in Kannada. Who cares about my movies. I like his performance. I really enjoyed working with him.
How did you feel about telling organic farming in this movie?
When we tell this story to our friends, they said “what can we say about organic farming? But Venky said very well about that topic with his screenplay in ‘Bheeshma’. There are no lectures about it anywhere. ‘Bheeshma’ is not a story about organic farming. It’s a one person journey. Organic farming is part of his journey. In a word ‘Bheeshma’ is a very good film.
Are the real events about agriculture included in this subject?
We all know how hard the farmers lives are today. We see people committing suicides, and children are struggling to pay their school fees. The director told them as the story. When I was told the story, organic farming was an underlying message, basically a fun film. When I say dubbing it is the same file. Agriculture is a very delicate subject. Venky made it so that the audience would accept it .
Did you know that Nithiin is Pawan Kalyan’s fan?
Nithiin once said that he was a fan of Pawan Kalyan. From childhood,He is a fan of Pawan Kalyan. Even though he is now an actor, he still seems to be a fan.i asked him ‘Have you ever met Pawan?’. He said he had met Pawan Kalyan twice and thrice. To sum up, Nithiin is a fan boy.

How did it feel to work with Nitin?
I’m not saying this in a fun manner . When I saw Nithiin and Samantha in ‘Aa’ aa, I thought that if you go into the film industry, you should do something like this. They both looked so good in the movie. Now with Nithiin I did the film. On the first day of going of the sets .. I thought he make a lot of films, whether he was comfortable with it or not. But he looked like a college boy. Sitting down, looking at the phone, talking to Venky and smiling. I am comfortable with it. College friends are like that.
When did you know about the Nitin Love Story?
It was reported two days before the engagement. He did not say this to me until then.
What does Sitara Entertainment say about the banner?
I met producer Nagavamsi about four times while making this film. Quite calm. Audience also talk about production values when they watched the movie . Nagavamshi built ‘Bheeshma’ with such quality.
How do you feel getting Stardom in three years from ‘Chalo’?
The scripts that I got were doing what I liked. I do not know how much luck factor in this.
How did you spend Valentine’s Day?
I went to Gym in the morning thinking that I have full day work on Valentine’s Day. But all the works were cancelled. My Valentine’s Day was so boring as ever. No one has ever spent such a boring Valentine’s Day.

What is now preferred in the selection of characters?
Choosing the characters that interest the story and the characters you like. Doing this seems new. Now looking for something more new in terms of characters. It’s about experimenting. Selecting subjects that will inspire what happens next. Two things I believe. Audiences who come to the theater should feel that they have seen a good movie .. It can be emotional, it can be another. Or else they should have fun. They should laugh. ‘Bheeshma’ is the second type of film. I smiled at the dubbing, I couldn’t help stop laugh at the dubbing…
When did Allu Arjun join the movie?
Join in mid-March. You will see another Rashmika in it.

6R3B4389 6R3B4394 6R3B4401 6R3B4416 6R3B4442 6R3B4453 6R3B4462