నగర ధియేటర్ లలో ‘సుడిగాడు’ నరేష్ హల్ చల్

నగర ధియేటర్ లలో ‘సుడిగాడు’  నరేష్  హల్ చల్ 

కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న ‘సుడిగాడు’ ధియేటర్ లను హీరో నరేష్ , దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు, నటీ నటులు హేమ, జ్యోతి, శ్రీలత,ఫిష్ వెంకట్, టార్జాన్, భవాని, అరవింద్, సారికా రామచంద్ర రావు, నర్సింగ్ యాదవ్. చిత్ర నిర్మాత చంద్రశేఖర్.డి. రెడ్డి, ఎగ్జి క్యూటివ్ నిర్మాత వివేక్ కూచి భొట్ల తది తరులు సందర్శించారు.
 ఆదివారం [2 -9 -12 ] సాయత్రం పంజాగుట్ట లోని పి.వి.ఆర్.ధియేటర్  ఆ తరువాత భ్రమరాంబ , చంద్రకళ, విమల్, సంధ్య, రాజధాని, మహాలక్ష్మి లలో ప్రేక్షకులను కలసి హీరో ‘నరేష్’ కృతజ్ఞతా పూర్వకంగా సంభాషించారు. ‘ తన కెరీర్ లోనే విజయ వంతమైన చిత్రంగా ‘సుడిగాడు’ను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞ త లన్నారు. ఆనందంగా సినిమా చూస్తుండగా వచ్చి మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నాను. మీ ఆనందం లో పాలు పంచు కోవాలనే ఇలా మీ ముందుకు వచ్చానని అన్నారు. సంధ్య ధియేటర్ లో తన ‘అల్లరి’ సినిమా చూశానని  అది పెద్ద విజయం సాధించిందని అలాగే ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించటం  ఎంతో ఆనందం గా వుందని నరేష్ తెలిపారు. 
దర్శకుడు ‘భీమనేని శ్రీనివాసరావు’ మాట్లాడుతూ..’ తన గత చిత్రాలు శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం, చిత్రాల స్థాయిలో ఈ సుడిగాడు’ విజయం సాధించి నందుకు, అందుకు కారకులైన ప్రేక్ష కులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ యాత్రలో పాల్గొన్న ఇతర నటీ నటులు ‘సుడిగాడు’ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.