‘బ్యాంకాక్’ లో భారీ పతాక సన్నివేశాల చిత్రీకరణలో మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ‘శ్రీను వైట్ల’ ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం :

DGA_2318 DGA_2322 DGA_2335 DGA_2340 విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ  నిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం గత నెల (జులై)  27 నుంచి బ్యాంకాక్ లో జరుగుతోంది. 
ఈ చిత్రం గురించి  బ్యాంకాక్ నుంచి నిర్మాత దానయ్య డి .వి.వి మాట్లాడుతూ …’  మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో  భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ నుంచి  ఈ నెల 12న హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య. 
మరల హైదరాబాద్ లో ఈ నెల 13 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ‘శ్రీను వైట్ల’ మాట్లాడుతూ ” ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ ‘కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని  ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో,  అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అన్నారు. 
ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ 
 
లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , 
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ 
సమర్పణ : డి. పార్వతి 
నిర్మాత : దానయ్య డి.వి.వి.
మూలకథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీను వైట్ల