మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ట్ చేసిన‌ `శైల‌జారెడ్డి అల్లుడు` నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి – కింగ్ నాగార్జున‌

 

DSC_11320036 DSC_11740069 DSC_11770072 DSC_13190032 DSC_13200033 DSC_08510012 DSC_08530014 DSC_08780035 DSC_08800036 DSC_09190073 DSC_09340087 DSC_09520105 DSC_10970002 DSC_11020007 DSC_11140018 DSC_11210025 DSC_11220026 DSC_11380041 DSC_11450047 DSC_11470048 DSC_11480049 DSC_11560051 DSC_11880083 DSC_11940089 DSC_12050009 DSC_12130015 DSC_12350032 DSC_12450042 DSC_12500047 DSC_12640059 DSC_12860005 DSC_12950013 DSC_13040021 DSC_13060022 DSC_13140029
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో నాగవంశీ.ఎస్‌, పి.డి.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు  కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా..
 
చైతులో చిలిపిత‌నం కూడా ఉంది
 
కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ”చైతన్యను ఇప్పుడు అందరూ శైలజారెడ్డి అల్లుడు అని అంటున్నారు. కానీ తను అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున పెద్ద కొడుకు. నాన్నకు ప్రేమ కథా చిత్రాలైనా, ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలైన స్ట్రాంగ్‌ ఉమెన్‌ క్యారెక్టర్స్‌ ఉండటాన్ని ఇష్టపడతారు. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు చైతన్య తీసుకున్నారు. చైతన్య సాఫ్ట్‌ అనుకుంటారు. కానీ తనలో చిలిపితనం కూడా ఉంది. దాన్ని మారుతిగారు చక్కగా వాడుకున్నారు. రమ్యకృష్ణ, నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అన్ని పెద్ద హిట్స్‌. ఇప్పుడు తను చైతన్యకు అత్తయ్య అయింది. బాహుబలి తర్వాత రమ్య అంటే ఇప్పుడు భారతదేశంలో తెలియనివారు లేరు. తను ఏ సీన్‌ చేసినా చక్కగా పండుతుంది. నాతో అల్లరి అల్లుడు సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఇప్పుడు శైలజారెడ్డి అల్లుడులో అత్త పాత్రలో చైతుతో నటించింది. గోపీసుందర్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కేరళకు సమస్యలు వచ్చినా… డేడికేషన్‌తో మంచి సాంగ్స్‌, రీరికార్డింగ్‌ ఇచ్చారు. అందుకు గోపీసుందర్‌కు థాంక్స్‌. ఎంతో మందికి అన్నం పెడుతున్న నిర్మాణ సంస్థ చినబాబుగారికి ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మారుతిగారి సినిమాలన్నీ చూస్తుంటాను. మాస్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు. మా అక్కినేని అభిమానులకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. గత నెల నా మనసుకు దగ్గరైన ఇద్దరూ వదలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య. ఎవరినైనా నేను అన్నా!.. అని పిలుస్తాను అంటే తననే. మా బాధ్య, బంధం మీకు చెప్పుకోలేను. ఆయన వెళ్లిపోయిన రోజు.. నా పుట్టినరోజు. పొద్దున నిద్ర లేవగానే తెలిసిన న్యూస్‌. ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో అర్థం కావడం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే మా ఆత్మీయుడు రవీందర్‌ రెడ్డిగారు. ఆయన్ను చాలా మిస్‌ అవుతున్నాం. మాకు సంబంధించి ఏ ఫంక్షన్‌ ఉన్నా ఆయన ముందుండేవారు. ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలి. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా నిండా నవ్వులే. ఎక్కడా సాంగ్‌ ఉండాలి. ఎక్కడ ఫైట్‌ ఉండాలి. ఎక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండాలో తెలిసిన దర్శకుడు మారుతి చేసిన సినిమా. చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
 
బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి
 
నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ”ఈ ఫంక్షన్‌కి రావడానికి రెండు కారణాలు.. మారుతి, టీమ్‌ అందరూ ఒక కారణమైతే..రెండో కారణం, నాగార్జునగారితో దేవదాస్‌ షూటింగ్‌ అయిపోయింది. దాసుగారిని దేవాగా మిస్‌ అయ్యానని వచ్చాను. ఇక సినిమా విషయానికి వస్తే.. చైతన్యను చూసి అసూయగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తను ఎంత ఎంజాయ్‌ చేసుంటాడో నాకు అర్థమవుతుంది. మారుతిగారు ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌. అలాంటి వ్యక్తి ఆరు నుండి తొమ్మిది నెలలు ఓ సినిమాపై వర్క్‌ చేశాడంటే సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నిర్మాత నాగవంశీ.. నా క్లాస్‌మేట్‌. నేను, చైతన్య దాదాపు ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. ఇంతకు ముందు జనరేషన్‌లో బెస్ట్‌ సాంగ్స్‌ అన్ని నాగార్జునగారికి పడితే.. ఈ జనరేషన్‌లో బెస్ట్‌ సాంగ్స్‌ అన్ని చైతన్యకే పడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి మంచి పాటలు రాసి పెట్టి ఉన్నాయోమో.. ఈ సినిమాలో కూడా పాటలు చాలా బావున్నాయి. టీజర్‌, ట్రైలర్‌ చాలా బావున్నాయి. అల్లరి అల్లుడులాంటి సినిమా అని నాగార్జునగారు అన్నారు. ఆయన అలా అన్నారంటే సినిమా ఎంత బావుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అనుఇమ్మాన్యుయేల్‌ నా మజ్నుతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ అయ్యింది. గోపీసుందర్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎంటైర్‌ యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావాలి” అన్నారు.
 
అభిమానులే మా బ‌లం.. ఎంక‌రేజ్ మెంట్‌ 
 
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ - ”అక్కినేని అభిమానులే మా బలం. వారి వల్లే నాకు ఎంకరేజ్‌మెంట్‌ దొరుకుతుంది. మీరిచ్చే ప్రేమకు హిట్‌ సినిమానే కోరుకుంటారు తప్ప.. మరేం కోరుకోరు. ఇప్పటి నుండి ప్రతి సినిమాకు అభిమానులను మైండ్‌లో పెట్టుకుంటాను. అక్కినేని అభిమానులనీ గర్వపడేలా చేస్తానని మాట ప్రామిస్‌ చేస్తున్నాను. ఈ సినిమా అలాంటి సినిమా. మారుతిగారు సూపర్బ్‌ సినిమా ఇచ్చారు. నా కంటే మీకు ఏం కావాలనే దాన్ని మారుతిగారే ఎక్కువగా పట్టించుకుంటారు. కొత్త బాడీ లాంగ్వేజ్‌, ఎనర్జీతో నన్ను ప్రెజంట్‌ చేసిన మారుతిగారికి థాంక్యూ సో మచ్‌. నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు ఈ సినిమాను మారుతిగారు ప్లాన్‌ చేశారు. అందుకు ఆయనకు థాంక్స్‌. నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌గారు రెండేళ్ల క్రితం నాకు మరచిపోలేని సినిమా ప్రేమమ్‌ను ఇచ్చారు. రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు మారుతిగారితో మంచి కాంబినేషన్‌ను సెట్‌ చేశారు. ఈ జర్నీ వారితో ఇలాగే కంటిన్యూ అవుతుందనుకుంటున్నాను. రమ్య మేడమ్‌ నుండే మాకు బిగ్గెస్ట్‌ సపోర్ట్‌ వచ్చింది. రమ్య మేడమ్‌ను దృష్టిలో పెట్టుకునే మారుతిగారు నాకు ఈ కథను చెప్పారు. ఆవిడ చేయకుండా సినిమా ఇంత బాగా వచ్చేది కాదు.హీరోయిన్‌గా చేసిన అను ఇమ్మాన్యుయేల్‌ ఈ ఈ సినిమాతో ఇంకా హైట్స్‌కి రీచ్‌ అవుతుంది. గోపీసుందర్‌గారు ప్రేమమ్‌ తర్వాత మరో సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. కెమెరామెన్‌ నిజార్‌, సీనియర్‌ నరేష్‌, పృథ్వీ అందరికీ థాంక్స్‌. పండగక్కి పండగలాంటి సినిమా. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది” అన్నారు.
పండ‌గలా ఉంటుంది
 
రమ్యకృష్ణ మాట్లాడుతూ - ”శైలజారెడ్డి అల్లుడు ఓ పెద్ద పండుగలా ఉండబోతుంది. నాగచైతన్యగారు చిలిపి నాగచైతన్యగా ఆకట్టుకుంటారు. ఎంటర్‌టైనింగ్‌ మూవీ. మారుతిగారు, నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.
పెద్ద స‌క్సెస్ కొట్ట‌బోతున్నాం
 
అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ - ”మారుతిగారు కరెక్ట్‌ టైమ్‌లో కరెక్ట్‌ హీరోను పట్టారు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. చేసుకోగానే ఫేస్‌లో గ్లో వచ్చేసింది. ట్రైలర్‌, సాంగ్స్‌ చూస్తుంటే ‘ఏమున్నాడ్రా బాబు మా అన్నయ్య’ అనిపిస్తుంది. సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. రమ్యకృష్ణగారు, అను, నిర్మాతలకు అభినందనలు. నాన్న చెప్పినట్లు అల్లరి అల్లుడు లాగానే ఈ సినిమాతో పెద్ద సక్సెస్‌ కొట్టబోతున్నామని అనిపిస్తుంది” అన్నారు.
అభిమానులు కోరుకునే సినిమా
 
చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ”అక్కినేని అభిమానులు కోరుకున్నట్లు నాగచైతన్యగారు తెరపై కనపడతారు. వారిచ్చిన ఎనర్జీతోనే సినిమాను చక్కగా చేశాను. ఈ సినిమా నుండి ఆయన యువ సామ్రాట్‌. నేను ట్యాగ్‌ వేస్తున్నాను. శైలజారెడ్డి అల్లుడు అనే టైటిల్‌ చూసి 80-90లో చూసిన అత్త, అల్లుడు మధ్య నడిచే పోట్లాట, చాలెంజింగ్‌ సినిమా కథ కాదు. మంచి లవ్‌స్టోరి. దీనికి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంత యాడ్‌ చేయాలో అంత చేశాం. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా రావడానికి ఎంతో సపోర్ట్‌ చేశారు. నిజార్‌షఫీగారు మంచి విజువల్స్‌ ఇచ్చారు. గోపీసుందర్‌గారు చాలా కష్టపడి క్వాలిటీ తగ్గకుండా సినిమాకు పాటలు, రీరికార్డింగ్‌ ఇచ్చారు. రమ్యకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమెతో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆమెతో శైలాజరెడ్డిగా ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అను ఇమ్మాన్యుయేల్‌ తన పాత్రకు న్యాయం చేసింది. నాకు ఒక యాక్టర్‌గా అయినా.. హీరోగా పరిచయం అయినా.. చైతన్య క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. సినిమాతో సంబంధం లేకుండా మా జర్నీ సాగింది. వినాయక చవితికి, ఈనెల 13న సినిమా విడుదలవుతుంది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత రాధాకృష్ణగారు, నాగవంశీగారు, పి.డి.వి.ప్రసాద్‌గారికి థాంక్స్‌. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. అలాగే నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌” అన్నారు.
 
అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – ‘‘చైతన్యతో పనిచేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. రమ్యకృష్ణగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. నన్ను ఆమె చాలా ఇన్‌స్పైర్‌ చేశారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌” అన్నారు.
సీనియర్‌ నరేశ్‌ మాట్లాడుతూ - ”ఎంటర్‌టైనింగ్‌ మూవీ శైలజారెడ్డి అల్లుడు. అన్ని సెంటర్స్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మారుతిగారు తనదైన స్టయిల్‌లో ప్రేక్షకులను మెప్పిస్తారు. మారుతి నేచురల్‌ టాలెంటెడ్‌. నాకు చాలా మంచి పాత్రను ఇచ్చారు. రమ్యకృష్ణ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నాగచైతన్య ప్రతి సినిమాను సిన్సియర్‌ అప్రోచ్‌తో చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో కూడా తన సిన్సియర్‌ అప్రోచ్‌ కనపడుతుంది. ఎంటైర్‌ టీమ్‌కు అభినందనలు” అన్నారు.

‘Shailaja Reddy Alludu’ pre-release event held amid fanfare

The pre-release event of ‘Shailaja Reddy Alludu’ was held on Sunday evening in Hyderabad.  Nagarjuna and Nani graced the occasion as main guests.  To be released on Sept 13, the family-comedy entertainer has been directed by Maruthi and produced by S Naga Vamsi and PDV Prasad.

‘King’ Nagarjuna said, “Everybody is calling Naga Chaitanya as a ‘shailaja reddy alludu’.  But he is a grandson of Akkineni Nageswara Rao garu and elder son of Nagarjuna.  I have always liked love stories and entertainers with strong women characters in my career.  Chaitanya is taking my legacy forward.  People think that Chaitanya is a soft guy.  But he is also naughty.  Maruthi has portrayed it so well in this film.  I and Ramya Krishna have acted in many movies.  And they were big hits.  She is now Chaitanya’s ‘Atthamma’ in ‘SRA’.  After ‘Baahubali’, there is nobody in the country who doesn’t know Ramya Krishna.  Whichever scene it may be, she carries herself so well.  Gopi Sundar is in great form.  Despite what happened in Kerala, he has completed his works on ‘SRA’ with dedication.  I wish that Chinababu garu, whose production house is providing livelihoods to many, scores a big hit with ‘SRA’.  I have watched Maruthi’s movies.  He knows the pulse fo the mass audience.  This film is a laugh riot.  Maruthi knows best where to have the fights, songs, etc.”
Nag said that, last month, two of his dearest people passed away.  “I used to call Harikrishna garu ’Anna’.  He died on my birthday and when I came to know about it, I was at a loss to understand what to make out of it!  Ravindar Reddy (Akkineni fans association president) is the other person.  He used to be at the forefront of every single event related to our family films,” the ‘Devadas’ actor said.
Natural Star Nani said, “There are two reasons why I have attended this function.  If Maruthi and his team are one reason, the other reason is that I am missing Nagarjuna garu ever since the shooting of ‘Devadas’ was over.  I am jealous of Chaitanya.  It’s because I can gauge how much he must have enjoyed while shooting for ‘SRA’. Maruthi garu is an entertaining person.  And his films are always entertaining.  Naga Vamsi, this film’s producer, was my classmate.  I and Chaitanya had started our careers around the same time.  In the previous generation, Nagarjuna garu used to walk away with the best songs.  In this generation, it’s the turn of his son.  Akkineni family heroes are lucky in that respect.  I have loved the Teaser and Trailer for ‘SRA’.  Nagarjuna garu has said that ‘SRA’ is like an ‘Allari Alludu’.  We can understand how entertaining the film must be.  Anu Emmanuel was introduced as the heroine with ‘Majnu’.  I wish her and the entire team all the best.”
Akkineni Akhil said, “Maruthi garu has got the right hero at the right time.  He got married only recently.  As soon as he got married, his face started glowing!  ‘Emundra babu maa annayya’ is what I am thinking seeing the trailer.  I am waiting for the movie.  I feel this one will be a big hit like Allari Alludu.”
Naga Chaitanya said, “Akkineni fans are my biggest strength.  In return for the love that you shower on us, you seek only a hit from us.  I will keep the fans in mind before doing every film from now.  I promise that I will make you people proud.  Maruthi garu has made a superb film.  More than me, it’s he who knows best what the audience wants.  He has presented me with a new body language and energy.  I thank him for that.  Naga Vamsi and PDV Prasad garu gave me ‘Premam’ a couple of years ago.  And now, it’s ‘SRA’.  I hope this journey of ours will go on.  Ramya Krishna madam gave us support throughout.  Maruthi garu narrated the story to me keeping her in mind.  But for her, this film wouldn’t have come out this well.  Anu will reach greater heights.  After ‘Premam’, Gopi Sundar has given me one more nice album.  Cinematographer Nizar Shafi, senior Naresh garu, Prudhvi and all have done a nice job.”
Maruthi said, “Akkineni fans will see Naga Chaitanya the way they have always wanted to see him.  With the support they gave me, I have made this film well.  With this film, Chaitanya is a Yuva Samrat.  I am giving him this tag.  ‘SRA’ is not a typical Attha vs Alludu story that we used to see in the 90s.  It’s a new story.  From the cinematographer to Gopi Sundar, everybody has made it all the more entertaining.  I have grown up watching Ramya Krishna garu’s movies.  I am very happy to have worked with her.  Anu has done full justice to her role.  Chatainya is a close friend now.  Our bond goes beyond the professional one.  I thank the producers for making this movie without compromising anywhere.”
Ramya Krishna said, “This film is going to arrive like a big festival.  Naga Chaitanya will entertain you as a naughty Naga Chaitanya.  I thank the prdocuers and the director.”
Anu Emmanuel said, “It was very comfortable to work with Chaitanya.  I have learned many things from Ramya Krishna garu.  She used to inspire me a lot.  I thank everybody for all the support.”
Senior Naresh said, “‘SRA’ is an entertaining movie.  It will entertain the audience of all centres.  Maruthi garu has a style of his won.  He has given me a nice role in the movie.  Chaitanya approaches every scene with sincerity.”