Jan 26 2021
Health &Municipal workers releasing FCUK movie 2nd vocal song “*Nenem Cheyya”
రీల్ హీరోలకు బదులు రియల్ హీరోలతో ‘ఎఫ్‌సీయూకే’ పాటలను విడుదల చేయించాలని నిర్ణయించుకున్న చిత్ర బృందం, అందులో భాగంగా కొవిడ్ 19 మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌తో ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే “ముఝ్‌సే సెల్ఫీ లేలో..” అంటూ సాగే తొలి పాటను ప్రముఖ ఆర్థోపెడీషియన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి చేతులు మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
లేటెస్ట్‌గా బుధవారం “నేనేం చెయ్య..” అంటూ సాగే రెండో పాటను ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు విడుదల చేయడం గమనార్హం. లాక్‌డౌన్ టైమ్‌లో కొవిడ్ నుంచి ప్రజలను కాపాడటంలో నిరంతరాయంగా పనిచేసి, ఒకవైపు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూస్తూ, మరోవైపు ఆరోగ్యసేవలు అందిస్తూ వచ్చిన ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుకోవాలనే చిరు ప్రయత్నంతోటే “నేనేం చెయ్య..” పాటను వారి చేత విడుదల చేయించింది చిత్ర బృందం.
ఈ పాటను సినిమాలో జగపతిబాబుపై చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు “నేనేం చెయ్య..” పాటను విడుదల చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాననీ, ఈ పాటను అందరూ ఎంజాయ్ చేస్తారనీ అన్నారు.
త్వరలో మరో రెండు పాటలను పోలీసు, మీడియా సిబ్బంది చేతుల మీదుగా విడుదల చేస్తామని నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు విద్యాసాగర్ రాజు తెలిపారు.
తారాగణం:
జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్.
సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూసర్: వాసు పరిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీకాంత్‌రెడ్డి పాతూరి
సహనిర్మాత: యలమంచిలి రామకోటేశ్వరరావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్.















Follow Us!