Pawan Kalyan – Harish Shankar – Mythri Movie Makers project titled as ‘Bhavadeeyudu Bhagat Singh’.

‘’భవదీయుడు భగత్ సింగ్”

*పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న చిత్రం
* మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం.
*వెండితెరపై చెరగని సంతకం ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్”
 ‘’భవదీయుడు భగత్ సింగ్”
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ నిర్మిత మయ్యే చిత్రాలపై అంచనాలు ఎప్పుడూ అధికంగానే ఉంటాయి. వీటిని మరోసారి నిజం చేసేలా టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ ‘’భవదీయుడు భగత్ సింగ్” చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం పేరును ఈ రోజు ఉదయం 9.45 నిమిషాలకు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు చిత్ర దర్శక,నిర్మాతలు.
‘’భవదీయుడు భగత్ సింగ్” ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే ….’ ఆధునిక వాహనం పై కథానాయకుడు పవన్ కళ్యాణ్ జీన్స్, జర్కిన్ వస్త్ర ధారణలో ఓ చేతిలో టీ గ్లాస్,మరో చేతిలో స్పీకర్.        స్టైలిష్ గా కూర్చొని ఉండటం కనిపిస్తుంది.
‘భవదీయుడు’ అన్న పదం వినయం, విధేయత గా అనిపిస్తే…
‘భగత్ సింగ్’ విప్లవ చైతన్యానికి మారుపేరు గా స్ఫురిస్తుంది.
ఈ రెండింటినీ కలిపి ఈ చిత్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అని పెట్టడంలో దర్శకుడు ఆంతర్యమేమిటి…?
ఈ చిత్రం ఓ లేఖ అయితే.. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనేది ఓ సంతకం అయితే…..
ఈ లేఖలో ఏం రాశారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పబోతున్నారు, అన్నీ ఆసక్తిని, ఆలోచనలు రేకెత్తించేవే….
చిత్రంలో సామాజిక అంశాల ప్రస్తావన
తప్పని సరా ? కథాబలం,సన్నివేశాలలో భావోద్వేగాలు, పాత్రలమధ్య సంఘర్షణ, తూటాల్లాంటి మాటలు ఈ చిత్రం స్వంతమా ..?అనిపిస్తుంది. ఖచ్చితంగా ‘భవదీయుడు భగత్ సింగ్’ వెండితెరపై ఓ చెరగని సంతకం అనిపిస్తుంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు మరోసారి అభిమాన ప్రేక్షకులను నిస్సందేహంగా ఉర్రూతలూగించనున్నాయి. ఒకటేమిటి మరెన్నో విశేషాలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నాయి. ఒక్కొక్కటిగా సందర్భాన్ని బట్టి ప్రకటించనున్నారు. ఒక డైనమైట్ లాంటి హీరో మీద, మరో డైనమైట్ లాంటి పేరు పెట్టి చిత్రం మీద ఉత్సుకతను, అంచనాలను మరింతగా పెంచారు చిత్రం మేకర్స్. “దిస్ టైం ఇట్స్ నాట్ జస్ట్ ఎoటర్ టైన్ మెంట్” అని ప్రచార చిత్రం లో కనిపించే అక్షరాలు అక్షరాల నిజం అనిపించేలా ” ‘’భవదీయుడు భగత్ సింగ్” ఉండబోతోంది.
ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది అని తెలుపుతూ తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
ఈ చిత్రానికి అయనాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు.
“Bhavadeeyudu Bhagat Singh”
* The blockbuster combination of Pawan Kalyan and Harish Shankar reunites.
* A prestigious project by Mythri Movie Makers.
* “Bhavadeeyudu Bhagat Singh” – an indelible signature on the silver screen.
Pawan Kalyan – Harish Shankar – Mythri Movie Makers project titled as ‘Bhavadeeyudu Bhagat Singh’.
The expectations are always sky high when a successful combo of an actor and director reunite for a project. ‘Bhavadeeyudu Bhagat Singh’ will exactly meet those expectations with leading actor Pawan Kalyan joining hands with blockbuster young director Harish Shankar under the production of the popular Mythri Movie Makers. The makers have officially announced the title today at 9:45 AM with a striking poster.
A closer look at the poster of ‘Bhavadeeyudu Bhagat Singh’ and you would see hero Pawan Kalyan in jeans and jerkin stylishly seated on a fancy vehicle with a tea glass in one hand and a speaker in the other. While “Bhavadeeyudu” hints about humility and humbleness, “Bhagat Singh” inspires by being a personification of revolution. What are the intentions of the director by uniting both these worlds? If this movie is a letter and the sign-off is “Bhavadeeyudu Bhagat Singh”, what the letter holds and what it intends to tell is a topic of intrigue. Is it certain that the movie will mention about socially relevant issues? It totally seems the film is packed with great script, screenplay, conflicts and some brilliant dialogues. All said and done, “Bhavadeeyudu Bhagat Singh” will surely be an indelible signature on the silver screen.
These apart, popular music director Devi Sri Prasad’s music is sure to win the hearts of fans and audience alike. The movie is packed with not just these but many more attractions. The makers would reveal these when the occasion seems fit. With a dynamite like title for a dynamite like actor, the makers have increased the expectations multifolds. The line on the posters – “This time it’s not just entertainment” will to be well and truly justified in “Bhavadeeyudu Bhagat Singh”. Producers Naveen Yerneni and Y. Ravishankar have clarified that this movie is a prestigious project for their banner and would start it’s shoot soon.
The other crew handpicked for this project are Ayananka Bose as the cinematographer, Anand Sai as the art director, Chota K Prasad as the editor and Ram-Laxman as the action choreographers.
INSTAGRAM-SIZE-copy STILL TWITTER

Director Krish, A M Rathnam meet Pawan Kalyan, Hari Hara Veera Mallu shoot to resume soon

*హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” తో షూటింగ్ చర్చల్లో చిత్ర సమర్పకులు ఎ.ఎం. ర‌త్నం, డైరెక్టర్ క్రిష్

‘పవన్ క‌ల్యాణ్’ ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుంది. దీనికి సంభందించి కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు తో చర్చలు జరిపారు ఈరోజు చిత్ర సమర్పకులు ఎ.ఎం. ర‌త్నం, డైరెక్టర్ క్రిష్. ‘భీమ్లా నాయక్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్రీకరించ వలసిన సన్నివేశాలు, గీతాలు, పోరాట సన్నివేశాలు, షూటింగ్ ప్రదేశాలు, నిర్మించ వలసిన భారీ సెట్స్ వంటి విషయాల గురించి చిత్ర నిర్మాత, దర్శకుల మధ్య సమాలోచనలు జరిగాయి. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ దాదాపు యాభై శాతం పూర్త‌యింది. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ‌ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు. “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” 2022 ఏప్రిల్ 29 న విడుదల అన్న విషయాన్ని కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రం లో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని చిత్ర నిర్మాణ కార్యక్రమాలు త్వరిత గతిన జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌ కావడంతో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా ను రూపొందిస్తున్నారు దర్శకుడు క్రిష్. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌,  మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు.

Director Krish, A M Rathnam meet Pawan Kalyan, Hari Hara Veera Mallu shoot to resume soon

The shooting of Pawan Kalyan starrer magnum opus Hari Hara Veera Mallu is all set to resume soon.

Directed by Krish, who has carved a niche for himself in making period films, the epic movie starring Pawan Kalyan in the lead role will depict the life of legendary warrior Veera Mallu.

Krish and producer A M Ratnam met Pawan Kalyan recently during which it was decided to commence the shoot of Hari Hara Veera Mallu once works related to the actor’s current project Bheemla Nayak are over.

The film is being made on a grand budget. Main scenes, songs and action scenes will be shot on grand sets. It is to be noted that around 50 per cent of shoot is already over.

Produced by A Dayakar Rao on Mega Surya Production banner, the movie will be presented by A M Ratnam in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada. Plans are on to release it in 29 April, 2022.

The film is the first collaboration between Krish and Pawan Kalyan. It is set in 17th century with the backdrop of Mughals and Qutb Shahis.

The film has musical score by M M Keeravani, cinematography by Gnana Shekar V S, editing by Sravan and dialogues by Sai Madhav Burra.

ACS_6324 copy ACS_6326 copy

Latest Update on the project of Pawan Kalyan and Harish Shankar under Mythri Movie Makers.

 పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం తాజా సమాచారం:

*శర వేగంగా పవన్ కళ్యాణ్ చిత్రాల నిర్మాణం:

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు శరవేగంగా పూర్తి కానున్నాయి.’భీమ్లా నాయక్’ చిత్రం త్వరలో పూర్తి కానుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైన తదుపరి తమ సంస్థ
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రం షూటింగ్ మొదలవుతుంది అని, మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ లు తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల అయిన ఈ చిత్రం ప్రచారచిత్రం అభిమానుల అంచనాలను, ఉత్సుకతను మరింత పెంచిన నేపథ్యంలో,చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోందన్న
తాజా సమాచారం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకు ఎంపిక అయిన ప్రధాన సాంకేతిక నిపుణులు.

Latest Update on the project of Pawan Kalyan and Harish Shankar under Mythri Movie Makers.

It is well known that leading Telugu actor Pawan Kalyan and popular director Harish Shankar have teamed for a prestigious project under the production of the esteemed Mythri Movie Makers. The latest update is that the film will go on floors soon. Pawan Kalyan would soon finish his current assignments with ‘Bheemla Nayak’ completing its shoot and ‘Hari Hara Veera Mallu’ commencing its next schedule in short time.
Producers Naveen Yerneni and Y. Ravishankar of Mythri Movie Makers have confirmed that their film would be launched simultaneously and further details will soon be revealed.
The poster which was released as a gift on Pawan Kalyan’s birthday last week created a lot of buzz and increased the excitement among fans and this news about the shoot starting soon is bound to take the fans over the moon!

Rockstar Devi Sri Prasad is composing some chartbusters for the movie while Ayananka Bose handles the camera. Other technicians involved in this blockbuster project are Art Director Anand Sai, Editor Chota K Prasad and Action Choreographers Ram-Laxman.

 

_02A9800 _02A9806

పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్ చిత్రం అధికారిక ప్రకటన

పవన్ కళ్యాణ్  హీరోగా యువ నిర్మాత రామ్ తాళ్లూరి ఓ  చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి సంబంధించి ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్నెంట్ సంస్థ  చిత్రం విషయమై అధికారిక ప్రకటన ఈ రోజు విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రచార చిత్రాన్ని గమనిస్తే .. ఓ వైపు తుపాకి, “యధా కాలమ్.. తధా వ్యవహారం” అన్న పదాలు కనిపిస్తాయి. నగర వాతావరణం అగుపిస్తుంది. కథా బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ తమ 9 వ చిత్రం గా ప్రకటించిన ఈ చిత్రానికి వక్కంతం వంశి రచయిత.

4

*పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ సినిమా ప్రచార చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్ కథానాయకుడు గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు కాంబినేషన్లో గతంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో, ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది ఈ సంస్థ.
నేడు పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రానికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ ప్రచార చిత్రాన్ని గమనిస్తే…. ఆధునిక వాహనం పై పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అయితే పవన్ కల్యాణ్ ను పూర్తిగా చూపించకుండ ఉండటాన్ని ప్రీ లుక్ గా భావించాలని చిత్ర బృందం చేసిన ప్రయత్నం హర్షించదగ్గది. అయినా ప్రచార చిత్రం యువతను కిర్రెక్కిస్తోంది. అభిమాన యువతలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం ‘జాతర షురూ’ అన్న ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ పేర్లు ప్రధాన సాంకేతిక నిపుణులుగా ఈ ప్రచారచిత్రం లో కనిపిస్తాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు నిర్మాతలు
twitter still (3)