*ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్
*రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ‘భీమ్లా నాయక్’ పాత్ర తీరుతెన్నులు.
*ఉర్రూతలూగిస్తున్న తమన్ స్వరాలు
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
‘భీమ్లా నాయక్’ తొలి గీతం ఈ రోజు విడుదల అయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం విశేషం. తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రముఖ దర్శకుడు క్రిష్
విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజున ఆయన చిత్రంలోని అద్భుతమైన గీతాన్ని విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని తన స్పందనను తెలియుచేశారు.
భీమ్లా నాయక్ దమ్ము… ధైర్యానికి అక్షరరూపంలా నిలుస్తుందీ గీతం. ఈ గీతంలోని ప్రతి పదం- తప్పు చేసే వాళ్లకు భీమ్లా ఓ సింహ స్వప్నం అని చెబుతుంది. భీమ్లా వ్యక్తిత్వం… డ్యూటీలో నిబద్ధత… తెగువను వెల్లడిస్తుంది ఈ పాట. కథానాయకుడి గొప్పదనాన్ని కరతలామలకం చేసేలా సాగింది.
ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ‘భీమ్లా నాయక్’ పాత్ర తీరు,తెన్నులు. ఆయన మాటల్లో ఈ గీతం గురించి…’శ్రీ త్రివిక్రమ్ గారితో నాది ప్రత్యేకమైన అనుబంధం… స్వయానా ఆయన రచయిత దర్శకుడు అవడం గీత రచయితకు కొండంత బలం. ఆయన ద్వారానే జల్సాలో మొదటిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాయడం జరిగింది. తదుపరి ఆయనకు ఎన్నో పాటలు రాసినా…ఈ టైటిల్ సాంగ్ రాయడం మాత్రం చాలా ప్రత్యేకం. నాకిష్టమైన ఇద్దరితో పని చేయడమే కాదు.. వారి సమక్షంలో నేను రాసిన పాట వినిపించడం మరింత ఆనందం ఇచ్చింది. పాట వింటున్న వారి స్పందనను కళ్ళారా ఆస్వాదించడం మరపురాని అనుభూతి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మంచి చదువరి సాహితీ పిపాసి.. ఈ పాట అక్షరాక్షరం ఆయనకు నచ్చడం నన్ను నేను మెచ్చుకునే విషయం. దీనికి కారణభూతులైన త్రివిక్రమ్, సాగర్ చంద్ర, తమన్ గార్లకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు.
తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 2022 జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ నాయికలు. ప్రముఖ నటులు రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె. చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్. టి.
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె. చంద్ర
BHEEMLA NAYAK FIRST SINGLE RELEASE
‘Bheemla Nayak’ Title song release.
*Esteemed Director Krish released the song through his twitter account. *Ramajogayya Sastry penned the lyrics describing ‘Bheemla Nayak’s’ character. *A mesmerizing tune composed by Thaman.
Pawan Kalyan and Rana Daggubati starrer ‘Bheemla Nayak’ is being produced by Sithara Entertainments. Screenplay and dialogues are given by Ace Writer-Director ‘Trivikram’ while ‘Survyadevara Naga Vamsi’ is producing the film which is being Directed by ‘Saagar K Chandra’.
Bheemla Nayak’s first single was released today on the occasion of Pawan Kalyan’s birthday by renowned Director ‘Krish’ through his twitter account. Director Krish expressed his joy on having the opportunity to release such a striking song on the occasion of Pawan Kalyan’s birthday.
This song stands for the bravery and strength of Bheemla Nayak. Every word in the song portrays Bheemla as fierce as a lion’s roar for the bad guys. The song resonates Bheemla’s ferocity and sincerity towards his duty as a cop. The song explains the heroics of his character in plain and simple terms.
The character dynamics of Bheemla Nayak is penned down by renowned lyricist Ramajogayya Sastry. His words about this song, “My association with Shree Trivikram is a unique one, Being a great writer himself, gives a lot of support to any lyricist like me. It is through him that I wrote a song for Pawan Kalyan for the first time in the film ‘Jalsa’. Even though I have written many songs for him later on, writing this title song was a unique experience. It was not just about working with the two people I like the most.. But unveiling my song in their presence gave me utmost happiness. Witnessing their response while listening to the song is an unforgettable experience. Being a literary expert himself, to know that Shree Pawan Kalyan liked each and every word of this song makes me feel proud. My heartfelt thanks to Shree Trivikram, Saagar Chandra and Thaman for being the pivotal contributors of this film.”, he says.
Producer Suryadevara Naga Vamsi said that his banner is producing this film with great ambition. He also said that the film is set to release on 12 January 2022.
Nithya Menen and Aishwarya Rajesh are acting alongside Pawan Kalyan and Rana Daggubati respectively. Renowned actors like Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghu Babu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Pammi Sai are playing important characters in this movie.
Dialogues, Screenplay: Trivikram Cinematographer: Ravi K. Chandran (ISC) Music: Thaman.S
Editor: Navin Nooli
Art: A.S.Prakash
VFX Supervisor: Yugandhar.T
P.R.O: Lakshmi Venugopal
Presenter: P.D.V. Prasad
Producer: Suryadevara Naga Vamsi
Director: Saagar K. Chandra
Follow Us!