“Sir will be a grand welcome to Dhanush into Telugu cinema” – Trivikram

మనతో చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా ‘సార్’: త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు)/‌ ‘వాతి’(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్’(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రీమియర్ షోల టికెట్లు రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి. ఇదే ఉత్సాహంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథి, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “గోవిందుడు, గురువు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలంటే.. గోవిందుడు వీడు అని చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతానని కబీర్ అన్నాడు. అలాంటి ఎంతోమంది గురువులకి నమస్కారం చెబుతూ.. అలాంటి గురువుల గురించి సినిమా తీసిన వెంకీని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. లాక్ డౌన్ సమయంలో వెంకీ ఈ కథ చెప్పాడు. అతను చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేసిన ధనుష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతల్లో ఒకరైన నా భార్య ఈ సినిమా చూసి.. కథగా విన్నప్పుడు కంటే, సినిమాగా చూసినప్పుడు ఇంకా బాగుంది అని చెప్పింది. నేను కూడా ఈ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే.. విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేది ప్రపంచం మనకి నేర్పుతున్న పాఠం. కానీ వాటినే సామాన్య జనాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అసలు చదువు ఎందుకు మనిషికి ముఖ్యమంటే.. ఒక మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. ఒక పేదవాడి కొడుకుని డబ్బున్న వాడిని చేయగలిగేది చదువు. ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ ని చేయగలిగేది చదువు. ఒక మాములు మనిషి కొడుకుని ఒక సుందర్ పిచై, ఒక సత్య నాదెళ్ళ లాంటి స్థాయికి.. ప్రపంచం మొత్తం చూసే స్థాయికి తీసుకెళ్లగలిగేది చదువు. అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు మీకు లేదని ఒక కారణం మూలంగా వాళ్ళకి దూరం చేయడం ఎంతవరకు రైట్?. ఈ ప్రశ్నే ఈ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సినిమాకు నాకు చాలా బాగా నచ్చింది. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలలో ఉండే వాళ్లకి ఉన్నత చదువులకు వెళ్ళాలంటే అడుగడుగుక్కి చదువు దూరమైపోతుంది. ఇప్పుడైతే ఎల్కేజీ ల నుంచే దూరమవ్వడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే గీతలు గీసేస్తున్నాం.. మీకు డబ్బుంది, మీకు డబ్బు లేదు.. మీరు చదువుకోగలరు, మీరు చదువుకోలేరని. చదువుకోవడానికి బుర్ర కాదు, డబ్బు కావాలి అనుకునే స్థాయి మనం వచ్చేశామంటే.. మనం ఎంత దిగజారిపోతున్నామో మనకు తెలుస్తుంది. వీటిని సినిమాలో చాలా బలంగా ప్రశ్నించాడు వెంకీ. నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ కోసం ఏడెనిమిది వేలు ఫీజు కట్టాలి. కానీ మా నాన్నగారు డిగ్రీ చదువుకోమని చెప్పడంతో.. నేను పెద్దగా ఏమీ ఆలోచించకుండా, చింతించకుండా డిగ్రీలో చేరాను. కానీ ఈ సినిమాలో ఒక సీన్ చూస్తే.. పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడతారు. కానీ వాళ్ళ అమ్మానాన్నలు మాత్రం ఆ కొనలేని పరిస్థితి గురించి పోయేవరకు బాధపడతారు అని ఈ సినిమాలో ఒక మాట రాశాడు వెంకీ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది.. నేను దాని గురించి పెద్దగా బాధపడలేదు.. కానీ మా నాన్నగారు మాత్రం ఇప్పటికీ మా వాడిని ఇంజనీరింగ్ చదివించలేకపోయానని బాధపడుతూ ఉంటారేమో. మౌలికమైన వసతులు అందరికీ సమానంగా అందాలి. నేను జల్సా సినిమాలో ఇదే రాశాను. వాళ్ళు ఆసుపత్రికి ఇంత దూరంగా ఉన్నారు, స్కూల్ కి ఇంత దూరంగా ఉన్నారు.. కానీ పేదరికానికి మాత్రం బాగా దగ్గరలో ఉన్నారు. ఇలాంటి సమాజాన్ని మనం ప్రోత్సహించకూడదు. మనకేం కాదు కదా మనం బాగున్నాం కదా అనుకుంటే.. బాగున్నా గ్రూప్ చిన్నదైపోయి, బాగోని గ్రూప్ పెద్దదైతే గనుక.. బాగున్నవాళ్ళు కూడా ఉండరు.. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది 2000లో జరిగిన కథగా చెప్పారు కానీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోతుంది. టీచర్, స్టూడెంట్ కి మధ్య ఉండే రిలేషన్ చాలా పవిత్రమైనది. మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా మన గురువులు మనతో పాటే ఉంటారు. అలాగే ఈ సార్ సినిమా కూడా మనతో పాటు చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా అవుతుంది. ఈ తరం గొప్ప నటుల్లో ధనుష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ పనిని ఎంజాయ్ చేస్తారు. అలా పనిని ఎంజాయ్ చేసేవాళ్ళని ఎవరూ ఆపలేరు. ధనుష్ మొదటి తెలుగు సినిమాలో మేం కూడా భాగమైనందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. వెంకీ చాలా మంచి సినిమా చేశాడు. అతనికి ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాను” అన్నారు.

ఈ వేడుకలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ధనుష్ తనకు తమిళ్ మాత్రమే వచ్చు అని, తెలుగు సరిగ్గా రాదని చెప్పడంతో.. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మైక్ అందుకొని తెలుగులోకి అనుదించడం మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంత పెద్ద దర్శకుడు అయ్యుండి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన అలా అనువదించడానికి ముందుకు రావడం అభినందనీయం. ధనుష్ తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించడం, మధ్య మధ్యలో త్రివిక్రమ్ తెలుగు పదాలు అందించడం చూడటానికి ఎంతో అందంగా అనిపించింది.

చిత్ర కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ..” 2002 లో నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు 2023 లో నా మొదటి తెలుగు సినిమా విడుదలవుతోంది. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఇప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇది అద్భుతమైన ఎమోషన్స్, మెసేజ్ తో కూడిన సింపుల్ సినిమా. మేమొక అర్థవంతమైన సినిమా చేశాము. ప్రేక్షకులకు మాములుగా వాళ్ళ కథలతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఇది మీ అందరి కథ. దర్శకుడు వెంకీ గారికి, హీరోయిన్ సంయుక్త మీనన్, నిర్మాత వంశీ గారికి అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు ఇంటినుంచి భోజనం తెప్పించేవారు. త్రివిక్రమ్ గారు మొదటి నుంచి మాకిచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు. యువరాజ్ గారు ప్రాజెక్ట్ కి పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించకపోయినప్పటికీ ఈ వేడుకకు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు బిగ్ థాంక్స్. అఖండ సినిమాలో నీ వర్క్ చాలా నచ్చింది.” అన్నారు.

చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. అందుకే ముందురోజే ప్రీమియర్లు వేయాలని నిర్ణయించుకున్నాం. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే  ప్రీమియర్ షోల టికెట్లు బుక్ అవ్వడం చూశాక.. ఈ సినిమా మీద మేమెంత నమ్మకం పెట్టుకున్నామో, ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారని అర్థమైంది. ఈ సినిమా మిమ్మల్ని అసలు నిరాశపరచదు. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది” అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “మేం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. మాములుగా ప్రీమియర్లు వేయడానికి నిర్మాతలు ఇష్టపడరు. కానీ ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నామంటే నిర్మాతకు మా సినిమా మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఇది తొలిప్రేమ తర్వాత నేను చాలా నమ్మకంగా ఉన్న సినిమా. ఇది ఒక వీకెండ్ మాత్రమే చూసే సినిమా కాదు.. కనీసం నాలుగు వీకెండ్ లు చూసే సినిమా. నేను నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా తెలుగులో కనీసం నాలుగు వారాలు, తమిళ్ లో కనీసం ఎనిమిది వారాలు ఆడుతుంది. నాకు మ్యాథ్స్ నేర్పిన మంజుల మేడంకి, నాకు క్రమశిక్షణ నేర్పిన రామ్మూర్తి సార్ కి ధన్యవాదాలు. అలాగే సినిమాల్లో నాకు దర్శకులు మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు గురువులు. నేను వారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. నేను ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం త్రివిక్రమ్ గారు. సంయుక్త మీనన్, సాయి కుమార్ గారు, సముద్రఖని గారు, తనికెళ్ళ భరణి గారు, హైపర్ ఆదితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. డీవోపీ జె.యువరాజ్ గారు సినిమాకి లైఫ్ ని తీసుకొచ్చారు. జీవీ ప్రకాశ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సుద్దాల అశోక్ తేజ గారు ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప పాట రాశారు. రామజోగయ్యశాస్త్రి, ప్రణవ్ చాగంటి అద్భుతమైన పాటలు రాశారు. ఈ సినిమా చేసే అవకాశమిచ్చిన ధనుష్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. ధనుష్ గారు ఒక నాగస్వరం. ఎన్ని వాయిద్యాలు ప్లే అవుతున్నా.. ఒక్కసారి నాగస్వరం ప్లే అయితే.. మనకు నాగస్వరం మాత్రమే వినిపిస్తుంది. ధనుష్ గారు ఒక నాగస్వరం. ఆయన నటిస్తుంటే.. ఆయన ఒక్కడే కనిపిస్తాడు, ఆయన ఒక్కడే వినిపిస్తాడు. అలాంటి నటుడితో సినిమా చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది.” అన్నారు.

చిత్ర కథానాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. “ఒక సినిమా విజయం సాధించాలంటే అందరి కృషి ఉండాలి. ప్రివ్యూ చూశాక మా టీమ్ అందరి కాన్ఫిడెన్స్ చూసి, నా కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది. ముఖ్యంగా నిర్మాత వంశీ గారు ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శక నిర్మాతలకు, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. కొద్దిరోజులుగా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు అందరూ కర్చీఫ్ లు తీసుకెళ్లండి. ఖచ్చితంగా ఈ సినిమా చూసి కంటతడితో బయటకు వస్తారు. నిర్మాత వంశీ గారు ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడుతుంటారు. ఈ సినిమా దర్శకుడు వెంకీతోపాటు ఈ సినిమాకి పని చేసిన అందరికీ గౌరవాన్ని తీసుకొస్తుంది. నా అభిమాన నటుల్లో ధనుష్ ఒకరు. ఈ సినిమా ఆయనకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. సంగీత దర్శకుడు జీవీ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశాడు. నా గత ఐదేళ్ల ప్రయాణాన్ని ఇంత అద్భుతంగా మార్చిన త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

ప్రముఖ నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. “నటుడిగా నాకిది 50వ సంవత్సరం. నా విజయానికి కారకులు నా తల్లితండ్రులు, నా గురువులు. గురువుకి పట్టాభిషేకం చేస్తున్న ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ సార్ లో నటించడం మా అందరి అదృష్టం. ఇందులో అద్భుతమైన పాత్ర పోషించాను. ధనుష్ సెట్ లో చాలా కూల్ గా, సరదాగా ఉంటాడు. అప్పటిదాకా సరదాగా ఉండి, షాట్ మొదలవ్వగానే ఒక్కసారిగా పాత్రలోకి వెళ్ళిపోతాడు. చాలా అద్భుతమైన నటుడు ధనుష్. దర్శకుడు వెంకీ అట్లూరి కూడా కూల్ గా ఉంటాడు. ఏం చేయాలి, నటుల నుంచి ఎంత రాబట్టుకోవాలి అని స్పష్టంగా తెలిసిన దర్శకుడు. ఇది మంచి సందేశంతో పాటు వినోదంతో కూడిన సినిమా. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ముఖ్యంగా ప్రతి విద్యార్ధి, ప్రతి గురువు చూడాల్సిన సినిమా” అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ.. “ఇలాంటి బాధ్యతగల సినిమా చేసిన వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా సోదరుడు ధనుష్ తో కలిసి ఇంకా ఎన్నో సినిమాలలో నటించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత సంయుక్త కి ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. సితార సంస్థ నాకు పుట్టినిల్లు లాంటిది. వరుస అవకాశాలు ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వంశీ గారికి, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. త్రివిక్రమ్ గారి పేరు చెప్పడం నాకు మంత్రం చెప్పడం లాంటిది. నాకు మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చారు.” అన్నారు.

నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ..”సార్ సినిమా గురించి చెప్పాలంటే.. ఒక్క మంచి అరిటాకు వేసి, చుట్టూ మీకు నచ్చిన కూరలన్నీ వేసి, మధ్యలో వేడి వేడి అన్నం వేసి, అందులో కాస్త నెయ్యి వేసి.. తింటే ఇలాంటి భోజనం ఎక్కడా చేయలేదంటారు కదా. ఫిబ్రవరి 17న ఈ సినిమా చూశాక కూడా చాలా బాగుంది, ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదంటారు. అంత బాగుంటుంది సార్ సినిమా. ఈ సినిమా తర్వాత సంయుక్త మీ అందరి ఫేవరెట్ హీరోయిన్ల లిస్టులో చేరిపోతుంది. ధనుష్ గారి సినిమాలో నటించే అదృష్టాన్ని ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. వెంకీ అట్లూరి ఈ చిత్రంతో ఖచ్చితంగా ఘన విజయం అందుకుంటారు. నిర్మాత నాగవంశీ గారు మంచితనం, మొండితనం కలిసిన నిజాయితీపరుడు. ముందు ముందు ఆయన ఆధ్వర్యంలో సితార సంస్థ ఇంకా ఎంతో ఉన్నతస్థాయికి వెళ్తుంది. నా ఆల్ టైం ఫేవరెట్ దర్శకుడు త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వడం సంతోషంగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో కుటుంబ విలువలు ఉంటాయి. నాకు తెలిసి తెల్ల కాగితానికి పూర్తి న్యాయం చేయగల ఏకైక రచయిత త్రివిక్రమ్ గారు. ఆయనది భీమవరం, ఆయన సినీ పరిశ్రమకు రావడం మనందరికీ వరం” అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ జె.యువరాజ్ మాట్లాడుతూ..”ధనుష్ గారి లాంటి అద్భుతమైన నటుడి సినిమాకి పని చేయడం గర్వంగా ఉంది. దర్శకుడు కట్ చెప్పకుండా ఉంటే బాగుండు.. ఇంకా కొంచెంసేపు ధనుష్ గారి నటన చూడొచ్చు అనిపిస్తుంది. వెంకీ అట్లూరి గారు ఎంతో ప్రతిభ గల దర్శకుడు. చాలా కూల్ గా ఉంటారు. నాకు ఇంత మంచి అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. “ఈరోజుల్లో విద్య అనే ఇతివృత్తం మీద సినిమా తీయడం సాహసం. గొప్ప కథని ఎంచుకొని, దానికి ధనుష్ లాంటి స్టార్ ని తీసుకొని, ఇంత మంచి అవకాశాన్ని దర్శకుడు వెంకీ అట్లూరికి ఇచ్చిన నిర్మాతలు నాగవంశీ గారిని, సాయి సౌజన్య గారిని అభినందించాలి. ఇందులో నేను ‘మాస్టారు మాస్టారు’, ‘మారాజయ్య’ అనే రెండు పాటలు రాశాను. వెంకీ అట్లూరి చాలా కూల్ గా ఉంటాడు. ఎలాంటి నొప్పి తెలియకుండా, ఆడుతూ పాడుతూ పని చేయించుకొని మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటాడు. తన సంగీతంతో మనల్ని ఎంతగానో అలరించే జీవీ ప్రకాశ్ ఎప్పటిలాగే ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలను అందించారు. ఇదొక మంచి ఉద్దేశంతో రూపొందిన సినిమా. ఇలాంటి మంచి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఫిబ్రవరి 17న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ధనుష్ సినిమాలలోని సూపర్ హిట్ పాటలకు చిట్టి మాస్టర్ బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ వెంకట్, డీవోపీ జె.యువరాజ్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, ప్రణవ్ చాగంటి, గాయని శ్వేతా మోహన్ తదితరులు పాల్గొన్నారు.


Dhanush, Trivikram, Thaman and Hyper Aadhi enthrall the audience with their magnetic presence in the pre-release event of Sir!

“Sir is a meaningful film with a simple story and a grand message” – Dhanush

“Sir will be a grand welcome to Dhanush into Telugu cinema” – Trivikram

“We’re very confident about Sir, the fact that we are having paid premiers a day before confirms it” – Producer S Naga Vamsi

The most awaited film of the season, Sir, is all set for a grand release on February 17, 2023. The trailer of the film has a blockbuster written all over it. As the film revolves around educational reforms, the stellar cast of Dhanush, Samyuktha, Samuthirakani, Hyper Aadhi, and others make it a perfect entertainer. Venky Atluri helmed this bi-lingual project and it’s bankrolled by Naga Vamsi S. and Sai Soujanya under Sithara Entertainments in association with Fortune Four Cinemas. Srikara Studios is presenting this movie. The pre-release event of Sir was organised today at Hyderabad. The cast and crew attended the event, and Triviram and S Thaman graced the occasion as special guests.

DOP Yuvraj said, “I am proud to work for a Dhanush film. We wished the director doesn’t say cut while shooting with Dhanush so we can watch him perform more. That’s the magical effect of him”. Then he thanked the entire team for giving their best for Sir.

Ramajogaiah Sastry said, “Sir’s movie plot with education is a brave attempt, and it has good commercial values and backed by a star and a good production house. Also, making the film in two languages is a valiant attempt. Venky is Mr. Cool and interacts with me in a friendly way. I am glad that ‘Mastaaru’ song became viral. I wrote another song called ‘Maarajayya’ that comes in the climax. These songs got fine tunes from G V Prakash. Pranav Chaganty also gave two songs”. He remarked that Dhanush is a Sabyasachi – poet, singer, actor, and more, and he is happy to work with him. It’s interesting that Dhanush penned the lyrics for Maastaru song in Tamil. That shows his versatility.

Pranav Chaganty said, “I wrote ‘One life’, ‘Sandhyalo udayiddaam’ in the movie. Thanks Venky Atluri for having me and I thank the entire team of Sir”.

Saikumar opened his speech with Gurubhyo Namahaa and praised Ramajogaiah Sastry for wonderful lyrics. He said, “This is my 50th year as an actor. The people who are instrumental for my success are my parents and my mentors. Check out my character and the story of Sir on February 17 in cinemas”. He rendered a few lines from the movie and is excited to see Dhanush in Bharatiar getup. He praised Yuvraj for beautiful visuals and Venky for all the cool quotient he got on sets. Saikumar closed his speech by saying, “Let’s celebrate Sir in theatres. Don’t miss it”.

Hyper Aadhi said, “Watching Sir is like eating a wholesome meal on banana leaf with different curries, rice, and ghee. Venky Atluri became lucky by working with Dhanush and he made us lucky too”. Then he spoke about how Trivikram on being his inspiration.

Samuthirakani flashed on the stage and thanked Venky Atluri for making a responsible movie. He thanked Dhanush for showing him a new path that gave a direction to his acting career.

Thaman came to the event as a special guest and praised G V Prakash for pouring life into the Sir with great music. He said, “After the release of Sir, everyone will call Venky Atluri as Sir. Sithara Entertainment has a knack for doing good films. Dhanush’s passion for films always makes him run and win. People will remember Feb 17 as the release date of Sir”.

Producer S Naga Vamsi said we are very confident about the film so are having paid premiers one day before and all the shows are sold out. This speaks volumes about the positive vibe of the film.

Venky Atluri heaped praises on the crew members and said the film will have a good talk. It won’t stay for just one weekend but for four weekends in AP/Telangana and eight weeks in Tamil Nadu. He thanked all his teachers and called Trivikram his greatest inspiration for writing and making films. He shared a story shared by Dhanush and related it to the latter’s performance. In his words, “When I asked Dhanush about nadaswaram, he told that Ilaiyaraaja calls it the dominating instrument among others. Similarly, when Dhanush is acting before camera he is like a nadaswaram”.

Samyuktha said a film’s success is a collective effort. She said, “Thanks to everyone for giving me successful movies. Maastaru is my favorite song in the film and will stay with me forever. It’s a delight to watch Dhanush’s performance and I am lucky to act with him”.

Trivikram started in his archetypal style with a Kabir doha that gives more importance to guru (teacher). Then he saluted all the teachers. He said, “I watched Sir and liked the film because of its soul. Education and health are basic amenities, and only education can change the lifestyle of a human being. Venky’s film prods an important question as why someone has to be devoid of education because of lack of money? Sir will travel with us for a long time. Dhanush is like a karma yogi who enjoys his work and moves ahead with his best efforts. Sir will be a grand welcome to Dhanush into Telugu films”. He closed his speech with the phrase, “Welcome Sir”.

Dhanush came to the stage in his grand style and said, “When my first film was released in 2002, I was nervous and now in 2023 for my first Telugu film release, I am more nervous. Every film feels like my first film. Sir has simple acting, simple story but a grand message. We have done a meaningful film and it connects with all, as this film is your story”. He thanked everyone for their contribution to the film. It’s interesting to see Trivikram translating Dhanush’s Tamil and English lines into Telugu for the benefit of audience. The surprise factor at the end was Dhanush’s rendition of ‘Maastaru’ song.

IMG_20230215_212311 IMG_20230215_212326 IMG_20230215_212408 IMG_20230215_212426 IMG_20230215_212448 IMG_20230215_221627 IMG_20230215_221607 IMG_20230215_221529 IMG_20230215_221734 IMG_20230215_221709 IMG_20230215_221544

*’Sir’ is a wholesome entertainer, and I did a meaningful role that’s charming and entertaining: Samyuktha*

కథ వినగానే ‘సార్’ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను – సంయుక్త మీనన్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు)/‌ ‘వాతి’(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్’(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రచార కార్యక్రమాలలో భాగంగా తాజాగా కథానాయిక సంయుక్త మీనన్ విలేకర్లతో ముచ్చటించి సార్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి?
2016 లో మొదటి సినిమా చేశాను. అప్పటికి సినిమానే కెరీర్ గా ఎంచుకోవాలి అనుకోలేదు. నేను కేరళలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయిని. చుట్టు పక్కల వాళ్లకి ఏదో ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి అనుకున్నాను. మొదటి సినిమా తర్వాత చదువు కోసం ఒక ఏడాది విరామం తీసుకున్నాను. కానీ విధి మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చింది. నటిగా సంతృప్తినిచ్ఛే ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుని సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు సినిమానే జీవితం అయిపోయింది. నటిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాలి అనుకుంటున్నాను. తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇది నా కెరీర్ లో ఉత్తమ దశ అనిపించింది.

సార్ గురించి చెప్పండి?
నేను తెలుగులో మొదట బింబిసార, ఆ తరువాత విరూపాక్ష సినిమా అంగీకరించాను. ఈ సినిమాలు విడుదలయ్యాక కొత్త సినిమాల గురించి ఆలోచించాలి అనుకున్నాను. కానీ ఇంతలో సితార బ్యానర్ లో భీమ్లా నాయక్ లో నటించే అవకాశమొచ్చింది. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో నేను పోషించిన పాత్రలో చేసిన మార్పులు నచ్చి, వెంటనే ఆ సినిమా అంగీకరించడం జరిగింది. భీమ్లా నాయక్ షూటింగ్ సమయంలోనే నా నటన నచ్చి సితారలో మరో సినిమా అవకాశమిచ్చారు. అదే సార్ చిత్రం. డైరెక్టర్ వెంకీ గారు కథ చెప్పగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. కథ చాలా బాగుంది, అందులో నా పాత్ర కూడా నచ్చడంతో వెంటనే అంగీకరించాను. ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు.

ఈ చిత్రంలో పాత్ర కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?
కొన్ని పాత్రల కోసం ముందుగానే హోమ్ వర్క్ చేయాలి. కొన్ని కొన్ని పాత్రలు మాత్రం అప్పటికప్పుడు సహజంగా చేస్తేనే బాగుంటుంది. ఇందులో నేను తెలుగు పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలకు వెళ్ళాను. అలాగే పాత్ర గురించి బాగా తెలుసుకోవడానికి డైరెక్టర్, రైటర్ తో ఎక్కువ చర్చించాను. అంతేకాకుండా టీచర్ల చీరకట్టు ఎలా ఉంటుంది? వాళ్ళ మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ గమనించాను.

ధనుష్ తో కలిసి నటించే అవకాశం రావడం ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటినుంచో ఆయన సినిమాలు చూస్తున్నాను. ఆయనకు అభిమానిని. ఆయన మంచి నటుడు, అలాగే పెద్ద స్టార్ కూడా. అలాంటి నటుడితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

కెరీర్ ప్రారంభంలోనే పెద్ద హీరోలతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
ముందుగా కథ ఎలా ఉంది?, పాత్ర ఎలా ఉంది? అని చూస్తాను. కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇంకా దానికి స్టార్ తోడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఆ హీరో అభిమానుల ప్రేమ కూడా దక్కుతుంది. భీమ్లా నాయక్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ప్రేమ చూపించారు.

ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
డైరెక్టర్ వెంకీ గారి గత సినిమాల్లో మాదిరిగానే ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో నేను మీనాక్షి అనే బయాలజీ టీచర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రతో పాటు నా పాత్ర కూడా బలంగా ఉంటుంది. సినిమా ప్రధాన కథలోకి వెళ్ళినప్పుడు హీరో పాత్రతో పాటు నా పాత్ర ప్రయాణం సాగుతుంది.

సినిమా ఎలా ఉండబోతుంది?
ఇందులో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడమే కాదు.. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి.

డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి చెప్పండి?
ఆయనలో మంచి రచయిత, దర్శకుడు ఇద్దరూ ఉన్నారు. నటీనటుల నుంచి మంచి ఎమోషన్స్ రాబట్టుకుంటారు. ఆయన సెట్ లో చాలా సరదాగా ఉంటారు. దర్శకుడిగా తన పనిని వంద శాతం చేస్తారు.

డబ్బింగ్ మీరే చెప్పారా?
ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పలేకపోయాను. అదే సమయంలో ఇతర సినిమాల షూటింగ్ లు ఉండటం వల్ల ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది.

ధనుష్ నుంచి ఏం నేర్చుకున్నారు?
ఆయన అద్భుతమైన నటుడు. ఎక్కువ తక్కువ కాకుండా పాత్రకు ఏం కావాలో అది చేస్తారు. ఆయన నుంచి నటనలో మెళకువలు నేర్చుకున్నాను.

మీ తెలుగు గురువు ఎవరు?
నా తెలుగు ట్యూటర్ ఆశ. నాకు తెలుగు బాగా నేర్పించారు. షూటింగ్ సమయంలో నేను తెలుగు బాగా మాట్లాడటం చూసి అందరూ ఎంతో సంతోషించారు.

ఇతర సినిమాలు?
విరూపాక్ష షూటింగ్ చివరి దశలో ఉంది. బింబిసార-2 ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

*’Sir’ is a wholesome entertainer, and I did a meaningful role that’s charming and entertaining: Samyuktha*

Sir is gearing up for its release on February 17, 2023. The movie is produced by Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios. With Dhanush, Samyuktha, Samuthirakani in the lead roles, director Venky Atluri carved it to perfection. The trailer releases recently got a good applause for its storyline, action, comedy, pulsating music and razor-sharp dialogue.

*Here are the excerpts from Samyuktha’s interaction with media*

*Journey into movies*

My first movie started while I was on vacation. I hail from a village in Kerala and during my first film I never believed I would make a cut in films. Then went back to studies, and somehow destiny got me here. When I did one movie with full attention then I fell in love with cinema. I consider cinema to be divine and spiritual. When things happen by luck then we don’t find difficulties. I had my best phase when I started movies in Telugu.

*How Sir happened?*

When I signed for Bimbisara and Virupaksha, I got a call from Bheemla Nayak team. I loved the changes they made to the original character. After signing for Bheemla Nayak, I met Venky Atluri and he narrated the story of Sir. Then I realized this a great film and I should not miss. I did a look test and I got finalised.

*On preparing for a character*

It purely depends on the character. For some, I want to be spontaneous. Then only the best acting happens. For a few roles, we have to prepare a lot. I went around a few villages in Andhra and Telugu to understand more about characters and their behaviors. I talk to director and writer to get more understanding of the character. For my teacher role in Sir, I visited schools to see how the teachers look, dress and talk. So, people can relate to my character.

*On working with Dhanush*

I have been watching Dhanush’s movies since a long time. He is an actor and a star. He is working in all languages and in international films. It’s a really good experience working with him. Dhanush is very quick and fast. When I was stressed with dialogues in two languages, he gave me motivation and I became stress free. Dhanush is spontaneous. He is subtle performer and knows how to be optimal with the acting.

*On working with big stars*

I majorly focus on the story and characters. In the current scenario, it’s exciting to get love from all the fans of big stars as I am working with them. It happened with Bheemla Nayak, and other films.

*Why do you consider acting to be divine?*

If we have to act, then we have to be truly in the moment. I must shut myself from external happenings when I am in the character. It’s not easy to achieve this state. Only a few times, I got into a true or pure moment. We must be completely into the film. The same can be achieved by meditation and I get there through my acting in films.

*On learning Telugu and experiences in Sir*

I learn Telugu as I felt it’s the need of the hour. When you are on sets, a lot of people talk in Telugu and it’s better to speak in their language. That made be learn Telugu and dub in the language. You have to be a good listener and stick to the brief given by the director. In a scene, we have to listen to other actors, and I picked most of the Telugu lines by being an active listener.

*On importance of character*

In huge films, female leads are seen playing a short role. But in Sir, the female lead has much more to do. I am not just limited to romance part but also connected with the main plot in a big way.

*Is Sir majorly focused on education?*

Sir is a wholesome entertainer. We want the audience to feel for education and the reforms. The audience will connect with all the characters and scenes.

*On Hyper Aadi calling Lady Superstar*

It’s good to know he believes that. I want love and support from the audience. I want to be with them. I am not concerned with the titles and other things.

*On working with Venky Atluri*

Venky moulded me to extract the right emotions. He is clear in what he wants, so it’s fun to work with him.

*On Dubbing for Sir*

I couldn’t dub for this film as I was stuck with many projects. That’s very unfortunate.

*Opinion on Love and marriage*

Love is the basis of everything. Greek, Roman literature and everything is about love. I truly believe that it’s the crux of everything. Love is not all about finding a romantic partner. There was a time when marriage is a necessity. Now it’s not. Women can be financially and emotionally independent. There’s no rush to love and marriage.

*On removal of surname Menon from the name*

I asked everyone not to use my surname. I don’t believe in someone identifying me with a caste. I feel it to be a separation. I speak humanity and want to be progressive. I don’t want to project that I belong to a privileged section.

*On emotionally touching moments during the shoot*

In the climax of the film, there were two sequences when I felt emotionally charged. Sometimes, the emotional scenes take a toll on our lives.

*On being compared with Samantha*

Even a few people said that I look like Samantha. But, I would be happy If someone says I act like Samantha.

 

8090 (4) 8090 (1) 8090 (3) 8090 (6) 8090 (2) 8090 (5)

*Phalana Abbayi Phalana Ammayi (PAPA) is a real and raw love story replete with soul-stirring music!*

వెన్నెల వానను తలపిస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్

*వేడుకగా జరిగిన ‘ ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ టీజర్ విడుదల వేడుక

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల, వ్యవహరిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ చిత్రానికి అతికొద్ది కాలంలోనే రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వారి కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలలోని సన్నివేశాలు, సంభాషణలు, సంగీతం కట్టిపడేశాయి. నటుడిగా శ్రీనివాస్ అవసరాల ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్నప్పటికీ.. ఆయన రచనకి, దర్శకత్వానికి ఫిదా అయిన ప్రేక్షకులు ఆయన దర్శకత్వంలో మూడో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ముచ్చటగా మూడోసారి నాగశౌర్యతో కలిసి దర్శకుడిగా వెండితెరపై వెన్నెల వాన కురిపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. గురువారం సాయంత్రం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. హైదరాబాద్ లో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమంలో కథానాయకుడు నాగశౌర్య, కథానాయిక మాళవిక నాయర్, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తదితరులు పాల్గొన్నారు.

తాజాగా విడుదలైన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్.. ఇష్టమైన వ్యక్తితో సముద్రపు ఒడ్డున కూర్చొని మనసు విప్పి మాట్లాడినట్లుగా, వర్షాకాలంలో ఆరుబయట కూర్చొని మిర్చి బజ్జీలు తింటూ అమ్మతో కబుర్లు చెప్పినంత హాయిగా, ఆహ్లాదకరంగా ఉంది. సహజమైన, సున్నితమైన ప్రేమకథలను తీసుకొని వాటిని సరదాగా, మనసుకి హత్తుకునేలా తెరకెక్కించడం దర్శకుడు శ్రీనివాస్ అవసరాల శైలి. ఈ చిత్రంతో ఈసారి అంతకుమించిన మ్యాజిక్ చేయబోతున్నారని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. “ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. సంజయ్ పీసుపాటి మరియు అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అహో” అంటూ టీజర్ ప్రారంభమైన తీరు ఆకట్టుకుంది. “పాత్రకు అవసరమైతే ఎక్స్ పోజింగ్ కూడా చేస్తా” అని కథానాయకుడు అనడం, “పెళ్ళైన తర్వాత కూడా నటిస్తా” అని కథానాయిక చెప్పడం చూస్తుంటే.. నటీనటుల మధ్య ఓ అందమైన ప్రేమ కథ చూడబోతున్నామని అర్థమవుతోంది. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ఓ అందమైన పెయింటింగ్ లా ఉంది. ఇక కళ్యాణి మాలిక్ సంగీతం టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్.. మరోసారి అద్భుతం చేయబోతున్నట్లు టీజర్ తోనే తెలియజేశారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

టీజర్ విడుదల సందర్భంగా కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ.. “2013 లో అవసరాల గారిని కలిశాను. ఆయనకిది మూడో సినిమా. ఆయనతో నాకిది మూడో సినిమా. కానీ నాకు మాత్రం ఇది 23వ సినిమా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ద్వారానే నేను ప్రేక్షకులకు ఇంత దగ్గరయ్యాను. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ఎలాగైతే గుర్తుండిపోతాయో.. ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకముంది. ఈ సినిమాని ఆయన తీసినట్లు ఎవరూ తీయలేరు. కొన్ని సినిమాలు విడుదలై విజయం సాధించాక మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం విడుదల కాకముందే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇలాంటి సినిమా మళ్ళీ నా జీవితంలో చేయలేను. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. కళ్యాణి మాలిక్ గారిని, ఆయన పాటలను ఎప్పటికీ మరచిపోలేము. నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, దాసరి గారికి, వివేక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాళవిక నాకు మంచి ఫ్రెండ్. తను చాలా మంచి యాక్టర్. తనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

మాళవిక మాట్లాడుతూ.. “టైటిల్ ని బట్టే మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఇది మీ ప్రేమ కథ అయ్యుండొచ్చు. మీ స్నేహితుల ప్రేమ కథ అయ్యుండొచ్చు. కానీ ఈ సంజయ్, అనుపమల ప్రేమకథ చూడటం ఇంకా ఎక్కువ మజా వస్తుంది. ఎందుకంటే ఇది శ్రీనివాస్ గారి మ్యాజిక్. ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. “ఇది టీమ్ అంతా కలిసి చర్చించుకొని తీసిన సినిమా. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీశాం. సినిమాటిక్ డైలాగ్స్ తో స్క్రిప్ట్ ని రాయకుండా.. నిజ జీవితంలో వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అలా సహజ సంభాషణలతో తీసిన సినిమా ఇది. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథ లాంటిది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరం కలిసి ఒక టీమ్ లా పనిచేశాం” అన్నారు.

కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. “శ్రీనివాస్ గారి సినిమా నాదాకా రావడం అదృష్టంగా భావిస్తాను. నాకు ఆయనంటే ప్రత్యేక అభిమానముంది, అందుకే ఆయన సినిమాలకు సంగీతం బాగా ఇస్తానని అంటుంటారు.. కానీ అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మిగతా సినిమాలకు కూడా మంచి పాటలు అందించాను. కానీ శ్రీనివాస్ గారి సినిమాల్లో పాటలు ఏదో తెలియని మ్యాజిక్ చేస్తాయి. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల్లోని పాటలు ఎంతలా అలరించాయో ఈ సినిమాలోని పాటలు కూడా అంతే అలరిస్తాయి” అన్నారు. చిత్ర నిర్మాతలు విశ్వప్రసాద్ తనయులు ప్రణవ్ విశ్వప్రసాద్, క్రితి విశ్వప్రసాద్ లు పాల్గొని చిత్ర విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరో నిర్మాత పద్మజ దాసరి తనయులు దాసరి శ్రేయాస్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా జరిగిన ఈ వేడుకలో పాటల రచయితలు భాస్కరభట్ల, లక్ష్మిభూపాల, డీవోపీ సునీల్ కుమార్ నామ, ఎడిటర్ కిరణ్ గంటి, నటీనటులు అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, అర్జున్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

*Phalana Abbayi Phalana Ammayi (PAPA) is a real and raw love story replete with soul-stirring music!*

*”I am happy to work with Srinivas Avasarala and I can’t do a much better film than PAPA” – Naga Shourya at the teaser launch*

Phalana Abbayi Phalana Ammayi (PAPA) is Srinivas Avasarala’s comeback film with his trademark comedy, emotion, and classical touches. This is the third film of Naga Shourya under Srinivas Avasarala’s direction. So, expectations are sky-high. Their previous outings Oohalu Gusagusalade and Jyo Achyutananda are hilarious and tug at the heartstrings. PAPA also brings Naga Shourya and Malavika Nair together for the second time. The cute pairing, the looks, and the sparkling chemistry shall be the highlight of the film. The makers released the official teaser for the film today.

*About the launch event:*

The teaser launch is graced by cast and crew members Naga Shourya, Malavika Nair, Srinivas Avasarala, Shreyas, Kiran, Kalyani Malik, Sri Vidya, Sowmya, Abhishek, Sunil Kumar, Bhaskarabatla, Lakshmi Bhupal, and others.

Cinematographer Sunil Kumar said it’s a dream come true to work with director Srinivas Avasarala. Shreyas of Dasari productions thanked the team for their efforts. Editor Kiran wanted to be crisp and said thanks in a funny way.

Music director Kalyani Malik said, “I feel privileged to get any Srinivas Avasarala films. The songs I composed for his films always came out well. You’ll definitely love all the songs of PAPA. 50% of the credit goes to singers and lyric writers”.

Lyric writer Bhaskarabatla praised the director for the literature values in the film. Then about Kayani Malik on great music for the film. Another lyric writer Lakshmi Bhupal compared Srinivas Avasarala and Kalyani Malik combo with that of Vamsi and Ilaiyaraja. “There are great songs in the movie, and I too contributed to the lyrics”, he added.

Director Srinivas Avasarala put forward an interesting thing about PAPA. He remarked, “We planned to make the film in collaboration with inputs from the cast and crew. We tried to make it more conversational. Sound is recorded on sets and most of the lines are impromptu. Everyone on the stage are my collaborators”. That makes PAPA a first-of-its-kind film made with a collaborative effort in terms of scripting the film.

Malavika Nair thanked everyone and said, “I began my journey in 2016 and thanks to all the supporters and well-wishers on the stage. PAPA is Sanjay and Anupama’s love story. There are highs and lows in the film. So, watch and enjoy it”.

*Hero Naga Shourya sharing his experience:*

Naga Shourya grabbed a lion’s share of the speeches as he spoke to the end. He said, “I am happy to get a good launch from Srinivas Avasarala back in those days, and now I have done 23 films. No one else can recreate the magic of Avasarala. And I can’t do a much better film than PAPA. Thanks to editor Kiran who travelled to London and showed us the edits. Lakshmi Bhupal is more like a family now and supported me in my journey. Bhaskarabatla’s songs are always hits in my films. Kalyani Malik took all the songs to next level. Cinematographer Sunil shot beautiful frames in a minimalistic way. Malavika has an amazing screen presence and always love to work with her”.

*About the teaser:*

PAPA teaser is replete with classical music composed by Kalyani Malik. The humming in the middle adds more weight to the proceedings. The whole experience can be termed as a musical journey where the characters experience different shades of friendship and love. Kalyani Malik and Srinivas Avasarala combination shall meet everyone’s expectation and touch every soul.

Phalana Abbayi Phalana Ammayi seems to revolve around the characters of Naga Shourya and Malavika and their beautiful love story. They can be seen in three stages of their lives and how their bonding strengthens over time. All this has Avasarala’s wacky touches with characters uttering funny lines.

PAPA celebrates the magic of love and audience shall experience a real and raw love story like never before. PAPA is produced by T. G. Vishwa Prasad, Padmaja Dasari, People Media Factory in association with Dasari creations. It’s co-produced by Vivek Kuchibotla. The film is gearing up for a big release on March 17 as Ugadi special.

The cast of PAPA includes Naga Shaurya, Malvika Nair, Srinivas Avasarala, Megha Chowdhury, Ashok Kumar, Abhishek Maharshi, Sri Vidya, Varanasi Soumya Chalamcharla, Harini Rao, Arjun Prasad, and others. Srinivas Avasarala penned the story, screenplay, dialogues, and directed the film. The movie is shot beautifully by Sunil Kumar Nama, who is the DOP. Music is composed by Kalyani Malik and Vivek Sagar did one song (Kafeefi). Kiran Ganti edited the film and Azmat Ansari (UK), John Murphy (UK), and Ramakrishna are the art directors. Sujith Kumar Kolli is the film’s Executive producer and Lyrics for the film are by Bhaskarabhatla, Lakshmi Bhupala, Kittu Vissapragada. The dances are choreographed by Raghu, Yash, Riyaz, Chau, and Gule.

 

IMG_6684 IMG_6687

*Dhanush sparkles in the role of a teacher fighting for a greater cause in Sir*

పేద విద్యార్థుల చదువు కోసం మాష్టారు పోరాటం.. ఆకట్టుకుంటున్న ‘సార్’ ట్రైలర్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు)/‌ ‘వాతి’(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్’(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. కథానాయకుడు ధనుష్, కథానాయిక సంయుక్త మీనన్, దర్శకుడు వెంకీ అట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజాగా విడుదలైన ‘సార్’ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చదువుని వ్యాపారంగా చేసుకొని పేద విద్యార్థులకు చదువు అందకుండా చేస్తూ పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న వ్యక్తులపై కథానాయకుడు సాగించే పోరాటమే ‘సార్’. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున కొన్ని ప్రభుత్వ కళాశాలను దత్తతు తీసుకుంటారు. అక్కడికి ఫ్యాకల్టీగా కథానాయుడు వెళ్తాడు. హాస్యం, ప్రేమ సన్నివేశాలతో సరదాగా సాగిపోతున్న కథలో.. కొందరి స్వార్థం కారణంగా పేద విద్యార్థులకు చదువు దూరమయ్యేలా కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ విద్యార్థుల తరపున సార్ ఎలా పోరాటం సాగించాడో అనే ఆసక్తిని రేకిత్తిస్తూ రూపొందిన ట్రైలర్ మెప్పిస్తోంది. “చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు.. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం మీరు ఉంటారన్న నమ్మకం వాళ్ళకి కుదరడం లేదు”, “ఎడ్యుకేషన్ లో వచ్చినంత డబ్బు పాలిటిక్స్ లో రాదు”, “డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు..కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది” వంటి సంభాషణలు కథానుసారం బలంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడి అద్భుతమైన సృష్టికి జె. యువరాజ్ కెమెరా పనితనం, జి.వి. ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం తోడై ట్రైలర్ ను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

ట్రైలర్ విడుదల సందర్భంగా కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ.. “ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఇది నా మొదటి తెలుగు సినిమా. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా, హిందీ సినిమా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అనడం సంతోషించదగ్గ విషయం. ఈ కథ చాలా బాగుంటుంది. నాకు ఇంతమంచి సినిమా ఇచ్చినందుకు వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. అలాగే చినబాబు గారికి, నాగవంశీ గారికి, త్రివిక్రమ్ గారికి, సంయుక్త మీనన్, హైపర్ ఆది మరియు మా టీమ్ అందరికీ ధన్యవాదాలు.” అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో ఈ కథ రాసుకొని వంశీ గారికి వినిపించగా ఆయనకు నచ్చింది. లాక్ డౌన్ కావడంతో అప్పుడు హీరోలు పెద్దగా కథలు వినే ధైర్యం చేయలేదు. కానీ ధనుష్ గారు మాత్రం కథ చెప్పడానికి రమ్మన్నారు. ఈ సినిమా ఆయన చేసిన చేయకపోయినా ఆయనకు కథ చెప్పానన్న సంతృప్తి నాకు చాలు అనుకున్నాను. కానీ ఆయన కథ వినగానే ఈ సినిమా చేస్తున్నాను అనడంతో నాకు ఆ ఆనందంలో మాటలు రాలేదు. నాకు ఈ అవకాశమిచ్చిన వంశీ గారికి, ధనుష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను” అన్నారు.

నాయిక సంయుక్త మాట్లాడుతూ సర్ సినిమా అందరినీ అలరిస్తుందని తెలిపారు.

హైపర్ ఆది మాట్లాడుతూ.. ” ధనుష్ గారి సినిమాల్లో రఘువరన్ బి.టెక్ తర్వాత తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమా సార్. అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా. ఒక తెలుగు యువ దర్శకుడు తమిళ స్టార్ కి కథ చెప్పి ఒప్పించాడంటే తెలుగు ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. అలాగే పాపులర్ స్టార్ అయ్యుండి కథ నచ్చి మూడు సినిమాల అనుభవమున్న దర్శకుడికి అవకాశమిచ్చాడంటే తమిళ ప్రేక్షకులు గర్వంగా ఈ సినిమా చూడాలి. తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ మెచ్చేలా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఫిబ్రవరి 17న థియేటర్లకి వెళ్లి చూడండి” అన్నారు.
చివరిగా కదహానాయకుడు ధనుష్ చిత్రం లో నటించిన స్టూడెంట్స్, టీమ్ తో కలసి చిత్రంలోని ‘ మాస్టారు…. మాస్టారు’ గీతం ఆలపించి అభిమానుల సంతోషాన్ని అంబరాన్ని తాకేలా
చేశారు.

*Dhanush sparkles in the role of a teacher fighting for a greater cause in Sir*

Sir, starring Dhanush, Samyuktha Menon and Samuthirakani, is easily one of the most awaited films among movie buffs. This bi-lingual is helmed by Venky Atluri and produced by Naga Vamsi S. and Sai Soujanya under Sithara Entertainment in association with Fortune Four Cinemas. This movie is gearing up for a grand release in Tamil and Telugu on February 17, 2023. Today, the cast and crew have gathered for the trailer launch.

Dhanush, Samyuktha Menon, Venky Atluri, Naga Vamsi, Hyper Aadi, Yuvraj are present for the trailer launch. Suma made the event more interactive with someone from the audience emphasizing the importance of Government schools.

Hyper Aadi praised the production quality of Sithara entertainment. He talked about beauty of Samyuktha and wants a teacher like her in all schools.

Venky Atluri said, “The story evolved from all the meme content floating around that I shift my base to a foreign country in the second half of my films. Then I wrote Sir’s story and narrated to Dhanush. He liked it instantly and gave his dates. That’s one of the precious moments in my life. Dhanush and G V Prakash had many blockbusters together, and I hope this film will become another one that’s notable for its background score”.

Dhanush is happy for his first straight Telugu film. He said, “Now we no longer speak about Telugu or Hindi or Telugu cinema, it’s Indian cinema. The story of Sir unfolds at a place that borders with Tamil and Telugu states, and one can witness both the flavours. I am thankful to Venky Atluri for this film. My sincere thanks to the entire team”. Dhanush pleases his fans by singing ‘Mastaru Mastaru’ song from the film.

Samyuktha Menon cheers the audience and poses for pictures and selfies with the actors who played her students in the film.

Sir’s trailer suggests that Dhanush is playing a role with multiple hues. It shows him a playful avatar and as the plot thickens, he is seen fighting for a greater cause. He is seen as a teacher sent to a government school as part of an upliftment programme. The elements such as comedy between Dhanush and Hyper Aadi, chemistry between the lead pair, the fight with Samuthirakani are creating a positive vibe for the trailer. The novel concept of educational reforms makes Sir the most sought-after film.

The trailer starts with fast cuts with thumping music. These set the tone for the trailer and hints at upcoming action-filled proceedings. As Dhanush steps into the college, there is some light-heartedness making way for comedy and romance. ‘Mastaru Mastaru’ song is breezy and established the characters bonding in the film. The stretch with Samuthirakani adds the serious tone to the film followed by Dhanush’s action to bring the change. This couple by G V Prakash’s reverberating theme music gives a joyous experience. Cinematography by J Yuvraj captures the essence of the film. Navin Nooli gives the film an unsettling pace with his sharp edits.

‘Adigindi konivvaka pothe aa pillalu okka roje edusthaaru… Kaani valla amma nanna konivvaleni paristhiti untnahtakaalam edustune untaaru’ is a hard-hitting emotional line, and one can expect many such lines in the film. During the end of the trailer when Saikumar character asks about the importance of education, Dhanush replies, ‘Dabbu elaagaina sampadinchu kovacchu… Kaani maryadani chaduvu maatrame sampaadinchi pedutundi.’ This might be the crux of Sir. This is followed by a theatre like design of ‘Dhanush In & As’ title card. That’s the whistle worthy moment for fans, and the star rightly addresses them in the end. ‘Classes start from February 17th’ is a nice touch.

 

DSC_2794 DSC_2799 DSC_2788 DSC_2884

*Cast and crew of Butta Bomma thank the audience in the post release press meet*

బుట్ట బొమ్మ’ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: చిత్ర బృందం 
కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం ‘బుట్ట బొమ్మ’: దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ తో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమయ్యారు. నేడు(ఫిబ్రవరి 4న) థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ.. “మా సినిమాకు ఇంతమంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. సినిమా బాగుందని యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది లవ్ స్టోరీ నుంచి థ్రిల్లర్ గామారే కథ అయినప్పటికీ.. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. మీ కుటుంబంతో కలిసి వెళ్ళండి.. ఈ చిత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రి తన కూతురితో కలిసి చూడాల్సిన సినిమా. మనం పిల్లలతో చెప్పలేని కొన్ని విషయాలను.. ఈ సినిమా చూపించి వారికి సులభంగా అర్థమయ్యేలా చేయొచ్చు. థియేటర్ కి వెళ్లి చూడండి.. ఒక మంచి సినిమా చూశామనే తృప్తి మీకు కలుగుతుంది. రోజురోజుకి ఈ సినిమా మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము” అన్నారు.
నటుడు అర్జున్ దాస్ మాట్లాడుతూ.. “అందరికీ మా సినిమా నచ్చిందని అనుకుంటున్నాను. ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. సినిమాలో నా నటన, డబ్బింగ్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సినిమాకి, సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుండటం ఆనందంగా ఉంది” అన్నారు.
నటుడు సూర్య వశిష్ఠ మాట్లాడుతూ.. “ఈరోజు ఉదయం మేము ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా మీద మేం పెట్టుకున్న నమ్మకం నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూసి, మమ్మల్ని ఆదరించండి” అన్నారు.
నటి అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ.. “మేం ఎంతో ఇష్టపడి చేసిన మా బుట్టబొమ్మ సినిమాకు ఇంతమంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు” అన్నారు.
రచయిత గణేష్ రావూరి మాట్లాడుతూ.. “బుట్టబొమ్మ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేం ఊహించినట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కథలో ఉన్న మలుపులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశాన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం” అన్నారు.
*Cast and crew of Butta Bomma thank the audience in the post release press meet*
*Butta Bomma appeals to all sections of the audience as it has layers of romance, thriller, and a beautiful message: Shourie Chandrasekhar Ramesh*
Butta Bomma released today is getting positive response from the audience. The reviews from the US and Telugu states are wonderful and all the shows are running to packed houses. Butta Bomma is a cute romantic thriller with a message. In a post release press meet, the cast and crew thanked the audience for their tremendous support in making the film a grand success.
Anika Surendran who played the central character of Satya said, “I am grateful and proud to do this project. I touched the hearts of everyone. I am happy for everything”.
Surya Vashistta who donned the auto driver role is elated with the response of Butta Bomma and said, “I saw the movie at Prasad’s in the morning and I am glad about the positive reviews. The movie is getting good reviews from across the states. This is a happy moment for me as I am part of a great project on my debut”.
Arjun Das who played a key role in the film is joyous about seeing the crowds for the morning shows. He said, “Thanks for coming for the morning show. Thanks for all the lovely messages. I really appreciate your feedback. It’s evident that everyone liked the dubbing in the film. Next time when I do a Telugu movie, I will make sure to interact with everyone in Telugu”.
Shourie Chandrasekhar T Ramesh who directed Butta Bomma is happy with the positive response. In his words, “My friends from America saw the film and heaped praises on me. The movie has got a lot of buzz in the overseas market. In Telugu states too, it got an immense response. The undercurrent of the film is appealing to the families, so it’s worth watching. I feel every father must take their daughters to this movie. So, they can explain certain things to them. Please come with your kids and watch Butta Bomma in cinemas”.
Ganesh Ravuri who penned wonderful dialogues for the film remarked, “Dialogues have well connected with audience. Thanks for making the film a success. People are liking the twists and turns in the story. The message will go a long way and movie will get a wide reach”.
 WhatsApp Image 2023-02-04 at 5.13.05 PM WhatsApp Image 2023-02-04 at 5.13.04 PM (2) WhatsApp Image 2023-02-04 at 5.13.04 PM WhatsApp Image 2023-02-04 at 5.13.05 PM (2) WhatsApp Image 2023-02-04 at 5.13.05 PM (1) WhatsApp Image 2023-02-04 at 5.13.04 PM (1)