Sithara Entertainments’ next project looks like the next intense high, titled ‘ALCOHOL’ stars Allari Naresh in lead role.

 అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రానికి ‘ఆల్కహాల్’ టైటిల్ ఖరారు

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వైవిధ్యభరితమైన చిత్రాలతో సంచలన విజయాలను అందుకుంటోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు ఈ మూడు సంస్థలు కలిసి మరో విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నాయి.

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది.

రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

‘ఆల్కహాల్’ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాత. నాగవంశీ వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ‘ఆల్కహాల్’తో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ కలిగించింది.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: అల్లరి నరేష్, రుహాణి శర్మ
రచన, దర్శకత్వం: మెహర్ తేజ్
సంగీతం: గిబ్రాన్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సహ నిర్మాత: వెంకట్ ఉప్పుటూరి
ఛాయాగ్రహణం: జిజు సన్నీ
కూర్పు: నిరంజన్ దేవరమానే
కళా దర్శకుడు: విశాల్ అబానీ
సహ రచన: ఉద్భవ్ రఘునందన్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Sithara Entertainments’ next project looks like the next intense high, titled ‘ALCOHOL’ stars Allari Naresh in lead role.Coming from the most trusted banner in Telugu cinema Sithara Entertainments in association Fortune Four Cinemas and presented by Srikara Studios joining forces once again for a gripping new project titled Alcohol directed by Meher Tej. The first look poster immediately grabs attention with an intense close up of Allari Naresh submerged in Alcohol. Looks like the story navigating the blurred lines between illusion & realityThe film also stars Ruhani Sharma. Music is composed by Ghibran who has a proven knack for keeping audiences on the edge of their seats with his gripping score. Jiju Sunny handles the cinematography and Niranjan Devaramane is the editor

Naga Vamsi is in a league of his own with the kind of films he’s backing and the success he’s racing towards. With just the announcement, Alcohol already looks like another stunning addition to his cap.

Starring: Allari Naresh, Ruhani Sharma
Written & Directed by: Meher Tej
Music by: Ghibran
Produced by: S. Naga Vamsi & Sai Soujanya
Co Producer: Venkat Upputuri
DOP: Jiju Sunny
Editing: Niranjan Devaramane
Production Design: Vishal Abani
Co Writer: Udbhav Raghunandan

pro: Lakshmivenugopal
ALCOHOL-FL-Twitter  (1) ALCOHOL-FL-Still (1)

Director Jyothi Krisna re-designed Bobby Deol’s character (Aurangzeb) in Hari Hara Veera Mallu after watching Animal

‘యానిమల్’ చూసి ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ పాత్రను మరింత శక్తివంతంగా మలిచిన దర్శకుడు జ్యోతి కృష్ణపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 3న ట్రైలర్ ఆవిష్కరణ జరగనుంది.

‘హరి హర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అలాగే పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ‘హరి హర వీరమల్లు’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

నిజానికి బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారు. కానీ, ‘యానిమల్‌’లో బాబీ నటనను చూసిన తర్వాత దర్శకుడు జ్యోతి కృష్ణ ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నారు. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారు.

“యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని జ్యోతి కృష్ణ అన్నారు.

జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బాబీ డియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం.. ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు. జ్యోతి కృష్ణ దిద్దిన మెరుగులతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారింది.

యానిమల్ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్‌డమ్‌ చూశారు. ఆ స్టార్‌డమ్‌ కి న్యాయం చేయడానికి మరియు ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు.

“నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు, బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం” అని దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి,
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Director Jyothi Krisna re-designed Bobby Deol’s character (Aurangzeb) in Hari Hara Veera Mallu after watching AnimalIt is known that Bobby Deol is playing the role of Mughal emperor Aurangzeb in Pawan Kalyan’s upcoming film Hari Hara Veera Mallu. The period drama is directed by Jyothi Krishna. Initially, Bobby Deol shot some scenes in the film. But later, after the director watched Bobby’s performance in Animal, he decided to completely re-write and redesign his character in Hari Hara Veera Mallu.

“Bobby Deol’s garu performance in Animal was spell bounding. His ability to convey emotions through expressions alone, despite the character’s lack of dialogues was something we all were blown away. I decided to change the arc of his character in our film too, and give a complete makeover,” said Jyothi Krishna. His desire to improve the character’s arc and better fit the role’s strength was the key to bring emotional depth in Bobby Deol’s performance. The revised role amplifies certain aspects of the character’s personality and infuse more riveting and compelling performance.

The director made major adjustments to the character’s personality, backstory, motivation, and physical portrayal. Jyothi Krisna felt that Aurangzeb’s character needs a more compelling arc to do justice to Bobby Deol’s new-found stardom and live up to his expectations. “When I narrated the revised script, Bobby garu was very excited. He is an actor who always likes to explore different possibilities and present a newer version of himself to the audiences. In Hari Hara Veera Mallu, Bobby Deol looks more intense. His powerful screen presence, elegance and the way he expresses a lot with his eyes speaks volumes. Working with him has been a great experience,” shared the director.

4 (2) Bobby Deol Final copy (1) HHVM REL DATE POSTER LOCK insta copy MIBR9821

Hari Hara Veera Mallu Theatrical Trailer Arrives on July 3rd.

జూలై 3న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల

సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ను జూలై 3వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం.

క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి  క్రిష్ జాగర్లమూడి కూడా తన సహకారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రతి ఫ్రేమ్‌ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది చిత్ర బృందం.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాలుగు గీతాలకు విశేష స్పందన లభించింది. ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’, ‘తార తార’ గీతాలు ఒక దానిని మించి మరొకటి శ్రోతలను మెప్పించాయి.

బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు  ’హరి హర వీరమల్లు’లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నభూతో నభవిష్యతి అన్నచందాన అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది.

ప్రముఖ నిర్మాత  ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ తో ‘హరి హర వీరమల్లు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.

దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి,

నిర్మాత: ఎ. దయాకర్ రావు

సమర్పణ: ఎ. ఎం. రత్నం

బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్

కూర్పు: ప్రవీణ్ కె.ఎల్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్

విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్

కళా దర్శకుడు: తోట తరణి

నృత్య దర్శకత్వం: బృందా, గణేష్

స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్

 

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

 

The wait is over. One of Indian cinema’s most ambitious historical spectacles Hari Hara Veera Mallu is all set to unveil its theatrical trailer on July 3rd, 2025.

Starring Power Star Pawan Kalyan in a never before seen avatar as the fierce and fearless Veera Mallu. The film narrates the journey of a rebellious outlaw who dares to defy the might of the Mughal

The film is by Director A.M. Jyothi Krishna who is spearheading this magnum opus with lots of hard work while Krish Jagarlamudi continues to contribute as one of the visionary forces behind the project. The post production work is progressing at a rapid pace with every frame undergoing meticulous attention to deliver best cinematic experience.

Music by M.M. Keeravani has already set the tone with four impactful songs all of which have received resounding love from fans.

The film also features ensemble cast Bobby Deol, Nidhhi Agerwal and many more adding madness to the narrative. With stunning visuals by Gnana Shekar V.S. and Manoj Paramahamsa and editing by K.L. Praveen, film is being shaped into a visual epic.

Presented by A.M. Rathnam and produced by A. Dayakar Rao under Mega Surya Production. The film is gearing up to hit the screens on July 24th.

 

HHVM_STILL_TWT HHVM_TRAILER_TWT_TEL

*“Kattanduko Janaki” Song from Mithra Mandali Launched with a Bang at KIMS College, Amalapuram!*

మిత్ర మండలి’ మొదటి గీతం ‘కత్తందుకో జానకి’ విడుదల

అమలాపురంలోని కిమ్స్ కాలేజ్ లో ఘనంగా గీతావిష్కరణ కార్యక్రమం

బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం అపరిమిత వినోదాన్ని అందించనుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది.

తాజాగా ‘మిత్ర మండలి’ నుంచి మొదటి గీతం ‘కత్తందుకో జానకి’ని నిర్మాతలు విడుదల చేశారు. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం(జూన్ 21) సాయంత్రం అమలాపురంలోని కిమ్స్ కాలేజ్ లో జరిగింది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఐకానిక్ డైలాగ్ ‘కత్తందుకో జానకి’ని తీసుకొని, ఈ తరం మెచ్చేలా అద్భుతమైన పాటగా మలిచారు. ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ గీతం.. వినసొంపుగా, అందరూ సరదాగా పాడుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ మరోసారి తన కలం బలం చూపించారు. ఈ సరదా గీతాన్ని ఎంతో అందంగా, అర్థవంతంగా వ్రాశారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.

‘మిత్ర మండలి’ మొదటి గీతం ‘కత్తందుకో జానకి’కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రధాన పాత్రధారులు ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గీతం సాగింది. తమ గురించి తాము ఉల్లాసంగా పాడుతూ.. నేటి Gen Z అలవాట్లయిన రీల్స్, రిలేషన్స్, పబ్జీ గేమింగ్ ఇలా ప్రతిదానిని ప్రస్తావిస్తూ ‘కత్తందుకో జానకి’ గీతం నడిచిన తీరు కట్టిపడేసింది. ఓ వైపు యువత తమ అలవాట్లను చెప్పుకుంటుంటే, మరోవైపు తల్లిదండ్రులు వారిని తరుముతూ ‘కత్తందుకో జానకి’ అనడం ఆకట్టుకుంది.

అమలాపురం కిమ్స్ కాలేజ్ లో జరిగిన ‘కత్తందుకో జానకి’ గీతావిష్కరణ వేడుకకు ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హాజరయ్యారు. అలాగే కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు, ఎండీ రవివర్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు బన్నీ వాస్, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల, నటీనటులు ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, దర్శకుడు విజయేందర్ ఎస్, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ తదితరులు సందడి చేశారు.

‘కత్తందుకో జానకి’ గీతం యువత మెచ్చేలా ఉందని ప్రశంసించిన అతిథులు.. ‘మిత్ర మండలి’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ‘మిత్ర మండలి’ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

  *“Kattanduko Janaki” Song from Mithra Mandali Launched with a Bang at KIMS College, Amalapuram!*

June 21st witnessed an electrifying atmosphere at KIMS College, Amalapuram, as the first single from the upcoming film Mithra Mandali, titled “Kattanduko Janaki”, was launched amidst a wildly enthusiastic crowd and the film’s vibrant cast.

Gracing the event as the Chief Guest was Amalapuram MP G.M. Harish Balyogi, joined by KIMS Chairman Chaitanya Raju and MD Ravi Varma. The launch turned into a grand celebration with the presence of film presenter Bunny Vas, producers Kalyan Manthina, Bhanu Pratap, Dr. Vijayender Reddy Teegala, and cast members Priyadarshi, Niharika N M, Rag Mayur, Vishnu Oi, and Prasad Behara, along with director Vijayender S, music director R.R. Dhruvan, and other team members.

The quirky and youthful anthem “Kattanduko Janaki” has already received a thunderous response online. Sung by Rahul Sipligunj, penned by Kasarla Shyam, and composed by RR Dhruvan, the song hilariously explores the world of four young men played by Priyadarshi, Vishnu Oi, Rag Mayur, and Prasad Behara as they sing about their Gen Z escapades, from reels to relationships to PUBG gaming, while their fathers yell in the background with the now-viral hook: “Kattanduko Janaki!”

The guests lauded the song for its fun and relatable vibe and conveyed their best wishes to the entire Mithra Mandali team, expressing hopes for the film’s massive success. The makers shared that Mithra Mandali will be a laughter-filled ride that allows audiences to forget their worries and simply enjoy the madness in theatres.

Presented by Bunny Vas under BV Works, and jointly produced by Sapta Aswa Media Works & Vyra Entertainments, Mithra Mandali is directed by Vijayender S, and stars an ensemble cast including Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, Vennela Kishore, Satya, VTV Ganesh, and more.

With Kalyan Manthina, Bhanu Pratap, and Dr. Vijayender Reddy Teegala as producers and Somaraju Penmetsa as co-producer, the film is backed by a dynamic technical team featuring RR Dhruvan (Music), Siddharth SJ (Cinematography), Peekay (Editing), and Gandhi Nadikudikar (Production Design).

Start vibing to “Kattanduko Janaki” out now and winning hearts everywhere!

IMG_8668 4dc6cb99-48a3-41c9-8112-2d6abc978cca KLN06027 (1) KLN06023 (1)

*The Arena of History Awaits Its Warrior. Hari Hara Veera Mallu Arrives July 24th*

జూలై 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రక యోధుడిగా నటిస్తుండటంతో పాటు, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటంతో ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

గ్లింప్స్, టీజర్ లో యోధుడిగా కనిపించిన పవన్ కళ్యాణ్ లుక్ కి, అద్భుతమైన విజువల్స్ కి విశేష స్పందన లభించింది. ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’, ‘తార తార’ గీతాలు ఒక దానిని మించి మరొకటి శ్రోతలను మెప్పించాయి. రికార్డు వ్యూస్ తో సామాజిక మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.

‘హరి హర వీరమల్లు’ నుంచి వచ్చే ప్రతి కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలకు తారాస్థాయికి తీసుకెళ్ళేలా.. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ త్వరలో విడుదల కాబోతుంది. అంతేకాదు, చిత్ర విడుదల తేదీని కూడా తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

ఈ చిత్రానికి మనోజ్ పరమహంస మరియు జ్ఞాన శేఖర్ వి.ఎస్. ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నభూతో నభవిష్యతి అన్నచందాన అద్భుతమైన సెట్ లను రూపొందించారు.

చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ తో రూపొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ప్రేక్షకులను వెండితెరపై గొప్ప అనుభూతిని కలిగించనుంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి.
దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి,
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

*The Arena of History Awaits Its Warrior. Hari Hara Veera Mallu Arrives July 24th*

Hari Hara Veera Mallu finally locks its date for an epic journey to the audience. It is one of Indian cinema’s most ambitious historical epics starring Pawan Kalyan in a never before seen warrior avatar portraying the rebellious outlaw Veera Mallu who dares to challenge the might of the Mughal Empire.

Director A.M. Jyothi Krishna is leaving no stone unturned in crafting this magnums opus. Also Krish Jagarlamudi also contributing as one of the creative visionaries behind the project. Post production is progressing in full swing with the team committed to delivering uncompromised quality at every level.

M.M. Keeravani’s music has added immense value to this magnum opus. With four songs released so far each met with overwhelming response. His score continues to elevate the film’s vibe.

Also starring Bobby Deol and alongside Nidhhi Agerwal, and an ensemble cast. Manoj Paramahamsa and Gnana Shekar V.S. shaped in the edit by K.L. Praveen.

Presented by A. M. Rathnam and produced by A. Dayakar Rao under Mega Surya Production, team is now gearing up for the release of the theatrical trailer which is set to create a massive impact with its content.

With the aim now clear, makers have locked in a direct strike to audiences’ hearts
Hari Hara Veera Mallu arrives in theaters on July 24, 2025.

HHVM_TWITTER WWM