“Hari Hara Veera Mallu is a subject very close to my heart.” – Power Star Pawan Kalyan at the Pre-Release Event

‘హరి హర వీరమల్లు’ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు: ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

 ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 21(సోమవారం) సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “లక్షలాది అభిమానుల మధ్య ఈ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. వర్షాలు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువమందితో నిర్వహిస్తున్నాము. అభిమానుల క్షేమం గురించి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ గారికి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాల్లోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో, అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఈశ్వర్ ఖండ్రే గారి లాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఇక్కడికి వచ్చినందుకు కృతఙ్ఞతలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన కందుల దుర్గేష్ గారు, రఘురామకృష్ణ రాజు గారికి  కూడా నా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల క్రితం ‘భీమ్లా నాయక్’ విడుదలైనప్పుడు.. అన్ని సినిమాలకు వందల్లో ఉంటే, ఆ సినిమాకి 10, 20 రూపాయలు టికెట్ రేట్లు చేశారు. నేను అప్పుడు ఒక మాట చెప్పను ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఇది డబ్బు గురించి కాదు, రికార్డుల గురించి కాదు. మనం ధైర్యంగా నిలబడితే న్యాయం జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నేను అసలు నటుడు అవ్వాలని కూడా కోరుకోలేదు. సగటు మనిషిగా బ్రతకాలన్న ఆలోచన తప్ప ఏంలేదు. నన్ను ఇంతటి వాడిని చేసింది అభిమానులే. పడినా, లేచినా, ఎలా ఉన్నా.. అన్నా నీ వెంట మేమున్నాం అన్నారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి 29 ఏళ్ళు. కొంచెం వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చావ ఇంకా బ్రతికే ఉంది. వరుస హిట్స్ ఇచ్చిన నేను.. జానీతో పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని. కానీ నేను ఒకటే నమ్మాను.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేదు, నన్ను ప్రేమించే నా అభిమానులు ఉన్నారని. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. పేరుంది, ప్రధాన మంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు. కానీ, దాని వల్ల డబ్బులు రావు. సినిమా చేసే డబ్బులు సంపాదించాలి. నాతో ఖుషి సినిమా తీసిన రత్నం గారు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నేను పరాజయాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలబడింది త్రివిక్రమ్ గారు. అపజయాల్లో ఉన్న నన్ను వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, నా ఆత్మ బంధువు త్రివిక్రమ్.. అప్పుడు నాతో జల్సా సినిమా తీశారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. నాకు అలాంటి స్నేహితుడు త్రివిక్రమ్ గారు. నేను రీమేక్ సినిమాలు చేయడం మీకు నచ్చకపోవచ్చు. కానీ, నా కుటుంబాన్ని పోషించడానికి, పార్టీని నడపడానికి తక్కువ సమయంలో డబ్బులు కావాలంటే రీమేక్ సినిమాలు చేయక తప్పలేదు. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా చేయాలనుకుంటే.. అది ఎ.ఎం. రత్నం గారి ద్వారా వచ్చింది. మొదట రత్నం గారు కూడా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ, క్రిష్ గారు ఈ కథ చెప్పారు. ఈ సినిమాకి పునాది వేసింది ఆయనే. నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రుతలూగించి ఆస్కార్ గెలిచారు కీరవాణి గారు. కరోనా వంటి కారణాల సినిమా ఆలస్యమవ్వడంతో నిరుత్సాహం వచ్చేది. కానీ, కీరవాణి గారి సంగీతం విన్న వెంటనే మళ్ళీ ఉత్సాహం కలిగేది. కీరవాణి గారి సంగీతం లేకుండా హరి హర వీరమల్లు లేదు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి కూడా.. అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయన ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశారు. తండ్రికి ఉన్న విజన్ కి కొడుకు సారధ్యం వహించారు. తండ్రీకొడుకుల ఎఫర్ట్ ఈ సినిమా. రత్నం గారికి, జ్యోతికృష్ణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను మంత్రి అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేసి.. అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. ఈ సినిమాని ఒంటి చేత్తో నెల రోజులుగా ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ గారికి అభినందనలు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ అద్భుతంగా నటించారు. హరి హర వీరమల్లు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. మన భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరినీ ఆక్రమించుకోలేదు. మనం చదువుకున్న పుస్తకాల్లో మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. వారి అరాచకాన్ని చెప్పలేదు. ఔరంగజేబు సమయంలో నువ్వు హిందువుగా బ్రతకాలంటే టాక్స్ కట్టాలి అన్నారు. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇలాంటి నేపథ్యంలో వీరమల్లు అనే కల్పిత పాత్రతో ఒక సగటు మనిషి ఏం చేసి ఉండొచ్చు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఎన్నో చేతులు మారుతూ ఇప్పుడు లండన్ లో ఉంది. కోహినూర్ నేపథ్యంలో క్రిష్ గారు కథ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించి సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ సినిమా కోసం మేము మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము. నాకు తెలిసిన వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ తో 18 నిమిషాల క్లైమాక్స్ ను నేను కొరియోగ్రఫీ చేశాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

కర్ణాటక అటవీ శాఖ మంత్రివర్యులు ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ జనరేషన్ లోని గొప్ప నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప మనిషి కూడా. సమాజానికి సేవ చేయడంలో ముందుంటారు. సినీ రంగంతో పాటు, రాజకీయం రంగంలోనూ రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీలు వేరయినా సమాజానికి సేవ చేయడమే మా లక్ష్యం. నిర్మాత ఈ వేడుకకు ఆహ్వానించడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. యువత ఆయనను అనుకరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే బడా హీరో, బడా నిర్మాత కలిసి చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆశిస్తూ.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ తో, అగ్రశ్రేణి కథానాయకుడిగా ఒక పక్కన.. మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి.. రాజకీయం రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ.. ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ మాటలు అయితే చెప్తారో వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దేశభక్తి, జాతీయ వాదం గురించి ఆయన పదే పదే మాట్లాడుతుంటారు. హరి హర వీరమల్లు టైటిల్ చూసినా, కథాంశం చూసినా నాకు అనిపించేది ఒక్కటే.. దేశంలోని యువతకు దేశభక్తి, జాతీయ వాదం గురించి చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఇంతకాలం ఈ సినిమా కోసం నిలబడిన రత్నం గారికి అభినందనలు. ఈ సినిమాలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు.” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ, “శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం హరి హర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఈ సినిమాలో చూడబోతున్నాం. జూలై 24 ఎప్పుడు వస్తుందా అని మీ అందరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఒక ఉద్వేగం. ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అలాగే ఎ.ఎం. రత్నం గారు ఎంతో ధైర్యమున్న వ్యక్తి, ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకొస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ప్రముఖ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. చాలా గొప్పవాడు. 17 ఏళ్ళ వయసు నుంచి పవన్ కళ్యాణ్ ని చూస్తున్న వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచే ఈ సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఉండేవాడు. తనంతట తాను వేసుకున్న బాటలో నడిచి వెళ్ళాడు తప్ప.. ఎవరో వేసిన బాటలో వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. తన బాటలో వస్తున్న ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు.. తనంతట తాను ఎదురుతిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప.. ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో పదిమందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనొక స్వయం శిల్పి. తనను తాను చిక్కుకున్న శిల్పి. డెస్టినీనే ఆయనను నడిపిస్తుంది. అనుకోకుండా నటుడు అయ్యారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యారు. లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నయినా అనుకోనివ్వండి. సముద్రమంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే.. స్ట్రయిట్ నిలబడి చెప్పగల ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పుట్టుక నీది, చావు నీది.. బ్రతుకంతా దేశానిది. ఈ మాట పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.” అన్నారు.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను. కానీ, నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించిన మొదటి హిస్టారికల్ ఫిల్మ్, మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ ను నిర్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. సినిమాల ద్వారా ఎంతో కొంత సందేశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఈ సినిమా కూడా వినోదం అందించడంతో పాటు, ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాము” అన్నారు.

చిత్ర నిర్మాత ఎ. దయాకర్ రావు మాట్లాడుతూ, “ఆరు సంవత్సరాల తర్వాత, అనేకమంది కృషి ఫలితంగా మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అభిమానులకు విందు ఇవ్వడానికి వస్తోంది. జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రం.. అభిమానులకు పెద్ద ఉత్సాహాన్ని, అంతకంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది. మేము కష్టపడి తీశాము. ఇక ఆదరించాల్సిన బాధ్యత అభిమానులపైనే ఉంది. ట్రైలర్ చూశారు కదా. దానికి ఎన్నో రెట్లు సినిమా ఉండబోతుంది. అభిమానులు ఇదే ఉత్సాహంతో సినిమాకి ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు టైటిల్ పెట్టిన క్రిష్ గారికి ముందుగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారు. ఔరంగజేబు అంటే పవర్ ఫుల్ మొఘల్ కింగ్. అంత పవర్ ఫుల్ రూలర్ కి ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన అనారోగ్యంతో 1680లో చనిపోయారు. ‘హరి హర వీరమల్లు’ కథ 1684లో స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి శివాజీ చివరి కోరిక ఏంటంటే.. మొఘల్స్ నుంచి జ్యోతిర్లింగాలు కాపాడాలని, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కాపాడాలని. ఆయన మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే వీరమల్లు. ప్రతి శతాబ్దానికి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. ఈ శతాబ్దానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్ డిజైన్ చేశారు. దానిని చూసి ఈ కథని ధర్మం కోసం జరిగే యుద్ధంగా మలిచాము. ఆ ఫైట్ ని త్రివిక్రమ్ గారికి చూపిస్తే ఎంతగానో ప్రశంసించారు. మా నాన్న ఎ.ఎం. రత్నం గారి గురించి చెప్పాలంటే.. అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదించి ఇస్తారు, మాకు మా నాన్న మంచి సంపాదించి ఇచ్చారు. ఆ పేరు వల్లే ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి.. రెండు గంటలు నీ గురించి మాట్లాడుతూ అభినందించారు’ అని త్రివిక్రమ్ గారు చెప్పారు. ఆ మాట విని నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాకు ఈ అవకాశమిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.” అన్నారు.

చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు ఒక ఎమోషనల్ డే లాగా ఉంది. ఎందుకంటే, ఈరోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమానిని. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎ.ఎం. రత్నం గారికి మనస్ఫూరిగా సెల్యూట్ చేస్తున్నాను. ఆయనలా సినిమాని ఎవరూ మోయలేరు అనిపిస్తుంది. రత్నం గారి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘ఈసారి డేట్ మారదు, రికార్డులు మారతాయి” అని జ్యోతికృష్ణ గారు చెబుతుంటారు. ఆయన మాట నిజం కావాలని ప్రార్థిస్తున్నాను. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. మనోజ్ పరమహంస గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

 

“Hari Hara Veera Mallu is a subject very close to my heart.”

– Power Star Pawan Kalyan at the Pre-Release Event

 

 Grand Pre-Release Event of ‘Hari Hara Veera Mallu’ Held in Hyderabad

Hari Hara Veera Mallu, starring Power Star Pawan Kalyan in the role of a warrior who fights for Dharma, is one of the most awaited films for fans and cinema lovers across the country. Produced by A. Dayakar Rao under the Mega Surya Productions banner, presented by renowned producer A.M. Ratnam, this big-budget period drama is directed by A.M. Jyothi Krishna and Krish Jagarlamudi. The film also stars Nidhhi Agerwal and Bobby Deol in pivotal roles. Slated to release worldwide on July 24, 2025, expectations for the film are sky-high.

The already released promotional material and songs have received excellent response, especially the trailer which has doubled the buzz.

On the evening of July 21st, the team organized a grand pre-release event at Shilpakala Vedika, Hyderabad, amidst fanfare and celebration. The event was graced by prominent personalities from the film, political, and business worlds.

Pawan Kalyan’s Speech Highlights:

Pawan Kalyan said:

“Though we planned a massive event with lakhs of fans, due to rains and other logistical concerns, we had to scale it down. This decision was taken keeping fans’ safety in mind. I extend my thanks to CM Revanth Reddy garu, Cinematography Minister Komatireddy Venkat Reddy, DGP Jitender garu, and Cyberabad Commissioner Avinash for giving permissions for this event.

I earned fan love through cinema and now friendships through politics — like Eshwar Khandre garu who made time to attend this event. I thank him, Kandula Durgesh garu, and Raghurama Krishnam Raju garu for joining us.

Two years ago during Bheemla Nayak release, when ticket rates were unfairly reduced, I said one thing — ‘Who can stop us?’ I was never in it for records or money.

I didn’t even dream of becoming an actor. I simply wanted to live as an ordinary man. It’s my fans who made me what I am. No weapons, no gangs — only hearts full of love.

I’ve completed 29 years in cinema. I’ve seen big hits… and big flops like Johnny. That failure taught me how monetary relationships dominate this field. But I always believed that I had fans who loved me beyond success.

This film was made with great struggle. Despite all my fame and connections, we had to earn money to make this movie. A.M. Ratnam garu, who once produced Khushi, came forward to do this again.

Trivikram garu stood by me during my failures and made Jalsa with me. He is a true friend.

I know fans may not like remakes, but I had to do them for financial stability — to support my family and political activities.

I’ve always had a deep love for the country and society. When I wanted to make a meaningful film, it was this one through A.M. Ratnam garu. Initially, he suggested a remake, but Krish garu came up with this idea.

Keeravaani garu, who made us all proud with Naatu Naatu, gave phenomenal music for this film. Even while grieving his father’s loss, he composed brilliant background music.

Jyothi Krishna garu, who trained in filmmaking in London, has handled this film exceptionally well. He brought his father’s vision to life.

Even as a minister, I dedicated 2 hours every day to this film’s shoot. Jyothi Krishna and DOP Manoj Paramahamsa planned everything perfectly.

Congratulations to Nidhhi Agerwal who carried promotions on her shoulders. Bobby Deol has done brilliantly as Aurangzeb.

This subject is very dear to me. Our history often glorifies invaders like Mughals but not their oppression. During Aurangzeb’s rule, Hindus were forced to pay tax to follow their faith.

Shivaji stood for Dharma. Through the fictional character of Veera Mallu, we are showing what an ordinary man could’ve done during those times.

The Kohinoor diamond, once found in Koti Lingala on the banks of Krishna river, passed through many hands to end up in London. When Krish narrated this backdrop, I was instantly hooked.

We’ve put our best efforts into this. I choreographed the 18-minute climax using my martial arts experience. I hope you all love it.”

Karnataka Forest Minister Eshwar Khandre:

“Pawan Kalyan has fans not just in Telugu states but all over India — even in Karnataka. He’s not only a great actor but a great human being, committed to public service.

I wish the film becomes a massive success.”

AP Cinematography Minister Kandula Durgesh:

“With a massive fan base and relentless work for the poor, Pawan Kalyan garu is a leader who practices what he preaches.

This film’s theme will ignite patriotism and nationalism in youth. My best wishes to the whole team.”

Deputy Speaker Raghurama Krishnam Raju:

“In this film, we’ll witness what Veera Mallu did to realize Shivaji’s dream.

Pawan Kalyan garu is an emotion.

A.M. Ratnam garu is a brave producer.

All the best to the entire team!”

Actor Brahmanandam:

“Pawan Kalyan garu is a man filled with humanity. I’ve known him since he was 17.

He never walked the easy path. He chose his own way — full of thorns and hardships.

He is a self-made man. Destiny leads him.

He rose not because of circumstances but in spite of them.

The quote ‘Your birth is yours, your death is yours… but your life belongs to the nation’ suits him perfectly.”

 

Producer A.M. Ratnam:

“I’ve produced many films, but this is special.

It’s the first film releasing after Pawan Kalyan garu became Deputy CM.

Also, it’s his first historical and pan-India film. I take pride in that.

This film will entertain and also make you think.

You’ll witness his full power on screen. We’re confident it’ll be a blockbuster.”

Producer A. Dayakar Rao:

“After 6 years of hard work, Hari Hara Veera Mallu is finally releasing.

We made it with all our heart. Now it’s time for fans to take it to the next level.

If the trailer excited you, the film will do even more!”

Director Jyothi Krishna:

“Thanks to Krish garu for giving us the title.

Bobby Deol plays Aurangzeb, a powerful Mughal ruler.

Our story begins in 1684, four years after Shivaji’s death.

Shivaji’s last wish was to protect the Jyotirlingas and Kashi Vishwanath temple.

Veera Mallu’s character represents that fight.

Every century gives birth to a Shivaji. In this century, we have Pawan Kalyan garu.

A single fight scene designed by Pawan garu inspired the entire concept of Dharma vs. tyranny.

Trivikram garu appreciated that scene deeply.

My father A.M. Ratnam gave us not just property but legacy.

Thanks to him, I got this opportunity.

Trivikram garu once told me, ‘Pawan Kalyan garu watched your film and spoke about you for 2 hours.’

That moved me to tears.

I promise this film will make all his fans proud.”

Actress Nidhhi Agerwal:

“Today is very emotional for me. I waited so long for this day.

I’m a die-hard fan of Pawan Kalyan garu, and acting with him is a dream come true.

This will stay in my heart forever.

Hats off to A.M. Ratnam garu — no one else could’ve carried this film like him.

As Jyothi Krishna garu says, ‘This time the date won’t change, only records will.’

I pray that comes true.

Keeravaani garu gave magical music.

I wish to do many more films with Manoj Paramahamsa garu.”

 

To the film industry that fed me, and to the producer who believed in me I will always stand by them – Power Star Pawan Kalyan at the Hari Hara Veera Mallu Press Meet

నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నన్ను నమ్మిన నిర్మాతకు నేను అండగా ఉంటాను : ‘హరి హర వీరమల్లు’ ప్రెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం. రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా చిత్రం బృందం ఘనంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మీడియా మిత్రులతో రాజకీయాల పరంగా చర్చించాను కానీ, ఇలా ఒక సినిమా కోసం పెద్దగా మాట్లాడలేదు. సినిమాకి సంబంధించి మాట్లాడటానికి నేను మొహమాటపడతాను. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అనుకోకుండా నటుడిని, సాంకేతిక నిపుణుడిని అయ్యాను. సినిమా గురించి మీడియాతో మాట్లాడకపోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఎ.ఎం. రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే.. ఈవెంట్ తర్వాత మళ్ళీ మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం రాదేమో అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అజ్ఞాతవాసి సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక మాట రాశారు. “ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది”. అలాంటిది ఒక సినిమా చేయడమంటే ఎన్ని యుద్ధాలు చేయాలి. ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. నేను సినిమాల్లోకి రాకముందు ఎ.ఎం. రత్నం గారి లాంటి వ్యక్తి నా నిర్మాత అయితే బాగుండు అనుకునేవాడిని. ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేసి, స్ట్రయిట్ సినిమాల స్థాయిలో ఆడించి సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. క్రియేటివ్ గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఏం చేసినా, ఎన్ని ఎదురైనా సినిమా బాగా రావాలని అనుకుంటాం. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎ.ఎం. రత్నం గారి తపన చూశాను. ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయి.. దర్శకత్వానికి, క్రియేటివ్ పార్ట్ కి దూరమైన తర్వాత.. నా ప్రధాన దృష్టి రాజకీయాలపై ఉన్న సమయంలో.. నా దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు సినిమా చేయాలని అడిగినప్పుడు నా బెస్ట్ ఇచ్చాను నేను. ప్రస్తుతం నేను టైం ఇవ్వలేను. అలాంటిది నేను ఒక్క క్లైమాక్స్ కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మే నెలలో మండుటెండలో షూట్ చేశాము. నేను ఎప్పుడో దేశ విదేశాల్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాకి పనికొచ్చాయి. కొరియోగ్రాఫర్స్ తో కూర్చొని క్లైమాక్స్ ను ప్రత్యేకంగా రూపొందించాము. సినిమాకి ఇదే ఆయువుపట్టు. సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో జరిగే కథ ఉంది. దీనికి పునాది వేసింది క్రిష్ జాగర్లమూడి గారు. ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. ఆయన, రత్నం గారు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నచ్చి వెంటనే ఓకే చేశాను. అయితే కరోనా అనేది సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. నేను ఎ.ఎం. రత్నం గారిని దగ్గరనుండి చూశాను. ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. ఖుషి సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది. ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు.. మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. కొన్ని కారణాల వల్ల క్రిష్ గారు ఈ సినిమా పూర్తి చేయలేకపోయినప్పటికీ.. ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాకి పునాది వేసిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయనతో మాట్లాడుతుంటే సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించింది. ఈ సినిమా అసలు పూర్తవుతుందా లేదా అని మాటలు వినిపిస్తున్న సమయంలో.. మాకు ప్రాణవాయువు ఇచ్చిన వ్యక్తి కీరవాణి గారు. నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప.. సినిమా గురించి పెద్దగా మాట్లాడను. కానీ, ఈ సినిమాకి మాట్లాడటం అవసరం అనిపించింది. నిర్మాతలు కనుమరుగు అవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్ వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. ఇక్కడ ఎందరో మీడియా మిత్రులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం గారి లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని.. ఈ సినిమాని నేను నా భుజాలపైకి తీసుకున్నాను. రత్నం గారు, జ్యోతికృష్ణ గారు, మనోజ్ పరమహంస గారు నిద్రలు మానుకొని మరీ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అలాగే నిధి అగర్వాల్ సినిమా ప్రమోషన్ బాధ్యతను తీసుకున్నారు. ఈ సినిమా అనాధ కాదు.. నేనున్నాను అని చెప్పడానికి వచ్చాను ఈరోజు. కోట్లాది మంది ప్రజలకు అండగా ఉండేవాడిని, దేశంలో ఉన్న సమస్యలకు స్పందించేవాడిని.. అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను. ఒక చిన్న మేకప్ మ్యాన్ స్టార్ట్ అయ్యి.. దర్శకుడిగా, రచయితగా, నిర్మతగా అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు రత్నం గారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన మౌనంగా ఉంటారు. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా.. ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. అందుకే సినీ పరిశ్రమ అంటే నాకు అంత గౌరవం. సినిమా చేయడం అనేది ఒక యజ్ఞం లాంటిది. డబ్బులు మిగులుతాయో లేదో కూడా తెలీదు. రత్నం గారు మంచితనం గురించి, ఆయన చేసిన మంచి సినిమా గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేశారు. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ ని ఎలా చేయబోతున్నామో జ్యోతికృష్ణ ముందే ప్రీ విజువలైజ్ చూపించారు. ఆయన సత్తా ఉన్న దర్శకుడు. సాంకేతిక విభాగాల మీద మంచి పట్టుంది. అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడయ్యారు. రత్నం గారి అనుభవంతో వీరిద్దరూ కలిసి సినిమాని గొప్పగా మలిచారు. నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు పరిశ్రమకు అండగా ఉన్న నిర్మాత రత్నం గారి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం గారి పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించాను. నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఓ మంచి అనుభూతిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమా అనేది మా జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపించాలి. అలాంటి ప్రభావాన్ని, ఎనర్జీని ఇచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారిని కలవాలని మీడియా వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ కి రావడం మనసుకి ఆనందాన్ని కలిగించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసిన ఒక ఫైట్ ఉంది. ఆ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ లోనే ఒక కథ ఉంటుంది. ఆ ఒక్క ఎపిసోడ్ కి కీరవాణి గారికి సంగీతం చేయడానికి పది రోజులు పట్టింది. ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే.. పవన్ గారు చూసే వీరమల్లు వేరే. పవన్ గారు అనుకున్న సినిమా వేరే. ఆయనలో ఉన్న ఫైర్ లో నుంచి డిజైన్ చేసిందే ‘ధర్మం కోసం యుద్ధం’. 17వ శతాబ్దం మొఘల్స్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది. ఆ సమయంలో ఔరంగజేబుకి, వీరమల్లు అనే కల్పిత పాత్రకి మధ్య జరిగే యుద్ధం లాంటిది ఈ సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఈ సినిమా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి నేను ఒక్క సెకను కూడా విశ్రాంతి తీసుకోలేదు. మా నాన్న ఎ.ఎం.రత్నం గారి కసి, పవన్ గారి కళ్ళలోని ఫైర్.. నన్ను అలా అవిశ్రాంతంగా పనిచేసేలా చేశాయి. నాతో పాటు నా టీం అంతా నిద్ర కూడా మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కీరవాణి గారు, మనోజ్ పరమహంస గారి సపోర్ట్ ను మర్చిపోలేను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తెరమీద ఎలా చూడాలని ఎదురుచూస్తున్నామో.. ఆ కోరిక హరి హర వీరమల్లుతో నెరవేరనుంది. జూలై 24న అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. హరి హర వీరమల్లు అనేది నా సినీ జీవితంలో ప్రత్యేకమైన చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎ.ఎం.రత్నం గారికి ధన్యవాదాలు. జ్యోతి కృష్ణ గారు ఈ సినిమాని గొప్పగా మలిచారు. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

To the film industry that fed me, and to the producer who believed in me I will always stand by them – Power Star Pawan Kalyan at the Hari Hara Veera Mallu Press Meet

Pawan Kalyan garu stated that Mr. A.M. Ratnam is the man who elevated regional cinema to a national level.

Hari Hara Veera Mallu, one of the most awaited films by fans and cinephiles alike, features Pawan Kalyan garu in the powerful role of a warrior who fights for Dharma. Presented by the legendary producer A.M. Ratnam under Mega Surya Productions and produced by A. Dayakar Rao, this periodical drama is co-directed by A.M. Jyothi Krishna and Krish Jagarlamudi. The film also stars Nidhhi Agerwal and Bobby Deol in key roles and is set for a grand release on July 24. With massive expectations already riding on it, the promotional content — especially the trailer — has received an overwhelming response.

Power Star Pawan Kalyan’s Words at the Press Meet:
“I’ve spoken to the media before, mostly on political matters. Rarely have I spoken so openly about a film. Honestly, I’m not great at promoting movies — I just know how to do the work. Talking about it never came naturally to me. I never imagined I’d become an actor or technician. My hesitation to speak about films isn’t pride or ego — it’s just discomfort.
But today, I arranged this press meet only for A.M. Ratnam garu. This film must live. We’re doing this press interaction before the evening pre-release event because I may not get another chance.
There’s a dialogue from Agnyaathavaasi written by Trivikram garu:
‘Sometimes, you must fight an entire war for a small comfort.’
That’s what making a movie feels like — financial battles, creative challenges.
Before I entered the industry, I used to dream of working with someone like A.M. Ratnam garu. He was the one who brought regional cinema to national recognition. He distributed Tamil films in Telugu and made them perform like straight films. He elevated the creative potential of the film industry
.
This film went through many ups and downs — two waves of COVID, and creative hurdles. But I saw Ratnam garu’s passion throughout. Even when I moved into politics, he approached me and asked me to do this film. I gave it my best.
I couldn’t spare much time, yet I shot the climax for almost 57 days, in peak summer. The martial arts I once learned overseas finally came in handy. I worked closely with the choreographers and specially designed the climax. It’s the soul of the film.

In essence, the film explores a fictional journey of the Kohinoor diamond from Koti Lingala on the banks of River Krishna to the Hyderabad Sultans.
Krish Jagarlamudi garu laid the foundation for this concept, and I immediately liked it.
The pandemic hit us hard. I saw Ratnam garu struggle. He once had producers, distributors, directors, and stars chasing after him. During Kushi, we had pre-production completed a month in advance all thanks to him.
Seeing such a person struggle was painful. This isn’t about money or success. It’s about standing by your people and your industry.

Though Krish garu couldn’t complete the film due to circumstances, I thank him wholeheartedly for giving life to this concept.
During Kushi, Jyothi Krishna was learning filmmaking in London. From our conversations, I knew he was a sensible director.
At a time when people were doubting if this film would ever get completed, M.M. Keeravaani garu breathed life into it.
I usually don’t speak about films. I just focus on quality. But for this film, I had to.
In an era where producers are slowly vanishing, Ratnam garu stood firm. I left behind a packed political schedule and came here, even while being criticized by my opponents, because this industry fed me.

I personally know many of the media friends here today. I have immense respect for cinema.
I took this film on my shoulders because I didn’t want Ratnam garu to suffer.
Ratnam garu, Jyothi Krishna garu, and Manoj Paramahamsa garu sacrificed their sleep for this film. So did Nidhhi Agerwal, who took on the promotion responsibilities.
I’m here to say this film is not abandoned. I am here.
If I can stand up for millions of people and react to national issues, why wouldn’t I stand up for my own film?
A.M. Ratnam garu, who started as a small makeup artist, grew into a writer, director, and producer — facing all hardships silently.

Cinema has no boundaries — caste, religion, or region don’t matter. That’s why I respect it deeply.
Making a film is like performing a yagna.

I recommended Ratnam garu’s name as Chairman of the Film Development Corporation to CM Chandrababu Naidu — not because he’s my producer, but because he’s a true asset to the industry.

I believe this film will offer the audience a powerful emotional experience. That’s what cinema should do — leave an impact, stir energy.”

Director Jyothi Krishna:
“The media has waited so long to hear from Pawan Kalyan garu. His presence today is truly heartening.
He choreographed one major action episode in the film — a 20-minute fight sequence that tells a story in itself. It took Keeravaani garu 10 days just to compose for that episode.
That’s when I realized — the Veeramallu Pawan Kalyan garu envisioned was far more intense than what we imagined.
This film is set in the 17th century, against the backdrop of the Mughals — particularly a fictional war between Aurangzeb and Veeramallu.
Ever since I took on this film, I haven’t taken a day off. My father A.M. Ratnam garu’s determination and the fire in Pawan garu’s eyes kept me going.
My entire team worked day and night. I’m thankful to Keeravaani garu and Manoj Paramahamsa for their support.
The dream of seeing Power Star on screen in a role like this will come true with Hari Hara Veera Mallu.
I hope families go and experience this film on July 24.”

Actress Nidhhi Agerwal:
“It’s an honour to work with Pawan Kalyan garu.
Hari Hara Veera Mallu is a very special film in my career.
I thank A.M. Ratnam garu for giving me this opportunity, and Jyothi Krishna garu for shaping the film beautifully.
I hope you all love it as much as we loved making it.

 GANI7595 GANI7608 GANI7609

A.M. Rathnam Shares His Vision and Passion Behind Hari Hara Veera Mallu Ahead of Its Grand Release

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప చిత్రం ‘హరి హర వీరమల్లు’ : ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు. అలాగే తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన లెజండరీ నిర్మాత ఎ.ఎం. రత్నం.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

 

హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది?

17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది. హరి హర వీరమల్లు పేరు పెట్టడానికి కారణం ఏంటంటే.. హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక. అలాగే వీరుడిని సూచించేలా వీరమల్లు అని పెట్టాము.

 

హరి హర వీరమల్లు ప్రయాణం గురించి చెప్పండి?

నేను ‘భారతీయుడు’ సహా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించాను. అయితే నా సినీ జీవితంలో ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసిన సినిమా ఇదే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చినంత మాత్రాన వెంటనే పూర్తి చేయగలిగే సాధారణ చిత్రం కాదు. అత్యంత భారీ చిత్రం. సెట్స్, గ్రాఫిక్స్ తో ముడిపడిన చారిత్రక కథ. అందుకే ఆలస్యమైంది. బాగా ఆలస్యమవవడంతో సినిమా ఎలా ఉంటుందోననే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. అయితే ట్రైలర్ తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. నేను నిర్మించిన సినిమాల్లో 90 శాతానికి పైగా విజయం సాధించాయి. ఆ అనుభవంతో చెప్తున్నాను.. హరి హర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

 

సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని ముందే అనుకున్నారా?

మొదట రెండు భాగాలని అనుకోలేదు. సినిమా అనేది వినోదంతో పాటు, సందేశాన్ని అందించాలనేది నా భావన. నేను రూపొందించిన ఎక్కువ శాతం సినిమాలు అలాగే ఉంటాయి. వీరమల్లు అనేది చారిత్రక నేపథ్యమున్న కథ. ఇలాంటి గొప్ప కథలో సందేశం ఉంటే.. ఎక్కువమందికి చేరువ అవుతుందని భావించాము. అలా చర్చల్లో కథ స్పాన్ పెరిగింది.

 

తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారా?

జూలై 24 తెల్లవారుజాము నుంచి షోలు వేయాలని మేము భావించాము. కానీ అభిమానులు ముందురోజు రాత్రి నుంచే షోలు వేయాలని కోరుతున్నారు. వారి కోరిక మేరకు జూలై 23 రాత్రి నుంచి షోలు వేసే ఆలోచనలో ఉన్నాము.

 

పవన్ కళ్యాణ్ గారితో మీ అనుబంధం గురించి?

ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల  అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. ఓ నటుడిగా కంటే కూడా మంచి ఆశయాలున్న మనిషిగా ఆయన నాకు ఎక్కువ ఇష్టం. సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఖుషి సమయంలో ఆయన ఆలోచన విధానం చూసి ఆశ్చర్యపోయాను. అది ప్రేమ కథా చిత్రం అయినప్పటికీ.. ఓ సన్నివేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పారు. అలాగే ఒక పాటలో దేశభక్తిని చాటుకున్నారు. సినిమాల్లో చూపించే ఇలాంటి విషయాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తాయి. హరి హర వీరమల్లు కూడా విజయవంతమైన చిత్రంగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తుంది.

 

పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. ఆ ఒత్తిడి ఏమైనా మీపై ఉందా?

ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని మేము బాధ్యతగా భావించి, మరింత శ్రద్ధగా సినిమాని రూపొందించాము. పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. అలాగే పవన్ గారి అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను.. ఈ సినిమా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.

 

సినిమా ఆలస్యమైంది కదా.. పవన్ కళ్యాణ్ గారి సహకారం ఎలా ఉంది?

పవన్ కళ్యాణ్ గారి సహకారం లేకుండా ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడం సాధ్యం కాదు. పవన్ గారంటే నాకెంత ఇష్టమో.. అలాగే నేనంటే కూడా ఆయనకి ఇష్టం. మేకర్ గా నన్ను గౌరవిస్తారు. పవన్ గారు పూర్తి సహకారం అందించారు కాబట్టే.. ఈ సినిమా ఇంత గొప్పగా తీయగలిగాము. అలాగే టీం అందరూ ఎంతో సహకరించారు. అందరం కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశాము.

 

మీ కుమారుడు జ్యోతికృష్ణ గారి గురించి?

మా అబ్బాయి అని చెప్పడం కాదు కానీ, జ్యోతికృష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాను. మేమందరం చూడని ఓ కొత్త కోణంలో ఈ కథని చూశాడు. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియన్ జోన్స్ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు. సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించాడు. జ్యోతికృష్ణ పనితీరు చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు.

 

A.M. Rathnam Shares His Vision and Passion Behind Hari Hara Veera Mallu Ahead of Its Grand Release

As Hari Hara Veera Mallu inches closer to its highly anticipated release on July 24th, veteran producer A.M. Rathnam sat down with print and web media to share his thoughts, memories, and insights from the long journey of making this period action epic.

Speaking about the buzz surrounding the film, Rathnam garu revealed the exciting plans the team is working on for fans across the Telugu states:

“We’re planning to organize paid premieres for Hari Hara Veera Mallu. Once we receive the necessary permissions, we’re hoping to announce 9:00 PM shows on July 23rd night.”

He also addressed the widespread belief that the film has taken an unusually long time to complete, setting the record straight with clarity and honesty:

“Hari Hara Veera Mallu didn’t take too many shoot days. It’s just that the time period and the scale of the story required more effort. That’s what took time — not the number of shooting days.”

When asked about the story’s origins and whether it’s based on a real historical figure, Rathnam was quick to clarify the film’s fictional nature:

“This is not the story of any particular historical figure. Hari Hara Veera Mallu is a completely imagined tale set against the backdrop of the 17th century. It’s a creative, historical fiction — not a biopic.”

The passion in Rathnam’s voice was unmistakable as he spoke about what the audience can expect after watching the film:

“After watching this movie, I’m confident that everyone will say one thing:

‘Rathnam, you’ve made a fine film — well done!’

That’s the kind of impact we believe this film will have.”

Backed by a powerful team, Hari Hara Veera Mallu is directed by Jyothi Krishna, presented by A.M. Rathnam, and produced by A. Dayakar Rao under Mega Surya Productions, with music composed by M.M. Keeravani.

The film stars Power Star Pawan Kalyan in the titular role alongside Nidhhi Agerwal and promises a cinematic experience that blends grandeur, emotion, and intense action in equal measure.

With Rathnam’s passion at the helm and the vision of a dedicated crew, Hari Hara Veera Mallu is set to bring a fiery storm to theatres and the countdown to July 24th has officially begun.

GANI7010 GANI7056 GANI7016

Nidhhi Agerwal Opens Up About Her Role in Hari Hara Veera Mallu Ahead of the Grand Release

‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటించడం నా అదృష్టం: కథానాయిక నిధి అగర్వాల్

‘హరి హర వీరమల్లు’ చిత్రం అద్భుతంగా ఉంటుంది: కథానాయిక నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన కథానాయిక నిధి అగర్వాల్.. సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
హరి హర వీరమల్లు అనేది ఒక భారీ చిత్రం. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. అలాగే నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు.

పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్డం ఉంది, ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ అవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది.

ఇద్దరు దర్శకులు క్రిష్ గారు, జ్యోతి కృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది?
క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకొని.. ఈ తరానికి తగ్గట్టుగా పని చేస్తారు.

ఎ.ఎం. రత్నం గారి గురించి?
ఎ.ఎం. రత్నం గారు గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు. రత్నం గారికి హ్యాట్సాఫ్.

ట్రైలర్ కి వచ్చిన స్పందన ఎలా అనిపించింది?
ట్రైలర్ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేసింది. మేము ఊహించిన దానికంటే ట్రైలర్ కి ఇంకా అద్భుతమైన స్పందన లభించింది.

హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారితో, రాజాసాబ్ లో ప్రభాస్ గారితో కలిసి నటించడం ఎలా ఉంది?
ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత హంబుల్ గా ఉంటారేమో అని వారిద్దరినీ చూస్తే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు. పాత్రలో సులభంగా ఒదిగిపోతారు. ప్రభాస్ గారు చాలా మంచి మనిషి. అందరూ చెప్పినట్టుగానే ఆయన నిజంగానే డార్లింగ్.

పంచమి పాత్ర గురించి చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
క్రిష్ గారు కలిసి నా పాత్ర గురించి, కథ గురించి వివరించారు. ఆయన చెప్తున్నప్పుడే ఈ సినిమా చేయాలనుకున్నాను. ఎందుకంటే భారీ సినిమా, పవన్ కళ్యాణ్ గారితో నటించే అవకాశం, రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా.. మంచి పాత్ర కూడా దక్కింది.

హరి హర వీరమల్లులో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సన్నివేశం?
భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయం ఛాలెంజింగ్ గా అనిపించింది.

కీరవాణి గారి సంగీతం గురించి?
పీరియడ్ సినిమాలకు కీరవాణి గారు పెట్టింది పేరు. పైగా ఆస్కార్ విజేత. వీరమల్లుకి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో తార తార, కొల్లగొట్టినాదిరో గీతాలు నాకు బాగా నచ్చాయి.

హరి హర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది?
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ లాగా ఈ సినిమా ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారితో సహా టీం అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. అందరం కలిసి ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారని నమ్మకం ఉంది.

Nidhhi Agerwal Opens Up About Her Role in Hari Hara Veera Mallu Ahead of the Grand Release

As the anticipation for Hari Hara Veera Mallu reaches a fever pitch, actress Nidhhi Agerwal shared her experiences and excitement in an exclusive interaction with print and web media. With the epic period action drama set to hit theatres on July 24th, the actress opened up about her powerful role, the film’s scale, and working alongside Power Star Pawan Kalyan.

“I absolutely loved this character. Getting a role like this in a big film is always a blessing. It comes with so many shades. If you look at ‘Kollagottinadhiro’ and ‘Tara Tara’, they’re completely contrasting from each other — and that’s the beauty of it,” Nidhhi shared.
Donning the character of Panchami, Nidhhi revealed the immense effort that went into her transformation.

“The costume and jewellery credits go to the stylists — they worked so hard. It used to take me nearly two hours every day to get into the Panchami look. Every detail, no matter how small, was taken care of with great care and precision.”
When asked about working with Pawan Kalyan, she was visibly emotional.

“I feel privileged to work with Pawan Kalyan Garu. His stardom is truly unmatched. Doing a hundred films is equal to doing just one with him.”
She also highlighted the soul of the film.

“‘Sword vs Spirit’ is the perfect tagline for Part 1. It clearly defines what the film is all about — a war of ideals, faith, and identity.”
Apart from intense performances, Nidhhi also trained hard for the action.

“I’ve been part of a few fight sequences and also learned horse riding and Bharatanatyam specifically for this film. It pushed me as a performer in every way.”
Recollecting her very first day on set, Nidhhi said:

“The song ‘Kollagottinadhiro’ was shot on a real set and it was my first day. From the moment I stepped in, I could feel the scale and seriousness of this film.”
She emphasized how confident and committed the entire crew was.

“I have the most combination scenes with Pawan Kalyan Garu and several others. Every artist and technician gave their best — you’ll see it on screen.”
Speaking about the film’s fictional roots within a real historical timeline, she said:

“Veera Mallu is a fictional character placed in a real era — just like how we could create a story during COVID with imaginary characters. It’s the Indian version of Indiana Jones with royal intensity.”
And of course, the music:

“The periodic genre is Keeravani Garu’s forte. He’s an Oscar winner for a reason. The background score in this film is going to elevate every scene. ‘Tara Tara’ and ‘Kollagottinadhiro’ are my songs, and they’re both very close to my heart.”
Directed by Jyothi Krishna, with music composed by M.M. Keeravani, Hari Hara Veera Mallu is presented by A.M. Rathnam and produced by A. Dayakar Rao under Mega Surya Productions.

The countdown to July 24th has truly begun — and with Nidhhi Agerwal promising both grace and grit, expectations are sky-high for Hari Hara Veera Mallu to be a cinematic spectacle.

GANI6727 GANI6675 GANI6798 GANI6740 GANI6693 (1) GANI6693

Anna Antene from #Kingdom – An Emotional Anthem That Strikes Straight at the Heart

కింగ్‌డమ్’ చిత్రం నుంచి హృదయాన్ని తాకే భావోద్వేగ గీతం ‘అన్న అంటేనే’ విడుదల

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘హృదయం లోపల’ గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం ‘అన్న అంటేనే’ విడుదలైంది.

‘కింగ్‌డమ్’ నుంచి ‘అన్న అంటేనే’ గీతాన్ని బుధవారం(జూలై 16) సాయంత్రం విడుదల చేశారు నిర్మాతలు. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రుతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. ‘కింగ్‌డమ్’ కోసం ఈ భావోద్వేగ గీతాన్ని స్వరపరిచారు. ఈ అద్భుతమైన గీతం హృదయాలను హత్తుకునేలా ఉంది.

సోదరభావానికి ఒక వేడుకలా ‘అన్న అంటేనే’ గీతముంది. వినోదాన్ని అందించే పాటలు ఎన్నో ఉంటాయి. కానీ, బంధాలను గుర్తుచేసే పాటలు, మనసుని తాకే పాటలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన గీతమే ‘అన్న అంటేనే’.

సోదరులుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కొత్తగా కనిపిస్తున్నారు. నిజ జీవితంలో అన్నదమ్ముల్లాగా తెరపై కనిపిస్తున్నారు. ఇద్దరూ తమదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటలోని భావోద్వేగ లోతుని చక్కగా పండించారు. ఈ గీతం తోబుట్టువుల ప్రేమకు పరిపూర్ణమైన నివాళిలా ఉంది.

‘అన్న అంటేనే’ గీతాన్ని అనిరుధ్ స్వరపరచడంతో పాటు ఆలపించడం విశేషం. తనదైన సంగీతంతో, గాత్రంతో అనిరుధ్ మరోసారి కట్టిపడేశారు. వరుస బ్లాక్‌బస్టర్‌ గీతాలను అందిస్తూ, పాట పాటకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న అనిరుధ్.. ఇప్పుడు ఈ భావోద్వేగ గీతంతో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అందరినీ కదిలించేలా ఉంది.

ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలను పెంచుతూనే ఉంది. తాజాగా విడుదలైన ‘అన్న అంటేనే’ గీతం దర్శకుడి బలమైన భావోద్వేగ దృష్టిని ప్రతిబింబిస్తుంది.

‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్


 Anna Antene from #Kingdom – An Emotional Anthem That Strikes Straight at the Heart
The makers of Kingdom have released their second single #AnnaAntene and it’s safe to say this one’s a soul stirrer. After setting the charts on fire with high energy anthems Anirudh Ravichander is back with a deeply emotional track that instantly tugs at your heartstrings.

It’s a celebration of brotherhood. There are many songs that entertain but very few that make you pause, reflect and feel the strength of your own bonds. #AnnaAntene does just that.

The visuals between Vijay Deverakonda and Satyadev looks refreshing. Their chemistry and screen presence together deliver a genuine emotional punch that enhances the song’s enhancement. It’s a perfect tribute to sibling love one that’s relatable and real.

The song is sung and composed by Anirudh who once again proves why he’s in a league of his own. With back to back unanimous musical blockbusters, he continues to raise the bar and this track adds a whole new dimension to his emotional spectrum. Lyrics by Krishna Kanth he literally moved us with words that hit hard.

Written & Directed by Gowtam Tinnanuri. Kingdom continues to build anticipation with every new asset and this song reflects the director’s strong emotional vision blending warmth with cinematic scale.

Cinematography by Jomon T. John ISC and Girish Gangadharan ISC and edited by Navin Nooli.

Produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios, Kingdom is gearing up for a grand release and with a song like #AnnaAntene emotional quotient is set. All set to strike the box office on July 31st.

Anna Antene Still Anna Antene_twt 62aa-2 Anna Antene_Promo Trending STILL-2