Aug 27 2025
Aug 27 2025
Kotha Lokah 1: Chandra’ Trailer Unveils India’s First Female-Led Superhero Saga
Aug 26 2025
Mass Jathara Postponed – Makers Promise a Bigger Feast Soon
Aug 16 2025
Priyanka Arul Mohan’s – First looks two posters as ‘Kanmani’ from OG Unveiled
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు. ‘ఓజీ’ రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది. మరో పోస్టర్ ప్రశాంతత మరియు గృహ వాతావరణాన్ని సూచిస్తుంది.
ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ కూడా కట్టిపడేస్తోంది. సుజీత్ యొక్క విస్ఫోటన కథనానికి భావోద్వేగ లోతును, ఆకర్షణను పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ జోడిస్తున్నారు. ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని నిర్మాతలు అభివర్ణించారు.
ఇటీవల విడుదలైన ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్ స్టార్మ్’కు విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రోమో విడుదల కానుంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025లో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులుగా రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: డీవీవీ దానయ్య
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Pawan Kalyan and Priyanka Arul Mohan promises to add emotional depth and charm to Sujeeth’s explosive narrative. The makers describe her role as the calm every storm needs.
After a blasting response to the first song from OG, the makers are now gearing up to release the second single. A promo will be out very soon.
With Pawan Kalyan, Emraan Hashmi, Arjun Das, Prakash Raj, Sriya Reddy, and Priyanka Arul Mohan in pivotal roles, OG is shaping up to be the biggest cinematic event of 2025. The film features music by S Thaman, cinematography by Ravi K Chandran ISC and Manoj Paramahamsa ISC, and editing by Navin Nooli. Produced by DVV Danayya and Kalyan Dasari under DVV Entertainment, and directed by Sujeeth, OG hits theatres worldwide on September 25th, 2025.
They Call Him OG and she is Kanmani.
Aug 15 2025
VENKATESH – TRIVIKRAM | THE MOST MAGICAL COMBO TAKES ITS FIRST STEP TOWARDS AN ENTHRALLING JOURNEY
సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకులలో కూడా వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమా పట్ల ఎంతో ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన కథా శైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేష్ ను చూడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్ పేరుగాంచారు. ఇప్పుడు త్రివిక్రమ్ మరో ఆకర్షణీయమైన, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.
సుప్రసిద్ధ హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇది అరుదైన, మాయాజాల కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. త్రివిక్రమ్ శైలి కథలో వెంకటేష్ ను వెండితెరపై చూడటానికి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
This collaboration has been the talk of the industry for a while and for good reason. Watching Venkatesh step into a character shaped by Trivikram’s unique storytelling arc is an exciting prospect for cinephiles. Known for his impeccable command over family entertainers that brings emotional depth, Trivikram is expected to bring yet another engaging and universally appealing film to the big screens..
Produced by S. Radha Krishna (Chinababu) under the prestigious Haarika & Hassine Creations banner. Film will go on floors soon.
Camera switch on by Suresh Babu added a special moment to the launch event.
With a combination as rare and magical as this, expectations are already sky high. Fans and film lovers alike will be eager to see what unfolds when Venkatesh’s Mark in Trivikram’s signature storytelling on the silver screen.
Follow Us!