Aug 2 2025
Aug 1 2025
After Chartbuster “Kattanduko Janaki,” Mithra Mandali Unveils Fun-Filled Second Single “Swecha Standuu”
‘మిత్ర మండలి’ నుంచి రెండవ గీతం ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదల
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘కత్తందుకో జానకి’ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదలైంది.’మిత్ర మండలి’ నుంచి మొదటి గీతంగా విడుదలైన ‘కత్తందుకో జానకి’ అందరూ సరదాగా పాడుకునేలా ఉండి, సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు రెండవ గీతంగా వచ్చిన ‘స్వేచ్ఛ స్టాండు’ కూడా అంతే సరదాగా ఉంది.ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ పాటకు ఆర్.ఆర్. ధృవన్, విజయేందర్ ఎస్ సంయుక్తంగా సాహిత్యం అందించారు. తేలికైన ఇంగ్లీష్ పదాలతో సరదా సరదాగా ఈ గీత రచన ఉంది. ‘వై దిస్ కొలవెరి’ శైలిలో సాగిన ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం.. ఆ పాట శైలిలోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించేలా ఉంది.
ధనుంజయ్ సీపాన, ఆర్.ఆర్. ధృవన్ ల గానం ఈ పాటను ఉత్సాహభరితంగా మార్చింది. కథానాయిక దృష్టిలో పడటం కోసం కథానాయకులు వచ్చీరాని ఇంగ్లీష్ పదాలతో పాట పడటం భలే సరదాగా ఉంది. ముఖ్యంగా ఈ తరం శ్రోతలకు నచ్చేలా ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం సాగింది.
వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్.జె, కళా దర్శకుడిగా గాంధీ నడికుడికర్ వ్యవహరిస్తున్నారు. పీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.
టీజర్, ‘కత్తందుకో జానకి’ గీతం ఆకట్టుకొని ‘మిత్ర మండలి’ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు ఈ ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం ఆ అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.
‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.
చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Presented by Bunny Vas under BV Works and produced by Sapta Aswa Media Works & Vyra Entertainments, Mithra Mandali stars Priyadarshi, Niharika NM, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, with an ensemble that also includes Vennela Kishore, Satya, and VTV Ganesh.
Technically, the film continues to shine with contributions from:
RR Dhruvan – Music
Siddharth SJ – Cinematography
Peekay – Editing
Gandhi Nadikudikar – Production Design
Shilpa Tanguturu – Costumes
“Swecha Standuu” arrives on the heels of an outstanding reception to the teaser and the foot-tapping Kattanduko Janaki, both of which gave audiences a glimpse into the quirky world of Mithra Mandali.
Produced by Kalyan Manthina, Bhanu Pratapa & Dr. Vijender Reddy Teegala, with Somaraju Penmetsa as Co-Producer and Rajeev Kumar Rama as Executive Producer, the film promises a refreshing cinematic experience laced with humor, relatability, and heart.
Follow Us!