`4 లెట‌ర్స్‌` చిత్రం విజయవంతం కావాలి : విక్టరీ వెంకటేష్

*`4 లెట‌ర్స్‌`  IMG_9226 IMG_9235సెన్సార్ పూర్తి: ఈ నెల 15  న విడుదల 

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక
ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్టీ జర్, ట్రైలర్ ను చూసి చిత్ర కథానాయకుడు,దర్శక, నిర్మాతలను అభినందించి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని “A ‘ సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 15 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్  తెలిపారు.
ఈ సంద‌ర్భంగా…నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు.  క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం అన్నారు.
హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.  చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ `క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత  తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌. `4 లెట‌ర్స్‌`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం“ అన్నారు.
ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.
సాంకేతిక నిపుణులు:
కో డైరెక్ట‌ర్‌:  రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సి.భాస్క‌ర్ రాజు, పాట‌లు:  సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: వ‌ర్మ‌, మ్యూజిక్:  భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌ఫీ:  చిట్టిబాబు.కె
నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్,
క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్.
The youthful entertainer, 4 Letters, produced under the banner of Om Sri Chakra Creations and directed by R. Raghu Raj is set to release on February 15th. The censor formalities have been completed and the movie has received an A certificate. “Victory” Venkatesh garu has seen the teaser and felt delighted. He congratulated the team of 4 Letters and wished them success. The movie stars debut actor, Eswar, as well as debut actresses, Anketa Maharana and Tuya Chakraborthy. The cast also includes Suresh, Posani, Sudha, Kousalya, Annapurnamma, and Satya Krishnan among others. The music director for the film is Bheems Ceciroleo who is known for his mass hits has given upbeat, folk numbers in 4 Letters.  The movie 4 Letters is comedy filled and contains a heartfelt message for college students about their education, love and personal life. Watch 4 Letters in theaters on February 15th.

INTRODUCING – ESWAR
INTRODUCING – TUYA CHAKRABORTHY & ANKETA MAHARANA
KAUSALYA, ANNAPURNA,  SUDHA, SATYA KRISHNAN, VIDYU LEKHA RAMAN
SURESH, POSANI KRISHNA MURALI, KRISHNA BHAGAVAN, GOWTHAM RAJU, ANANTH  VENU, DHANRAJ, TADIVEL, VITTA MAHES
CO-DIRECTOR  RAJASEKHAR MAARISETTY
PRODUCTION CONTROLLER: C. BHASKAR  RAJU
LYRICS – SURESH UPADHYAYA
CHOREOGRAPHY – GANESH
STILLS – ANBU
DESIGNS ESHWAR
ART – VARMA
MUSIC- BHEEMS CICEROLEO
DIRECTOR OF PHOTOGRAPHY – CHITTI BABU. K

PRODUCERS – DOMMARAJU HEMALATHA  ,DOMMARAJU UDAYA KUMAR
STORY, SCREENPLAY, DIALOGUES, EDITING, DIRECTION – R. RAGHURAJ