About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement

సందీప్ కిష‌న్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్‌`

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిష‌న్ చేతిలో హాకీ స్టిక్‌ను ప‌ట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది.
ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ  సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను
నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌A1 xpress  PRE LOOK LOCK A1 xpress  plain still

 Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement
Hero Sundeep Kishan’s upcoming movie is titled ‘A1 Express.’ This is new age sports entertainer and the pre-look poster is released.
Hero Sundeep Kishan is seen holding hockey stick in the pre-look poster and is facing backwards in a stadium.
Dennis Jeevan Kanukolanu is directing ‘A1 Express’ while Hiphop Tamizha is providing music.
The film is being produced by TG Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan and Daya Pannem under People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies banners.
Shooting begins in the 1st week of November.Crew:
Director: Dennis Jeevan Kanukolanu
Producers: TG Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan, Daya Pannem
Banners: People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies
Co-producer: Vivek Kuchibhotla
Music: Hiphop Tamizha

‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం


People Media & aa arts
‘శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్’ చిత్రం
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు  టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.
శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్  ఈ ఏడాది చివరిలో  ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి
Sree vishnu in People Media Factory and Abhishek Agarwal arts next
Popular Tollywood production houses People Media Factory and Abishek Agarwal Arts are joining hands and bankrolling a new project in Telugu. ‘Brochevarevarura’ actor Sree Vishnu has been signed on to play the lead role for the film which will be directed by debutante Hasith Goli. Interestingly, Hasith was part of Sree Vishnu’s previous hits like ‘Mental Madhilo’ and ‘Brochevarevarura’ and worked in the direction team alongside Vivek Athreya.
Producers TG Vishwa Prasad and Abhishek Agarwal are quite elated to join hands for the project which has such elite names. With a soulful story, the shooting of this yet untitled film will go on floors towards the end of the year. Details about the complete cast and crew will be announced by the makers in the near future. The film have Vivek Kuchibhotla and Keerthi Chowdary as co-producers onboard.

‘అల వైకుంఠపురంలో’ ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన’కు 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్.

DSC_4874 DSC01743 DSC02288 DSC02595 MIB_1239 SSS_3639 SSS_3844

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న
‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’   విడుదల అయిన విషయం విదితమే..  ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది.
ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313 లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం.సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం.-

‘అల వైకుంఠపురములో” ని తారలు:
స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

‘అల వైకుంఠపురంలో’ నుండి తొలి గీతం ‘సామజవరగమన’ విడుదల

 

MIB_1239 copy SSS_5388 copy (1)
‘అల వైకుంఠపురంలో’ నుండి తొలి గీతం ‘సామజవరగమన’ విడుదల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’  వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది.
ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని తొలి పాట ‘సామజవరగమన’ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు  రాసిన ఈ పాటలోని లిరిక్స్ అద్భుతంగా ఉండగా.. పాటను పాడిన సిద్ శ్రీరామ్ వాయిస్ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా  సినిమాకు సంగీతం అందించిన తమన్.. పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు  ఈ పాటతో తమ అనుభవాలను పంచుకున్నారు. వాటి వివరాల్లోకి వెళితే….ఈ పాట గురించి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. అల వైకుంఠపురంలో.. ‘అల్లు  అర్జున్’ గారి కి పాటలు చేయాలంటే చాలా కష్టం. చాలా ఆలోచించాలి. బన్నీ డాన్స్ చాలా బాగుంటుంది. తన కొరియోగ్రఫీ ఐడియాలు చాలా గట్టివి. ఇప్పటికే రేసుగుర్రం, సరైనోడు ఇలా బన్నీకి 12పాటలు చేశానని, ఇప్పుడు చేసేది ఇంకా కొత్తగా ఉండాలనే ప్రయత్నం లో  ఈ పాటను రూపొందించినట్లు తమన్ చెప్పారు. త్రివిక్రమ్ సార్, సీతారామశాస్త్రి గారు. వాళ్లతో జర్నీ అంటే మాములు విషయం కాదు. ఎప్పుడూ కూడా ఫస్ట్ డే లా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వారి ఆలోచనలు కొత్తగా ఉంటాయని, అందుకే వాళ్లకు ది బెస్ట్ ఇవ్వాలని అందులో కాంప్రమైజ్ కాలేదని తమన్ అన్నారు.ఇదివరకు చిత్రాలతో పోలిస్తే విభిన్నంగా సంగీతాన్ని అందించినట్లు చెప్పారు. మెలోడీ సాంగ్ అంటే దానికి ఎంతో సాధన చేయాలని, అందుకే ఈ సినిమాకు చాలా కొత్తగా చేశామని, నేచురల్ సౌండ్స్ తో చేశామని, పియానో, వయోలిన్, ఫ్లూట్.. ఇలా లైవ్ సౌండ్స్ పెట్టుకుని లిరిక్స్ కు తగ్గట్టుగా పాటను రూపొందించినట్లు వెల్లడించారు. పాపకు పేరు ఎంత ఇంపార్టెంటో.. లిరిక్స్ అంత ఇంపార్టెంట్ అని అటువంటి అధ్భుతమైన సాహిత్యం  సీతా రామ శాస్త్రి గారు ఇచ్చారని, ఇందులో లిరిక్స్ ది బెస్ట్ అని తమన్ అన్నారు. అలాగే సిద్ శ్రీరామ్ పాటను చాలా బాగా పాడారు. అని ‘సామజవరగమన…’  అనే పదం మొత్తాన్ని కదిలించింది అని తమన్ అన్నారు. ఈ పాట కోసం 70మందికి పైగా పనిచేశారని చెప్పుకొచ్చారు. తనకు ఇటువంటి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ కి, అల్లు  అర్జున్ కి, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంధర్భంగా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మాట్లాడుతూ..  ’అల వైకుంఠపురంలో..’ సినిమాలోని పాట ‘సామజవరగమన..’ చాలా బాగా వచ్చిందని, ఈ పాటకు తమన్ చాలా చక్కగా సంగీతం అందించాడు అని అన్నారు. ఆర్కెస్ట్రా కూడా చాలా కష్టపడిందని అన్నారు. వైరుధ్యంగా.. కుర్రతనం.. తుంటరితనం.. కొంటెతనం ఉండే పాట రాయమని అడిగినప్పుడు కొన్ని క్లాసికల్ పదాలు రాయాలని అనిపించిందని, అందుకే  కొన్ని పదాలను ఇందులో రాసినట్లు చెప్పారు.అటువంటి అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు ధన్యవాదాలు అని తెలిపారు. సామజవరగమన అంటే అమ్మాయి గురించి వర్ణించే పదాలు అని, సామజవరగమన, మల్లెల మాసమా? విరిసిన పింఛమా..? దయలేదా? అసలు అంటూ రాసిన పాట సిద్ధ్ శ్రీరామ్ చాలా బాగా పాడాడని, ఆర్కెస్ట్రా కూడా చాలా బాగా ఏర్పాటు చేశాడు తమన్ అని అన్నారు. బన్నీ ఎటువంటి పాత్రలో అయినా చాలా చక్కగా ఒదిగిపోతాడని, ఓ మధ్యతరగతి కుర్రాడి పాత్రలో ఇందులో కూడా ఎంతో బాగా బన్నీ నటించాడని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అన్నారు.తనకు ఇటువంటి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్, అల్లు అర్జున్, నిర్మాతలు అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) లకు కృతజ్ఞతలన్నారు.’అల వైకుంఠపురములో” ని తారలు:
స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,

పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
Samajavaragamana,the first song from ‘Ala Vaikunthapurramuloo’, releasedTrivikram Srinivas and Allu Arjun have teamed up for the third time for the movie’Ala Vaikunthapurramulo’. Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this Sankranthi release has been riding high on expectations. Having received a thumping response for the first look, title teaser the makers have now released the first song from the movie, ‘Samajavaragamana’.Composed by SS Thaman, ‘Padma Shri’ Sirivennela Seetharama Sastry has penned lyrics for this song. Sid Sriram’s soulful voice perfectly complements the beautiful tune and imaginative lyrics.

SS Thaman said, “Composing a song for Allu Arjun is not an easy task. He is an amazing dancer and I’ve to put in extra effort to compose a tune for him. I’ve already worked with him for ‘Race Gurram’, ‘Sarrainodu’ and I’ve given very different tunes for this movie. Working with Trivikram garu and Seetharama Sastry garu has always been a great learning experience. We have tried natural sounds and live composing for this song. Seetharama Sastry garu’s lyrics will be highlights of this song. Sid Sriram has sung beautifully. More than 70 technicians have worked for this song. I thank Trivikram garu, Allu Arjun and the producers for giving me this opportunity”.
Sirivennela too has shared his experience working on this song. ” ‘Samajavaragamana’ describes the beauty of a woman and I’ve thought of using some classical words when director asked me to come up with imaginative, youthful lyrics filled with mischief. Thaman has given a beautiful tune and the orchestra has worked very hard. The way Sid Sriram has sung the song is excellent. Allu Arjun has been acting very well as a middle class youngster in this movie. I thank the makers for giving me the opportunity to pen lyrics for this song”.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde,
Tabu,Rajendra Prasad, Sachin Kedkar,Tanikella Bharani, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya,Rohini, Eswarerao, Kalyani natarajan, Sireesha, Brahmaji,,Harshavardhan,Ajay,Pammi sai,Rahul Ramakrishna,

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

* ‘దండుపాళ్యం’ ట్రైలర్ విడుదల

IMG-20180423-WA0015 IMG-20180423-WA0021 MK3A1321

* ‘దండుపాళ్యం’ ట్రైలర్ విడుదల 
* నవంబర్ 1న ‘దండుపాళ్యం – 4 ‘ విడుదల 

సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం పై తెలుగు, కన్నడ నాట ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను నేరుగా సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.

*ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ*…
తెలుగు, కన్నడ నాట ‘దండుపాళ్యం – 4 ‘ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయటం జరిగింది. ట్రైలర్ విడుదల అయిన కొద్ది సమయానికే చిత్రం పై అనూహ్యమైన స్పందన పెరిగింది. సోషల్ మీడియాలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడం, ట్రెండింగ్ అవటం,  చిత్ర విజయం పై మా నమ్మకాన్ని మరింత పెంచింది. సినిమా బాగా వచ్చింది అన్నది చిన్నమాట. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. నవంబర్ 1 న ‘దండుపాళ్యం – 4 ‘ చిత్రాన్ని  తెలుగు, కన్నడ నాట అత్యధిక ధియేటర్ లలో  విడుదల చెయ్యబోతున్నాము. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్ర కధ,కధనాల విషయానికి వస్తే  ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.

*దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ*…
దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నవంబర్ 1 న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. సుమన్‌ రంగనాథన్‌, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, పాత్రలు  సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.

నటీ నటులు : సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్  సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్, బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్, స్నేహ, రిచర్డ్  శాస్త్రి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:  డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి, మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ
సాహిత్యం : భువనచంద్ర, డి ఓ పి: గిరి బెనకరాజు, నృత్యాలు: బాబా భాస్కర్, ఎడిటర్ : బాబు ఏ. శ్రీవాత్సవ – ప్రీతి మోహన్ , పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి.నాయక్
బ్యానర్  వెంకట్ మూవీస్ 

 
 
*Dandupalyam – 4′ Trailor is out
*Dandupalyam – 4′ locks November 1st  release
  

Starring  Suman Ranganadhan, Mumaith Khan, Benerjee, Venkat, , Sanjeev Kumar, in lead roles, Dandupalyam is gearing up for release on November 1st. This film is directed by KT Nayak.

The producer of the film Venkat said  the trailor of ‘Dandu Palyam 4′ has been out and got great applause from all corners. The film hits the screens on November 1 st all over the globe.The film has come out really well. The story of the movie circles around a gang, which wants to free their friends who’ re behind the bars, the police have their plans to break the gang’s strategies, then what will happen? And the producer wants to release the movie in Telugu and Kannada versions on the same day, that’s November 1st all over the globe.

 

The director KT Nayak said that this film does not have any resemblance with the previous parts and it will have a completely different plot. The performances of the lead cast is the biggest asset of this film, he said.


Suman Ranganathan, mumaitkhan, Benarjee, venkaat, Sanjeev Kumar, Arun Bachchan, Ds rao, rocklike Sudhakar, bullet Somu, vithal rangayan, Jeeva Simon, santosh kumar, Veena ponnappan , Sneha, Richard sastry, etc.

Dialogues: M.Rajasekhar Reddy,Music: Anand Raja Vikrama, lyricist: Bhuvanachandra , Dop: R.Giri, Benakaraju, Choreography: Baba Bhaskar
Editor: Babu A Srivatsava- Preethi Mohan,Stunts: kungfu Chandru
Director: K.T.Nayak
Producer: Venkaat