About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

నేటితరం ప్రేమకథాచిత్రం `4 లెట‌ర్స్‌`

 ANKETA MAHARANA ESWAR AND ANKETA MAHARANA ESWAR AND TUYA CHAKRABORTY ESWAR TUYA CHAKRABORTYఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`.
‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక
 
ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.
 
ఈ సంద‌ర్భంగా…నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. రేపు థియేట‌ర్‌లో సినిమా చూస్తే కొత్త హీరోలా కాకుండా అనుభ‌వ‌మున్న హీరో సినిమా చేసిన‌ట్లుగా న‌టించారు.  అలాగే `కలుసుకోవాల‌ని` వంటి బ్యూటీఫుల్, క్యూట్ ల‌వ్ స్టోరీని తెరకెక్కించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన ద‌ర్శ‌కుడు ర‌ఘురాజ్‌గారు మా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క‌న్న‌డ‌, తెలుగు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ బిజీగా మారిన ఆయ‌న చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో చేస్తున్న చిత్రమిది. అన్ని అంశాల‌తో.. క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం. చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేశాం.సీనియర్ ప్రొడక్షన్ కంట్రోలర్ సి.భాస్కర రాజు గారి సహకారం ఈ చిత్ర నిర్మాణంలో మరువలేనిది. ఆయనకు కృతఙ్ఞతలు. త్వ‌ర‌లోనే పాటలు, సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అన్నారు. 
ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ “`క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత క‌న్న‌డ‌, త‌మిళ సినిమాల‌తో బిజీగా మారిపోయాను. చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ. నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు సినిమాను తెర‌కెక్కించాను. ఒక రకంగా చెప్పాలంటే `4 లెట‌ర్స్‌`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం“ అన్నారు. 
న‌టీన‌టులు:
ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. 
సాంకేతిక నిపుణులు:
కో డైరెక్ట‌ర్‌:  రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సి.భాస్క‌ర్ రాజు, పాట‌లు:  సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: వ‌ర్మ‌, మ్యూజిక్:  భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌ఫీ:  చిట్టిబాబు.కె, 
 
నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్, 
క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్.

Up until now, you knew very little about the upcoming movie “4 letters” by Om Sri Chakra Creations, but the only thing you really need to know is that it’s the next movie from Kalusukovalani writer and director, R. Raghuraj. R. Raghuraj is the man behind the story, screenplay, dialogue and editing of the movie “4 letters”. The movie has been structured to grasp the attention of teenagers and grownups alike by Introducing Eswar, Tuya Chakraborthy and Anketa Maharana as the lead in this movie. These newcomers were given extensive training for 60 days to play their respective roles. The actors might seem new but their performances are going to take your breath away. Raghuraj took a break from the Telugu film industry until now. Meanwhile Raghuraj has directed 10 successful films in Kannada and Tamil. With his form intact Raghuraj has decided to give his major comeback with this movie and the highlights are the editing and screenplay of the movie. The director of photography is K. Chittibabu who is known for the movies, Bheemili Kabaddi Jattu and SMS. Although he was given the challenge of working with new artists, he has provided stunning, lustful and breathtaking visuals to capture the audience with this romantic movie. The movie is filled with active romance and twisted humor. But wait. That’s not all! Remember diyo diyo song by Bheems Ceciroleo from Garuda Vega? Well, Bheems has done far better than his previous best with his new movie “4 letters”. The beats have been fine tuned to keep the youth on their feet with their dance moves flowing. Bheems has composed all 4 songs for the movie and each of them being unique in their own way. Simply put, Bheems Ceciroleo has outdone himself and this will be his platform to reach a bigger form of greatness. Raghuraj added that all this wouldn’t have been possible without the liberty and complete support of the producers. The producers upheld their promises by providing maximum comfort for the director and his team which helped the creators produce such a marvelous movie. The movie is to be released 75 days from the first day of shooting.


INTRODUCING – ESWAR
INTRODUCING – TUYA CHAKRABORTHY & ANKETA MAHARANA
KAUSALYA, ANNAPURNA,  SUDHA, SATYA KRISHNAN, VIDYU LEKHA RAMAN
SURESH, POSANI KRISHNA MURALI, KRISHNA BHAGAVAN, GOWTHAM RAJU, ANANTH  VENU, DHANRAJ, TADIVEL, VITTA MAHES
CO-DIRECTOR  RAJASEKHAR MAARISETTY
PRODUCTION CONTROLLER: C. BHASKAR  RAJU
LYRICS – SURESH UPADHYAYA
CHOREOGRAPHY – GANESH
STILLS – ANBU
DESIGNS ESHWAR
ART – VARMA
MUSIC- BHEEMS CICEROLEO
DIRECTOR OF PHOTOGRAPHY – CHITTI BABU. K

PRODUCERS – DOMMARAJU HEMALATHA  ,DOMMARAJU UDAYA KUMAR 
STORY, SCREENPLAY, DIALOGUES, EDITING, DIRECTION – R. RAGHURAJ

 

పెరాక్ లో త‌క్కువ బ‌డ్జెట్ తో షూటింగ్ చేసుకోవ‌చ్చు అంటూ తెలుగు సినిమా నిర్మాత‌ల‌ను ఆహ్వానించిన మ‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి’దాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ

పెరాక్ లో త‌క్కువ బ‌డ్జెట్ తో షూటింగ్ చేసుకోవ‌చ్చు అంటూ తెలుగు సినిమా నిర్మాత‌ల‌ను ఆహ్వానించిన మ‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిదాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ’

 DSC_0368 DSC_0429 DSC_0506 DSC_0511 DSC_0537 DSC_0584 DSC_0616 DSC_0620 DSC_0623 DSC_0626 DSC_0628 DSC_0630 DSC_0632 DSC_0634 DSC_0639 DSC_0641
తెలుగు సినిమా రోజురోజుకు అభివృద్ది చెందుతుండ‌డం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా..విదేశాల్లో సైతం తెలుగు సినిమాకి డిమాండ్ ఉండ‌డంతో ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు విదేశాల్లో ఉన్న ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రెడీ చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ చేసే సినిమాల‌కు ఆయా దేశాలు షూటింగ్ ప‌ర్మిష‌న్స్ స‌కాలంలో ఇప్పించ‌డంతో పాటు రిట‌ర్న్ గిఫ్ట్ లా కొంత మొత్తాన్ని కూడా ఇస్తున్నాయి. తాజాగా మ‌లేషియా ప్ర‌భుత్వం కూడా త‌మ దేశంలో షూటింగ్ చేస్తే స‌కాల స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంతో పాటు త‌మ దేశంలో కావ‌ల్సిన అన్ని ప‌ర్మిష‌న్స్ ను వెంట‌నే అందిస్తామంటోంది.
 
మ‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూతో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ మీట్ & గ్రీట్ కార్య‌క్ర‌మాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి  గురు ఫిల్మ్స్ సునీత తాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో మ‌లేషియాలోని పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ పైజ‌ల్ అజుమూ మాట్లాడుతూ…నా ఫ్రెండ్ మ‌హేష్ తో ఎప్ప‌టి నుంచో ఇండియా రావాలి అని చెప్పాను. ఈరోజు హైద‌రాబాద్ రావ‌డం చాలా హ్యాపీగా ఉంది.  ఇండియా ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. మ‌లేషియాలో సంవ‌త్స‌రానికి ఒక‌సారైనా ఇండియా ఫుడ్ తింటుంటాను. కౌలాలాంపూర్ నుంచి చెన్నైకి రావ‌డానికి 3 గంట‌లు ప‌ట్టింది. చెన్నై నుంచి హైద‌రాబాద్ రావ‌డానికి 3 గంట‌ల టైమ్ ప‌ట్టింది. దీనిని బ‌ట్టి ఇండియా ఎంత పెద్ద‌దో అర్ధం చేసుకోవ‌చ్చు. 
 
ఇక నా గురించి చెప్పాలంటే..ద‌త్తా శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ అయిన‌ప్ప‌టికీ పెజా అని పిలుస్తారు. మ‌లేషియాలో 13 రాష్ట్రాలు ఉన్నాయి. అక్క‌డ ఉన్న పెద్ద రాష్ట్రాల్లో పెరాక్ ఒక‌టి. పెరాక్ అంటే సిల్వ‌ర్ అని అర్ధం. ఈ రాష్ట్రంలో 48% అడ‌వి ఉంటుంది. పెరాక్ లో వాతావ‌ర‌ణం చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. సినిమా షూటింగ్ నిమిత్తం నిర్మాత‌లు ఏసియాలో చాలా దేశాల‌కు వెళ్లుంటారు. అయితే…పెరాక్ రాష్ట్రం రావాల‌ని కోరుతున్నాను. తెలుగు నిర్మాత‌ల‌ను ఆహ్వానించ‌డం కోస‌మే హైద‌రాబాద్ వ‌చ్చాను. నా మిత్రుడు మ‌హేష్, వివేక్ కూచిభ‌ట్ల న‌న్ను ఇక్క‌డికి రావాల‌ని ఆహ్వానించారు. వారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.   
 
ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ బిజినెస్ ఏషియాలోనే జ‌రుగుతోంది. ఏషియ‌న్స్ అంద‌రూ ఒక్క‌టే అని నా ఫీలింగ్. షూటింగ్ నిమిత్తం యు.ఎస్ వెళుతుంటారు. కానీ..ఇండియ‌న్ మూవీస్ ని అక్క‌డ చూడ‌రు. ఏషియాలో లోకేష‌న్స్ చాలా ఉన్నాయి. అందుచేత ఇక్క‌డే షూటింగ్ చేయాల‌ని కోరుతున్నాను. చిన్న‌ప్ప‌టి నుంచి ఇండియ‌న్ సినిమాని ఫాలో అవుతుంటాను. కానీ..ఇండియ‌న్ సినిమాల‌ని ఏసియాలో కాకుండా ఎక్కువుగా యు.ఎస్ లో షూటింగ్ చేస్తుండ‌డం బాధ‌గా అనిపిస్తుంది. పెరాక్ రాష్ట్రంలో షూటింగ్ చేస్తే త‌క్కువ బ‌డ్జెట్ అవుతుంది. మా ద‌గ్గ‌ర డ్యాన్స‌ర్స్, టెక్నీషియ‌న్న్ చాలా మంది ఉన్నారు. అలాగే మా రాష్ట్రంలో తెలుగు, త‌మిళ సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తుంటారు. తెలుగు సినిమాల్లో సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంటుంది. పెరాక్ లో మీరు కావాలంటే సెట్స్ కూడా వేసుకోవ‌చ్చు. బ‌డ్జెట్ కూడా చాలా త‌క్కువు అవుతుంది. అందుచేత తెలుగు సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పెరాక్ రాష్ట్రంలో రావాల‌ని..షూటింగ్స్ చేయాల‌ని ఆహ్వానిస్తున్నాను అన్నారు. 
 
మ‌లేషియాలో పెరాక్ మాత్ర‌మే కాకుండా కంబోడియా, థాయ్ లాండ్, సింగ‌పూర్ ల‌లో షూటింగ్ చేసుకోవ‌చ్చు. మా రాష్ట్రంలో చాలా మంది ఇండియ‌న్స్ ఉన్నారు. మ‌లేషియాను ట్రూలీ ఏసియా అంటారు. వేరే దేశంలో షూటింగ్ చేయ‌డం కంటే మా ద‌గ్గ‌ర షూటింగ్ చేస్తే చాలా త‌క్కువ బ‌డ్జెట్ అవుతుంది. పెరాక్ లో చాలా మందికి సినిమా అంటే ఇష్టం. వాళ్లు ఫ్రీగా న‌టించ‌డానికి కూడా రెడీ. ఒక్క‌సారి తెర పై క‌నిపిస్తే చాలు అనుకుంటారు. అంతిష్టం వాళ్ల‌కి సినిమా అంటే. మీకు ఎలాంటి ప‌ర్మిష‌న్ కావాల‌న్నా న‌న్ను సంప్ర‌దిస్తే వెంట‌నే అనుమ‌తి ఇస్తాను. ఈరోజు ఇలా తెలుగు సినిమా నిర్మాత‌ల‌ను క‌లుసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు. 
 
ప్ర‌ముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ మాట్లాడుతూ…మా దేశం వచ్చినందుకు  పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ పైజ‌ల్ అజుమూ గారికి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే ఆయ‌న ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ విన‌డం హ్యాపీగా ఫీల‌వుతున్నాను. ఇక నుంచి మా సినిమా మేనేజ‌ర్లు యూర‌ప్ అంటే వెళ్లం. మ‌లేషియాకే వ‌స్తాం. మ‌లేషియా అంటే కౌలాలాంపూర్ మాత్ర‌మే అనుకునే వాళ్లం. కానీ…చాలా మంచి బ్యూటీఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడే తెలిసింది. సినిమా అనేది ప్ర‌పంచాన్ని చూడ‌డానికి విండో లాంటిది. వెంట‌నే పెరాక్ లో షూటింగ్ చేయాల‌నిపిస్తుంది. పెరాక్ ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ గారితో మీట & గ్రీట్  కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మ‌హేష్,వివేక్ కూచిభ‌ట్ల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు. 
 
అడివి శేష్ మాట్లాడుతూ…త్వ‌ర‌లోనే పెరాక్ లో షూటింగ్ చేయాల‌నుకుంటున్నాను. ఈరోజు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
 
పెరాక్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దాతో శ్రీ అహ‌మ‌ద్ ఫైజ‌ల్ అజుమూ గార్ని నిర్మాత వివేక్ కూచిభ‌ట్ల శాలువా, పుష్ప‌గుఛ్చం ఇచ్చి స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు భ‌ర‌త్ చౌద‌రి, కిర‌ణ్ రెడ్డి, రాథామోహ‌న్, డి.ఎస్.రావు, మైత్రీ మూవీస్ ర‌వి, అభిషేక్ నామా, అభిషేక్ అగ‌ర్వాల్,   అనిల్ సుంక‌ర‌, శివ‌కుమార్, రాజ్ కందుకూరి, రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్, జ‌గ‌న్, బెక్కం వేణుగోపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

“Anaganaga o Premakadha’ december 14th Release

థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

నిర్మాత కె.ఎల్‌.ఎన్ రాజు మాట్లాడుతూ – “మంచి ప్రేమ‌క‌థ‌. అశ్విన్‌, రిద్ది, రాధా బంగారు స‌హా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హకారంతో మంచి ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఓ కూతురుని మంచి దారిలో పెట్ట‌డానికి తండ్రి ఏం చేశాడ‌నేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్‌. డిసెంబ‌ర్ 14న సినిమాను గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ తాతం శెట్టి మాట్లాడుతూ – “మంచి క్యూట్ ల‌వ్ స్టోరీ. అహ్లాద‌క‌రంగా ఉంటుంది. కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి స‌హాయంతో సినిమాను పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డిసెంబ‌ర్ 14న విడుద‌లవుతోన్న మా ప్ర‌య‌త్నాన్ని ఆదరిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

సున‌య‌న మాట్లాడుతూ – “మా మామ‌గారు కె.ఎల్.ఎన్ రాజుగారు చిన్న సినిమాల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో.. ఈ సినిమా చేశాం. సినిమా కోసం అంద‌రం క‌ష్ట‌పడ్డాం. ఈ నెల 14న మా సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది“ అన్నారు.

విరాట్‌జె.అశ్విన్ మాట్లాడుతూ – “రాజుగారు లేకుంటే సినిమా లేదు. ఆయ‌న బ్యాన‌ర్‌లో హీరోగా ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను. మావ‌య్య మార్తాండ్ కె.వెంక‌టేశ్‌గారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. డిసెంబ‌ర్ 14న విడుద‌ల‌వ‌తున్న మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

రిద్ది కుమార్ మాట్లాడుతూ – “తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. మంచి పాత్ర చేశాను. ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పిస్తాను“ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

KUM_59690034 KUM_60440083 KUM_60470086 KUM_60680095 KUM_60760100 KUM_60900103 KUM_60970110 KUM_61060113 KUM_61180122

Releasing on Dec 14th Anaganaga o premakadha”

థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో…

నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజు మాట్లాడుతూ – ”సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్‌ యు సర్టిఫికేట్‌ పొందింది. డిసెంబర్‌ 14న సినిమాను విడుదల చేస్తున్నాం. క్లీన్‌ లవ్‌స్టోరీ. మంచి సస్పెన్స్‌ కూడా ఉంటుంది. సినిమా చూసినవారు అప్రిషియేట్‌ చేస్తున్నారు. హీరో విరాజ్‌, హీరోయిన్స్‌ రిద్దికుమార్‌, రాధా బంగారు సహా కాశీవిశ్వనాథ్‌ ఇతర నటీనటులు అందరూ చక్కగా నటించారు. దర్శకుడు ప్రతాప్‌ తాతం శెట్టి సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఎడిటర్‌ మార్తాండ్‌ వెంకటేశ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె.సి.అంజన్‌ తదితరులు సినిమా మంచి అవుట్‌పుట్‌ కోసం బాగా కేర్‌ తీసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాను గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ విడుదల చేస్తుంది” అన్నారు.

కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ – ”కె.ఎల్‌.ఎన్‌.రాజుగారు ఎన్నో సినిమాలకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. ఎన్నో చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఆయన నిర్మాణంలో రూపొందిన ‘అనగనగా ఓ ప్రేమకథ’ సాంగ్స్‌, ట్రైలర్‌ చాలా బావున్నాయి. ప్రతాప్‌ సినిమాను చక్కగా తెరకెక్కించారు. మార్తాండ్‌ వెంకటేశ్‌గారి మేనల్లుడు హీరో విరాజ్‌ హ్యండ్‌సమ్‌గా ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉంది. ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ మాట్లాడుతూ -”మా విరాజ్‌ను హీరోను చేసిన కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి సహాయాన్ని మరచిపోలేను. సాంగ్స్‌, ట్రైలర్స్‌ అందరికీ నచ్చాయి. సినిమా కూడా అందరినీ మెప్పిస్తుంది” అన్నారు.

విరాజ్‌ జె.అశ్విన్‌ మాట్లాడుతూ – ”హీరో కావాలనే నా కల నిజమైంది. కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి నిర్మాతగా చేసిన సినిమా ద్వారా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతాప్‌ నా క్యారెక్టర్‌ను ఫుల్‌ ఎనర్జీతో తీర్చిదిద్దారు. మా యూనిట్‌ కుటుంబ సభ్యుల్లా నాకు అండగా నిలబడ్డారు. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను” అన్నారు.

దర్శకుడు ప్రతాప్‌ తాతం శెట్టి మాట్లాడుతూ – ”ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయ్యింది. మంచి లవ్‌ స్టోరీ. టచ్‌ హేస్‌ ఎ మెమరీ అనే ట్యాగ్‌ లైన్‌ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజుగారు లేకుంటే ఈ సినిమాయే లేదు. ఆయనకి థాంక్స్‌. ఆయన కుమారుడు సతీష్‌గారు, కోడలు సునైనగారు ఎంతగానో ఎంకరేజ్‌ చేస్తూ వచ్చారు. కొత్త వాళ్లతో సినిమా చేయడం చాలా గొప్ప విషయం. వారికి థాంక్స్‌. ఇప్పుడున్న వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఎడిటర్స్‌లో ఒకరైన మార్తాండ్‌ కె.వెంకటేశ్‌గారు బెస్ట్‌ ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. అంతే కాకుండా ఆయన మేనల్లుడిని హీరోగా కూడా ఇచ్చారు. డిసెంబర్‌ 14న సినిమా విడుదలవుతుంది. మా ప్రయతాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

 

 ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
 
సమర్పణ: సతీష్ రాజు 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 
 
 KUM_16780004 KUM_16870007 KUM_17110021 KUM_17130023 KUM_17260034 KUM_17310038 KUM_17360042 KUM_17410047

Sri Ranjith Movies K.L.DamodarPrasad’s New Ventures with New Faces and Noted Artists..

 కొత్త తరం మరియు ప్రముఖ నటీ నటులతో  శ్రీ రంజిత్ మూవీస్ నూతన చిత్రం 
- నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ 
 
కొత్త తరం మరియు ప్రముఖ నటీ నటులతో  శ్రీ రంజిత్ మూవీస్ నూతన చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.  శ్రీ రంజిత్ మూవీస్ … ఈ బ్యానర్ పేరు వినగానే ‘అలా మొదలైంది’, ‘అంతకుముందు…ఆ తరువాత’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి విజయవంతమైన చిత్రాల పేర్లు గుర్తుకు వస్తాయి. అలాగే ఈ చిత్రాల పేర్లు గుర్తుకు వచ్చినా ఉత్తమ కధా చిత్రాల నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ పేరు స్ఫురణకు వస్తుంది ఇటు చిత్ర పరిశ్రమలోనూ, అటు ప్రేక్షక వర్గాలలోనూ. 
శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ…’నాని కథానాయుడిగా నందినిరెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘అలా మొదలైంది, సుమంత్ అశ్విన్ కథానాయకునిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకునిగా నిర్మించిన ‘అంతకు ముందు…ఆ తరువాత’, మరోసారి నందిని రెడ్డి దర్శకురాలిగా నాగ సౌర్య కధా నాయకునిగా నిర్మించిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాల విజయాల వెనుక వాటి వైవిధ్యమైన కధా బలం తో పాటు చిత్ర తారాగణం, సాకేంతిక నిపుణుల ప్రతిభ ఎంతో ఉంది. వీటితో పాటు  ఆ చిత్రాల పబ్లిసిటీ, ప్రింట్ మరియు, ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారం ఎప్పటికీ మరిచిపోలేనిది ఈ సందర్భంగా వారికి మరోసారి కృతఙ్ఞతలు అన్నారు. 
ఆయనే మాట్లాడుతూ..’ దాదాపు రెండు సంవత్సరాల విరామం తరువాత మళ్ళీ వరుసగా చిత్రాలను నిర్మించబోతున్నాను. ఇప్పటికే నాలుగు కధలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయటం జరిగింది. వీటి నిర్మాణం సమాంతరంగా జరుగుతుంది.
వీటిలో ఒక చిత్రాన్ని  జనవరి నెలలో పూజా కార్యక్రమాలలతో ప్రారంభిచనున్నాము. నూతన దర్శకుడు సాగర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీ,నటులతో పాటు, నూతన తారాగణం కూడా ఉంటారు. వీరు ఎవరన్నది కొద్దిరోజులలో ప్రకటిస్తాము. అలాగే తదుపరి చిత్రాల దర్శకులు, వాటికి సంబంధించిన తారాగణం వివరాలు కూడా ఒకదాని తరువాత మరొకటి తెలియ జేయటం జరుగుతుందని తెలిపారు నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్. గత చిత్రాల కోవలోనే తమ తదుపరి చిత్రాల కధలు వైవిధ్యంగానే ఉంటాయన్న  నమ్మకాన్ని వ్యక్తం చేశారు
శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ అధినేత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ IMG_2653 IMG_2654 IMG_2655 IMG_2656

Sri Ranjith Movies K.L.DamodarPrasad’s New Ventures with New Faces and Noted Artists..

Producer K.L.DamodarPrasad, who produced  memorable movies under his Sri Ranjith Movies banner, is all set with his new ventures.. one of His earlier venture ‘Ala Modalaindi’, where Nani and Nitya Menon played the lead roles, remained a huge hit.  lady director Nandini Reddy made her directorial debut with this film.Antaku Mundu- Aa Taruvata’, produced by him  directed by Indraganti Mohana Krishna and Sumanth Aswin and Eesha Rebba who played the hero and the heroine respectively. Was a genuine success for Sumanth Aswin and Director also. Damodar Prasad gave again a chance to  director Nandini Reddy with his ‘Kalyana Vaibhogame’, starring Naga Showrya and Malavika Nair which also was successfull film.
most of my  movies did well at the box-office” because of my scripts and well planned  publicity and all efforts put in by all my Technicians and Artists says Damodar Prasad.    I whole heartedly thank the print and electroinc media who promoted my ventures and stood by me all through. after the gap of two years I am ready with four scripts and will make them simultaneously” from jan 2019. According to him the first venture, this time, will be directed by Sagar, with a mixture of new and established artists. directors for Other ventures  will be announced shortly.  Damodar Prasad is very confident about his new ventures. Hope, he will create the same magic again with his new ventures.