Oct 30 2012
Posts by Venugopal L:
Oct 27 2012
నవంబర్ 1 న విడుదల అవుతున్న ‘లక్కీ’
నవంబర్ 1 న విడుదలవుతున్న శ్రీకాంత్ ‘లక్కీ’
శ్రీకాంత్, మేఘన జంటగా జ్యోత్స్నారెడ్డి సమర్పణలో రాజ రాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై ’హరి’ ని దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ‘లక్కీ’ చిత్రం
విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 1 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
రొమాంటిక్, ఫామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించి నట్లు దర్శకుడు హరి తెలిపారు. చిత్ర నాయకా,నాయికల పాత్రలు కొత్త దనాన్ని ఆపాదించు కొని ఉంటాయి. పాత్రల మధ్య జరిగే
సంఘటనలు, సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. దర్శకునిగా ఈ చిత్రం మంచి పేరు తెస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు హరి. సాయి కార్తీక్ సంగీతం ఇప్పటికే సంగీత ప్రియులను విశేషం
గా ఆకట్టుకొంది. అలాగే చిత్ర కదానుసారం హీరో ‘శ్రీకాంత్’ పాడిన పాత కూడా చిత్రం హైలెట్స్ లో ఒకటి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా చిత్ర కధ, కధనాల విషయంలో జాగ్రత్తలు
తీసుకొన్నట్లు దర్శకుడు తెలిపారు.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో బ్రహ్మానందం,ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ, చిట్టిబాబు, కృష్ణభగవాన్, జయసుధ,,రోజా,సన, హేమ నటిస్తున్నారు.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో బ్రహ్మానందం,ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చలపతిరావు, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ, చిట్టిబాబు, కృష్ణభగవాన్, జయసుధ,,రోజా,సన, హేమ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: పడాల శివ సుబ్రహ్మణ్యం: సంగీతం: సాయి కార్తీక్: పాటలు; భాస్కరభట్ల రవికుమార్: కెమెరా: వి.శ్రీనివాస రెడ్డి: ఎడిటర్: నాగిరెడ్డి: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముదిగొండ
వెంకటేష్: సమర్పణ: జ్యోత్స్నారెడ్డి: నిర్మాత: రాజ రాజేశ్వరి శ్రీనివాసరెడ్డి: రచన,దర్శకత్వం: హరి
Follow Us!