About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Ustaad Bhagat Singh wraps up an emotionally charged and an action-packed climax

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

 భావోద్వేగాలు, యాక్షన్ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ ను రూపొందిన దర్శకుడు హరీష్ శంకర్
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్ స్టార్ యొక్క అంకితభావం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.
 
ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను తాజాగా చిత్ర బృందం పూర్తి చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలు మరియు యాక్షన్ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ ను రూపొందించారు. ఈ చిత్రానికి ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచే ఈ అత్యంత పవర్ ఫుల్ సీక్వెన్స్ కు నబకాంత మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పవన్ కళ్యాణ్ యొక్క అత్యుత్తమ ప్రదర్శనతో ఈ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది.
 
చిత్రీకరణ పూర్తయిన తర్వాత, నబకాంత మాస్టర్ బృందానికి మరియు ఫైటర్లు అందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్లైమాక్స్ సీక్వెన్స్‌ అద్భుతంగా రావడానికి కృషి చేసినందుకు వారిని అభినందించారు.
 
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. మాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.
 
ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యువ ప్రతిభావంతుడు ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం మరియు నబకాంత మాస్టర్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అయనంక బోస్, కాస్ట్యూమ్ డిజైనర్ గా నీతా లుల్లా, కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు. 
 
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా
 
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కథనం: కె. దశరథ్
రచనా సహకారం: సి. చంద్రమోహన్ 
ఛాయాగ్రహణం: అయనంక బోస్
కూర్పు: ఉజ్వల్ కులకర్ణి
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రావిపాటి చంద్రశేఖర్, హరీష్ పై
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నబకాంత మాస్టర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
Ustaad Bhagat Singh wraps up an emotionally charged and an action-packed climax
Ustaad Bhagat Singh, starring Power Star Pawan Kalyan and directed by Harish Shankar, is one of the most anticipated projects with a lot of hype surrounding the project. The shoot has been going on at a brisk pace in spite of Pawan Kalyan being busy with his responsibilities as the Deputy CM of Andhra Pradesh, cabinet meetings and being actively involved in Hari Hara Veera Mallu presentations. This is a testament to Power Star’s dedication and hardworking nature.

Today, the team has wrapped up the climax sequence of the film. Harish Shankar has designed a solid climax that is high on emotions and action. Nabakanta Master has choreographed a high octane sequence that will be one of the major highlights of the film. The entire sequence has come out extraordinarily with Pawan Kalyan at his absolute best.

After wrapping up the shoot, Power Star Pawan Kalyan gave photographs to all the fighters and the entire team of Nabakanta Master and appreciated them for the wonderful execution of the climax sequence.

Produced by Naveen Yerneni and Y.Ravi Shankar under Mythri Movie Makers on a grand scale, the film promises to be a mass action extravaganza.

The film also stars Sreeleela and Raashii Khanna as the female leads , alongside a strong ensemble cast including Parthiban, KS Ravikumar, Ramky, Nawab Shah, Avinash (of KGF fame), Gauthami, Naga Mahesh, and Temper Vamsi.

The technical team of the film is top notch – with Rockstar Devi Sri Prasad providing the music, young dynamite Ujwal Kulkarni handling editing, and Ram-Lakshman duo & Nabakanta master choreographing the action sequences. Ayananka Bose handles the camera while Neeta Lulla is in charge of the costumes. The production design is being handled by the award winning art director Anand Sai.

 Ustaad-PR-2

Grand Kingdom Pre Release Event

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక
నా నుంచి అభిమానులు కోరుకుంటున్న విజయం ‘కింగ్‌డమ్’తో రాబోతుంది: ప్రీ రిలీజ్ వేడుకలో కథానాయకుడు విజయ్ దేవరకొండ
‘కింగ్‌డమ్’ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. సోమవారం(జూలై 26) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగిన ఈ వేడుకలో అనిరుధ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “మరో రెండు రోజుల్లో జులై 31న మిమ్మల్ని థియేటర్లలో కలవబోతున్నాం. మనసులో కొంచెం భయం ఉంది, అదే సమయంలో ఓ మంచి సినిమా చేశామనే సంతృప్తి ఉంది. ‘కింగ్‌డమ్’ అవుట్ పుట్ పట్ల టీమ్ అందరం సంతోషంగా ఉన్నాము. ఈరోజు నేను అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ‘అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు. నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్‌డమ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’. ఈ కథ ఆలోచన పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా పని మీదే ఉన్నాడు గౌతమ్. ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ వేడుకకి రాలేకపోయాడు. ఆ తర్వాత ఇది అనిరుధ్ రవిచందర్ ‘కింగ్‌డమ్’. పాటలు ఇప్పటికే విన్నాము. నేపథ్యం సంగీతం కూడా అదిరిపోతుంది. నా సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. అది ‘కింగ్‌డమ్’తో నెరవేరింది. తన సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇది ఎడిటర్ నవీన్ నూలి ‘కింగ్‌డమ్’. నాలో ఒక ఫైర్ ఉంటుంది. మా వాళ్లకి బెస్ట్ ఇవ్వాలని కోరిక ఉంటుంది. ఈసారి నాకు ఇంత ఫైర్ ఉన్న టీమ్ దొరికింది. అలాగే ఇది నాగవంశీ ‘కింగ్‌డమ్’. ఎంతో రిస్క్ చేసి ఈ సినిమా చేశారు. బెస్ట్ అవుట్ పుట్ రావడం కోసం.. ఎక్కడా రాజీ పడకుండా మేము ఏది అడిగితే అది ఇచ్చారు. భాగ్యశ్రీ బోర్సే కొత్తమ్మాయి. కానీ, సినిమా కోసం చాలా కష్టపడుతుంది. రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్తుంది. నా సోదరులు సత్యదేవ్, వెంకటేష్ ఇద్దరూ చాలా మంచి నటులు. ఈ సినిమాలో అన్న పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రలో సరైన నటుడు చేస్తేనే సినిమా పండుతుంది. అలాంటి పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని చాలా చర్చించిన తర్వాత.. సత్యదేవ్ ని ఎంపిక చేశాడు గౌతమ్. షూటింగ్ సమయంలో సత్యదేవ్ నిజంగానే నాకు సోదరుడిలా అనిపించాడు. సత్యదేవ్ అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. అలాగే వెంకటేష్ అద్భుతంగా నటించాడు. భవిష్యత్ లో బిగ్ స్టార్ కావాలని కోరుకుంటున్నాను. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌ కొల్లా, సినిమాటోగ్రాఫర్స్ జోమోన్, గిరీష్.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. రెండు రోజుల్లో ‘కింగ్‌డమ్’ మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాల పరంగా నా మెంటర్ నాగవంశీ గారు. నా సాంగ్ హిట్ అయితే ఆయన చాలా హ్యాపీగా ఫీలవుతారు. ‘కింగ్‌డమ్’ లాంటి గొప్ప సినిమాలో నన్ను భాగం చేసిన నాగవంశీ గారికి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్ కి నా కృతఙ్ఞతలు. సోదరుడు గౌతమ్ దర్శకత్వం వహించిన ‘జెర్సీ’ చిత్రానికి ఎందరో అభిమానులు ఉన్నారు. ‘కింగ్‌డమ్’ అంతకుమించిన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విడుదల కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ అద్భుతంగా నటించారు. ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ ఎడిటర్స్ లో నవీన్ నూలి ఒకరు. విజయ్ చాలా మంచి మనిషి. ఇతరుల యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. నేను ఈ చిత్రం కోసం పని చేస్తున్న సమయంలో.. ‘మనకి నిద్ర అనేది ముఖ్యం, తగిన నిద్ర పోతూ విశ్రాంతి తీసుకుంటున్నావని ఆశిస్తున్నాను’ అని విజయ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అంత గొప్పది విజయ్ మనసు. నేను ‘కింగ్‌డమ్’ చిత్రం చూశాను. ఈ సినిమా విజయ్ కెరీర్ తో పాటు, నా కెరీర్ లో, గౌతమ్ కెరీర్ లో, నాగవంశీ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ‘కింగ్‌డమ్’ ద్వారా మేము తెలుగు ప్రేక్షకుల కోసం ఓ కొత్త ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. నా కెరీర్ ప్రారంభం నుంచి నా పాటలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మీ వాడిగా భావించి నాపై ప్రేమ కురిపిస్తున్నారు. మీ ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.” అన్నారు.
కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. “జులై 31న విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ కోసం మీతో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గౌతమ్ గారు ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. ఇందులో పవర్ ఫుల్ పర్ఫామెన్స్ లు చూడబోతున్నారు. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి గొప్ప సినిమాలో విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. గౌతమ్ గారు ఎంతో ప్రతిభగల దర్శకుడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. కింగ్‌డమ్ సినిమాకి అనిరుధ్ గారు హార్ట్ బీట్. సత్యదేవ్ గారు అద్భుతంగా నటించారు. జులై 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.
ప్రముఖ నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. “కింగ్‌డమ్ లో భాగమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. విజయ్ ను నేను చాలా దగ్గర నుంచి చూశాను. చాలా అరుదైన వ్యక్తి. మంచి మనిషి, ఇతరుల గురించి కేర్ తీసుకుంటాడు. విజయ్ ఈ సినిమాతో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామాన్యుడిలా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘కింగ్‌డమ్’ను స్థాపించుకున్న విజయ్ అంటే నాకు అపార గౌరవం. విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవరకొండ కాదు బంగారుకొండ. అనిరుధ్ ఏది పట్టుకుంటే అది బంగారం. అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది. నాగవంశీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో.. అలాంటి సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి, గట్స్ ఉన్న నిర్మాత అనిపించుకున్నారు. విజయ్ తో పాటు ఈ సినిమాను ప్రమోట్ చేసే బాధ్యతను నాగవంశీ గారు తీసుకున్నారు. ప్రతి నటుడు గౌతమ్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా అభిప్రాయం. మనలో ఇంత నటన దాగుందా అని మనమే ఆశ్చర్యపోయేలా.. మన నుంచి నటనను రాబడతాడు. భవిష్యత్ లోనూ గౌతమ్ తో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ తో సహా అందరూ అద్భుతంగా నటించారు.” అన్నారు.
నటుడు వెంకటేష్ మాట్లాడుతూ, “మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన నేను.. ఇప్పుడు ‘కింగ్‌డమ్’లో భాగమయ్యాను. ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. ఇప్పటిదాకా నేను పని చేసిన బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. సితారలో మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సత్యదేవ్ గారు గొప్ప నటుడు. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. తెలుగులో నేను విజయ్ దేవరకొండ గారితో ‘కింగ్‌డమ్’ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్ గారు ఈ సినిమాలో నా నటనను మెచ్చుకోవడం గర్వంగా అనిపించింది.” అన్నారు.
సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో నటులు రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, కళా దర్శకుడు అవినాష్‌ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, గీత రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొని ‘కింగ్‌డమ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Grand Kingdom Pre Release Event
“The success my fans have been wishing for will arrive with ‘Kingdom,’” says hero Vijay Deverakonda at the pre release event.
Kingdom will stand as a milestone in Vijay Deverakonda’s career says music director Anirudh Ravichander.
‘Kingdom’ is one of the most awaited films among Telugu audiences worldwide. Starring Vijay Deverakonda in the lead role film also features Bhagyashri Borse, Satyadev, and Venkatesh in pivotal roles. It is directed by Gowtam Tinnanuri and produced prestigiously by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, with presentation by Srikara Studios. Rockstar Anirudh Ravichander has composed the music. Scheduled for release on July 31st, the film has already garnered massive expectations. The promotional material released so far has impressed audiences, especially the recently released trailer, which has taken the hype to the next level.
On Monday (July 26), the grand pre-release event of Kingdom was held at Yousufguda Police Grounds, Hyderabad, amidst a huge crowd and fan frenzy. The event was graced by prominent guests, and Anirudh’s live music performance stood out as a special attraction.
Vijay Deverakonda said:
*”In just two days, on July 31st, we will meet you in theatres. There’s a little nervousness in my heart, but at the same time, there’s satisfaction that we’ve made a good film. The whole team is very happy with Kingdom’s output.
Today, I want to especially speak about my fans. You all are God’s gift to me. Whether my films are hits or flops, you have always shown me the same love and faith. At today’s fan meet, I met nearly 2000 fans, and most of them told me, ‘Anna, this time we’re hitting big.’ You’ve made me one of your own, and I know you want to see me succeed. Cinema is the reason you know me, and for you, I put my heart and soul into every film I do.
The hit that you’ve been waiting for from me will arrive with Kingdom. This is not Vijay Deverakonda’s Kingdom; it is Gowtam Tinnanuri’s Kingdom. Ever since this story was conceived, Gowtam has been living and breathing this project, working tirelessly to make the perfect film. That’s why he couldn’t be here today.
Next, it’s Anirudh Ravichander’s Kingdom. We’ve already heard the songs, and the background score is just outstanding. I always wished to have Anirudh compose for my film, and with Kingdom, that wish has come true. He has elevated this movie to another level with his music.
Then, it’s Naveen Nooli’s Kingdom. I always have a fire in me to give my best to my people, and this time I got a team with the same fire. It’s also Naga Vamsi’s Kingdom. He took a big risk with this film, never compromising anywhere, and gave us everything we asked for to achieve the best output.
Bhagyashri Borse is a newcomer, but she has worked very hard for this film. She will go to great heights in the coming days. My brothers Satyadev and Venkatesh are both amazing actors. The elder brother’s role in this film is very important, and the movie would only work if the right actor plays it. After several discussions, Gowtam chose Satyadev, and during the shoot, he genuinely felt like my brother. Satyadev is not just a phenomenal actor but also a great human being.
Venkatesh too has performed brilliantly, and I wish for him to become a big star in the future. Costume designer Neeraja Kona, art director Avinash Kolla, and cinematographers Jomon and Girish – every single person has given their all for this film.
In just two days, Kingdom will be in front of you all. We are confident that you’ll love this movie.”*
Music director Anirudh Ravichander said:
*”In Telugu cinema, my mentor has always been Naga Vamsi garu. Whenever my songs become hits, he feels genuinely happy. I thank him and the entire Sithara Entertainments team for making me a part of such a great film like Kingdom.
Gowtam, my brother, already has so many fans for Jersey. I believe Kingdom will achieve even greater success. We are all eagerly waiting for the film’s release, and the output has turned out brilliantly. Bhagyashri Borse, Satyadev, and Venkatesh have all performed amazingly. Naveen Nooli is one of the finest editors in India.
Vijay is a wonderful person. He always thinks about the well-being of others. While working on this film, I once got a message from him saying, ‘Sleep is important, I hope you are getting enough rest.’ That’s how big-hearted Vijay is.
After watching Kingdom, I strongly feel that this film will be a milestone in not just Vijay’s career but also mine, Gowtam’s, and Naga Vamsi’s. The trailer has received a great response, and bookings are going well. We have attempted something new for Telugu audiences through this film, and I’m confident they will support this effort.
Since the beginning of my career, Telugu audiences have always showered me with love and made me feel like one of their own. My heartfelt thanks to them for their love and support.”*
Actress Bhagyashri Borse said:
*”Like all of you, I am also eagerly waiting for Kingdom’s release on July 31st. Gowtam sir has made this film beautifully, and you’re going to see some powerful performances.
The love I’ve been receiving from audiences has brought me these opportunities as an actor. Acting alongside an actor like Vijay in such a big film makes me truly happy. Gowtam sir is an immensely talented director, and I’m grateful to Naga Vamsi sir for giving me this chance.
Anirudh sir is the heartbeat of Kingdom, and Satyadev sir has given a phenomenal performance. See you all in theatres on July 31st!”*
Actor Satyadev said:
*”I’m extremely happy to be part of Kingdom. I’ve seen Vijay up close – he is a rare person, a good human being who genuinely cares for others.
I sincerely wish that Vijay achieves huge success with this film. He started as a common man and, step by step, built his own ‘Kingdom,’ which is why I have immense respect for him.
Anirudh turns everything he touches into gold, and I feel proud to be part of a film with his music.
A special mention to Naga Vamsi garu – he takes the kind of risks that others hesitate to, producing unique films and scoring hits, proving himself as a gutsy producer. He has taken full responsibility for promoting this film along with Vijay.
Every actor should do at least one film with Gowtam sir. He brings out a side of you that even you didn’t know existed. I hope to work with him again in the future.
Bhagyashri Borse and Venkatesh have also delivered amazing performances.”*
Actor Venkatesh said:
*”I started my journey as an actor by doing small roles in Malayalam films, and now I’m thrilled to be part of Kingdom.
I thank Naga Vamsi sir for this opportunity. Sithara Entertainments has been the best production house I’ve ever worked with, and I hope to do more films with them.
Satyadev sir is an incredible actor, and I have learned so much from him.
When I told people in Kerala that I’m acting with Vijay Deverakonda in a Telugu film, they were pleasantly surprised. Gowtam sir appreciating my performance in this film made me feel proud.”*
The event was hosted by Suma Kanakala. Actors Rangasthalam Mahesh, Raj Kumar Kasireddy, art director Avinash Kolla, costume designer Neeraja Kona, and lyricist Krishna Kanth were also present and extended their best wishes for Kingdom’s grand success.
Cast: Vijay Deverakonda, Satyadev, Bhagyashri Borse
Director: Gowtam Tinnanuri
Producers: Naga Vamsi, Sai Soujanya
Music: Anirudh Ravichander
Cinematography: Jomon T. John ISC, Girish Gangadharan ISC
Costume Designer: Neeraja Kona
Art Director: Avinash Kolla
Editor: Naveen Nooli
Production Houses: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
PRO: Lakshmi Venugopal
GANI9398 GANI9415 GANI9408 GANI9401

Pawan Kalyan’s Vedic character in Hari Hara Veera Mallu is a blend of mythology and history

Pawan Kalyan’s Vedic character in Hari Hara Veera Mallu is a blend of mythology and history

Power Star Pawan Kalyan’s lates film Hari Hara Veera Mallu turns out to be a blockbuster. The central story of the historical of how Mughals destroyed Hindu temples during their reign is getting wide appreciation. The film’s director Jyothi Krisna says at a time when Vedic texts were destroyed, Veera Mallu (Pawan Kalyan), stood against all odds and fought against the Mughals. “He transformed himself into a Vedic Scholar. He deciphered all the Vedic books as his knowledge so that it cannot further be destroyed. Since Veera Mallu is raised in a temple, and was imparted all the Vedic knowledge during his formative years, he eventually becomes a force to reckon with.”   Jyothi Krisna also explains how Veera Mallu draws from his knowledge to create a harmonious living environment from the five elements in Vastu Shastra — Earth (Prithvi), Water (Jal), Fire (Agni), Air (Vayu), and Space (Akasha) — that are rooted in Vedic principles.   “His expertise and ability to foresee things are second to none. For instance, he saves Gulfam Khan (Kabir Duhan Singh) from a landslide at the hills. He facilitates the Varuna Yagam (deity associated with the sky) to end drought in a village with rainfall. Veera Mallu’s belief of connecting to the animals (Wolf) through love, compassion and consciousness (Ahimsa) is a cornerstone and emerges from Vedic thought.” Lord Rama in his epic journey from Ayodhya to Lanka, navigated through various places. So the story of Ramayana is interwoven with these places. It traces his path through places like Chitrakuta, Panchavati (Bhadrachalam), Krauncha Aranya forest, Matanga Ashram, and Rishyamuka before reaching Lanka. Rama’s good deeds at these places during his journey were hailed and termed as ‘landmark moments.’ Similarly, Veera Mallu’s epic mission from Golkonda to Delhi Sultanate – south to north – is a significant journey interwoven with good deeds through Vedic principles. “We blended history and mythology to narrate how Veera Mallu is the protector of Sanatana Dharma. The situations he encountered and the good deeds he had done during the course of his journey can draw parallels to that of Lord Rama’s warrior-like journey. And when Veera Mallu meets Aurangzeb, it’s a catastrophe. The stage will be set for an ultimate showdown where nature erupts in the form of a whirlwind. “That’s why the climax is like a cliffhanger…nicely sets up the drama for what’s to ensue.”   Meanwhile, to further elevate the audiences’ cinematic experience, Hari Hara Veera Mallu got a Vfx upgrade. The film is further poised for a solid weekend as bookings remain strong across regions.

PHOTO-2025-07-26-21-28-55

Kingdom Trailer Out Now: raised the expectations to the max.

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

 
 ట్రైలర్ తో ‘కింగ్‌డమ్’పై అంచనాలు తారాస్థాయికి
 
 వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్‌డమ్’ చిత్రంతో ఘన విజయం సాధిస్తాను : కథానాయకుడు విజయ్ దేవరకొండ 
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.
 విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఘన విజయం చేరనుందనే భరోసాను ఈ ట్రైలర్ ఇస్తోంది. ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “గత సంవత్సర కాలంగా ‘కింగ్‌డమ్’ గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను. ఎప్పటిలాగే ఈ సినిమాకి కూడా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను. జూలై 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.
 కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, “నేను చేసింది ఒక్క సినిమానే అయినా.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. దర్శకుడు గౌతమ్ గారు ‘కింగ్‌డమ్’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజయ్ దేవరకొండ గారికి తన వర్క్ పట్ల ఎంతో డెడికేషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం విజయ్ పడిన కష్టాన్ని త్వరలో ప్రేక్షకులు స్క్రీన్ పై చూడబోతున్నారు. అనిరుధ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నాగవంశీ గారు ఒకే సమయంలో ఎన్నో సినిమాలు నిర్మిస్తున్నా.. ప్రతి సినిమాపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. జూలై 31న విడుదలవుతున్న ‘కింగ్‌డమ్’ మీ అందరికీ నచ్చుతుందని, మీ హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నాను.” అన్నారు.
 నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ ‘కింగ్‌డమ్’ సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. నేను, గౌతమ్ 2018లో జెర్సీ సినిమా చేసి జాతీయ అవార్డు అందుకున్నాం. ఆ తర్వాత గౌతమ్ ఐదేళ్ళ నుంచి కష్టపడి రాసిన కథ ఇది. రెండున్నరేళ్ల నుంచి ప్రొడక్షన్ లో ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్ స్టర్ సినిమాని చూపించబోతున్నాము. మీరు ట్రైలర్ లో చూసింది శాంపిల్ మాత్రమే. విజయ్ దేవరకొండ గారి అభిమానులు గత నాలుగైదు సంవత్సరాలలో ఏం మిస్ అయ్యారో.. ఆ ఇంటెన్సిటీ ఈ సినిమాలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ గారి కళ్ళలో ఏ ఇంటెన్సిటీ చూశారో.. అది ఇందులో ఉంటుంది. విజయ్ గారి కోసం నేను, గౌతమ్ 100 శాతం ఎఫర్ట్ పెట్టి.. మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. జూలై 31 విడుదలవుతున్న ఈ సినిమాని అందరూ థియేటర్లకు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.”
 ‘కింగ్‌డమ్’ కథ చాలా బలంగా, అద్భుతంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది. కేవలం యాక్షన్ తో నిండి ఉండటమే కాకుండా.. పాత్రల మధ్య బంధాన్ని చూపించే బలమైన భావోద్వేగాలను కలిగి ఉంది. సూరిగా విజయ్, శివగా సత్యదేవ్ కనిపిస్తున్నారు. ఆ పాత్రల మధ్య సన్నివేశాలు కట్టిపడేస్తున్నాయి. ఇవి లోతైన మరియు అర్థవంతమైన అనుభూతిని ఇస్తున్నాయి. మొత్తానికి బలమైన భావోద్వేగాలతో నిండిన అద్భుతమైన కథను ‘కింగ్‌డమ్’లో చూడబోతున్నామని ట్రైలర్ తో అర్థమవుతోంది. విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రజెన్స్ తో గత కొద్ది సంవత్సరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా భావోద్వేగాలను పండించడంలో ఆయన దిట్ట. ఇప్పుడు ‘కింగ్‌డమ్’ ట్రైలర్ వెండితెరపై విజయ్ అందించే గొప్ప విందును ప్రతిబింబిస్తుంది.
 ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చారు. బలమైన నాటకీయతను, భావోద్వేగ క్షణాలతో మిళితం చేస్తూ కథను చెప్పడం గౌతమ్ శైలి. ‘కింగ్‌డమ్‌’లోనూ తనదైన శైలిని చూపిస్తున్నారు. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ లు తమ కెమెరా పనితనంతో ప్రతి ఫ్రేమ్ ను అందంగా, అర్థవంతంగా చూపించారు. ఎడిటర్ నవీన్ నూలి తన పనితీరుతో ట్రైలర్‌ను మరింత శక్తివంతంగా మరియు ఆకర్షణీయంగా మలిచారు.
ఇప్పటికే ‘హృదయం లోపల’, ‘అన్నా అంటేనే’ గీతాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.. ట్రైలర్ లో అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళారు. ట్రైలర్ తో ‘కింగ్‌డమ్’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతోన్న ఈ చిత్రం సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
 సంగీతం: అనిరుధ్ రవిచందర్
 ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC కూర్పు: నవీన్ నూలి నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Kingdom Trailer Out Now: raised the expectations to the max. 
The official trailer of Kingdom starring Vijay Deverakonda has landed and looks like a blockbuster ride. Directed by Gowtam Tinnanuri and Produced by Naga Vamsi and Sai Soujanya. Film gears up for its release on July 31, 2025 The trailer tells the story in a very strong and striking way. It is not just full of action but also has many emotional moments that show the bond between the characters. The scenes between Vijay’s Suri and Satyadev’s Siva stand out with great chemistry giving the film a deep and meaningful feel. You can clearly sense the emotions and high stakes in the story. Vijay’s performance is already being hailed as his most riveting in recent years packed with raw aggression, emotional range and sheer screen presence. This trailer sets the tone for the big treat he delivers on the silver screen Gowtam brings his own style to Kingdom, mixing strong drama with smooth storytelling and emotional moments. Editor Navin Nooli adds sharp, perfect cuts that make the trailer even more powerful and engaging. Composer Anirudh Ravichander has returned with a background score that elevates every scene . Having already delivered hits like Anna Antene and Hridayam Lopala his music sets a tone for Kingdom’s emotional and narrative arcs Cinematography by Jomon T. John & Girish Gangadharan and editing by the Navin Nooli . Produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios. Looks Like All stars are aligning for a massive blockbuster on July 31.
Kingdom Trailer out Still Trailer Event (1) Trailer Event (2) (1) Kingdom Trailer Out Now

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు*

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు*
* ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు
* జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం
* మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం
* నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు
* నా అభిమానులే నాకు కొండంత బలం
* శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి
* హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి మంచితనాన్ని తక్కువగా చెప్పి ఇతర దేశాల నుంచి వచ్చి మనల్ని పాలించిన వారి గొప్పతనాన్ని ఎక్కువగా చెప్పారు అనిపిస్తుంది. భారతదేశాన్ని కేవలం 200 ఏళ్లపాటు పాలించిన మొఘల్స్ గురించిన మంచితనం అధికంగా ప్రస్తావించారు. బాబర్, అక్బర్, షాజహాన్ వంటి మొఘల్ రాజుల గొప్పతనాన్ని ఎక్కువగా చూపించి, ఔరంగజేబు వంటి రాజు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు అనిపిస్తుంది. మన కాకతీయ రాజులు, కృష్ణదేవరాయులు, రాణి రుద్రమ వంటి పరిపాలకుల చరిత్ర తక్కువగా కనిపిస్తుంది. అందుకే ఔరంగజేబు కాలంలో హిందువుగా బతకాలంటే జిజియా పన్ను కట్టే దారుణమైన రోజులను హరిహర వీరమల్లు చిత్రంలో సునిశితంగా చర్చించాం. ఔరంగజేబు చనిపోయి ఇంతకాలమైన అప్పటి దారుణాలను చెప్పాలంటే ఇప్పటికి చాలా మంది భయపడతారు. నాకు అలాంటి భయాలు లేవు. చరిత్రలో జరిగిన విషయాలను హరిహరవీరమల్లు చిత్రం ద్వారా ప్రజలకు తెలిసేలా చెప్పడం ఆనందంగా ఉంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, హరిహర వీరమల్లు చిత్ర కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గురువారం రాత్రి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావడంతో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఔరంగజేబు కాలంలో చీకటి రోజులను ఆ కాలంలో సామాన్యులు పడిన ఇబ్బందులను చిత్రంలో చక్కగా చూపించాం. మొఘల్స్ సామ్రాజ్యంలో మంచితోపాటు చెడును చెప్పాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. నేను ఏమీ చేసినా భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, దేశ ఉన్నతిని బలంగా చెప్పాలని చూస్తాను. నా మనసు అంతా భారతదేశపు ఆత్మ నిండిపోయి ఉంది. చిత్రం పార్ట్-2 కూడా 20 శాతం పూర్తయ్యింది. దీనిలో ఖాన్ అబ్దుల్ గఫూర్ గారిని దృష్టిలో పెట్టుకొని కొంత భాగం చిత్రీకరించాం. • ప్రేక్షకుడు భావోద్వేగం చెందాలి ముఖ్యంగా అప్పటి పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా కష్టం తీసుకోవాలి. హరిహర వీరమల్లు చిత్రం కథ విన్న తరువాత దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చాలా కాలం మదించాను. శ్రీ తోట తరణి లాంటి ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకు దొరకడం మా అదృష్టం. ఇలాంటి పిరియాడికల్ చిత్రం ప్రేక్షకుడిని పూర్తి భావోద్వేగంతో నింపి ఎన్నో గొప్ప అనుభూతులను ఇంటికి తీసుకెళ్లేలా చేస్తుంది. నా జీవితం మొదట నుంచి వడ్డించిన విస్తరి కాదు. ప్రతి రోజు జీవితంతో సంఘర్షిస్తూనే ఉంటాను. గత వారం రోజులుగా చిత్రం ప్రమోషన్ల నిమిత్తం సరైన నిద్ర లేదు. పూర్తి అలసటగా ఉన్నాను. ఇలా గత 28 ఏళ్లలో ఏ చిత్రానికి చేయని ప్రమోషన్లను ఈ చిత్రానికి చేశాను. ఏ.ఎం. రత్నం లాంటి నిర్మాతకు నా వంతు సాయం చేయాలని బలంగా భావించడం వల్లే ఇంత శ్రమించాను. నన్ను విమర్శించే కొందరు, రాజకీయ ప్రత్యర్థులు నా చిత్రాలను బాయ్ కాట్ చేస్తామని చెబుతున్నారు. నేను అస్సలు దీనిని పట్టించుకోను. బాయ్ కాట్ చేసినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను నటించిన ఒక సినిమా మిమ్మల్ని ఇంతలా భయపెడుతోంది అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగామో అర్థమవుతోంది. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు. ఎవరైన మన గురించి పూర్తి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే కచ్చితంగా మనం చాలా బలంగా ఉన్నామని అర్థం. నేను ఇంత బలంగా ఉన్నానంటే నా అభిమానులు ఇచ్చిన బలమే. • సినిమా చాలా ప్రభావితం చేసే మాధ్యమం ఒకప్పుడు భారతదేశంలో విదేశీ సంగీతం విస్తృతంగా వ్యాప్తి చెందిన సమయంలో భారతీయ సంగీతం గొప్పతనాన్ని, దాని ప్రాముఖ్యాన్ని అత్యంత అద్భుతంగా ప్రేక్షకులకు చూపించిన సినిమా శంకరాభరణం. ఆ సినిమా చూసిన తరువాత కర్ణాటక సంగీతం మీద, భారతదేశపు సంగీతం ఔన్నత్యం మీద గొప్ప అభిప్రాయం ఏర్పడింది. సినిమా మనిషిని బలంగా ప్రభావితం చేస్తుంది. సినిమాలోని కథ, కథనం, పాత్రలు కచ్చితంగా మన ఆలోచనను మారుస్తారు. దానిలో లీనమయ్యేలా మారుస్తాయి. అంతటి గొప్ప బలం సినిమాకు ఉంది. హరిహర వీరమల్లు సినిమా చూసిన చాలా మంది కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్లు చెబుతున్నారు. దానిని కచ్చితంగా సరిదిద్దుకుంటాం. నా అభిమానులు సున్నితంగా అయిపోవద్దు. శత్రువు ఎంత బలంగా మనపై దాడి చేస్తే అంత బలంగా ఎదుర్కొని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. కోహినూర్ వజ్రం కంటే విలువైన గొప్ప ధర్మం భారతదేశంలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, జ్ఞానం, విజ్ఞానం, కలగలిపిన గొప్ప భూమి ఇది. దీనినే చిత్రంలోనూ చూపించాం. నాకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా వాటిని అధిగమిస్తూనే నా జీవిత ప్రయాణాన్ని గొప్పగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి కష్టాన్ని దాటుకొంటూ కాలర్ ఎగరేయకుండా… ఆ దాటే క్రమాన్ని చక్కగా అనుభవాలు, అనుభూతులుగా మిగుల్చుకుంటాను. హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సహకరించిన పీపుల్స్ మీడియా శ్రీ విశ్వప్రసాద్ గారికి, నిర్మాత రత్నం గారికి ధన్యవాదాలు, చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, చిత్ర బృందానికి అభినందనలు’’ అన్నారు.

PHOTO-2025-07-24-23-36-59 (1) PHOTO-2025-07-24-23-36-59 PHOTO-2025-07-24-22-40-13 (1) PHOTO-2025-07-24-22-40-13