Dec 26 2022
Posts by Venugopal L:
Dec 24 2022
Bobby Deol comes on board for Hari Hara Veera Mallu, set to play the Mughal emperor Aurangzeb
‘హరి హర వీర మల్లు’లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్
భారతీయ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రాలలో ‘హరి హర వీర మల్లు’ ఒకటి. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎంతో ప్రతిభ గల క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియన్ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. జీన్స్, ప్రేమికుల రోజు, భారతీయుడు వంటి హద్దులు చెరిపేసే భారీ చిత్రాలతో గొప్ప అనుభవం సంపాదించిన ఎ.ఎం. రత్నం.. ఇప్పుడు కూడా అద్భుతమైన చిత్రాన్ని అందించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది.
ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.
హరి హర వీర మల్లు చిత్ర యూనిట్ ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో 40 రోజుల పాటు 900 మంది సిబ్బందితో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన భారీ షెడ్యూల్‌ను ముగించారు. ఆ షూట్‌కు ముందు ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణులతో ప్రత్యేక ప్రీ-షెడ్యూల్ వర్క్‌షాప్ నిర్వహించారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆలోచనకు జీవం పోయడానికి.. తోట తరణి మొఘల్ యుగాన్ని పునఃసృష్టి చేయడానికి అన్ని విధాలా శ్రమిస్తున్నారు.
ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి వెండితెరపై గొప్ప అనుభూతిని పంచాలన్న ఉద్దేశంతో చిత్రం బృందం ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కొన్ని వారాల క్రితం విడుదలైన హరి హర వీర మల్లు గ్లింప్స్ కి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
విర్క్, డానిష్, భరత్ భాటియా, నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి
డి ఓ పి: వి.ఎస్. జ్ఞానశేఖర్
సంగీతం: ఎం ఎం. కీరవాణి
మాటలు: సాయి మాధవ్ బుర్రా
పాటలు: సిరివెన్నెలసీతారామశాస్త్రి, చంద్రబోస్
ఎడిటర్: కె యల్. ప్రవీణ్
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి
పోరాటాలు: విజయ్, రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతన్, బెన్ లాక్
కాస్ట్యూమ్స్ డిజైనర్: ఐశ్వర్య రాజీవ్
కో-డైరక్టర్: వి.వి. సూర్యకుమార్
పి ఆర్ ఓ: లక్ష్మీ వేణుగోపాల్
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్
నిర్మాత: ఎ.దయాకర్ రావు
సమర్పణ: ఎ.ఎం. రత్నం
దర్శకత్వం: క్రిష్
Bobby Deol comes on board for Hari Hara Veera Mallu, set to play the Mughal emperor Aurangzeb
Hari Hara Veera Mallu is one of the most-awaited, prestigious projects in Indian cinema, starring Pawan Kalyan and Nidhhi Agerwal in the lead roles. Directed by visionary filmmaker Krish Jagarlamudi and presented by AM Rathnam on a massive scale under Mega Surya Production, there’s immense hype surrounding the pan-Indian film that will release in five languages – Telugu, Tamil, Kannada, Malayalam and Hindi. From Jeans to Premikula Roju to Bharatheeyudu, AM Rathnam comes with great experience in producing lavish films that cross barriers and he’s leaving no stone unturned to back a potential masterpiece now too. Well, his much-anticipated project has yet another impressive addition.
Yes, you heard it right! Popular Hindi film actor Bobby Deol has officially joined the team of the historic action film today. He is cast as the Mughal emperor Aurangzeb in the project and commenced his portions in Hyderabad. A massive ‘darbar’ set, intricately designed by Thota Tharani, dating back to the 17th century, has been erected for the schedule. Crucial scenes in the darbar featuring Pawan Kalyan and Bobby Deol will be filmed on the set. In a special video released by the makers, the team of Hari Hara Veera Mallu is seen offering a grand welcome to the actor, who’s seen sporting a stylish stubble.
The makers of Hari Hara Veera Mallu recently wrapped an extensive schedule spanning 40 days in Ramoji Film City where crucial action sequences with over 900 crew members were filmed. A special pre-schedule workshop was held prior to the shoot with the primary cast and crew in attendance. Veteran production designer Thota Tharani is pulling all the stops to recreate the Mughal era while bringing filmmaker Krish Jagarlamudi’s spectacular vision to life.
The team is paying heed to the little details of the grand universe so that viewers relish every bit of the out-of-the-world experience on the big screen. A special glimpse of Hari Hara Veera Mallu, launched a few weeks ago, has created the right noise in trade circles and film buffs alike. With cinematography by VS Gnanashekar and music by MM Keeravaani, Hari Hara Veera Mallu is produced by Dayakar Rao. Virk, Danish, Bharat Bhatia, Najar,Raghubabu, Narra sreenu, Suneel, Subbaraju, Nura phatehi, Anasuya, Pojita Ponnada too essay important roles. More details about the film will be out shortly.
Cast & Crew
Featuring: Pawan Kalyan & Niddhi Agerwal
BobyDeol, Virk, Danish, Bharat Bhatia, Najar,Raghubabu, Narra sreenu, Suneel, Subbaraju, Nura phatehi, Anasuya, Pojita Ponnada etc
Presented by AM Rathnam
Direction: Krish Jagarlamudi
Producer: A. Dayakar Rao
Banner: Mega Surya Production
Cinematography: Gnanashekar VS
Music: MM Keeravani
Editor: KL Praveen
Dialogues: Sai Madhav Burra
Visual Effects: Hari Hara suthan,Ben Lock
Production Designer: Thota Tharani
Stunts: Vijay, Ram-Laxman, Sham Kaushal, Dileep Subbarayan
Lyrics: ‘Sirivennela’ Seetharama Sastry, Chandrabose
Costume Designer: Aiswarya Rajeev
PRO: LakshmiVenugopal
Dec 11 2022
Ustaad Bhagat Singh Matter poster & Stills
Nov 20 2022
అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు – Pawankalyan
అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక
అభినందనలు
తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి
గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం
వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం
ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక
వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి
హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు
దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా
ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై
అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో
ఆనందిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
Nov 17 2022
Dhanush’s Telugu-Tamil bilingual Sir/Vaathi set to hit theatres on February 17, 2023
ధనుష్ ‘సార్’ 17 ఫిబ్రవరి
2023 న విడుదల
*ఆకట్టకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు) ’వాతి’,(తమిళం) చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉన్నది. ఈ చిత్రాన్ని వచ్చేఏడాది 2023, ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు ధనుష్ కళాశాల మెట్లమీద ఎంతో స్టైలిష్ గా కూర్చుని ఉన్న వైనం అభిమానుల్ని అలరిస్తుంది. అలాగే ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు‘ గీతం చాట్ బస్టర్స్ లో అగ్రగామిగా నిలవడంతో పాటు, చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు ‘సార్‘ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీద సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు, ఆలోచింప చేస్తాయి.
తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ 17 ఫిబ్రవరి, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.
తారాగణం: ధనుష్, సంయుక్తా మీనన్, సాయికుమార్, తనికెళ్ల భరణి , సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రాఫర్: జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: నాగవంశీ ఎస్. – సాయి సౌజన్య
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Dhanush’s Telugu-Tamil bilingual Sir/Vaathi set to hit theatres on February 17, 2023
Leading producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments is joining forces with Sai Soujanya of Fortune Four Cinemas for a bilingual film Sir (Telugu)/Vaathi (Tamil), headlined by national-award winning actor Dhanush. Srikara Studios is presenting the film. Venky Atluri is the writer and director of the prestigious project. Samyuktha Menon plays the female lead.
The makers of Sir/Vaathi announced the film’s release date today. The film will release simultaneously in Telugu and Tamil across the globe on February 17, 2023. In the release date announcement poster, Dhanush, dressed in a blue formal shirt, is flamboyantly sitting on the stairs in a college surrounded by a group of students.
Sir/Vaathi has wrapped up shoot and the post-production formalities are progressing at a brisk pace. The film’s teaser and the first single, Mastaaru Mastaaru, released recently, opened to unanimously positive responses from film buffs. Sai Kumar, Tanikella Bharani, Samuthirakani, Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu, Motta Rajendran, Hareesh Peradi and Praveena too play crucial roles in the film.
J Yuvraj cranks the camera for the film with national award-winning composer GV Prakash coming up with the background score. Navin Nooli is the editor and Avinash Kolla is the production designer. Venkat handles the action choreography.
Follow Us!