About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Rang De Is Pure Love Story; Bless Us With A Hit – Hero Nithiin

ప్యూర్ ల‌వ్ స్టోరీ ‘రంగ్ దే’ని ప్రేమ‌తో చూసి, మాకు హిట్టివ్వండి
- హీరో నితిన్‌

* అశేష అభిమానుల మ‌ధ్య క‌ర్నూలులో గ్రాండ్‌గా ‘రంగ్ దే’ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌
* ఆద్యంతం న‌వ్వుల‌తో అల‌రించిన ట్రైల‌ర్
* అభిమానుల‌తో సెల్ఫీలు దిగిన నితిన్
* సెన్సార్ పూర్తి.. యు/ఎ స‌ర్టిఫికెట్‌‌‌
నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ‘రంగ్ దే’ సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ శుక్ర‌వారం రాత్రి క‌ర్నూలులో నితిన్ ఫ్యాన్స్‌, ప్రజల హర్షధ్వానాల మ‌ధ్య గ్రాండ్‌గా జ‌రిగింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశి నిర్మిస్తున్నారు. మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ‘రంగ్ దే’ విడుద‌ల‌వుతోంది.ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో జ‌రిగిన ‘రంగ్ దే’ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో క‌ర్నూలుకు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, ‘రంగ్ దే’ ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. క‌ర్నూలుకు త‌ర‌చూ వ‌చ్చి సినిమా షూటింగ్స్ చేయాల‌ని నితిన్‌ను కోరారు.

కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్ మాట్లాడుతూ, ‘రంగ్ దే’ సినిమా పెద్ద హిట్ట‌వ్వాల‌ని, నితిన్‌కు మంచి పేరు రావాల‌ని ఆకాంక్షించారు.

క‌ర్నూలు మునిసిప‌ల్ క‌మిష‌నర్ బాలాజీ మాట్లాడుతూ, తాను ఐఏఎస్‌కు ప్రిపేర‌య్యేట‌ప్పుడు కూడా ప్ర‌తి వారం ఓ సినిమా చూసేవాడిన‌ని తెలిపారు. దిల్ నుంచి నితిన్ సినిమాల‌న్నీ చూశాన‌ని చెప్పారు. ‘రంగ్ దే’ మూవీ హిట్ట‌వ్వాల‌నే ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. ఈ సినిమాని ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూస్తామ‌న్నారు.

క‌ర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మెహ‌బూబ్ బాషా సినిమా క‌చ్చితంగా హిట్ట‌వుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

డీజీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యేలు హ‌ఫీజ్ ఖాన్‌, సుధాక‌ర్ క‌లిసి రంగ్ దే ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు.

డీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ, “నితిన్ మాకు క‌ర్నూలు బిడ్డ‌. ఆయ‌న బంధువులు మా కొలీగ్‌. ప్ర‌తి మూవీలో నితిన్‌ మ‌రింత యంగ్‌గా త‌యార‌వుతున్నారు. ‘రంగ్ దే’లో మ‌రింత యంగ్‌గా క‌నిపిస్తున్నారు. క‌ర్నూలులో షూటింగ్ చేసిన సినిమాల్లో 99 శాతం హిట్‌. ‘రంగ్ దే’ పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నా.” అన్నారు.

నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశి మాట్లాడుతూ, “త‌క్కువ స‌మ‌యంలో పిలిచినా వ‌చ్చి ఇంత బాగా ఆద‌రించిన క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు థాంక్స్‌. 26న వ‌స్తున్న సినిమాని కూడా ఇలాగే ఆద‌రించి పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నా.” అన్నారు.

న‌టుడు అభిన‌వ్ గోమ‌టం మాట్లాడుతూ, “మా సినిమా ‘రంగ్ దే’ మార్చి 26న వ‌స్తోంది. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఒక సంవ‌త్స‌రం క‌ష్ట‌ప‌డి తీశారు. లాక్‌డౌన్ వ‌ల్ల కాస్త ఆల‌స్యం అయ్యింది. సినిమా మ‌స్తుంట‌ది. త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌కు వెళ్లి చూడండి. సాంగ్స్‌లో నితిన్ ఎట్లా డాన్స్ చేస్తారో తెలిసిందే క‌దా. నితిన్‌, సుహాస్‌, వెన్నెల కిశోర్, నేను క‌లిసి మ‌స్తు కామెడీ చేశాం ఈ సినిమాలో..” అన్నారు.

నితిన్ మాట్లాడుతూ, ట్రైల‌ర్‌ను లాంచ్ చేసిన హ‌ఫీజ్ ఖాన్‌, సుధాక‌ర్‌, భ‌ర‌త్‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. “క‌ర్నూలు రావ‌డం నాకిదే ఫ‌స్ట్ టైమ్‌. క‌ర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్క‌డ తీసిన సినిమాలు హిట్ట‌య్యాయి. ఆ ప్లేసెంత ప‌వ‌ర్‌ఫుల్లో మీరింకా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్‌కు చాలా ఊళ్ల‌కు వెళ్లాను. అక్క‌డ అంద‌రి ఎన‌ర్జీ చాలా బావుంట‌ది. కానీ మీ ఎన‌ర్జీ దానికంటే ఓ లెవ‌ల్ ఎక్కువ ఉంది. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ చాలా చాలా బావుంది. మార్చి 26 సినిమా వ‌స్తోంది. ప్యూర్ ల‌వ్ స్టోరీ. మామూలుగా రాయ‌ల‌సీమ అంటే ఉట్టి మాస్‌, ఫ్యాక్ష‌న్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ల‌వ్ ఎక్కువ ఉంది. అందుకే ఫ‌స్ట్ ఈ ఈవెంట్‌ను ఇక్క‌డ పెట్టాం. ఇదే ప్రేమ‌తో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి.” అన్నారు.

అంత‌కు ముందు సువ‌ర్ణ అనే అభిమాని నితిన్‌ను “పెళ్ల‌య్యాక స‌న్న‌బ‌డ్డారు కార‌ణ‌మేంటి?” అన‌డిగితే, “ఇంట్లో ప‌నిచేసి, బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయాను.” అని నితిన్ చ‌మ‌త్క‌రించారు. అలాగే ఆయ‌న అభిమానుల‌తో క‌లిసి సెల్ఫీలు దిగి వారిని ఆనంద‌ప‌రిచారు.

శ్రేయాస్ మీడియా ఆర్గ‌నైజ్ చేసిన ఈ ఈవెంట్‌కు శ్యామ‌ల, భార్గ‌వ్‌ యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఆక‌ట్టుకున్న ట్రైల‌ర్‌:

2 నిమిషాల 20 సెక‌న్ల నిడివి ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే, ‘రంగ్ దే’ మూవీ క‌థ సారాంశం మ‌న‌కు అర్థ‌మైపోతోంది. చ‌క్క‌ని రొమాన్స్‌, కామెడీ క‌ల‌గ‌ల‌సిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీని డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది.

“నేను అర్జున్‌.. దేవుడ్ని నాకొక గాళ్‌ఫ్రెండ్‌ని ప్ర‌సాదించ‌మ‌ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెక‌న్‌కి ఒక పాప మా కాల‌నీకి వ‌చ్చింది. అప్ప‌ట్నుంచి తొక్క‌టం స్టార్ట్ చేసింది.. నా జీవితాన్ని.” అని అర్జున్ (నితిన్) చెప్తుండ‌గా ట్రైల‌ర్ స్టార్ట‌యింది. అప్పుడు అర్జున్ బాగా చిన్నోడు. ఆ పాపే పెద్ద‌య్యాక అను (కీర్తి సురేష్‌) అయ్యింది.

మ‌నోడు స్ట‌డీస్‌లో బాగా పూర్ అయితే, అను జీనియ‌స్‌. అర్జున్ ఎగ్జామ్స్‌లో ఫెయిలైతే, అనుకు 95 ప‌ర్సెంట్ మార్క్స్ వ‌స్తాయి. ఆమె వ‌ల్ల ఫ్యామిలీలో అర్జున్‌కు అడుగ‌డుగునా అవ‌మానాలు ఎదుర‌వుతుంటాయి. దాంతో ఫ్ర‌స్ట్రేష‌న్‌కు గురై, అనును ఎలాగైనా వ‌దిలించేసుకోవాల‌ని ట్రై చేస్తుంటాడు. అనుకి మాత్రం అత‌డంటే చాలా ఇష్ట‌మ‌ని ట్రైల‌ర్‌ని బ‌ట్టి ఊహించుకోవ‌చ్చు.

అనుకు క‌డుపు వ‌చ్చింద‌ని, ఈ సంగ‌తి తెలిసి వాళ్ల‌మ్మ అనును చెంప‌మీద ఎడాపెడా వాయించేసిందని అర్థ‌మ‌వుతోంది. “ఇంత చేసిందాన్ని ఇంకే ఎద‌వ పెళ్లి చేసుకుంటాడ‌న్న‌య్యా” అని అర్జున్ ఫాద‌ర్ ద‌గ్గ‌ర మొర‌పెట్టుకుంది. దాంతో అనుని అర్జున్‌కే ఇచ్చి పెళ్లి చేసేశారు.

కానీ ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు పెరిగి పెద్ద‌వ‌య్యాయే కానీ, త‌గ్గ‌లేదు. ఇద్ద‌రూ విడిపోయారు. “మ‌నం ప్రేమించే వాళ్ల విలువ మ‌నం వాళ్ల‌ను వ‌ద్ద‌నుకున్న‌ప్పుడు కాదు, వాళ్లు మ‌న‌ల్ని అఖ్ఖ‌ర్లేద‌నుకున్న‌ప్పుడు తెలుస్తుంది.” అని అర్జున్ మాట‌లు బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంటే.. కీర్తి విసురుగా న‌డుస్తూ ఏడుస్తుండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ట్రైల‌ర్ చివ‌ర‌లో “మ‌న అనూకి ఏం త‌క్కువ‌రా?” అడిగాడు అర్జున్‌ను వాళ్ల నాన్న‌. “అది నాకు న‌చ్చ‌దు నాన్నా” అన్నాడు అర్జున్‌. “అదే ఏ..” అని రెట్టించాడు నాన్న‌. “నీకు ఫిష్ న‌చ్చ‌దు. ఎవ‌ర‌న్నా హార్ట్‌కి మంచిది.. తినండంటే తింటావా? ఇదీ అంతే.” అని చెప్పాడు అర్జున్‌.
“నాకు ఫిష్ న‌చ్చ‌దు, నేను ముట్టుకోను. నువ్వు ముట్టుకోకుండానే నీ ఫిష్‌కి క‌డుపొచ్చిందా?” అని ప్ర‌శ్నించాడు నాన్న‌.
“నాన్నా.. ఛీ..” అని త‌ల తిప్పుకున్నాడు అర్జున్‌.

ఇట్లా ఆస‌క్తిక‌ర అంశాల‌తో, ఉత్కంఠ‌ని రేకెత్తించే క‌థ‌నంతో ఈ సినిమా రూపొందింద‌ని తెలిసిపోతోంది. డైలాగ్స్ కూడా ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అనే విష‌యం ట్రైల‌ర్ తెలియ‌జేస్తోంది. ఇక రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకోగా, నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ పి.సి. శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాని ఆక‌ర్ష‌ణీయంగా మ‌ల‌చింది.

సెన్సార్ పూర్తి.. యు/ఎ స‌ర్టిఫికెట్‌:
‘రంగ్ దే’ సినిమా శుక్ర‌వారం సెన్సార్ ప‌నుల్ని పూర్తి చేసుకొని, యు/ఎ స‌ర్టిఫికెట్ పొందింది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌వ్విస్తూ, చ‌క్క‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించింద‌ని సెన్సార్ స‌భ్యులు ఈ చిత్రాన్ని కొనియాడారు.

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ
‘రంగ్ దే’.  ’ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
 
Rang De Is Pure Love Story; Bless Us With A Hit – Hero Nithiin• Grand Trailer Launch Event held in Kurnool
• Nithiin clicks selfies with fans
• Rang De wraps up censor and gets ‘U/A’ certificateThe trailer launch event of ‘Rang De’ starring Nithiin and Keerthy Suresh in the lead roles was held in Kurnool amidst the presence of Nithiin fans and audiences. A directorial of Venky Atluri, the film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments banner. The film is all set for a worldwide release on March 26th.

The event by was graced MLAs and others. Speaking on the occasion, Kurnool MLA Abdul Hafeez Khan wished the team of ‘Rang De’ good luck. He also appealed to Nithiin and film industry people to shoot their films in the city.

Kodumur MLA Sudhakar conveyed his best wishes to ‘Rang De’ team.

Kurnool Municipal Commissioner Balaji also graced the event. Addressing the event he said, “During his preparation for civil services, he used to watch films every weekend. I watched every film of Nithiin from ‘Dil’ and I wish him all the best for ‘Rang De.’ I will be watching this movie on first day for first show,” said Balaji.

Kurnool DG Bharat, Kurnool Traffic DSP Mehboob Basha were also part of the guest list.

Speaking DG Bharat said, “Nithiin is son of Kurnool. He is looking very young with every film and in ‘Rang De’ he appears even more handsome. Films shot in Kurnool have turned into huge blockbusters and I wish that ‘Rang De’ will also become hugely successful.”

Producer Naga Vamsi said, “Within a short notice, many guests graced this event. I would like to thank each one of them. Special thanks to the people of Kurnool and on 26th of this month, we expect the same reception for our ‘Rang De.’ We hope the film becomes a big hit.”

Comedian Abhinav addressed the event. “Our film ‘Rang De’ is arriving at the box office on March 26th. This is a complete family entertainer and everyone worked very hard for this film for one year. Due to lockdown the film got little delayed but there will be ample of entertainment and watch it only in theatres. Nithiin, Vennela Kishore, Suhaas and myself will provide good laughs for sure.”

Last but not least hero Nithiin entertained the fans. Speaking he said, “I would like to thank MLAs Hafeez Khan, Sudhakar and DG Bharat for launching the trailer. This is my visit to Kurnool and I’m humbled by your love. Kurnool is famous for Kondareddy Buruju and all the films shot on his backdrop were blockbusters. I see the same power in all of you and I like the energy in you all. Generally they say Rayalaseema is famous for mass and faction films but I witnessed a huge love and so we are arriving with a pure love story on March 26th. Watch ‘Rang De’ with the same love and bless me and my team.”

On the absence of the heroine and director, Nithiin said, Keerthy Suresh and Venky Atluri gave hand in the last minute.

Before Nithiin addressing the gathering, he interacted with fans. A female fan told him that after wedding, he has become skinnier. Replying Nithiin said, “Yes I’m doing a lot of household works and stuff. This is the result.” He went into the public and clicked a few selfies with fans.

Rang De Trailer launch event was organised by Shreyas Media while Shyamala and Bhargav were the hosts.

Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh, Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram, Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
pro: Lakshmivenugopal
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.
DSC_3613 DSC_3619 DSC_3609 DSC_33530139 DSC_33600144 DSC_33660150 DSC_33710154 DSC_33770160 DSC_35630020 DSC_33430129 DSC_31850001 DSC_31880004 DSC_31910006

 

*Powerstar Pawan Kalyan’s Epic magnum opus titled ‘Hari Hara Veeramallu.’

*Powerstar Pawan Kalyan’s Epic magnum opus titled ‘Hari Hara Veeramallu.’ 

*First Look Glimpse Unveiled 

* Mega Surya Production is making this grandeur budget film with 150Cr 

*Grand Release For Sankranthi 2022

Powerstar Pawan Kalyan and Crafty Director Krish Jagarlamudi’s Legendary Heroic OutLaw Film Titled ‘Hari Hara Veeramallu’; A production of legendary producer AM Ratnam on Mega Surya Production banner.

On the auspicious occasion of Maha Shivaratri, the title and first look glimpse of Powerstar Pawan Kalyan’s forthcoming epic movie under the direction of Krish Jagarlamudi and production of legendary producer AM Ratnam on Mega Surya Production banner are revealed. This magnum opus is titled ‘Hari Hara Veeramallu’ and the first glimpse is extraordinary in its own way.

Powerstar Pawan Kalyan is essaying the title role. *In the video* Pawan’s look is completely refreshing and from tip to toe there can be noticed a clear makeover. It’s a never before look of Pawan and crafty *director Krish’s taking is superb* which is *terrifically complemented by Keeravani’s music* and *the grandeur visuals* go with the flow.

This is the story of legendary heroic outlaw,” says director Krish who is a magician in this space of genres and this film will have his trademark elements. This massive film ‘Hari Hara Veeramallu’ is set in the period of 17th century on the backdrop of Moghuls and Qutub Shahis era and it will offer spectacular visual feast. This is an untold story in Indian cinema and will truly be spellbound.

Gigantic sets like Charminar, Red Fort and Machilipatnam port are assembled for the film’s shooting which means it is being made on a lavish budget of ₹ 150 crore with uncompromising grandeur production values.

So far ‘Hari Hara Veeramallu’ has wrapped up forty percent of its shooting and the makers are hopeful to wrap it up by July and then head to the post-production works. Being a period drama film, six months’ time is dedicated for VFX and it will be supervised by Ben Lock who was associated with Hollywood films earlier.

Nidhhi Agerwal is playing the female lead.

Top technicians such as MM Keeravani and ace cinematographer Gnana Shekar VS are handling music and camera respectively for this film.

Also the film is being made on a pan-India level and will get a simultaneous release in Hindi, Tamil, and Malayalam languages along with Telugu.

‘Hari Hara Veeramallu’ is slated for 2022 Sankranthi release.

Crew:

Presented by AM Ratnam

Direction: Krish Jagarlamudi

Producer: A. Dayakar Rao

Banner: Mega Surya Production

Cinematography: Gnanashekar VS

Music: MM Keeravani

Editor: Sravan

Dialogues: Sai Madhav Burra

Visual Effects: Ben Lock

Production Designer: Rajeevan

Stunts: Ram-Laxman, Sham Kaushal, Dileep Subbarayan

Lyrics: ‘Sirivennela’ Seetharama Sastry, Chandrabose

Costume Designer: Aiswarya Rajeev

PRO: LakshmiVenugopal

 

 *ప‌వ‌ర్‌స్టార్ పవన్ క‌ల్యాణ్ ఎపిక్ మాగ్న‌మ్ ఓప‌స్ టైటిల్  ’హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’

*ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్ విడుద‌ల*
రూ. 150 కోట్ల‌తో మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్ గ్రాండియ‌ర్‌గా నిర్మిస్తోన్న చిత్రం
*2022 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్


పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌కు ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’  అనే టైటిల్ ఖ‌రారు చేశారు. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ  ప్రొడ్యూస‌ర్ఎ.ఎం. ర‌త్నం ఈ ఎపిక్‌ చిత్రానికి సమర్పకులు.
మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ’హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ ఫ‌స్ట్ లుక్  గ్లిమ్స్‌ను విడుద‌ల చేశారు. ఆ లుక్‌నుచూడ‌గానే అద్భుతంగా అనిపిస్తోంది.
‘ హరి హర వీరమల్లు’ గా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ తొలి
దృశ్యమాలిక‌లో పవన్ లుక్  పూర్తిగా కొత్త‌ద‌నంతో క‌నిపిస్తోంది. పై నుంచి కింద దాకా ఆయ‌న రూపం పూర్తిగా మారిపోయింద‌ని స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇది మ‌నం గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపం. డైరెక్ట‌ర్ క్రిష్అద్భుత‌మైన విజ‌న్‌కు త‌గ్గ‌ట్లు కీర‌వాణి టెర్ర‌ఫిక్ మ్యూజిక్‌, గ్రాండియ‌ర్ విజువ‌ల్స్‌తో ఈ ఫ‌స్ట్ గ్లిమ్స్ అపూర్వం గాఉంది.
“ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ.” అని డైరెక్ట‌ర్ క్రిష్ చెప్పారు. నేటి త‌రం
ద‌ర్శ‌కుల్లో ఒకఇంద్ర‌జాలికుడు లాంటి ఆయ‌న త‌న ట్రేడ్‌మార్క్ అంశాల‌తో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైనవిజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. క‌చ్చితంగాఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని
ఇస్తుంది.
ఈ చిత్రం షూటింగ్ కోసం చార్మినార్, రెడ్ ఫోర్ట్, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. అంటే.. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్నిరూపొందిస్తున్నారు.
ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ నలభై శాతం పూర్త‌యింది. జూలై నాటికి మొత్తం చిత్రీక‌ర‌ణ‌నుపూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్తామ‌నే ఆశాభావాన్ని నిర్మాత‌ ఎ. ద‌యాక‌ర్ రావు వ్యక్తం చేశారు. పీరియడ్ డ్రామా ఫిల్మ్ కావడంతో, వీఎఫ్ఎక్స్ ప‌నుల కోస‌మే ఆరు నెలల సమయాన్ని కేటాయించారు. ప‌లుహాలీవుడ్ చిత్రాల‌కు ప‌నిచేసిన బెన్ లాక్ ఈ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను పర్యవేక్షిస్తారు.
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు
అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.
పాన్‌ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.
2022 సంక్రాంతికి ’హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.
సాంకేతిక బృందం:

స‌మ‌ర్ప‌ణ‌: ఎ.ఎం. ర‌త్నం, ద‌ర్శ‌క‌త్వం: క్రిష్ జాగ‌ర్ల‌మూడి, నిర్మాత‌: ఎ. ద‌యాక‌ర్ రావు, బ్యాన‌ర్‌: మెగా సూర్యా ప్రొడ‌క్ష‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. మ్యూజిక్‌: ఎం.ఎం. కీర‌వాణి

పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, చంద్ర‌బోస్‌ ,  డైలాగ్స్‌: సాయి మాధవ్ బుర్రా

ఎడిటింగ్‌: శ్రావ‌ణ్‌, , విజువ‌ల్ ఎఫెక్ట్స్‌: బెన్ లాక్ ‌ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌, స్టంట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, శ్యామ్ కౌశ‌ల్‌, దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఐశ్వ‌ర్ రాజీవ్ , పిఆర్వో: ల‌క్ష్మీ వేణుగోపాల్‌.‌

 

TELUGU ENGLISH HINDI TAMIL MALAYALAM PLAIN-STILL

*Nithin, Keerthy Suresh’s Rang De movie’s song has been released.

*‘నితిన్, కీర్తి సురేష్‘ ల ’రంగ్ దే’  చిత్రం నుంచి విడుదల అయిన మరో  గీతం 

* యూత్ స్టార్ నితిన్ అండ్ కో  పై చిత్రీకరించిన సందర్భోచిత గీతం.
*కథానాయకుడు నితిన్ పరిచయ గీతం ఇదంటున్న గీత రచయిత శ్రీ మణియూత్ స్టార్  ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ’రంగ్ దే’ చిత్ర లోని మరో గీతం ఈరోజు  విడుదల అయింది.

కథానుసారం చిత్ర కథా నాయకుడు పరిచయ గీతం గా కనిపించే, వినిపించే ఈ సందర్భోచిత గీతం  వివరాల్లోకి వెళితే …..
” సన్ లైట్ ను చూసి నేర్చుకుని ఉంటే
ఫుల్ మూన్ కూల్ గా ఉండేవాడా
క్లాస్ మేట్  ని చూసి నేర్చుకుని ఉంటే
ఐన్ సైంటిస్ట్  అయ్యే వాడా….?”
అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు డేవిడ్ సీమన్  గాత్రంలో ఈ గీతం హుషారుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు ముఖ్యంగా యువతను, అలాగే సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి.  నితిన్ తో పాటు చిత్రంలోఅతని మిత్రులు అభినవ్ గోమటం, సుహాస్ బృందంపై  శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఈ గీతాన్ని వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి..
చిత్ర కథానుసారం కథానాయకుడు పరిచయ గీతం గా ఇది వస్తుంది అని తెలిపారు గీత రచయిత శ్రీ మణి. చిత్రంలోని ప్రతిపాట సందర్భ శుద్ధి గానే సాగుతాయి. కథను చెబుతాయి. ఈ పాట కూడా అంతే. దర్శకుడు వెంకీ గారు చిత్రం లో పాట కు ఉండే సందర్భాన్ని వివరించే తీరు  పాటలు ఇంత బాగా రావటానికి కారణం ఆన్నారు శ్రీ మణి.
‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం వరుసగా విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, లిరికల్ వీడియో గీతాలు మరింత పెరిగేలా చేస్తూనే ఉన్నాయి.
యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం
‘రంగ్ దే’. ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
 
*Nithin, Keerthy Suresh’s Rang De movie’s  song has been released. 
*Youth Star Nithiin and co are featuring in this peppy song.
*Nithin’s introductory song written by  Srimani
Youth Star Nithiin, Keerthy Suresh’s Rang De movie’s  song has been released. More details about the introductory song of the hero -
Srimani has penned ghe lyrics for this song. David Simon has lent his voice for the vocals. Devi Sri Prasad has composed this song in a fashion to attract both the youth and music lovers. Other than the lead actor Nithin, his friends Abhinav Gomatam and Suhas are featured in the song. Shekhar Master’s choreography teamed up with Venky Atluri’s direction has ensured that this song would be a spectacle on the silver screen
According to the story, this song is the introductory song for the hero. The lyrics have been penned by Srimani. All the songs in the movie are situational songs which take the story forward.   Director Venky Atluri’s vision of emotion is the primary reason for the song’s to have garnered such popularity according to the lyrist Srimani.
On the occasion of ‘Rang De’ releasing on March 26th the promotions and the related events have been ramped up the the team. Youth Star ‘Nithiin’ and leading actress ‘Keerthy Suresh’s combination on the silver screen promises to be enthralling and mesmerizing going by the articles, videos and songs that have been released so far.
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.
out now Still-CN Lyric-RangDe-01 Still (1) Still-CN-4-RangDe CN-RangDe-Still

With the blessings of Puri Jagannadh, Sai Raam Shankar’s Bumper Offer 2 Announced

* సాయిరాం శంకర్  హీరోగా ‘బంపర్ ఆఫర్ – 2′
*ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలిపిన డేరింగ్ అండ్ డాషింగ్  దర్శకుడు పూరి జగన్నాథ్ 
* రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించనున్న దర్శకుడు జయ రవీంద్ర
*ఉగాది శుభాకాంక్షలతో చిత్రం షూటింగ్ ప్రారంభం
* సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంస్థలు సంయుక్త నిర్మాణం
ఓ చిత్రం విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయటం ఓ పద్ధతి. అదే చిత్రం పేరును కొనసాగిస్తూ కొత్త కథను తెరకెక్కించడం మరో పద్ధతి. ఇప్పుడీ రెండో పద్దతిలోనే ఓ చిత్రం ఈరోజు పురుడు పోసుకుంది.
యువ హీరో సాయిరాం శంకర్  హీరోగా గతంలో రూపొందిన ‘బంపర్ ఆఫర్’ చిత్రం, సాధించిన విజయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ ‘బంపర్ ఆఫర్ – 2′ పేరుతో ఓ చిత్రం నిర్మితం కానుంది. వివరాల్లోకి వెళితే…..
తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరుచుకున్న డేరింగ్ అండ్ డాషింగ్  దర్శకుడు పూరి జగన్నాథ్  గారి ఆశీర్వాదం తో, సురేష్ విజయ ప్రొడక్షన్స్ మరియు సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో సాయిరాం శంకర్ హీరోగా సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్ లు నిర్మాతలుగా ‘బంపర్ ఆఫర్ 2′ చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
‘బంపర్ ఆఫర్’ విజయం నేపథ్యంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అదే పేరు మీద రెండవ భాగం చేస్తున్నారు. అయితే ఇది సీక్వెల్ కాదు, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించబోతున్నారు. ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగాని కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అశోక స్క్రిప్ట్ రచన చేశారు.  ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఉగాది శుభాకాంక్షలతో ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్ మరియు ఇతర తారాగణం,సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చుతుండగా, పప్పు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు,ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు మరియు ఆర్ట్ డైరెక్టర్ గా వర్మ  ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులు.
తారాగణం: సాయి రామ్ శంకర్
దర్శకత్వం: జయరవీంద్ర
నిర్మాతలు: సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్,
బ్యానర్లు: సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాస్కర్ రాజు చామర్తి
సంగీతం: మణి శర్మ
 సినిమాటోగ్రఫీ: పప్పు
 ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
 కథ: అశోక
 కళ: వర్మ
 పి ఆర్ ఓ:  లక్ష్మీవేణుగోపాల్
 స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్
 పబ్లిసిటీ డిజైన్స్: ధని అలే
With the blessings of Puri Jagannadh, Sai Raam Shankar’s Bumper Offer 2 Announced 
The film ‘Bumper Offer’ was a breakthrough film for hero Sai Raam Shankar. After 12 long years, the second part is ready however this is not a sequel but will be whole together a fresh subject.
With the blessings of Tollywood’s leading Dashing and Daring Director Puri Jagannadh, ‘Bumper Offer 2’ is officially announced. This is going to be an out and out commercial entertainer set against the backdrop of Rayalaseema region.
Jayaravindra who directed ‘Bumper Offer’ will also helm the second part while Ashoka has penned the script. The regular shooting of ‘Bumper Offer 2’ kick starts on Ugadi festival i.e, in April.Heroines and Other Technicians will be announced Soon
Melody Brahma Mani Sharma will be composing music while Pappu will handle the cinematography. Technicians such as Kotagiri Venkateswara Rao and Varma for editing and art work are signed for the movie.
Suresh Yellamaraju is producing the movie under Suresh Vijaya Productions, and also with this film hero Sai Raam Shankar is marking his debut as producer on Cinemaas Dukan
Cast: Sai Raam Shankar
Crew:
Director: Jayaravindra
Producers: Suresh Yellamaraju, Sai Raam Shankar,
Banners: Cinemaas Dukan, Suresh Vijaya Productions
Executive Producer: Baskar Raju Chamarthi
Music: Mani Sharma
Cinematography: Pappu
Editor: Kotagiri Venkateswara Rao
Story: Ashoka
Art: Varma
PRO: LakshmiVenugopal
Stills: Sebastian Brothers
Publicity Designs: Dhani Aelay
Design 3 a (1) Design 2 IMG_9593

 

Super Star Mahesh Babu releases Nithin’s and Keerthy Suresh’s ‘Range De’movie’s song.

*సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన  ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ’రంగ్ దే’ చిత్ర గీతం 

* తన ట్విట్టర్ ఖాతా ద్వారా పాటను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
* యూత్ స్టార్ నితిన్, ప్రధాన తారాగణం పై చిత్రీకరించిన సందర్భోచిత గీతం
* ‘రంగ్ దే’ చిత్రం  నుంచి తృతీయ గీతం విడుదల
*సిద్ శ్రీరామ్ గళంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట
ప్రముఖ కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘నితిన్, కీర్తి సురేష్‘ ల
 ’రంగ్ దే’ చిత్ర లోని ఓ గీతం ను ఈరోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేశారు.
ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన  రెండు గీతాలకు ఇటు సంగీత ప్రియులనుంచి, అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తిన తరుణంలో చిత్రం నుంచి మరో గీతం వీడియో రూపంలో ఈరోజు విడుదల అయింది. చిత్ర కథానుసారం సందర్భోచితంగా సాగే  ’రంగ్ దే’ లోని ఈ  గీతం వివరాల్లోకి వెళితే .
“నా కనులు ఎపుడూ కననే కనని
హృదయ  మెపుడూ విననే వినని
పెదవు లెపుడూ అననే అనని
అద్భుతం చూస్తూ ఉన్నా…”
అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్  గాత్రంలో ఈ గీతం మృదు మధురంగా, శ్రావ్యంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిత్ర కథానుసారం యూత్ స్టార్  నితిన్, ప్రధాన తారాగణం పై చిత్రీకరించిన  సందర్భోచిత గీతం ఇది. ఈ  గీతాన్ని వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి..
సూపర్ స్టార్ మహేష్ బాబు తమ చిత్రంలోని ఈ గీతాన్ని విడుదల చేయటం పట్ల సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ వేదికగా చిత్ర కథానాయకుడు యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్, దర్శకుడు వెంకి అట్లూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ లతో పాటు చిత్రం యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా తమ సంతోషాన్ని,కృతజ్ఞతలను తెలియ చేశారు.
‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం వరుసగా విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, గీతాలు మరింత పెరిగేలా చేస్తూనే ఉన్నాయి.
యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ
‘రంగ్ దే’.  ’ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.

ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
 
*Super Star Mahesh Babu releases Nithin’s and Keerthy Suresh’s  ’Range De’movie’s song.
*SSMB released the song through his twitter handle and conveyed good wishes to the whole unit of Rang De.
*Youth Star ‘Nithin’ stars prominently in the song that is released.
*The third song from ‘Rang De’ has been released
*Sid Sriram mesmerizes audience once again with his vocals in Rang De’s third song
Super Star Mahesh Babu has released Nithiin and Keerthy Suresh’s ‘Rang De’ movie’s third song via his twitter handle today. He also congratulated the whole unit and wished the team all the best.
 ”Here’s the lyrical video of Naa Kanulu Yepudu from #RangDe! Rockstar @ThisIsDSP and @sidsriram… amazing as always! “
The two songs that were recently released from the movie ‘Rang De’ were instant hits among both music lovers and movie enthusiasts. One more song from the movie has been released today in the form of a lyrical video. This song is claimed to be very pivotal for the movie.
Song details-
The lyrics have been penned by Srimani and Sid Sriram lends his beautiful voice for the song. Rockstar Dsp has composed the music and has once again proved as to why he is the leading music director in the industry. Venky Atluri’s direction takes the the song to an unparalleled level in the movie. Youth Star Nithiin stars predominantly in the song while the song also features other important characters in the movie as well. Director Venky Atluri has claimed that this song on the silver screen would be one of the highlights of the movie.
The entire unit including Youth Star ‘Nithiin’, Keerthy Suresh, director Venky Atluri and producer Surya Devara Naga Vamsi, Music director Rockstar Devisriprasad  convey their gratitude towards Superstar Mahesh Babu for releasing the song through his twitter handle.
On the occasion of ‘Rang De’ releasing on March 26th the promotions and the related events have been ramped up the the team. Director Venky Atluri expressed that this movie can be enjoyed by the whole family together. Youth Star ‘Nithiin’ and leading actress ‘Keerthy Suresh’s combination on the silver screen promises to be enthralling and mesmerizing going by the photos, posters, videos and songs that have been released so far.
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh, Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram, Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
pro: Lakshmivenugopal
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.
30X40-015 copy NKY-RangDe Layer 24 copy