Dec 24 2020
Posts by Venugopal L:
Dec 22 2020
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ప్రారంభం:
* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ప్రారంభం:
*సంస్థ కార్యాలయం లో 10.19 నిమిషాలకు పూజా కార్యక్రమాలు.
*జనవరి 2021 లో రెగ్యులర్ షూటింగ్
టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం నేడు ప్రారంభమయింది. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పి.డి.వి. ప్రసాద్ సమర్పకులు. సంస్థ కార్యాలయం లో ఈరోజు ఉదయం 11.19 నిమిషాలకు చిత్రం పూజా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవుని పటాలపై పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా, సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అందించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వెంకీ అట్లూరి ల తో పాటు మరికొంతమంది మిత్రులు , శ్రేయోభిలాషులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. నేడు లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి లో మొదలవుతుంది. కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ‘ప్రసాద్ మూరెళ్ళ’ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా ‘నవీన్ నూలి’, కళా దర్శకునిగా ‘ఏ.ఎస్.ప్రకాష్ లు ఎంపిక అయ్యారు అని తెలిపారు. ఇక ఈ చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
Well known Tollywood production House Sithara Entertainments Production No 12 featuring Powerstar Pawan Kalyan and Rana Daggubati Launched On the eve of Dussehra festival, young producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments banner has announced a film new with Powerstar Pawan Kalyan. This is Sithara Entertainments banner’s first collaboration with Powerstar Pawan Kalyan and they are super thrilled to work with such a big star. Pawankalyan garu will be seen in an even more powerful role loaded with mass elements. Now this film has another hero and he is none other than Rana Daggubati. The film is also launched in a grand manner with noted Tollywood personalities gracing the occasion. Director Shri Trivikram has done the honours of switching on the camera while Powerstar Pawan Kalyan had clapped the sound board. Producer S Radha Krishna of Haarika & Hassine Creations handed over the script to the director. Young and talented director Saagar K Chandra will wield the megaphone for this project while happening music composer Thaman will be providing music and background score. Top technicians like Prasad Murella for cinematography, Naveen Nooli for editing and AS Prakash for art department have been signed for the film. The untitled movie regular shooting will kick start from next month. Producer ‘Dil’ Raju, director Venky Atluri and others were also present at the launch ceremony. Cast: Powerstar Pawan Kalyan, Rana Daggubati Crew: Director: Saagar K Chandra Producer: Suryadevara Naga Vamsi Banner: Sithara Entertainments Presented by PDV Prasad Music: Thaman S Cinematography: Prasad Murella Editor: Naveen Nooli Art Director: AS Prakash PRO: L.Venugopal
Nov 14 2020
Naga Shaurya and Ritu Verma ‘Varudu Kaavalenu’
నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘వరుడు కావలెను‘
*నాగ శౌర్య , రీతువర్మ ల ‘వరుడు కావలెను‘
*చిత్రం పేరు ఖరారు చేస్తూ వీడియో విడుదల
‘వరుడు కావలెను‘….!
వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది ఒక చిత్రం పేరు. మీరు వింటున్నది నిజమే….
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ‘వరుడు కావలెను‘ అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక నిర్మాతలు.
హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
Sithara Entertainments, a well-known film production company,
has teamed up with Naga Shaurya and Ritu Varma for the film ‘Varudu Kaavalenu’.
* Naga Shaurya and Ritu Verma ‘Varudu Kaavalenu’
* Video has been released on finalizing the name of the movie
‘Varudu Kaavalenu’….!
Upon hearing this it felt like a similar ad in the magazine of the
‘bride”s parents searching for a suitable ‘groom’ for their daughter.
But this is the name of the movie. What you heard is true.
Sithara Entertainments, an prestigious film company with young hero ‘Naga Shaurya’ and heroine ‘Ritu Verma’.
Introducing ‘Lakshmi Sowjanya’ as the director for the upcoming film named as
‘Varudu Kaavalenu’. By now an official announcement has been made and
an impressively beautiful video has been released.In this video
the hero ‘Naga Shaurya’ and heroine ‘Ritu Varma’ looks so beautiful.
The background music provided by Vishal Chandrashekar
added even more vanity to this movie.
The director and producer of the film have expressed the belief that the
name ‘Varudu Kaavalenu’ is completely appropriate for the story of the film.
The film is currently shooting in Hyderabad. Scenes are being shot with
the film’s hero and heroine as well as the main cast.
On behalf of the film unit, Diwali wishes were extended to the audience and the media.
Naga Shaurya’, ‘Ritu Verma’ as hero heroines, the other main cast are Nadhiya,
Murali Sharma,Vennela Kishore, Praveen, Anant, Kiriti Damaraju, Rangasthalam Mahesh,
Arjun Kalyan, Vaishnavi Chaitanya, Sidiksha and remaining other main characters.
For the film the
Cinematography: Vamsi Patchi Pulusu, Music: Vishal Chandrasekhar, Dailogues: Ganesh Kumar Ravuri; Editor: Naveen Nooli,
Art: A.S. Prakash, Presents: P.D.V. Prasad.
Producer: Suryadevara Naga Vamsi
Story-Screenplay-Direction: Lakshmi Sowjanya
Nov 14 2020
First song release ….. from the movie “ RANGDE…”
* యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల రొమాంటిక్ మెలోడీ గీతం
యూత్ స్టార్ నితిన్ వివాహ మహోత్సవం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన చిన్న వీడియో దాదాపు 14 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించిన అనంతరం చిత్రం నుంచి తొలి గీతాన్ని వీడియో రూపంలో ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.
‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం అయిన ఈ ‘రంగ్ దే’ లోని గీతం వివరాల్లోకి వెళితే ..
‘ఏమిటో ఇది వివరించలేనిది
మది ఆగమన్నది తనువాగనన్నది
భాష లేని ఊసులాట సాగుతున్నది
అందుకే ఈ మౌనమే ఓ భాష ఐనది
కోరుకోని కోరికేదో తీరుతున్నది‘ అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ ల గాత్రంలో శ్రావ్యంగా వినిపిస్తుంది ఈ గీతం. ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. చిత్ర నాయకా, నాయిక లయిన నితిన్, కీర్తి సురేష్ లపై రొమాంటిక్ మెలోడీ గీతం గా వెండితెరపై వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి.
ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు,‘ దుబాయ్‘ లో పాటలచిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది.
యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
First song release ….. from the movie “ RANGDE…”
A romantic melody …..The first single of the movie “ RANGDE…! “ starring youth star nithin and keerthy suresh is released today.
As a marriage gift to nithin the movie unit has already released the wishes video which has gained 14 million views . after that unit has released the first single lyrical video today …..
If we go into the more details of the song …. The lyric follows as
“ EMITO IDHI VIVARINCHALENIDHI….
MADHI AAGAMANNADHI…. THANUVUAAGANNADHI….
BHASHA LENI OOSULAATA SAAGUTHUNNADHI…..
ANDHUKE EE MOUNAME… BHASHA AINADHI….
KORUKONI KORIKEDO THEERUTHUNNADHI……
The Lyric has penned by sri mani and the voices which have been rendered by hari priya & kapil kapilan is awesome . music by devi sri Prasad is simply soul stirring and the visual mood has been directed by venky atluri .
The cast & crew is flying to dubai in the last week of this month to shoot the balance part of the scenes & songs .With this schedule the shooting of the movie will be completely finished. The movie will be released as sankranthi 2021 gift. Under the prestigious banner ‘sithara entertainments’ by talented director venky atluri…. With first ever youthfull combination of youth hero nithin & keerthy suresh.
Along with nithin & keerthy suresh , senior actor naresh, vineeth, rohini, kaushyala, brahmaji, vennena Kishore, satyam rajesh, abhinav gomatam , suhaas, gayathriraghuram …. Etc had palyed the vital roles .
Director of photography : pc sriram
Music : devi sri Prasad
Editing : Naveen nooli
Production design : avinash kolla
Additional screenplay : satish Chandra pasam
Executive producer : s. venkata rathnam
Presents by : pdv Prasad
Producer: suryadevara nagavamsi
Written & directed by : venky atluri
Oct 25 2020
Powerstar Pawan Kalyan and Sithara Entertainments Production No 12 Film Announcement
Marking the special occasion of Dussehra festival, young producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments banner has announced a film new with Powerstar Pawan Kalyan.
This is Pawan’s first Collabration with Sithara Entertainments banner and he will be seen in a powerful role loaded with mass elements and charishma.
Young and talented director Saagar K Chandra will wield the megaphone for this project while happening music composer Thaman will be providing music and background score.
Top technicians like Prasad Murella for cinematography, Naveen Nooli for editing and AS Prakash for art department have been signed for the film. The makers will soon sign the rest of the cast and crew. The shooting details would also follow.
Producer Naga Vamsi is delighted to announce the new film with Powerstar and wished the Telugu audiences a Happy Dussehra
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainments
Presented by PDV Prasad
Music: Thaman
Cinematography: Prasad Murella
Editor: Naveen Nooli
Art Director: AS Prakash
యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా, విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రతిభావంతమైన యువ దర్శకుడు సాగర్. కె .చంద్ర ను దర్శకునిగా ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని వివరంగా పొందుపరుస్తు వినూత్నంగా ఓ వీడియో రూపంలో ప్రకటించారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు..’గబ్బర్ సింగ్’ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అశేష ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ మరోమారు పోలీస్ పాత్రలో ఈ చిత్రం ద్వారా రక్తి కట్టించనున్నారు. కాగా ఈ చిత్రానికి ప్రధాన సాంకేతిక నిపుణులుగా సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడు థమన్.ఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సమున్నత ప్రతిభావంతులైన ‘ప్రసాద్ మూరెళ్ళ’ ఛాయాగ్రాహకునిగా,ఎడిటర్ గా ‘నవీన్ నూలి’, కళా దర్శకునిగా ‘ఏ.ఎస్.ప్రకాష్ లు ఎంపిక అయ్యారు అని తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యేది, చిత్రంలోని ఇతర నటీ,నటులు సాంకేతిక నిపుణులు ఎవరన్న వివరాలు, విశేషాలు మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చెబుతూ మీడియా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
Follow Us!