Jul 7 2023
Panja Vaisshnav Tej, Sithara Entertainments action entertainer Aadikeshava to release on 18th August
పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్టైన్మెంట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’ ఆగస్ట్ 18న విడుదల
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను అందిస్తున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు వరుస ఘన విజయాలను అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు వారు ‘ఆదికేశవ’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల తొలిసారి జతకట్టారు.
ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యాక్షన్ సినిమా ప్రేమికులను అలరించేలా ఆయన చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఆదికేశవ యాక్షన్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన కూల్ టీజర్ కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, ఆదికేశవ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అలనాటి తార రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అత్యంత ప్రతిభావంతుడు, జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నారు.
తారాగణం: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, అపర్ణా దాస్, జోజు జార్జ్, రాధిక
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీఓపీ: డడ్లీ
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
Panja Vaisshnav Tej, Sithara Entertainments action entertainer Aadikeshava to release on 18th August
Sithara Entertainments and Fortune Four Cinemas have been coming up with different, interesting content. The production houses have been involved in delivering major hits and now, they are gearing up to release Aadikeshava.
Upcoming Mega Hero Panja Vaisshnav Tej and recent Sensation, Sreeleela have paired up for this action entertainer for the first time.
Srikanth N Reddy is directing the film to engage and entertain Telugu action film lovers across the world with a bang.
Adrenaline rush inducing Aadikeshava action teaser has become viral and created unprecedented hype and overwhelming buzz for the film. Recently released Cool Teaser for Sreeleela birthday has impressed young audiences too.
Movie-lovers are eagerly waiting for the movie. And ending the wait, Aadikeshava is now scheduled to hit the screens on 18th August, worldwide.
Suryadevara Naga Vamsi and Sai Soujanya are producing the film and Srikara Studios is presenting the film.
National Award winning Malayalam star actor Joju George is debuting in Telugu with the film. Lovely actress Aparna Das, yesteryear actress and extremely popular Radhika are part of the cast.
Highly talented and multi-faceted, National Award Winning GV Prakash Kumar is composing music for the film. National Award winning editor, Navin Nooli is editing the film.
More updates about the film, Aadikeshava are eagerly awaited.
Stars: Panja Vaisshnav Tej, Sreeleela
Director: Srikanth N Reddy
Producers: Naga Vamsi. S & Sai Soujanya
DOP: Dudley
Art: A.S. Prakash
Editor: Navin Nooli
Presenter: Srikara Studios
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Follow Us!