Hari Hara Veeramallu

Pawan Kalyan’s Vedic character in Hari Hara Veera Mallu is a blend of mythology and history

Pawan Kalyan’s Vedic character in Hari Hara Veera Mallu is a blend of mythology and history

Power Star Pawan Kalyan’s lates film Hari Hara Veera Mallu turns out to be a blockbuster. The central story of the historical of how Mughals destroyed Hindu temples during their reign is getting wide appreciation. The film’s director Jyothi Krisna says at a time when Vedic texts were destroyed, Veera Mallu (Pawan Kalyan), stood against all odds and fought against the Mughals. “He transformed himself into a Vedic Scholar. He deciphered all the Vedic books as his knowledge so that it cannot further be destroyed. Since Veera Mallu is raised in a temple, and was imparted all the Vedic knowledge during his formative years, he eventually becomes a force to reckon with.”   Jyothi Krisna also explains how Veera Mallu draws from his knowledge to create a harmonious living environment from the five elements in Vastu Shastra — Earth (Prithvi), Water (Jal), Fire (Agni), Air (Vayu), and Space (Akasha) — that are rooted in Vedic principles.   “His expertise and ability to foresee things are second to none. For instance, he saves Gulfam Khan (Kabir Duhan Singh) from a landslide at the hills. He facilitates the Varuna Yagam (deity associated with the sky) to end drought in a village with rainfall. Veera Mallu’s belief of connecting to the animals (Wolf) through love, compassion and consciousness (Ahimsa) is a cornerstone and emerges from Vedic thought.” Lord Rama in his epic journey from Ayodhya to Lanka, navigated through various places. So the story of Ramayana is interwoven with these places. It traces his path through places like Chitrakuta, Panchavati (Bhadrachalam), Krauncha Aranya forest, Matanga Ashram, and Rishyamuka before reaching Lanka. Rama’s good deeds at these places during his journey were hailed and termed as ‘landmark moments.’ Similarly, Veera Mallu’s epic mission from Golkonda to Delhi Sultanate – south to north – is a significant journey interwoven with good deeds through Vedic principles. “We blended history and mythology to narrate how Veera Mallu is the protector of Sanatana Dharma. The situations he encountered and the good deeds he had done during the course of his journey can draw parallels to that of Lord Rama’s warrior-like journey. And when Veera Mallu meets Aurangzeb, it’s a catastrophe. The stage will be set for an ultimate showdown where nature erupts in the form of a whirlwind. “That’s why the climax is like a cliffhanger…nicely sets up the drama for what’s to ensue.”   Meanwhile, to further elevate the audiences’ cinematic experience, Hari Hara Veera Mallu got a Vfx upgrade. The film is further poised for a solid weekend as bookings remain strong across regions.

PHOTO-2025-07-26-21-28-55

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు*

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు*
* ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు
* జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం
* మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం
* నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు
* నా అభిమానులే నాకు కొండంత బలం
* శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి
* హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి మంచితనాన్ని తక్కువగా చెప్పి ఇతర దేశాల నుంచి వచ్చి మనల్ని పాలించిన వారి గొప్పతనాన్ని ఎక్కువగా చెప్పారు అనిపిస్తుంది. భారతదేశాన్ని కేవలం 200 ఏళ్లపాటు పాలించిన మొఘల్స్ గురించిన మంచితనం అధికంగా ప్రస్తావించారు. బాబర్, అక్బర్, షాజహాన్ వంటి మొఘల్ రాజుల గొప్పతనాన్ని ఎక్కువగా చూపించి, ఔరంగజేబు వంటి రాజు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు అనిపిస్తుంది. మన కాకతీయ రాజులు, కృష్ణదేవరాయులు, రాణి రుద్రమ వంటి పరిపాలకుల చరిత్ర తక్కువగా కనిపిస్తుంది. అందుకే ఔరంగజేబు కాలంలో హిందువుగా బతకాలంటే జిజియా పన్ను కట్టే దారుణమైన రోజులను హరిహర వీరమల్లు చిత్రంలో సునిశితంగా చర్చించాం. ఔరంగజేబు చనిపోయి ఇంతకాలమైన అప్పటి దారుణాలను చెప్పాలంటే ఇప్పటికి చాలా మంది భయపడతారు. నాకు అలాంటి భయాలు లేవు. చరిత్రలో జరిగిన విషయాలను హరిహరవీరమల్లు చిత్రం ద్వారా ప్రజలకు తెలిసేలా చెప్పడం ఆనందంగా ఉంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, హరిహర వీరమల్లు చిత్ర కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. గురువారం రాత్రి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావడంతో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఔరంగజేబు కాలంలో చీకటి రోజులను ఆ కాలంలో సామాన్యులు పడిన ఇబ్బందులను చిత్రంలో చక్కగా చూపించాం. మొఘల్స్ సామ్రాజ్యంలో మంచితోపాటు చెడును చెప్పాలన్నదే ప్రధానమైన ఉద్దేశం. నేను ఏమీ చేసినా భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, దేశ ఉన్నతిని బలంగా చెప్పాలని చూస్తాను. నా మనసు అంతా భారతదేశపు ఆత్మ నిండిపోయి ఉంది. చిత్రం పార్ట్-2 కూడా 20 శాతం పూర్తయ్యింది. దీనిలో ఖాన్ అబ్దుల్ గఫూర్ గారిని దృష్టిలో పెట్టుకొని కొంత భాగం చిత్రీకరించాం. • ప్రేక్షకుడు భావోద్వేగం చెందాలి ముఖ్యంగా అప్పటి పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా కష్టం తీసుకోవాలి. హరిహర వీరమల్లు చిత్రం కథ విన్న తరువాత దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చాలా కాలం మదించాను. శ్రీ తోట తరణి లాంటి ఆర్ట్ డైరెక్టర్ ఈ సినిమాకు దొరకడం మా అదృష్టం. ఇలాంటి పిరియాడికల్ చిత్రం ప్రేక్షకుడిని పూర్తి భావోద్వేగంతో నింపి ఎన్నో గొప్ప అనుభూతులను ఇంటికి తీసుకెళ్లేలా చేస్తుంది. నా జీవితం మొదట నుంచి వడ్డించిన విస్తరి కాదు. ప్రతి రోజు జీవితంతో సంఘర్షిస్తూనే ఉంటాను. గత వారం రోజులుగా చిత్రం ప్రమోషన్ల నిమిత్తం సరైన నిద్ర లేదు. పూర్తి అలసటగా ఉన్నాను. ఇలా గత 28 ఏళ్లలో ఏ చిత్రానికి చేయని ప్రమోషన్లను ఈ చిత్రానికి చేశాను. ఏ.ఎం. రత్నం లాంటి నిర్మాతకు నా వంతు సాయం చేయాలని బలంగా భావించడం వల్లే ఇంత శ్రమించాను. నన్ను విమర్శించే కొందరు, రాజకీయ ప్రత్యర్థులు నా చిత్రాలను బాయ్ కాట్ చేస్తామని చెబుతున్నారు. నేను అస్సలు దీనిని పట్టించుకోను. బాయ్ కాట్ చేసినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను నటించిన ఒక సినిమా మిమ్మల్ని ఇంతలా భయపెడుతోంది అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగామో అర్థమవుతోంది. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు. ఎవరైన మన గురించి పూర్తి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే కచ్చితంగా మనం చాలా బలంగా ఉన్నామని అర్థం. నేను ఇంత బలంగా ఉన్నానంటే నా అభిమానులు ఇచ్చిన బలమే. • సినిమా చాలా ప్రభావితం చేసే మాధ్యమం ఒకప్పుడు భారతదేశంలో విదేశీ సంగీతం విస్తృతంగా వ్యాప్తి చెందిన సమయంలో భారతీయ సంగీతం గొప్పతనాన్ని, దాని ప్రాముఖ్యాన్ని అత్యంత అద్భుతంగా ప్రేక్షకులకు చూపించిన సినిమా శంకరాభరణం. ఆ సినిమా చూసిన తరువాత కర్ణాటక సంగీతం మీద, భారతదేశపు సంగీతం ఔన్నత్యం మీద గొప్ప అభిప్రాయం ఏర్పడింది. సినిమా మనిషిని బలంగా ప్రభావితం చేస్తుంది. సినిమాలోని కథ, కథనం, పాత్రలు కచ్చితంగా మన ఆలోచనను మారుస్తారు. దానిలో లీనమయ్యేలా మారుస్తాయి. అంతటి గొప్ప బలం సినిమాకు ఉంది. హరిహర వీరమల్లు సినిమా చూసిన చాలా మంది కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టినట్లు చెబుతున్నారు. దానిని కచ్చితంగా సరిదిద్దుకుంటాం. నా అభిమానులు సున్నితంగా అయిపోవద్దు. శత్రువు ఎంత బలంగా మనపై దాడి చేస్తే అంత బలంగా ఎదుర్కొని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. కోహినూర్ వజ్రం కంటే విలువైన గొప్ప ధర్మం భారతదేశంలో ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, జ్ఞానం, విజ్ఞానం, కలగలిపిన గొప్ప భూమి ఇది. దీనినే చిత్రంలోనూ చూపించాం. నాకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా వాటిని అధిగమిస్తూనే నా జీవిత ప్రయాణాన్ని గొప్పగా ఎంజాయ్ చేస్తాను. ప్రతి కష్టాన్ని దాటుకొంటూ కాలర్ ఎగరేయకుండా… ఆ దాటే క్రమాన్ని చక్కగా అనుభవాలు, అనుభూతులుగా మిగుల్చుకుంటాను. హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సహకరించిన పీపుల్స్ మీడియా శ్రీ విశ్వప్రసాద్ గారికి, నిర్మాత రత్నం గారికి ధన్యవాదాలు, చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, చిత్ర బృందానికి అభినందనలు’’ అన్నారు.

PHOTO-2025-07-24-23-36-59 (1) PHOTO-2025-07-24-23-36-59 PHOTO-2025-07-24-22-40-13 (1) PHOTO-2025-07-24-22-40-13

With Hari Hara Veera Mallu, our mission is fulfilled” – Power Star Pawan Kalyan at the Success Meet Audience showering immense love on Hari Hara Veera Mallu

హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
 - ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం
సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం.. తమ ఆనందాన్ని పంచుకోవడమే కాకుండా, ‘హరి హర వీరమల్లు’ సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “నా జీవితం వడ్డించిన విస్తరి కాదు. నా జీవితంలో ఏదీ అంత తేలికగా జరగదు. ఈ సినిమా విడుదల విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నా 29 ఏళ్ళ సినీ ప్రయాణంలో నేను ఒక సినిమాని ఇలా ప్రమోట్ చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా బాధ్యత తీసుకోవడం కూడా ఓ రకంగా ఆనందాన్ని ఇచ్చింది. ఏ సినిమాకైనా భావోద్వేగాలు ముఖ్యం. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండేది.. మనం ఏ ఎమోషన్ ని ఇంటికి పట్టుకొస్తామని. ఈ చిత్ర కథ మొఘల్స్ కి సంబంధించినది. మనం చదువుకున్న పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. అతని దుర్మార్గాన్ని చెప్పలేదు. మొఘల్స్ 200 ఏళ్ళే పాలించారు. చాళుక్యులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్ళు పాలించారు. కానీ, చరిత్రలో మొఘల్స్ గురించే ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. మన చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపైన చిన్నచూపు చూశారు. ఔరంగజేబు పాలన సమయంలో హిందూదేశంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఆ విషయాన్ని ఈ సినిమాలో నిర్భయంగా ప్రస్తావించాము. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్, నాకున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రజా సమస్యలపై పోరాడేతత్వం.. ఇవన్నీ కలిసి నన్ను ప్రీ క్లైమాక్స్ లో 18 నిమిషాల ఫైట్ ను డిజైన్ చేయడానికి ప్రేరణ ఇచ్చాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ బాగుందని ప్రశంసించడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా మతాలకు సంబంధించింది కాదు. ఇందులో మంచి, చెడుకి మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించాము. ఈ చిత్రం విడుదల విషయంలో రత్నం గారికి అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇంత బలంగా నిలబడ్డానంటే నాకు అభిమానులు ఇచ్చిన బలమే కారణం. ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు, రికార్డుల కంటే కూడా.. ఈ సినిమా ద్వారా చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని చెప్పామనేది ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తోంది. శంకరాభరణం సినిమా చూసిన తర్వాత నాకు శాస్త్రీయ సంగీతం పట్ల అపారమైన గౌరవం వచ్చింది. ఒక సినిమా ఏం చేయగలదు అనేదానికి ఇదొక ఉదాహరణ. సినిమా అనేది కథ ఎలా చెప్పాము, ప్రేక్షకుల్లో ఎంత ప్రేరణ కలిగించాము అనేది ముఖ్యం. ఆ పరంగా వీరమల్లు చిత్రం యొక్క లక్ష్యం నెరవేరింది. సాంకేతికంగా కొందరు కొన్ని సూచనలు చేశారు. ఆ విషయాలను రెండో భాగం విషయంలో పరిగణలోకి తీసుకుంటాము. కోహినూర్ కంటే విలువైన జ్ఞానం మన దేశం సొంతం అని ఈ సినిమాలో చూపించాము. హరి హర వీరమల్లులో చరిత్రలో దాగి ఉన్న ఎన్నో వాస్తవాలను చెప్పాము. నా దృష్టిలో అదే నిజమైన విజయం. ఇలాంటి గొప్ప సినిమా తీసిన రత్నం గారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావించాను.” అన్నారు. చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు విడుదలై మంచి స్పందన తెచ్చుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలైనప్పటి నుంచి అభినందనలు తెలుపుతూ ఫోన్లు, మెసేజ్ లు వస్తున్నాయి. ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైంది. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. రత్నం గారు, జ్యోతికృష్ణ గారితో పాటు టీం అంతా ఐదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని మొదటి నుంచి నమ్మాను. మనం మనస్ఫూర్తిగా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం లభిస్తుందని హరి హర వీరమల్లుతో మరోసారి రుజువైంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.” అన్నారు. చిత్ర సమర్పకులు, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “సినిమా బాగుందని అందరూ అభినందలు తెలపడం ఆనందాన్ని కలిగించింది. హరి హర వీరమల్లు సినిమా కాదు.. ఇదొక చరిత్ర. ఔరంగజేబు కేవలం తన మతం మాత్రమే ఉండాలని అనుకుంటాడు. అతన్ని ఎదిరించి ధర్మాన్ని రక్షించే వీరుడి కథే ఈ వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సింహంలాంటి యోధుడి లాగా కనిపించారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో వీరవిహారం చేశారు. ‘ఇది సార్ మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునేది’ అని అభిమానులు ఫోన్లు చేసి చెప్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మా కష్టానికి తగ్గ భారీ విజయం లభిస్తుందని ఆశిస్తున్నాను.” అన్నారు. చిత్ర దర్శకుడు జ్యోతికృష్ణ మాట్లాడుతూ, “థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకుల స్పందన చూసి చాలా సంతోషం కలిగింది. సినిమాని ముగించిన తీరు అద్భుతంగా ఉంది, రెండవ భాగం చూడాలనే ఆసక్తి కలుగుతోందని చాలామంది ఫోన్ చేసి ప్రశంసించారు. చిన్న చిన్న పిల్లలు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కుటుంబంతో కలిసి చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే అందరూ కలిసి చూస్తారు. పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి మంచి సినిమా చేయడం గర్వంగా ఉంది. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు.. ఒకరు పవన్ గారు, ఇంకొకరు కీరవాణి గారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు 18 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ ను కంపోజ్ చేశారు. పెద్దగా సంభాషణలు లేకుండా దాదాపు 30 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ని కీరవాణి గారు తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్లారు. నిధి అగర్వాల్ గారు ఐదేళ్లుగా ఈ సినిమాను నమ్మి నిలబడ్డారు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ సపోర్ట్ ను మరువలేను. మా నాన్న రత్నం గారు తన మొదటి సినిమా హిట్ అయినప్పుడు ఎంత ఆనందపడ్డారో.. మళ్ళీ అంతటి ఆనందాన్ని ఇన్నాళ్లకు ఆయన ముఖంలో చూశాను. ఈ సినిమా ఆయనకు ఎంతటి డ్రీం ప్రాజెక్టో ఆ సంతోషంలోనే తెలుస్తోంది. ఈ సినీ ప్రయాణంలో నా భార్య, మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ ని ఎప్పటికీ మరచిపోలేము. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పవన్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అన్నారు. ప్రముఖ నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ, “పవర్ స్టార్ గారి పవర్ ఏంటో మేము నిన్న విమల్ థియేటర్ సాక్షిగా చూశాను. ఒక్క షో ప్రీమియర్ కే రూ.3.36 కోట్ల షేర్ చేసింది. ఆ నెంబర్ చూసి మేము షాక్ అయ్యాము. మొదటి రోజు వసూళ్ల పరంగా రికార్డు నెంబర్లు చూడబోతున్నాం. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపిస్తే ఆ ఆనందమే వీరు.” అన్నారు. ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు ఘన విజయం సాధించిన సందర్భంగా రత్నం గారికి మరియు చిత్ర బృంద అందరికీ శుభాకాంక్షలు. అన్ని చోట్లా నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రికార్డు కలెక్షన్లు చూడబోతున్నాం.” అన్నారు. తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, మురళి శర్మ, అయ్యప్ప శర్మ, కబీర్ సింగ్, వెన్నెల కిశోర్, మకరందేశ్ పాండే, కబీర్ బేడీ, సచిన్ కెడేకర్, ఛత్రపతి శేఖర్, దర్శకత్వం: జ్యోతి కృష్ణ , క్రిష్ జాగర్లమూడి నిర్మాత: ఎ. దయాకర్ రావు సమర్పణ: ఎ. ఎం. రత్నం బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్ సంగీతం: ఎం. ఎం. కీరవాణి ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్ కూర్పు: ప్రవీణ్ కె.ఎల్ సాహిత్యం: చంద్రబోస్, పెంచల్ దాస్, చైతన్య కృష్ణ, రాంబాబు గోశాల. విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్ కళా దర్శకుడు: తోట తరణి నృత్య దర్శకత్వం: గణేష్, శోభి. స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, పీటర్ హెయిన్, స్టంట్ సెల్వ, దిలీప్ సుబ్బరాయన్, విజయ్, డ్రాగన్ ప్రకాష్. పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పాయ్. ఎక్సుక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కో డైరెక్టర్: కే. రంగనాథ్ కాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వర్య రాజీవ్ స్టిల్స్: వెంకట్ పబ్లిసిటీ డిజైనర్: అనంత్
With Hari Hara Veera Mallu, our mission is fulfilled” – Power Star Pawan Kalyan at the Success Meet
Audience showering immense love on Hari Hara Veera Mallu
Film racing ahead with sensational collections Power Star Pawan Kalyan’s much-awaited film Hari Hara Veera Mallu finally hit the theatres amidst huge expectations. Premieres began from the night of July 23rd, and audiences are thrilled with Pawan Kalyan’s portrayal of Veera Mallu, a warrior who fights for Dharma. The performances, grand war sequences, and music have all received wide appreciation. The film is garnering acclaim from all sections of the audience and showing growth with each show in terms of box office returns. The team recently held a grand success meet to share their joy and thank the audience for embracing the film so wholeheartedly. Pawan Kalyan said: My life was never served on a platter. Nothing ever came easy to me. Even the release of this film faced many hurdles. In my 29-year film journey, this is the first time I promoted a film like this. Taking responsibility for this film gave me a strange sense of happiness. Emotions are essential for any film. What stays with the audience is how they feel after watching it. This story revolves around the Mughals. Our textbooks mostly glorified Aurangzeb and never spoke about his cruelty. The Mughals ruled for 200 years, but dynasties like the Chalukyas, Pallavas, Kakatiyas, and Vijayanagara empire ruled for centuries. Yet, our rulers are barely acknowledged in history. During Aurangzeb’s reign, Hindus had to pay a tax (Jizya) just to live as Hindus. We’ve addressed that fearlessly in this film. The martial arts I learned, my understanding of technology, and my activism — all these came together and helped me design the 18-minute pre-climax fight. I’m happy everyone is appreciating that episode. This film isn’t about religion. It’s about the battle between good and evil. I thank Mythri Movie Makers and People Media Factory for supporting Ratnam garu in getting this film to release. I stand strong today only because of the strength given to me by my fans. More than collections or records, I feel proud that this film told a historical truth. After watching Shankarabharanam, I developed immense respect for classical music. This film, too, shows what cinema can achieve. Cinema is all about storytelling and inspiring audiences. On that front, Veera Mallu has achieved its goal. Some have given us technical feedback, and we will consider that for the second part. This film shows that knowledge is more valuable than the Kohinoor. Revealing these hidden truths of history through this film — that is the real victory. Supporting Ratnam garu for such a film was my responsibility. Actress Nidhhi Agerwal said: I’m extremely happy with the response Hari Hara Veera Mallu is getting. Since the release, I’ve been flooded with congratulatory messages and calls. This is all possible only because of Pawan Kalyan garu. This film is very special to me. Ratnam garu, Jyothi Krishna garu, and the whole team have worked hard for five years. I believed in this project right from the beginning. Once again, this proves that hard work done with sincerity always bears fruit. Thank you to all the audiences supporting our film. Presenter & Veteran Producer A.M. Ratnam said: Hearing everyone say the movie is great brings me immense happiness. Hari Hara Veera Mallu is not just a film — it’s history. Aurangzeb believed only his religion should exist, but this is the story of a warrior who opposed him to protect Dharma. Pawan Kalyan garu looked like a lionhearted warrior in the film. He worked extremely hard, especially in the war scenes. Fans are calling me saying, ‘This is exactly what we wanted to see from Pawan Kalyan garu!’ Even family audiences are enjoying the film. We’re hopeful for a massive success. Director Jyothi Krishna said: Seeing the audience and fans celebrate the film in theatres makes me emotional. Many are saying the ending was brilliant and that they’re excited for the second part. Even young kids are enjoying the movie. This is a film meant to be watched with families. Working with Pawan Kalyan garu on such a good film is a matter of pride. There are two heroes in this film — one is Pawan Kalyan garu, and the other is Keeravani garu. Pawan Kalyan garu choreographed an 18-minute action sequence. There’s nearly a 30-minute stretch with minimal dialogue. Keeravani garu elevated it beautifully with his music. Nidhhi Agerwal believed in this film for five years. I must also thank our direction department. I haven’t seen my father (Ratnam garu) this happy since his first film’s success. His joy shows how much this dream project meant to him. I also want to thank my wife and mother for their constant support. I am deeply thankful to Pawan Kalyan garu for giving me this opportunity. Producer Y. Ravi Shankar said: We saw Power Star’s power live at Vimal Theatre yesterday. One premiere show alone collected ₹3.36 crores share. We were shocked to see that number. We’re expecting record-breaking collections on Day 1 itself. The response everywhere is phenomenal. There’s a different kind of joy when Pawan Kalyan garu appears on screen. Producer Naveen Yerneni said: Congrats to Ratnam garu and the entire team for the grand success of Hari Hara Veera Mallu. We’re getting amazing response from all quarters, and expecting record-breaking collections.
GANI9360

The Bow That Stands for Dharma – Hari Hara Veera Mallu

*ధర్మం కోసం నిలబడే విల్లు… హరిహర వీరమల్లు*

• హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ
• కోహినూర్ వజ్రం మొగల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం
• మేకప్ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీ ఎ.ఎం. రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే చిత్ర ప్రమోషన్లు
• ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా మిలుగులుంది
• హరిహర వీరమల్లు పార్ట్ – 2 భాగం 20 శాతం చిత్రీకరణ పూర్తయింది
• జానీ చిత్రం ఫెయిల్యూర్ నిజ జీవితంలో స్ఫూర్తి పాఠం అయింది
• హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారుహరిహర వీరమల్లు క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హరిహర వీరమల్లు చిత్ర కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు, హరిహర వీరమల్లు చిత్ర కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. హిందువులుగా బతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అమానుష ఘటనలను స్పృశిస్తూ, తనకు అడ్డువచ్చిన రక్త సంబంధీకులనే చంపిన మొగల్ పాలకుడు ఔరంగజేబు స్వరూపాన్ని తెలిపే గొప్ప కథగా చిత్రం మిగిలిపోతుందన్నారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడిన ఓ యోధుడి కథ ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. మీడియా ప్రతినిధులు చిత్ర నిర్మాణంపై అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చారు. మాటామంతీలో కీలకమైన ప్రశ్నలు… వాటికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమాధానాలు ఇవీ….
• ప్రశ్న –
హరిహర వీరమల్లు చిత్రం సనాతన ధర్మం అనే కాన్సెప్టును దృష్టిలో పెట్టుకొని చిత్రీకరించిన చిత్రం అనుకోవచ్చా..?
– సొంత తమ్ముణ్ణి సైతం అత్యంత క్రూరంగా చంపిన ఔరంగజేబు వంటి క్రూరమైన మొగల్ చక్రవర్తి దాష్టీకాలను చూపించిన సినిమా. ధర్మం కోసం పోరాడిన యోధుడి సినిమా. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటం ఈ సినిమాలో చూపించాం.
• ప్రశ్న
ఉప ముఖ్యమంత్రిగా ఇటు సినిమాలు, అటు పాలన, మరోపక్క రాజకీయాలు చేయడం ఇబ్బందిగా అనిపించడం లేదా..?
– రాజకీయాలకే నా జీవితంలో మొదటి ప్రాధాన్యం ఇస్తాను. దాని తర్వాత సినిమాలు. నాకు వచ్చింది సినిమాల్లో నటించడమే. నాకు అన్నం పెట్టింది, బతుకుదెరువు ఇచ్చింది సినిమాలే.
• ప్రశ్న
గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ సారి హరిహర వీరమల్లు కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లకు దిగారు. ఈ మార్పుకు గల కారణం..?
– ఈ సినిమా చాలా ప్రత్యేకమైంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చిత్ర నిర్మాణం సాగింది. ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని నిలబడింది. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఇంత ధైర్యంగా నిలబడిన నిర్మాతకు అండగా నిలబడటం నా కర్తవ్యంగా భావించాను. ప్రమోషన్లు చేయడం నా బాధ్యతగా భావించాను.
• ప్రశ్న
ఈ సినిమా చేస్తున్నపుడు అనేక ఇబ్బందులు పడినట్లున్నారు..?
– సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. విశాఖలో నన్ను హోటల్ లో నిర్భందించడం వంటి కీలకమైన పరిణామాలు జరిగాయి. అలాగే నా సినిమా టిక్కెట్లను రూ.10, రూ.15లకు తగ్గించి గత పాలకులు ఇబ్బందులు పెట్టారు. సీమలో ఎవరికైనా పగలు ఉంటే చీని చెట్లను నరికి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే అలవాటు ఉన్న గత పాలకుల ఆలోచన విధానాలతో నాతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు. నన్ను పూర్తిగా దెబ్బతీయడానికి నానా రకాల ప్రయత్నాలు జరిగాయి. ఇలా అన్ని విషయాలను అధిగమించి ఇప్పుడు ఈ చిత్రం బయటకు రావడం ఆనందంగా ఉంది.
• ప్రశ్న
ఈ సినిమా మొదలు పెట్టినప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు భిన్నంగా అనిపించాయా..?
– సినిమా చేయడమే పెద్ద సంఘర్షణ. దీన్ని నిత్యం అనుభవిస్తూనే ముందుకు వెళతాం. ఈ చిత్ర నిర్మాణంలోనే ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నాం.
ప్రశ్న
• మీ సినిమాలకు గత ప్రభుత్వంలో తక్కువ ధరకు టిక్కెట్లు అమ్మితే, ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెరిగిన విషయాన్ని ఎలా చూస్తారు..?
– అన్ని సినిమాలకు పెరిగినట్లుగానే నా సినిమాకు పెరిగాయి. కేవలం నా సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ రేట్ల పెంపు ఇవ్వలేదు. నిర్మాతల కష్టం, వారి శ్రమ అన్ని పరిగణనలోకి తీసుకొని సినిమాలకు టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.
• ప్రశ్న
ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. దీన్ని మీ తోటి సహచరులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులకు చూపిస్తారా..?
– నాకు ఇప్పటి వరకు ఈ ఆలోచన రాలేదు. మంచి సూచన చేశారు. కచ్చితంగా నా సహచరులైన ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా షో వేసే ఏర్పాటు చేస్తాను.
• ప్రశ్న
జానీ సినిమా నిరాశ మిగిల్చింది. మళ్లీ ఇప్పుడు హరిహర వీరమల్లు చిత్రంలో చివరి సీన్లు మీరే తీసినట్లు చెబుతున్నారు..? అప్పటికీ ఇప్పటికీ మీ అనుభవం ఏంటీ..?
– జానీ సినిమా ఫలితం నా రాజకీయ జీవితంలో మరింత రాటుదేలేలా నన్ను మార్చిందని చెప్పొచ్చు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిన వెంటనే నేను బయ్యర్లు, ఫైనాన్సియర్స్ అందరినీ ఇంటికి పిలిచి సెటిల్ చేశాను. చాలా రోజులపాటు నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆ రోజు జానీ చిత్ర ఫలితం నాకు రాజకీయాల్లో అపజయం వచ్చినపుడు దాన్ని తట్టుకొని ఎలా ముందుకు సాగాలో నేర్పించింది. జీవితంలో వచ్చే అపజయాలను దాటితేనే.. నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలవు అనేది జానీ చిత్రంతో నాకు అవగతమైంది. తర్వాత రాజకీయ జీవితాల్లో స్ఫూర్తి పాఠం అయింది.
• ప్రశ్న
మీ సినిమాకు ఇతర సినిమాల మాదిరిగా థియేటర్ల కొరత సమస్య ఉంటుందా..? హరిహర వీరమల్లు చిత్రం పార్ట్ 2 అవకాశం ఉందా..?
– థియేటర్ల కొరత ఏమీ ఉండబోదు. సినిమాలకు థియేటర్లు ఇవ్వరనేది నాకు ఎప్పుడు ఎదురుకాలేదు. హరిహర వీరమల్లు పార్ట్ – 2 కూడా 20 శాతం చిత్రీకరణ పూర్తయింది.
• ప్రశ్న
రాజకీయాల్లో ఉంటూనే ఇకపై చిత్రాలను చేస్తారా..?
– అది భగవదేచ్ఛ. ఆయన ఆశీస్సులు ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. భవిష్యత్తు గురించి ఇప్పుడే మనం అంచనా వేయలేం కదా..?
• ప్రశ్న
హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ పెరగాలంటే ఏం చేయాలి..?
– హైదరాబాద్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చిత్ర పరిశ్రమ పెరగాల్సిన అవసరం ఉంది. దీనికి తగిన వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ పెరిగితే బాగుంటుంది. దీనివల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి. అవకాశాలు విస్తృతం అవుతాయి.

The Bow That Stands for Dharma – Hari Hara Veera Mallu

A battle against those who demanded tax just to live as a Hindu — that’s the soul of Hari Hara Veera Mallu.
The film subtly touches upon how the Kohinoor diamond, discovered on the banks of the Krishna River, reached the hands of the Mughals.
Promotions are not just for the film — they’re also a tribute to producers like A.M. Ratnam garu, who started his journey as a makeup assistant.
The film shines as a great cinematic effort that emerged after facing many hurdles.
Around 20% of Hari Hara Veera Mallu – Part 2 has already been shot.
Johnny’s failure was a life lesson, not just a cinematic one.
Deputy CM Pawan Kalyan garu addressed the media on the eve of the film’s release and spoke his heart.
Key Highlights from Pawan Kalyan’s Interaction with Media:
Clarification on the story:
The character Veera Mallu is fictional. There are rumors linking him to historical warriors like Sarvai Papanna, but the core of the story is different. It showcases how the Kohinoor, once found near the Krishna River, ended up in London.
It also highlights the oppression under Mughal emperor Aurangzeb — a ruler who even killed his own kin and imposed taxes on Hindus just to practice their faith.
Q&A from the Media Interaction:
Q: Is Hari Hara Veera Mallu based on Sanatana Dharma?
A: Yes. The film portrays a warrior who fought for Dharma during Aurangzeb’s cruel regime. Hindus had to pay a tax just to follow their religion — this fight to protect Dharma is the core of the story.

Q: As Deputy CM, how are you balancing films, administration, and politics?
A: Politics is my top priority. But cinema gave me identity, food, and livelihood — it remains an integral part of me.

Q: This is the first time you are actively promoting a film. Why the change?
A: This film is very special. It faced natural, man-made, and political obstacles. The producers stood by it with courage. Supporting such producers is my duty — promotions are my responsibility.

Q: You seem to have faced a lot of struggles while making this film. Can you elaborate?
A: Yes. Politically, I faced many challenges — like being detained in Visakhapatnam. Ticket prices were unfairly reduced during the past government’s regime, which hurt producers. They were intentionally targeted for working with me. Despite all this, we completed the film.

Q: Has the situation changed from when you started the film to now?
A: Every day of making this film was a struggle. But struggle defines growth — we kept moving forward.

Q: Ticket prices have increased now, unlike during the past regime. Your thoughts?
A: Ticket hikes were done for all films based on the producers’ efforts, not just for mine. The current government is recognizing those efforts.

Q: Will you organize a special screening for fellow MLAs, MLCs, MPs, and Ministers?
A: I hadn’t thought of it until now — but yes, that’s a great suggestion. I will plan a special show for public representatives.

Q: Johnny was a disappointment. You directed the climax of HHVM — what has changed between then and now?
A: Johnny was a turning point. When it failed, I personally settled accounts with buyers and financiers and went silent for a while. That failure taught me how to handle setbacks — and helped me navigate political failures too.

Q: Will HHVM face a theatre shortage like some films do? And is Part 2 happening?
A: No shortage at all. Part 2 has already completed 20% of its shoot.

Q: Will you continue making films while in politics?
A: That’s up to God. If He blesses it, anything is possible.

Q: What should Andhra Pradesh do to develop a film industry like Hyderabad?
A: We need to create proper infrastructure, especially film schools. That will naturally grow the industry and generate opportunities.

This interaction was held at the Jana Sena Party central office on the occasion of Hari Hara Veera Mallu’s release. Pawan Kalyan answered all questions with clarity and conviction, offering a rare and insightful perspective into the struggles, values, and emotional investment behind the making of the film.

PHOTO-2025-07-22-22-30-07 (2) PHOTO-2025-07-22-22-30-04 (2) PHOTO-2025-07-22-22-30-09 (1) PHOTO-2025-07-22-22-30-05 (3) PHOTO-2025-07-22-22-30-06 (3) PHOTO-2025-07-22-22-30-07 (1) PHOTO-2025-07-22-22-30-04 (1) PHOTO-2025-07-22-22-30-09 PHOTO-2025-07-22-22-30-05 (2) PHOTO-2025-07-22-22-30-06 (2) PHOTO-2025-07-22-22-30-04 PHOTO-2025-07-22-22-30-08 (1) PHOTO-2025-07-22-22-30-06 (1) PHOTO-2025-07-22-22-30-05 (1) PHOTO-2025-07-22-22-30-08 PHOTO-2025-07-22-22-30-07 PHOTO-2025-07-22-22-30-05 PHOTO-2025-07-22-22-30-06

“Hari Hara Veera Mallu is a subject very close to my heart.” – Power Star Pawan Kalyan at the Pre-Release Event

‘హరి హర వీరమల్లు’ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు: ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

 ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జూలై 21(సోమవారం) సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “లక్షలాది అభిమానుల మధ్య ఈ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. వర్షాలు, ఇతరత్రా కారణాల వల్ల తక్కువమందితో నిర్వహిస్తున్నాము. అభిమానుల క్షేమం గురించి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ గారికి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాల్లోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నానో, అలాగే రాజకీయాల్లోకి వచ్చి ఈశ్వర్ ఖండ్రే గారి లాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకున్నాను. బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఇక్కడికి వచ్చినందుకు కృతఙ్ఞతలు. అలాగే ఈ వేడుకకు విచ్చేసిన కందుల దుర్గేష్ గారు, రఘురామకృష్ణ రాజు గారికి  కూడా నా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల క్రితం ‘భీమ్లా నాయక్’ విడుదలైనప్పుడు.. అన్ని సినిమాలకు వందల్లో ఉంటే, ఆ సినిమాకి 10, 20 రూపాయలు టికెట్ రేట్లు చేశారు. నేను అప్పుడు ఒక మాట చెప్పను ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అని. ఇది డబ్బు గురించి కాదు, రికార్డుల గురించి కాదు. మనం ధైర్యంగా నిలబడితే న్యాయం జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నేను అసలు నటుడు అవ్వాలని కూడా కోరుకోలేదు. సగటు మనిషిగా బ్రతకాలన్న ఆలోచన తప్ప ఏంలేదు. నన్ను ఇంతటి వాడిని చేసింది అభిమానులే. పడినా, లేచినా, ఎలా ఉన్నా.. అన్నా నీ వెంట మేమున్నాం అన్నారు. నా దగ్గర ఆయుధాలు లేవు, గూండాలు లేరు.. గుండెల్లో ఉండే అభిమానులు తప్ప ఎవరూ లేరు. నేను సినీ పరిశ్రమకు వచ్చి 29 ఏళ్ళు. కొంచెం వయసు పెరిగిందేమో కానీ, గుండెల్లో చావ ఇంకా బ్రతికే ఉంది. వరుస హిట్స్ ఇచ్చిన నేను.. జానీతో పరాజయం చూశాను. ఆ సమయంలో అర్థమైంది.. ఇక్కడ బంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని. కానీ నేను ఒకటే నమ్మాను.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేదు, నన్ను ప్రేమించే నా అభిమానులు ఉన్నారని. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. పేరుంది, ప్రధాన మంత్రి గారి దగ్గర నుంచి అందరూ తెలుసు. కానీ, దాని వల్ల డబ్బులు రావు. సినిమా చేసే డబ్బులు సంపాదించాలి. నాతో ఖుషి సినిమా తీసిన రత్నం గారు ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. నేను పరాజయాల్లో ఉన్నప్పుడు నా పక్కన నిలబడింది త్రివిక్రమ్ గారు. అపజయాల్లో ఉన్న నన్ను వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, నా ఆత్మ బంధువు త్రివిక్రమ్.. అప్పుడు నాతో జల్సా సినిమా తీశారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. నాకు అలాంటి స్నేహితుడు త్రివిక్రమ్ గారు. నేను రీమేక్ సినిమాలు చేయడం మీకు నచ్చకపోవచ్చు. కానీ, నా కుటుంబాన్ని పోషించడానికి, పార్టీని నడపడానికి తక్కువ సమయంలో డబ్బులు కావాలంటే రీమేక్ సినిమాలు చేయక తప్పలేదు. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా చేయాలనుకుంటే.. అది ఎ.ఎం. రత్నం గారి ద్వారా వచ్చింది. మొదట రత్నం గారు కూడా రీమేక్ చేయాలనుకున్నారు. కానీ, క్రిష్ గారు ఈ కథ చెప్పారు. ఈ సినిమాకి పునాది వేసింది ఆయనే. నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఉర్రుతలూగించి ఆస్కార్ గెలిచారు కీరవాణి గారు. కరోనా వంటి కారణాల సినిమా ఆలస్యమవ్వడంతో నిరుత్సాహం వచ్చేది. కానీ, కీరవాణి గారి సంగీతం విన్న వెంటనే మళ్ళీ ఉత్సాహం కలిగేది. కీరవాణి గారి సంగీతం లేకుండా హరి హర వీరమల్లు లేదు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి కూడా.. అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. నేను ఖుషి సినిమా చేస్తున్న సమయంలో జ్యోతికృష్ణ లండన్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. ఆయన ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశారు. తండ్రికి ఉన్న విజన్ కి కొడుకు సారధ్యం వహించారు. తండ్రీకొడుకుల ఎఫర్ట్ ఈ సినిమా. రత్నం గారికి, జ్యోతికృష్ణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను మంత్రి అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేసి.. అద్భుతమైన అవుట్ పుట్ తీసుకొచ్చారు. ఈ సినిమాని ఒంటి చేత్తో నెల రోజులుగా ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ గారికి అభినందనలు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ అద్భుతంగా నటించారు. హరి హర వీరమల్లు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. మన భారతదేశం ఎవరి మీద దాడి చేయలేదు, ఎవరినీ ఆక్రమించుకోలేదు. మనం చదువుకున్న పుస్తకాల్లో మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప.. వారి అరాచకాన్ని చెప్పలేదు. ఔరంగజేబు సమయంలో నువ్వు హిందువుగా బ్రతకాలంటే టాక్స్ కట్టాలి అన్నారు. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ప్రజల పక్షాన నిలబడ్డారు. ఇలాంటి నేపథ్యంలో వీరమల్లు అనే కల్పిత పాత్రతో ఒక సగటు మనిషి ఏం చేసి ఉండొచ్చు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం ఎన్నో చేతులు మారుతూ ఇప్పుడు లండన్ లో ఉంది. కోహినూర్ నేపథ్యంలో క్రిష్ గారు కథ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించి సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ సినిమా కోసం మేము మా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాము. నాకు తెలిసిన వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ తో 18 నిమిషాల క్లైమాక్స్ ను నేను కొరియోగ్రఫీ చేశాను. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

కర్ణాటక అటవీ శాఖ మంత్రివర్యులు ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారికి తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ జనరేషన్ లోని గొప్ప నటుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప మనిషి కూడా. సమాజానికి సేవ చేయడంలో ముందుంటారు. సినీ రంగంతో పాటు, రాజకీయం రంగంలోనూ రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీలు వేరయినా సమాజానికి సేవ చేయడమే మా లక్ష్యం. నిర్మాత ఈ వేడుకకు ఆహ్వానించడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. యువత ఆయనను అనుకరిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే బడా హీరో, బడా నిర్మాత కలిసి చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆశిస్తూ.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “అశేష అభిమాన జన సందోహంతో, అద్భుతమైన మాస్ ఫాలోయింగ్ తో, అగ్రశ్రేణి కథానాయకుడిగా ఒక పక్కన.. మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవడమే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి వచ్చి.. రాజకీయం రంగంలో సైతం పేదవారికి అధికారం తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తూ.. ఇవాళ మనందరి అభిమాన ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ మాటలు అయితే చెప్తారో వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దేశభక్తి, జాతీయ వాదం గురించి ఆయన పదే పదే మాట్లాడుతుంటారు. హరి హర వీరమల్లు టైటిల్ చూసినా, కథాంశం చూసినా నాకు అనిపించేది ఒక్కటే.. దేశంలోని యువతకు దేశభక్తి, జాతీయ వాదం గురించి చాటిచెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఇంతకాలం ఈ సినిమా కోసం నిలబడిన రత్నం గారికి అభినందనలు. ఈ సినిమాలో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు.” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ, “శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం హరి హర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఈ సినిమాలో చూడబోతున్నాం. జూలై 24 ఎప్పుడు వస్తుందా అని మీ అందరితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆవేశం, ఒక ఉద్వేగం. ఎంతో ఉన్నతమైన వ్యక్తి. అలాగే ఎ.ఎం. రత్నం గారు ఎంతో ధైర్యమున్న వ్యక్తి, ఎన్నో హిట్ సినిమాలు తీసిన వ్యక్తి. ఇప్పుడు కళ్యాణ్ గారితో ఒక సంచలనాన్ని సృష్టించడానికి ముందుకొస్తున్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ప్రముఖ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. చాలా గొప్పవాడు. 17 ఏళ్ళ వయసు నుంచి పవన్ కళ్యాణ్ ని చూస్తున్న వ్యక్తిగా నాకు తెలుసు. అప్పటి నుంచే ఈ సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఉండేవాడు. తనంతట తాను వేసుకున్న బాటలో నడిచి వెళ్ళాడు తప్ప.. ఎవరో వేసిన బాటలో వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. తన బాటలో వస్తున్న ముళ్ళు, అవాంతరాలు, కష్టాలు, సుఖాలు.. తనంతట తాను ఎదురుతిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప.. ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు. ఆయన వేసుకున్న బాటలో పదిమందిని నడిపిస్తూ వచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనొక స్వయం శిల్పి. తనను తాను చిక్కుకున్న శిల్పి. డెస్టినీనే ఆయనను నడిపిస్తుంది. అనుకోకుండా నటుడు అయ్యారు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అయ్యారు. లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నయినా అనుకోనివ్వండి. సముద్రమంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే.. స్ట్రయిట్ నిలబడి చెప్పగల ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పుట్టుక నీది, చావు నీది.. బ్రతుకంతా దేశానిది. ఈ మాట పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.” అన్నారు.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను. కానీ, నాకు ఈ సినిమా ప్రత్యేకమైనది. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించిన మొదటి హిస్టారికల్ ఫిల్మ్, మొదటి పాన్ ఇండియా ఫిల్మ్ ను నిర్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. సినిమాల ద్వారా ఎంతో కొంత సందేశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఈ సినిమా కూడా వినోదం అందించడంతో పాటు, ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూస్తారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాము” అన్నారు.

చిత్ర నిర్మాత ఎ. దయాకర్ రావు మాట్లాడుతూ, “ఆరు సంవత్సరాల తర్వాత, అనేకమంది కృషి ఫలితంగా మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అభిమానులకు విందు ఇవ్వడానికి వస్తోంది. జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రం.. అభిమానులకు పెద్ద ఉత్సాహాన్ని, అంతకంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తుంది. మేము కష్టపడి తీశాము. ఇక ఆదరించాల్సిన బాధ్యత అభిమానులపైనే ఉంది. ట్రైలర్ చూశారు కదా. దానికి ఎన్నో రెట్లు సినిమా ఉండబోతుంది. అభిమానులు ఇదే ఉత్సాహంతో సినిమాకి ఘన విజయం అందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “హరి హర వీరమల్లు టైటిల్ పెట్టిన క్రిష్ గారికి ముందుగా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారు. ఔరంగజేబు అంటే పవర్ ఫుల్ మొఘల్ కింగ్. అంత పవర్ ఫుల్ రూలర్ కి ఒక వ్యక్తిని చూస్తే నిద్ర పట్టేది కాదు. అది ఎవరంటే మన ఛత్రపతి శివాజీ. ఆయన అనారోగ్యంతో 1680లో చనిపోయారు. ‘హరి హర వీరమల్లు’ కథ 1684లో స్టార్ట్ అవుతుంది. ఛత్రపతి శివాజీ చివరి కోరిక ఏంటంటే.. మొఘల్స్ నుంచి జ్యోతిర్లింగాలు కాపాడాలని, కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కాపాడాలని. ఆయన మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే వీరమల్లు. ప్రతి శతాబ్దానికి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. ఈ శతాబ్దానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైట్ డిజైన్ చేశారు. దానిని చూసి ఈ కథని ధర్మం కోసం జరిగే యుద్ధంగా మలిచాము. ఆ ఫైట్ ని త్రివిక్రమ్ గారికి చూపిస్తే ఎంతగానో ప్రశంసించారు. మా నాన్న ఎ.ఎం. రత్నం గారి గురించి చెప్పాలంటే.. అందరూ వాళ్ళ పిల్లలకి ఆస్తి సంపాదించి ఇస్తారు, మాకు మా నాన్న మంచి సంపాదించి ఇచ్చారు. ఆ పేరు వల్లే ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. ‘పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసి.. రెండు గంటలు నీ గురించి మాట్లాడుతూ అభినందించారు’ అని త్రివిక్రమ్ గారు చెప్పారు. ఆ మాట విని నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాకు ఈ అవకాశమిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది.” అన్నారు.

చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు ఒక ఎమోషనల్ డే లాగా ఉంది. ఎందుకంటే, ఈరోజు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమానిని. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎ.ఎం. రత్నం గారికి మనస్ఫూరిగా సెల్యూట్ చేస్తున్నాను. ఆయనలా సినిమాని ఎవరూ మోయలేరు అనిపిస్తుంది. రత్నం గారి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘ఈసారి డేట్ మారదు, రికార్డులు మారతాయి” అని జ్యోతికృష్ణ గారు చెబుతుంటారు. ఆయన మాట నిజం కావాలని ప్రార్థిస్తున్నాను. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. మనోజ్ పరమహంస గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

 

“Hari Hara Veera Mallu is a subject very close to my heart.”

– Power Star Pawan Kalyan at the Pre-Release Event

 

 Grand Pre-Release Event of ‘Hari Hara Veera Mallu’ Held in Hyderabad

Hari Hara Veera Mallu, starring Power Star Pawan Kalyan in the role of a warrior who fights for Dharma, is one of the most awaited films for fans and cinema lovers across the country. Produced by A. Dayakar Rao under the Mega Surya Productions banner, presented by renowned producer A.M. Ratnam, this big-budget period drama is directed by A.M. Jyothi Krishna and Krish Jagarlamudi. The film also stars Nidhhi Agerwal and Bobby Deol in pivotal roles. Slated to release worldwide on July 24, 2025, expectations for the film are sky-high.

The already released promotional material and songs have received excellent response, especially the trailer which has doubled the buzz.

On the evening of July 21st, the team organized a grand pre-release event at Shilpakala Vedika, Hyderabad, amidst fanfare and celebration. The event was graced by prominent personalities from the film, political, and business worlds.

Pawan Kalyan’s Speech Highlights:

Pawan Kalyan said:

“Though we planned a massive event with lakhs of fans, due to rains and other logistical concerns, we had to scale it down. This decision was taken keeping fans’ safety in mind. I extend my thanks to CM Revanth Reddy garu, Cinematography Minister Komatireddy Venkat Reddy, DGP Jitender garu, and Cyberabad Commissioner Avinash for giving permissions for this event.

I earned fan love through cinema and now friendships through politics — like Eshwar Khandre garu who made time to attend this event. I thank him, Kandula Durgesh garu, and Raghurama Krishnam Raju garu for joining us.

Two years ago during Bheemla Nayak release, when ticket rates were unfairly reduced, I said one thing — ‘Who can stop us?’ I was never in it for records or money.

I didn’t even dream of becoming an actor. I simply wanted to live as an ordinary man. It’s my fans who made me what I am. No weapons, no gangs — only hearts full of love.

I’ve completed 29 years in cinema. I’ve seen big hits… and big flops like Johnny. That failure taught me how monetary relationships dominate this field. But I always believed that I had fans who loved me beyond success.

This film was made with great struggle. Despite all my fame and connections, we had to earn money to make this movie. A.M. Ratnam garu, who once produced Khushi, came forward to do this again.

Trivikram garu stood by me during my failures and made Jalsa with me. He is a true friend.

I know fans may not like remakes, but I had to do them for financial stability — to support my family and political activities.

I’ve always had a deep love for the country and society. When I wanted to make a meaningful film, it was this one through A.M. Ratnam garu. Initially, he suggested a remake, but Krish garu came up with this idea.

Keeravaani garu, who made us all proud with Naatu Naatu, gave phenomenal music for this film. Even while grieving his father’s loss, he composed brilliant background music.

Jyothi Krishna garu, who trained in filmmaking in London, has handled this film exceptionally well. He brought his father’s vision to life.

Even as a minister, I dedicated 2 hours every day to this film’s shoot. Jyothi Krishna and DOP Manoj Paramahamsa planned everything perfectly.

Congratulations to Nidhhi Agerwal who carried promotions on her shoulders. Bobby Deol has done brilliantly as Aurangzeb.

This subject is very dear to me. Our history often glorifies invaders like Mughals but not their oppression. During Aurangzeb’s rule, Hindus were forced to pay tax to follow their faith.

Shivaji stood for Dharma. Through the fictional character of Veera Mallu, we are showing what an ordinary man could’ve done during those times.

The Kohinoor diamond, once found in Koti Lingala on the banks of Krishna river, passed through many hands to end up in London. When Krish narrated this backdrop, I was instantly hooked.

We’ve put our best efforts into this. I choreographed the 18-minute climax using my martial arts experience. I hope you all love it.”

Karnataka Forest Minister Eshwar Khandre:

“Pawan Kalyan has fans not just in Telugu states but all over India — even in Karnataka. He’s not only a great actor but a great human being, committed to public service.

I wish the film becomes a massive success.”

AP Cinematography Minister Kandula Durgesh:

“With a massive fan base and relentless work for the poor, Pawan Kalyan garu is a leader who practices what he preaches.

This film’s theme will ignite patriotism and nationalism in youth. My best wishes to the whole team.”

Deputy Speaker Raghurama Krishnam Raju:

“In this film, we’ll witness what Veera Mallu did to realize Shivaji’s dream.

Pawan Kalyan garu is an emotion.

A.M. Ratnam garu is a brave producer.

All the best to the entire team!”

Actor Brahmanandam:

“Pawan Kalyan garu is a man filled with humanity. I’ve known him since he was 17.

He never walked the easy path. He chose his own way — full of thorns and hardships.

He is a self-made man. Destiny leads him.

He rose not because of circumstances but in spite of them.

The quote ‘Your birth is yours, your death is yours… but your life belongs to the nation’ suits him perfectly.”

 

Producer A.M. Ratnam:

“I’ve produced many films, but this is special.

It’s the first film releasing after Pawan Kalyan garu became Deputy CM.

Also, it’s his first historical and pan-India film. I take pride in that.

This film will entertain and also make you think.

You’ll witness his full power on screen. We’re confident it’ll be a blockbuster.”

Producer A. Dayakar Rao:

“After 6 years of hard work, Hari Hara Veera Mallu is finally releasing.

We made it with all our heart. Now it’s time for fans to take it to the next level.

If the trailer excited you, the film will do even more!”

Director Jyothi Krishna:

“Thanks to Krish garu for giving us the title.

Bobby Deol plays Aurangzeb, a powerful Mughal ruler.

Our story begins in 1684, four years after Shivaji’s death.

Shivaji’s last wish was to protect the Jyotirlingas and Kashi Vishwanath temple.

Veera Mallu’s character represents that fight.

Every century gives birth to a Shivaji. In this century, we have Pawan Kalyan garu.

A single fight scene designed by Pawan garu inspired the entire concept of Dharma vs. tyranny.

Trivikram garu appreciated that scene deeply.

My father A.M. Ratnam gave us not just property but legacy.

Thanks to him, I got this opportunity.

Trivikram garu once told me, ‘Pawan Kalyan garu watched your film and spoke about you for 2 hours.’

That moved me to tears.

I promise this film will make all his fans proud.”

Actress Nidhhi Agerwal:

“Today is very emotional for me. I waited so long for this day.

I’m a die-hard fan of Pawan Kalyan garu, and acting with him is a dream come true.

This will stay in my heart forever.

Hats off to A.M. Ratnam garu — no one else could’ve carried this film like him.

As Jyothi Krishna garu says, ‘This time the date won’t change, only records will.’

I pray that comes true.

Keeravaani garu gave magical music.

I wish to do many more films with Manoj Paramahamsa garu.”