Jul 28 2025
Grand Kingdom Pre Release Event
Jul 28 2025
Jul 26 2025
ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక
Jul 17 2025
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘హృదయం లోపల’ గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం ‘అన్న అంటేనే’ విడుదలైంది.
‘కింగ్‌డమ్’ నుంచి ‘అన్న అంటేనే’ గీతాన్ని బుధవారం(జూలై 16) సాయంత్రం విడుదల చేశారు నిర్మాతలు. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రుతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. ‘కింగ్‌డమ్’ కోసం ఈ భావోద్వేగ గీతాన్ని స్వరపరిచారు. ఈ అద్భుతమైన గీతం హృదయాలను హత్తుకునేలా ఉంది.
సోదరభావానికి ఒక వేడుకలా ‘అన్న అంటేనే’ గీతముంది. వినోదాన్ని అందించే పాటలు ఎన్నో ఉంటాయి. కానీ, బంధాలను గుర్తుచేసే పాటలు, మనసుని తాకే పాటలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన గీతమే ‘అన్న అంటేనే’.
సోదరులుగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కొత్తగా కనిపిస్తున్నారు. నిజ జీవితంలో అన్నదమ్ముల్లాగా తెరపై కనిపిస్తున్నారు. ఇద్దరూ తమదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటలోని భావోద్వేగ లోతుని చక్కగా పండించారు. ఈ గీతం తోబుట్టువుల ప్రేమకు పరిపూర్ణమైన నివాళిలా ఉంది.
‘అన్న అంటేనే’ గీతాన్ని అనిరుధ్ స్వరపరచడంతో పాటు ఆలపించడం విశేషం. తనదైన సంగీతంతో, గాత్రంతో అనిరుధ్ మరోసారి కట్టిపడేశారు. వరుస బ్లాక్‌బస్టర్ గీతాలను అందిస్తూ, పాట పాటకు తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న అనిరుధ్.. ఇప్పుడు ఈ భావోద్వేగ గీతంతో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం అందరినీ కదిలించేలా ఉంది.
ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకొని, ఆ కథను అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అంచనాలను పెంచుతూనే ఉంది. తాజాగా విడుదలైన ‘అన్న అంటేనే’ గీతం దర్శకుడి బలమైన భావోద్వేగ దృష్టిని ప్రతిబింబిస్తుంది.
‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మునుపెన్నడూ చూడని గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించనుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.
తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
It’s a celebration of brotherhood. There are many songs that entertain but very few that make you pause, reflect and feel the strength of your own bonds. #AnnaAntene does just that.
The visuals between Vijay Deverakonda and Satyadev looks refreshing. Their chemistry and screen presence together deliver a genuine emotional punch that enhances the song’s enhancement. It’s a perfect tribute to sibling love one that’s relatable and real.
The song is sung and composed by Anirudh who once again proves why he’s in a league of his own. With back to back unanimous musical blockbusters, he continues to raise the bar and this track adds a whole new dimension to his emotional spectrum. Lyrics by Krishna Kanth he literally moved us with words that hit hard.
Written & Directed by Gowtam Tinnanuri. Kingdom continues to build anticipation with every new asset and this song reflects the director’s strong emotional vision blending warmth with cinematic scale.
Cinematography by Jomon T. John ISC and Girish Gangadharan ISC and edited by Navin Nooli.
Produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios, Kingdom is gearing up for a grand release and with a song like #AnnaAntene emotional quotient is set. All set to strike the box office on July 31st.
May 15 2025
మే 30న విడుదల కావాల్సిన మా ‘కింగ్‌డమ్’ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాము. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్‌లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ నిర్ణయం ‘కింగ్‌డమ్’కి మరిన్ని మెరుగులు దిద్ది, సాధ్యమైనంత ఉత్తమంగా మలచడానికి సహాయపడుతుందని మేము విశ్వసిస్తున్నాము. కాస్త ఆలస్యంగా వచ్చినా ‘కింగ్‌డమ్’ చిత్రం అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. జూలై 4న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నాము.
విడుదల తేదీ మార్పు విషయంలో తమ మద్దతు ఇచ్చినందుకు దిల్ రాజు గారికి, నితిన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.” అని చిత్ర బృందం పేర్కొంది.
విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు.
ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘కింగ్‌డమ్’ కోసం అద్భుతమైన కథను ఎంచుకున్నారు. ఆ అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.
జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉండనుంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి, జూలై 4న ‘కింగ్‌డమ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది.
చిత్రం: కింగ్‌డమ్
విడుదల తేదీ: జూలై 4, 2025
తారాగణం: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకరా స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
KINGDOM locks July 4th,2025 – The crown awaits the Big Screen Throne
Team issues a statement regarding the postponement:
“To our dear audience,
We wish to inform that the release of our film Kingdom originally set for May 30 has been rescheduled to July 4. We explored every possibility to stick to the original date, but recent unforeseen events in the country and the current atmosphere have made it difficult for us to move forward with promotions or celebrations.
We believe this decision will help us present Kingdom in the best possible way, with the creative excellence and spirit it deserves. We truly value your support and hope to receive your love when we meet you at the cinemas on July 4.
We’re grateful to Dil Raju garu and Nithin garu for their understanding and support in making this change possible.
JAI HIND!!
With gratitude,
Team Kingdom “
Vijay Deverakonda takes on one of the most intense roles of his career and he’s already making a mark with his killer looks as always. From the glimpses seen so far, Bhagyashri Borse will deliver an intriguing portrayal. The film is written and directed by Gowtam Tinnanuri who has an impeccable style of storytelling.
Cinematography is handled by Jomon T. John ISC and Girish Gangadharan ISC with editing handled by Navin Nooli.
Music is composed by Anirudh Ravichander who has already delivered big and set sky high expectations with the first single Hridayam Lopala.
Produced by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios.
July 4th, 2025. KINGDOM will rise. And it will rule.
Film Title: KINGDOM
Release Date: 4th July, 2025
Cast: Vijay Deverakonda, Bhagyashri Borse
Director: Gowtam Tinnanuri
Producers: Naga Vamsi, Sai Soujanya
Music: Anirudh Ravichander
Cinematography: Jomon T. John ISC, Girish Gangadharan ISC
Production Designer: Avinash Kolla
Editing: Navin Nooli
Production Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios
May 2 2025
‘కింగ్‌డమ్’ చిత్రం నుండి మొదటి గీతం ‘హృదయం లోపల’ విడుదల
అనిరుధ్ రవిచందర్ తన మనోహరమైన సంగీతంతో ‘హృదయం లోపల’ గీతాన్ని అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. వీరి మధుర గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ గీతానికి కెకె కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించారు. దార్ గై తనదైన కొరియోగ్రఫీతో పాటలోని భావోద్వేగానికి దృశ్యరూపం ఇచ్చారు.
‘హృదయం లోపల’ గీతం విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్ కి కథానాయకుడు విజయ్ దేవరకొండ తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా భావాలను పంచుకున్నారు. “3, VIP చిత్రాల సమయంలోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయాను. నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకి ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి గీతం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.” అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు.
కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘హృదయం లోపల’ గీతం ఉంది. ‘కింగ్‌డమ్’ రూపంలో ఓ మంచి ఆల్బమ్ ని అందించబోతున్నట్లు తొలి గీతంతోనే ఈ త్రయం హామీ ఇచ్చింది.
వీడియో సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కథ లోతును తెలియజేస్తూ.. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగా, ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో రూపొందిస్తున్నారని విజువల్స్ ని బట్టి అర్థమవుతోంది.
జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరకెక్కిస్తూ ‘కింగ్‌డమ్’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
Kingdom’s first single ‘Hridayam Lopala’, Composed by Anirudh is an instant chartbuster
The promo released just a couple of days ago took over the charts crossed 20M+ views and left everyone humming it on loop perfectly setting the stage for the full song. Now with the full video out the response is nothing short of massive even bigger than expected.
Anirudh Ravichander leaves yet another mark with this soul piercing melody supported beautifully by the magical voice of Anumita Nadesan.
Lyricist KK delivers a poetic knockout while Dar Gai’s choreography adds visual emotion.
Vijay Deverakonda, Gowtam Tinnanuri and Anirudh a trio already known for delivering musical blockbusters strike again.
The visuals in the full video song give hints, raise questions and add depth to the story making everyone curious about the film. Shot on a big scale, the visuals look grand, beautiful and totally live up to the hype.
The cinematography handled by Jomon T. John ISC and Girish Gangadharan ISC is top notch. Editing by Navin Nooli.
Written and directed by Gowtam Tinnanuri. Kingdom is shaping up to be a massive theatrical experience.
Produced by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios. Worldwide Grand Release on May 30th.
Follow Us!