kingdom

They fake love to survive, but soon, it feels all too real. – HRIDAYAM SONG PROMO from KINGDOM IS A WINNER

కింగ్‌డమ్’ చిత్రం నుండి మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదల

‘కింగ్‌డమ్’ చిత్రం నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదలైంది. విడుదలైన క్షణాల్లోనే అందరి మనసుని దోచేసింది.

కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రోమో ఉంది. ప్రోమోలో విజయ్, భాగ్యశ్రీ బోర్సే జోడీ చూడ ముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పూర్తి గీతం మే 2వ తేదీన విడుదల కానుంది.

“వారు బ్రతకడానికి ప్రేమను నటిస్తారు, కానీ త్వరలోనే అది నిజమనిపిస్తుంది.” అనే వాక్యాన్ని నిర్మాతలు జోడించారు. దానిని బట్టి చూస్తే.. ప్రధాన పాత్రలు మొదట ప్రేమలో ఉన్నట్లు నటిస్తాయి, కానీ చివరికి నిజంగానే ప్రేమలో పడిపోతాయని అర్థమవుతోంది.

విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మే 2న విడుదల కానున్న ‘హృదయం లోపల’ గీతం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రోమోలో అనిరుధ్ సంగీతం కట్టిపడేసింది. అలాగే అనిరుధ్, అనుమిత నదేశన్ తమదైన గాత్రంతో మెప్పించారు. ఈ మనోహరమైన గీతానికి కెకె సాహిత్యం అందించారు. దార్ గై తన కొరియోగ్రఫీతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరకెక్కిస్తూ ‘కింగ్‌డమ్’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

They fake love to survive,
but soon, it feels all too real.
- HRIDAYAM SONG PROMO from KINGDOM IS A WINNER

The most awaited Hridayam Lopala promo from Kingdom is out now and it’s already playing on loop!

The beats hit instantly and it looks like the powerful trio of Vijay Deverakonda, Gowtam Tinnanuri and Anirudh have struck big . Real fireworks are clearly set for May 2nd with full song release.

As the makers captioned:
“They fake love to survive, but soon it feels all too real.”

From what we see, it looks like the characters start by pretending to be in love… but eventually fall for real.

The visuals are stunning, grand and absolutely worth the wait and hype. The cinematography, handled by Jomon T. John ISC and Girish Gangadharan ISC is top notch, while Navin Nooli handling editing.

Full song on May 2nd and Anirudh and Anumita Nadesan has already struck the right chord building massive anticipation with his
KK has penned the lyrics for this soulful and intense melody. Dar Gai has added her touch of magic with the choreography.

Gowtam Tinnanuri has written and directed this film on a truly grand scale.

Produced by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios.

Hridayam Lopala - STILL InstaPost Video Cover-KINGDOM_TEL PROMO OUT

VD12 TITLED ‘KINGDOM’ – TEASER is a cinematic masterpiece that ignites excitement!

విజయ్ దేవరకొండ ‘VD12′ చిత్రానికి ‘కింగ్‌డమ్’ టైటిల్.. అంచనాలు రెట్టింపు చేసిన టీజర్!
- మే 30, 2025 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ‘కింగ్‌డమ్’ విడుదల
యువ సంచలనం విజయ దేవరకొండ కథానాయకుడిగా ప్రతిభగల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై సినీ ప్రియులతో పాటు, సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘VD12′ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
టైటిల్ తో పాటు బుధవారం నాడు టీజర్ ను కూడా ఆవిష్కరించారు నిర్మాతలు. ‘కింగ్‌డమ్’ టీజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ‘కింగ్‌డమ్’ రూపొందుతోందని టీజర్ తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
‘కింగ్‌డమ్’ టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి, టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లారు.
‘కింగ్‌డమ్’ చిత్రానికి విజయ్ దేవరకొండ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. సినిమాని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళడానికి తన వైపు నుంచి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నారు. విజయ్ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే, దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టి ఉండటం సహజం. ‘కింగ్‌డమ్’ టీజర్ విడుదల తేదీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి, ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూశారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్ కట్టిపడేసింది. విజయ్ తన స్టార్‌డమ్‌కి తగిన సరైన కథ వస్తే.. ఏం చేయగలరో కేలవం టీజర్ తోనే రుజువు చేశారు.
‘జెర్సీ’ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త అవతార్‌లో చూపిస్తున్నారు. ‘కింగ్ డమ్’ టీజర్ విజయ్ అభిమానులను సంతృప్తి పరచడమే కాకుండా, సాధారణ ప్రేక్షకులలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని మరింత పెంచింది.
సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. టీజర్ లో విజయ్ పాత్రను దర్శకుడు చూపించిన తీరు, దానిని తన సంగీతంతో అనిరుధ్ మరో స్థాయికి తీసుకువెళ్లిన తీరు అద్భుతం. ఛాయాగ్రాహకులు జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ తమ కెమెరా పనితనంతో చిత్రానికి మరింత అందం తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాకి ఎడిటర్ గా నవీన్ నూలి, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
వరుస ఘన విజయాలను సొంతం చేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ‘కింగ్‌డమ్’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తారాగణం: విజయ్ దేవరకొండ
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్
కూర్పు: నవీన్ నూలి
కళా దర్శకత్వం: అవినాష్ కొల్లా
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
నృత్య దర్శకుడు: విజయ్ బిన్నీ
యాక్షన్ దర్శకులు: యానిక్ బెన్, చేతన్ డిసౌజా , రియల్ సతీష్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
VD12 TITLED ‘KINGDOM’ – TEASER is a cinematic masterpiece that ignites excitement! ????
Vijay Deverakonda’s upcoming film directed by Gowtam Tinnanuri is one of the most anticipated films of 2025. The makers of VD12 have officially announced the film’s title – KINGDOM.
The teaser is an adrenaline fueled action drama packed with intensity, emotions and scale. It promises a larger than life experience leaving audiences on the edge of their seats.
To elevate the madness, Jr. NTR has lent his voice for the Telugu version, Suriya for Tamil and Ranbir Kapoor for Hindi. The presence of these powerhouses has taken the teaser to the next level turning it into a firecracker of an experience!
Vijay Deverakonda has poured his heart and soul into this film giving it everything to make it as big as possible. He reminds us of why the nation sat up in attention when he arrived and the phenomenon that he is, he now seems to have found a script and team that does justice to his stardom.
After delivering the cult classic Jersey, Gowtam Tinnanuri is back, this time showcasing Vijay Deverakonda in a completely new avatar. The teaser has ignited massive excitement satisfying fans’ long standing anticipation while leaving them hungry for more.
The brand Anirudh Ravichander strikes again with a power packed and electrifying BGM adding to the film’s intensity. Naveen Nooli handles the editing while Avinash Kolla takes charge as the art director. Jomon T. John and Girish Gangadharan will bring the madness to life through their lens!
The blockbuster machines producers Naga Vamsi and Sai Soujanya who are mounting this film on an unprecedented scale under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and in collaboration with Srikara Studios.
Set to hit the big screens on May 30th 2025, KINGDOM has already taken over the digital space setting expectations sky high. The film has all the makings of a stupendous monstrous box-office success.
Stay tuned for more updates.
Starring: Vijay Deverakonda
Crew Details:
Written & Directed By: Gowtam Tinnanuri
Produced By: Naga Vamsi S – Sai Soujanya
Music Composed By: Anirudh Ravichander
Cinematography: Jomon T John ISC, Girish Gangadharan ISC
Editor: Navin Nooli
Production Designer: Avinash Kolla
Costume Designer: Neeraja Kona
Song Choreographer: Vijay Binni
Action Choreographer’s: Yannick Ben, Chethan D’Souza, Real Satish
A Sithara Entertainments Production
in Association with Fortune Four Studios
Presented by Srikara Studios
KINGDOM_STILL_FINAL FB-TWITTER_KINGDOM