Mithra Mandali

Mithra Mandali All Set for a Diwali Blast – Hitting Theatres Worldwide on October 16th!

దీపావళికి నవ్వుల టపాసులు పేల్చనున్న ‘మిత్ర మండలి’అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల

పండుగ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను జరుపుకునేలా.. ‘మిత్ర మండలి’ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించి, రెండు చార్ట్‌బస్టర్ పాటలతో అభిమానులను అలరించిన తర్వాత, నిర్మాతలు ఇప్పుడు ఆకట్టుకునే విడుదల తేదీ పోస్టర్‌తో పాటు ఒక వినోదభరితమైన ప్రకటన వీడియోను ఆవిష్కరించారు. బాణసంచా కాల్చడం మరియు గ్యాంగ్ యొక్క ఉత్సాహభరితమైన శక్తితో నిండిన ఈ పోస్టర్ పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ప్రకటన వీడియో అయితే నవ్వులు పూయిస్తూ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ప్రేక్షకులకు ఎంతగానో ఎదురుచూస్తున్న నవ్వుల పండుగకు నమూనా అన్నట్టుగా ఈ వీడియో ఉంది.

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చబోతున్నారు.

అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స వ్యవహరిస్తున్నారు.

‘మిత్ర మండలి’కి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్ గా పీకే, కళా దర్శకుడిగా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

ప్రీ-లుక్ పోస్టర్ నుండి టైటిల్ ప్రకటన, టీజర్, పాటలు వరకు.. ‘మిత్ర మండలి’ నుండి విడుదలైన ప్రతిదీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇక ఇప్పుడు దీపావళి కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుందని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్, వీడియో కూడా మెప్పించి అంచనాలను రెట్టింపు చేశాయి.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.

ఈ దీపావళికి వెండితెరపై సరదా, గందరగోళం మరియు స్నేహం యొక్క పటాకును చూడటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ‘మిత్ర మండలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఫన్ బాంబ్ లాగా విజృంభించడానికి వస్తోంది.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం., విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Mithra Mandali All Set for a Diwali Blast – Hitting Theatres Worldwide on October 16th!The festive wait has finally come to an end! The team of Mithra Mandali has officially locked October 16th as the grand worldwide release date, ensuring audiences a laughter-packed Diwali celebration in theatres.

After creating a wave of intrigue with its teaser and making fans groove to two chartbuster songs, the makers have now unveiled a colourful Release Date Poster along with a hilarious announcement video. Bursting with fireworks and the vibrant energy of the gang, the poster has set the festive mood rolling, while the quirky video has sparked laughter across social media, giving audiences the perfect preview of the madness and comedy that awaits.

Presented by Bunny Vas under the banner of BV Works and jointly produced by Sapta Aswa Media Works and Vyra Entertainments, Mithra Mandali is all set to be a madcap mix of humour, mystery, and youthful energy. Directed by Vijayendar, the film stars a powerhouse ensemble of entertainers – Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, and Prasad Behara – who bring infectious camaraderie and impeccable comic timing to the big screen.

Backing the project are producers Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala, with co-production by Somaraju Penmetsa.

The film also boasts a stellar technical crew, featuring RR Dhruvan as Music Director, Siddharth SJ as Cinematographer, Peekay as Editor, Gandhi Nadikudikar as Art Director, Rajeev Kumar Rama as Executive Producer, and Shilpa Tangturu as Costume Designer.

From the pre-look reveal to the title announcement, followed by the teaser launch and music releases, Mithra Mandali has built consistent buzz and anticipation among audiences. Now, with the release date officially sealed for October 16th, excitement has reached its peak.

This Diwali, get ready to witness a firecracker of fun, chaos, and friendship on the big screen – because Mithra Mandali is ready to burst into theatres worldwide like a FUN BOMB!

 

MM RELEASE DATE POSTER LOCK insta

After Chartbuster “Kattanduko Janaki,” Mithra Mandali Unveils Fun-Filled Second Single “Swecha Standuu”

మిత్ర మండలి’ నుంచి రెండవ గీతం ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదల

‘కత్తందుకో జానకి’ శైలిలో ‘మిత్ర మండలి’ నుంచి మరో సరదా గీతం ‘స్వేచ్ఛ స్టాండు’

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘కత్తందుకో జానకి’ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదలైంది.’మిత్ర మండలి’ నుంచి మొదటి గీతంగా విడుదలైన ‘కత్తందుకో జానకి’ అందరూ సరదాగా పాడుకునేలా ఉండి, సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు రెండవ గీతంగా వచ్చిన ‘స్వేచ్ఛ స్టాండు’ కూడా అంతే సరదాగా ఉంది.ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ పాటకు ఆర్.ఆర్. ధృవన్, విజయేందర్ ఎస్ సంయుక్తంగా సాహిత్యం అందించారు. తేలికైన ఇంగ్లీష్ పదాలతో సరదా సరదాగా ఈ గీత రచన ఉంది. ‘వై దిస్ కొలవెరి’ శైలిలో సాగిన ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం.. ఆ పాట శైలిలోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించేలా ఉంది.

ధనుంజయ్ సీపాన, ఆర్.ఆర్. ధృవన్ ల గానం ఈ పాటను ఉత్సాహభరితంగా మార్చింది. కథానాయిక దృష్టిలో పడటం కోసం కథానాయకులు వచ్చీరాని ఇంగ్లీష్ పదాలతో పాట పడటం భలే సరదాగా ఉంది. ముఖ్యంగా ఈ తరం శ్రోతలకు నచ్చేలా ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం సాగింది.

వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్.జె, కళా దర్శకుడిగా గాంధీ నడికుడికర్ వ్యవహరిస్తున్నారు. పీకే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్స, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

టీజర్, ‘కత్తందుకో జానకి’ గీతం ఆకట్టుకొని ‘మిత్ర మండలి’ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు ఈ ‘స్వేచ్ఛ స్టాండు’ గీతం ఆ అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

 

 After Chartbuster “Kattanduko Janaki,” Mithra Mandali Unveils Fun-Filled Second Single “Swecha Standuu”
After the rousing applause for the teaser and the roaring success of the first single Kattanduko Janaki, the makers of Mithra Mandali proudly unveil their second single “Swecha Standuu”.Composed by RR Dhruvan, with lyrics jointly written by RR Dhruvan and the film’s director Vijayendar S, this is a quirky, light-hearted proposal track that delightfully experiments with broken-English expressions and playful storytelling. Channeling a Kolaveri Di-like energy, Swecha Standuu stands out as a genre-defying number, filled with youthful spirit and humor.The vocals by Dhanunjay Seepana and RR Dhruvan lend a vibrant and relatable tone to this track, which is expected to strongly resonate with Gen Z audiences.

Presented by Bunny Vas under BV Works and produced by Sapta Aswa Media Works & Vyra Entertainments, Mithra Mandali stars Priyadarshi, Niharika NM, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, with an ensemble that also includes Vennela Kishore, Satya, and VTV Ganesh.

Technically, the film continues to shine with contributions from:
RR Dhruvan – Music
Siddharth SJ – Cinematography
Peekay – Editing
Gandhi Nadikudikar – Production Design
Shilpa Tanguturu – Costumes

“Swecha Standuu” arrives on the heels of an outstanding reception to the teaser and the foot-tapping Kattanduko Janaki, both of which gave audiences a glimpse into the quirky world of Mithra Mandali.

Produced by Kalyan Manthina, Bhanu Pratapa & Dr. Vijender Reddy Teegala, with Somaraju Penmetsa as Co-Producer and Rajeev Kumar Rama as Executive Producer, the film promises a refreshing cinematic experience laced with humor, relatability, and heart.

 
 Here’s the ‘Never Before’, Most Quirkiest “Proposal Song of the Year” #SwechaStanduu from #MithraMandali  english Song out now
OUT NOW plain OUT NOW TWITTER

*“Kattanduko Janaki” Song from Mithra Mandali Launched with a Bang at KIMS College, Amalapuram!*

మిత్ర మండలి’ మొదటి గీతం ‘కత్తందుకో జానకి’ విడుదల

అమలాపురంలోని కిమ్స్ కాలేజ్ లో ఘనంగా గీతావిష్కరణ కార్యక్రమం

బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం అపరిమిత వినోదాన్ని అందించనుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది.

తాజాగా ‘మిత్ర మండలి’ నుంచి మొదటి గీతం ‘కత్తందుకో జానకి’ని నిర్మాతలు విడుదల చేశారు. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం(జూన్ 21) సాయంత్రం అమలాపురంలోని కిమ్స్ కాలేజ్ లో జరిగింది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఐకానిక్ డైలాగ్ ‘కత్తందుకో జానకి’ని తీసుకొని, ఈ తరం మెచ్చేలా అద్భుతమైన పాటగా మలిచారు. ఆర్.ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ గీతం.. వినసొంపుగా, అందరూ సరదాగా పాడుకునేలా ఉంది. కాసర్ల శ్యామ్ మరోసారి తన కలం బలం చూపించారు. ఈ సరదా గీతాన్ని ఎంతో అందంగా, అర్థవంతంగా వ్రాశారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ తన గాత్రంతో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.

‘మిత్ర మండలి’ మొదటి గీతం ‘కత్తందుకో జానకి’కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రధాన పాత్రధారులు ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ గీతం సాగింది. తమ గురించి తాము ఉల్లాసంగా పాడుతూ.. నేటి Gen Z అలవాట్లయిన రీల్స్, రిలేషన్స్, పబ్జీ గేమింగ్ ఇలా ప్రతిదానిని ప్రస్తావిస్తూ ‘కత్తందుకో జానకి’ గీతం నడిచిన తీరు కట్టిపడేసింది. ఓ వైపు యువత తమ అలవాట్లను చెప్పుకుంటుంటే, మరోవైపు తల్లిదండ్రులు వారిని తరుముతూ ‘కత్తందుకో జానకి’ అనడం ఆకట్టుకుంది.

అమలాపురం కిమ్స్ కాలేజ్ లో జరిగిన ‘కత్తందుకో జానకి’ గీతావిష్కరణ వేడుకకు ముఖ్య అతిథిగా అమలాపురం ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి హాజరయ్యారు. అలాగే కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు, ఎండీ రవివర్మ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు బన్నీ వాస్, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల, నటీనటులు ప్రియదర్శి, నిహారిక, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, దర్శకుడు విజయేందర్ ఎస్, సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ తదితరులు సందడి చేశారు.

‘కత్తందుకో జానకి’ గీతం యువత మెచ్చేలా ఉందని ప్రశంసించిన అతిథులు.. ‘మిత్ర మండలి’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధలన్నీ మర్చిపోయి, థియేటర్లలో మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ‘మిత్ర మండలి’ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

  *“Kattanduko Janaki” Song from Mithra Mandali Launched with a Bang at KIMS College, Amalapuram!*

June 21st witnessed an electrifying atmosphere at KIMS College, Amalapuram, as the first single from the upcoming film Mithra Mandali, titled “Kattanduko Janaki”, was launched amidst a wildly enthusiastic crowd and the film’s vibrant cast.

Gracing the event as the Chief Guest was Amalapuram MP G.M. Harish Balyogi, joined by KIMS Chairman Chaitanya Raju and MD Ravi Varma. The launch turned into a grand celebration with the presence of film presenter Bunny Vas, producers Kalyan Manthina, Bhanu Pratap, Dr. Vijayender Reddy Teegala, and cast members Priyadarshi, Niharika N M, Rag Mayur, Vishnu Oi, and Prasad Behara, along with director Vijayender S, music director R.R. Dhruvan, and other team members.

The quirky and youthful anthem “Kattanduko Janaki” has already received a thunderous response online. Sung by Rahul Sipligunj, penned by Kasarla Shyam, and composed by RR Dhruvan, the song hilariously explores the world of four young men played by Priyadarshi, Vishnu Oi, Rag Mayur, and Prasad Behara as they sing about their Gen Z escapades, from reels to relationships to PUBG gaming, while their fathers yell in the background with the now-viral hook: “Kattanduko Janaki!”

The guests lauded the song for its fun and relatable vibe and conveyed their best wishes to the entire Mithra Mandali team, expressing hopes for the film’s massive success. The makers shared that Mithra Mandali will be a laughter-filled ride that allows audiences to forget their worries and simply enjoy the madness in theatres.

Presented by Bunny Vas under BV Works, and jointly produced by Sapta Aswa Media Works & Vyra Entertainments, Mithra Mandali is directed by Vijayender S, and stars an ensemble cast including Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, Vennela Kishore, Satya, VTV Ganesh, and more.

With Kalyan Manthina, Bhanu Pratap, and Dr. Vijayender Reddy Teegala as producers and Somaraju Penmetsa as co-producer, the film is backed by a dynamic technical team featuring RR Dhruvan (Music), Siddharth SJ (Cinematography), Peekay (Editing), and Gandhi Nadikudikar (Production Design).

Start vibing to “Kattanduko Janaki” out now and winning hearts everywhere!

IMG_8668 4dc6cb99-48a3-41c9-8112-2d6abc978cca KLN06027 (1) KLN06023 (1)

Mithra Mandali Groovy 1st Single “Kattanduko Janaki” Launch at KIMS College, Amalapuram June 21st!

Mithra Mandali Groovy 1st Single “Kattanduko Janaki” Launch at KIMS College, Amalapuram June 21st!

Following the buzz-worthy title reveal and the riotous teaser that received a phenomenal response, the team behind MITHRA MANDALI is all set to launch the film’s first single Kattanduko Janaki on June 21st at 6:30 PM, live at KIMS College, Amalapuram, amidst an enthusiastic crowd of cinema lovers.

Marking the start of the film’s musical journey, the launch event will see the presence of the cast and crew, promising a foot-tapping, high-energy number that’s bound to get stuck in your head! With Rahul Sipligunj on vocals, Kasarla Shyam’s catchy lyrics, and RR Dhruvan’s groovy composition, this track is expected to be a chartbuster from the get-go.

Presented by Bunny Vas under the BV Works banner, and produced by Sapta Aswa Media Works and Vyra Entertainments, MITHRA MANDALI is helmed by Director Vijayendar and boasts a madcap ensemble cast featuring Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, Vennela Kishore, Satya, VTV Ganesh, and many more.

The film is produced by Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala, with Somaraju Penmetsa as co-producer. Backing the madness is a skilled technical team, RR Dhruvan composing the music, Siddharth SJ behind the lens, Peekay on the edit, and Gandhi Nadikudikar crafting the film’s quirky visual aesthetic.

 PHOTO-2025-06-19-20-26-58

*I loved the teaser, Mithra Mandali is definitely going to be a blockbuster: Producer Allu Aravind at Mithra Mandali Teaser Launch event*

ఘనంగా ‘మిత్ర మండలి’ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం


‘మిత్ర మండలి’ టీజర్ చాలా బాగుంది : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రం అపరిమిత వినోదాన్ని అందించనుందనే నమ్మకాన్ని పోస్టర్ కలిగించింది.

తాజాగా ‘మిత్ర మండలి’ టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు(జూన్ 12) ఉదయం హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

త్వరలో థియేటర్లలో నవ్వుల పండుగ రాబోతుందని చాటిచెప్పేలా ‘మిత్ర మండలి’ టీజర్ ఉంది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా పోటాపోటీగా టీజర్ లో నవ్వులు పంచారు. క్రికెట్ తరహా కామెంటరీతో టీజర్ ను వినోదభరితంగా మలిచిన తీరు ఆకట్టుకుంది. “బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు.. రోజూ ఎవరో ఒకర్ని ఎర్రిపప్పని చేస్తారు” అంటూ ప్రధాన పాత్రధారులు ఎలాంటి హాస్యాన్ని పంచబోతున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇక టీజర్ లో వెన్నెల కిషోర్, సత్య మధ్య కామెడీ డైలాగ్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం నవ్వులు పంచుతున్న ఈ ‘మిత్ర మండలి’ టీజర్.. నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ ‘మిత్ర మండలి’ టీజర్ ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను యంగ్ స్టర్స్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాడు. దాని వల్ల స్క్రిప్ట్ ఎంపిక వంటి విషయాల్లో ఎంతో హెల్ప్ జరుగుతుంటుంది. ఒకసారి వాసు ఈ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు. కానీ, మీ ముందు కథ చెప్పలేకపోతున్నాను అని దర్శకుడు వెళ్ళిపోయాడు. నేను కథ వినకుండానే, నేరుగా ఈ సినిమా చూడబోతున్నాం. వీరందరి మాటలు వింటుంటే.. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవుతోంది. ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అనిపించింది.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని. యాక్టర్ గా ఎంత చేయాలో, ఎంత చేయకూడదో తెలిసిన మనిషి. కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు. సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకి ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకంటూ, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.” అన్నారు.

అతిథి, దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ, “ఈ మిత్ర మండలి చిత్ర దర్శకుడు విజయ్ నాకు స్నేహితుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడు. రైటింగ్ క్రేజీగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న బన్నీ వాస్ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్.” అన్నారు.

అతిథి, నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ, “ఏ హోమం చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. మా సినిమా వేడుకలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే. నన్ను, బన్నీ వాసుని ఆయన బిడ్డల్లాగే చూసుకుంటారు. చేతి ఐదు వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, కలిసే ఉంటాయి. అరవింద్ గారు ప్రోత్సహించిన కుటుంబం మేము. మేమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆయన కోసం మేము పిడికిలిగా మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈ మిత్ర మండలి టీజర్ చూస్తుంటే జాతి రత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్ సినిమాల వైబ్ వస్తుంది. అవన్నీ హిట్ సినిమాలే. మిత్ర మండలి వాటిని మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

చిత్ర సమర్పకులు, నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, “ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. మిత్ర మండలి అలా ఉంటుంది. ఇలాంటి సినిమా తీయడానికి ‘జాతిరత్నాలు’ స్ఫూర్తి. ఒక నలుగురు స్నేహితులు సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడితే చూడటానికి ఎంత బాగుంటుంది. ఇది యంగ్ స్టర్స్ అంతా కలిసి తీసిన సినిమా. మేము వాళ్ళకి మా వంతు సపోర్ట్ ఇచ్చాము. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక అందరూ అద్భుతంగా చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ – సత్య ట్రాక్ అదిరిపోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. ఈ సందర్భంగా అరవింద్ గారికి, అనుదీప్ గారికి, మిత్రుడు ఎస్.కె.ఎన్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు. అల్లు అరవింద్ గారు మాకు గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ జరగడం సంతోషంగా ఉంది. నా లైఫ్ లో మా తల్లిదండ్రులు కంటే కూడా అరవింద్ గారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఆయన వల్లే మేము ఎదిగాము. సినీ పరిశ్రమలో నేను ఏం సాధించినా దానికి అరవింద్ గారికే కారణం.” అన్నారు.

చిత్ర నిర్మాత భాను ప్రతాప మాట్లాడుతూ, “అల్లు అరవింద్ గారు మా టీజర్ లాంచ్ కి చాలా సంతోషంగా ఉంది. ఆయన రాక మా అందరికీ ఎంతో ఎనర్జీ ఇచ్చింది. అలాగే, అనుదీప్ గారు మాకు రైటింగ్ పరంగా ఎంతో సహాయం అందించారు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాము.” అన్నారు.

చిత్ర దర్శకుడు విజయేందర్ ఎస్ మాట్లాడుతూ, “మా టీజర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన అల్లు అరవింద్ గారికి, నా మిత్రుడు అనుదీప్ కి, అందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది. నేను రాసిన కామెడీని నటీనటులంతా తెరమీద అద్భుతంగా పండించారు.” అన్నారు.

చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ, “టీజర్ మీ అందరికీ నచ్చింది కదా. సినిమా అంతకుమించి ఎన్నో రెట్లు వినోదాన్ని పంచబోతుంది. ఈ సినిమా కథ చాలా బాగుంది. అందుకే ఇంతమంది నిర్మాతలు ముందుకు వచ్చారు. వాసు గారు మా అందరినీ నడిపించారు. మా లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు. విజయ్ లాంటి రచయితలు, దర్శకులు సినీ పరిశ్రమకు రావాలి. ఈ సినిమా థియేటర్లలో మీ అందరినీ నవ్విస్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.

చిత్ర కథానాయిక నిహారిక మాట్లాడుతూ, “ఇంత మంచి సినిమా నా మొదటి తెలుగు చిత్రం కావడం సంతోషంగా ఉంది. టాలెంటెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో నటించారు. వాళ్ళ కామిక్ టైమింగ్ అదిరిపోతుంది. వారందరి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి, దర్శక నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ” అన్నారు.

వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడానికి త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

*I loved the teaser, Mithra Mandali is definitely going to be a blockbuster: Producer Allu Aravind at Mithra Mandali Teaser Launch event*

After the quirky first look that has generated excitement across social media, makers unveiled the much awaited teaser of “Mithra Mandali” today in a grand launch event.

The teaser showcases the wild world of Mithra Mandali, where friendship meets madness in the quirkiest way possible. It begins with cricket-style commentary that perfectly sums up the film’s quirky tone signallig something amazingly fresh. With the right blend of vibrant visuals, crackling comedy, and non-stop fun, the teaser promises a crazy experience. Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, Prasad Behara, Vennela Kishore, Satya, VTV Ganesh and others who bring unmatched energy to the screen.

The film is being presented by Bunny Vas under his newly launched banner BV Works, & Produced by the energetic collaboration of Sapta Aswa Media Works, Vyra Entertainments, and Passionate Producers Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala. Directed by debutant Vijayendar S, the film boasts a crackling technical team with RR Dhruvan composing the music,
Siddharth SJ handling cinematography, and Peekay as editor.

The film’s teaser was launched by ace producer Allu Aravind. Blockbuster director Anudeep KV, Producer SKN and the total cast graced the event. Producer Allu Aravind said, “My friends Bunny Vas, Bhanu Pratapa, and Kalyan Manthina have made a fun entertainer with Mithra Mandali. I’m here to support them and extend my best wishes to the entire team. Being around all these youngsters makes me feel young again! I believe director Vijay has a lot of potential. Priyadarshi is a dedicated actor, and he’s going to be around for a long time. When Bunny Vas showed me 4–5 pictures to choose the heroine for this film, I picked the first one, Niharika. I even follow her on Instagram with a fake account. Fun aside, All the best to you, Amma. Best wishes to producers Bhanu, Kalyan, Somaraju, and music director RR Dhruvan. I loved the teaser, if the film is as fun as it looks, it’s definitely going to be a blockbuster”

Producer Bunny Vas said, “This is a buddy comedy featuring fresh, young talent. I drew inspiration from Anudeep KV’s Jathi Ratnalu to make a film like this. Mithra Mandali has a wonderful cast, Priyadarshi, Prasad Behra, Vishnu, and Rag Mayur. And of course, we all know the sensation that is Niharika NM. We’ll be announcing the release date very soon. Huge thanks to our Godfather Allu Aravind garu for always supporting us. We’re growing in this industry because of him.”

Producer Bhanu Pratapa, “Thanks to Allu Aravind garu for gracing the event. It’s a very special moment for us and has given us a lot of energy. Thanks also to Anudeep KV garu for his constant support and help.”

Director Anudeep KV said, “Thanks to Allu Aravind garu. My friend Vijay is directing Mithra Mandali, and the film is packed with crazy writing – you’ll enjoy it from the first minute to the climax. Wishing the entire team all the best! Special thanks to Bunny Vas garu for supporting young directors and actors. I wish blockbuster success to the producers Bhanu Pratapa garu, Kalyan garu – and to my dear friends Priyadarshi and Niharika NM.”

Producer SKN said, “AAA is a lucky venue for us – we hosted events for Baby, #Single, and now Mithra Mandali here. Thanks to Allu Aravind garu for his constant support. After watching the teaser, I got vibes of Jathi Ratnalu, MAD, AAY, and #Single. Wishing blockbuster success to the producers Bhanu Pratapa, Kalyan Manthina, Vijayendar, Somaraju and to the entire team. Mithra Mandali will definitely entertain everyone!”

Music Director RR Dhruvan said, “Thanks to Bunny Vas garu and my producers for giving me this crazy opportunity. Special thanks to my friend and director Vijay for trusting me. I’ll speak more at upcoming events!”

Actor Prasad Behara said, “Thanks to my director Vijay for choosing me to be part of Mithra Mandali*, and to producers Bhanu Pratapa garu, Kalyan Manthina garu, Somaraju garu, and Bunny Vas anna. Mithra Mandali will make everyone laugh, please watch it with your friends gang.”

Actor Rag Mayur said, “Thanks to everyone for attending the event, especially Allu Aravind garu. This film is made by the most fair and handsome producers – Bunny Vas garu, Bhanu garu, Kalyan garu, and Somaraju garu! We had double the fun shooting it. Off-screen, the chemistry with Priyadarshi, Prasad Behra, and Vishnu OI was even stronger than on screen. Thanks to our director Vijay for this opportunity.”

Actress Niharika NM said, “I’m so glad to be part of Mithra Mandali. This is my debut film, and director Vijay chose me for a very special reason. I feel lucky to work with such a talented cast – their comic timing is incredible! Thanks to Allu Aravind sir for choosing me and trusting that I could do this.”

Director Vijayendar said, “Thanks to Allu Aravind garu and Anudeep Mama for attending the event. A big thank-you to Benchmark Kiran anna – he took me to Bunny Vas garu, then to Allu Aravind garu, and that’s how this project began. I think everyone enjoyed the trailer. The comedy worked in the film because of the fantastic cast Priyadarshi, Prasad Behra, Niharika NM, Rag Mayur, and Vishnu – all of whom brought it to life. The songs will be fantastic, thanks to music director RR Dhruvan. Thanks to my friends – 90s Aditya Hasan, Mad Kalyan Shankar, and Anudeep KV for all their support.”

Actor Priyadarshi said, “Mithra Mandali is a very fun film – you can imagine how good it is when it’s backed by four banners! Thanks to our producers – Bunny Vas anna, Bhanu garu, Kalyan garu, and Somaraju garu. Special thanks to Allu Aravind garu for always encouraging young talent. I love my team – Rag Mayur, Prasad Behra, Vishnu, and Niharika NM. We’ve all been talking about the importance of theatrical releases, and a good comedy film like Mithra Mandali is just what audiences need. Director Vijay has written a fantastic script, and I’m proud to be a part of it.”

 GANI9483 GANI9491 GANI9498 GANI9507 GANI9509