Mithra Mandali

First Look of Mithra Mandali Unveiled.

ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్

- నవ్వులు పంచనున్న ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా గ్యాంగ్
- తెలుగు తెరకు పరిచయమవుతున్న నిహారిక ఎన్. ఎం

బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. ముసుగు అవతారాలలో ఉన్న నటులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో కలిగింది. దీని గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ చర్చ జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు నిర్మాతలు.

ఈ చిత్రానికి “మిత్ర మండలి” అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఫస్ట్ లుక్ అందరి అంచనాలను అందుకునేలా కట్టిపడేసేలా ఉంది. ఈ పోస్టర్ నీలిరంగు ముసుగుల వెనుక ఉన్న గ్యాంగ్ ను పరిచయం చేసింది. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అపరిమిత వినోదాన్ని అందించడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోంది.

సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. “మిత్ర మండలి” చిత్రంతో తెలుగులోకి అరంగేట్రం చేస్తుండటం విశేషం. సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్’ కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచారు.

అద్భుతమైన నటన, కామిక్ టైమింగ్, భిన్నమైన పాత్రల ఎంపికతో ప్రియదర్శి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు ‘మ్యాడ్’ ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా వంటి ప్రతిభగల నటులు తోడయ్యారు. ఈ నలుగురు కలిసి ‘మిత్ర మండలి’తో అద్భుతమైన వినోదాన్ని అందిస్తారు అనడంలో సందేహం లేదు.

బన్నీ వాస్ తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై ‘మిత్ర మండలి’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత.

నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ‘మిత్ర మండలి’ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా వ్యవహరిస్తున్నారు.

‘మిత్ర మండలి’ అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది.

మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిత్రం: మిత్ర మండలి
తారాగణం: ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్.ఎం.
సంగీతం: ఆర్.ఆర్. ధృవన్
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్ ఎస్.జె
కూర్పు: పీకే
కళా దర్శకుడు: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్‌: శిల్పా టంగుటూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రాజీవ్ కుమార్ రామా
దర్శకత్వం: విజయేందర్ ఎస్
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత: సోమరాజు పెన్మెత్స
సమర్పణ: బన్నీ వాస్ (బి.వి. వర్క్స్)
నిర్మాణ సంస్థలు: సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Unmasking the Madness:
First Look of Mithra Mandali Unveiled.

After the quirky pre-look that has generated excitement and speculation across social media of who could be the cast in masked avatars, the much-awaited First Look Poster of “Mithra Mandali” has been unveiled today, and it’s every bit as vibrant as promised.

The poster introduces the gang behind the blue masks, revealing an ensemble cast that’s all set to deliver unlimited fun, chaos, and entertainment starring Priyadarshi, Rag Mayur, Vishnu Oi, and Prasad Behara.

In a refreshing twist, the film marks the Telugu debut of Social Media sensation Niharika N M, completing the crazy crew.
Niharika has been in the news for her collaboration with Tom Cruise recently for Mission Impossible – Final Reckoning.

Known for their impeccable Acting, comic timing and offbeat role choices,
Priyadarshi, Mad fame Vishnu Oi,
Rag Mayur and Prasad Behara bring a undoubted powerhouse of entertainment to Mithra Mandali.

The film is being presented by Bunny Vas under his newly launched banner BV Works, & Produced by the energetic collaboration of Sapta Aswa Media Works, Vyra Entertainments, and Passionate Producers Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala.

Directed by debutant Vijayendar S, the film boasts a crackling technical team with RR Dhruvan composing the music,
Siddharth SJ handling cinematography, and Peekay as editor.

Other technicians include,
Art: Gandhi Nadikudikar
Costumes: Shilpa Tanguturu
Executive Producer: Rajeev Kumar Rama
PRO: Venu Gopal

MM FL LOCK insta plain MM FL LOCK twitter

A Quirky & Masked Madness Begins! Pre-Look released, First Look on June 6th.

మ్యాడ్ నెస్ మొదలైంది!
కట్టిపడేస్తున్న ప్రీ-లుక్.. జూన్ 6న ఫస్ట్ లుక్బన్నీ వాస్ వర్క్స్ తో కలిసి నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్ మరియు వైరా ఎంటర్టైన్మెంట్స్ ఒక ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కట్టిపడేసే ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి, ట్రేడ్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ తొలిసారిగా సినిమాను సమర్పిస్తుండటం.. ఈ ప్రాజెక్ట్ పై నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప గతంలో బన్నీ వాస్ తో కలిసి తండేల్ కి పని చేసి, బ్లాక్ బస్టర్ ను అందించారు. ఈ ద్వయం ‘ఆయ్’, ‘సింగిల్’ వంటి సినిమాలతో తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచుతున్నారు.

‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేతులు కలపడం ఈ ప్రాజెక్ట్ కి అదనపు బలాన్ని చేకూరుస్తుంది.

తాజాగా ఆవిష్కరించబడిన ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్.. ఉత్సుకతను రేకెత్తించడంతో పాటు, నవ్వులను చిందించేలా ఉంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్ తో రోలర్‌కోస్టర్‌ను సూచిస్తుంది. జూన్ 6న ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించిన నిర్మాతలు.. సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు.

ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన కథన శైలితో వినోదం యొక్క సరికొత్త రుచిని అందించడానికి సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా రూపొందించిన ప్రీ-లుక్ పోస్టర్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళడం ఖాయమని చెప్పవచ్చు.

జూన్ 6న ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగిన ఫలితం అన్నట్టుగా నటీనటులను ఆవిష్కరిస్తూ ఉండే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అసలుసిసలైన మ్యాడ్ నెస్ ను అందించనుంది.

A Quirky & Masked Madness Begins! Pre-Look released, First Look on June 6th.

The new-age Production Houses Sapta Aswa Creatives and Vyra Entertainments in collaboration with Bunny Vas Works have just dropped a whacky and wildly intriguing Pre-Look Poster, and it’s already sparking curiosity across social media & trade.

Bunny Vas, for the first time presenting a film under BV Works, strengthens the confidence on this project. Bunny Vas & one of the Producers of this project Bhanu Pratapa has collaborated earlier for Thandel and delivered a blockbuster. The duo has continued their success streak with AAY & #Single, raising expectations on this project.

The project is cemented with Vyra Entertainments joining hands who has delivered the soothing blockbuster Hi Nanna.

The unveiled intriguing Pre-Look poster is raising curiosity and laughter. Featuring a lineup of masked men donning quirky red caps and hiding their identities in blue masks, reveal hints at a rollercoaster of fun, mystery, and madness. With the poster announcing “First Look on June 6th,” the makers have set the tone for a film that promises to be as unpredictable as it is entertaining.
The film is directed by debutant Vijayendar S & Produced by Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala & Co-produced by Somaraju Penmetsa.
The film is backed by RR Dhruvan as Music Director, Siddharth SJ as Cinematographer, Peekay as Editor, Gandhi Nadikudikar as Art Director, Rajeev Kumar Rama as Executive Producer, Shilpa Tangturu as Costume Designer.

The film is gearing up to deliver a fresh flavor of fun with a unique narrative style. The visual aesthetics and design language of the pre-look already reflect the film’s commitment to youthful energy and wild imagination.
Stay tuned for the official First Look on June 6th, unveiling the cast and giving audiences a peek into the madness that awaits!

IMG_3668 MM PRELOOK DES LOCK TWITTER