OG

OG Birthday Blast: Vintage Pawan Kalyan Look and ‘HBD OG – LOVE OMI’ Glimpse Leave Fans Ecstatic

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ బొనాంజా
 
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ నుండి పోస్టర్, గ్లింప్స్ విడుదల
 
పవర్ స్టార్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పోస్టర్, గ్లింప్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ‘ఓజీ’ చిత్ర బృందం అభిమానులకు డబుల్ బొనాంజా ఇచ్చింది. అద్భుతమైన కొత్త పోస్టర్ తో పాటు, “HBD OG – LOVE OMI” పేరుతో ఓ సంచలనాత్మక గ్లింప్స్ ను విడుదల చేసింది.
వింటేజ్ లుక్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న పోస్టర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పోస్టర్ రాకతో సామాజిక మాధ్యమాలు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఈ తరహా లుక్ లో చూసి చాలా కాలం అయిందని అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌ ను ఇంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన శైలిలో చూపించినందుకు అభిమానులు, సినీ ప్రేమికులు.. దర్శకుడు సుజీత్ మరియు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఓజీ’ అనే టైటిల్ కి తగ్గట్టుగానే పోస్టర్ కూడా ఎంతో శక్తివంతంగా ఉంది.
పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర బృందం “HBD OG – LOVE OMI” అనే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదటి నుండి ‘ఓజీ’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ను గంభీరమైన అవతారంలో చూపించిన హంగ్రీ చీతా గ్లింప్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు “HBD OG – LOVE OMI” గ్లింప్స్‌ సినిమా యొక్క మరో విస్ఫోటన కోణాన్ని వెల్లడిస్తుంది. తాజా గ్లింప్స్ లో ఇమ్రాన్ హష్మీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టే బలమైన పాత్రలో ఆయన కనువిందు చేయనున్నారు.
‘ఓజీ’ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, గ్లింప్స్, పాటలు కట్టిపడేశాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ‘ఓజీ’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్, అద్భుతమైన విజువల్స్, సంగీతం, సంభాషణలు ఇలా ప్రతి అంశం సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ‘ఓజీ’ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 25, 2025న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
OG Birthday Blast: Vintage Pawan Kalyan Look and ‘HBD OG – LOVE OMI’ Glimpse Leave Fans Ecstatic
On the occasion of Power Star Pawan Kalyan’s birthday, the team of OG treated fans with a double bonanza.  A striking new poster and a sensational glimpse titled “HBD OG – LOVE OMI .”
The poster, featuring Pawan Kalyan in a vintage yet supremely stylish avatar, has electrified fans everywhere. Social media is flooded with celebrations, with audiences declaring that it has been a long time since they witnessed Pawan Kalyan in such a dashing, never-before look. Fans and cine lovers are showering praise on director Sujeeth and DVV Entertainment for presenting Pawan Kalyan in this powerful, charismatic style. They call him OG — and this poster proves why.
Adding to the celebrations, the makers dropped the glimpse “ HBD OG – LOVE OMI”, which has taken the frenzy to a whole new level. Right from the beginning, OG’s promotional campaign has been grabbing attention from starting with the electrifying Hungry Cheetah glimpse that showcased Pawan Kalyan in his most intense avatar, and now with HBD OG – LOVE OMI which reveals another explosive dimension of the film. This latest glimpse also highlights the presence of Emraan Hashmi, adding fresh intrigue to the high-voltage narrative.
The stylish visuals, striking presentation, and fiery undertones have skyrocketed expectations. With every update, fans and cine enthusiasts unanimously declare that the anticipation for OG is reaching unstoppable heights.
Directed by Sujeeth and produced by DVV Danayya and Kalyan Dasari under the prestigious DVV Entertainment banner, OG features a powerhouse cast including Pawan Kalyan, Emraan Hashmi, Priyanka Arul Mohan, Prakash Raj, and Sriya Reddy, with music by S Thaman.
Slated for a grand worldwide release on September 25th, 2025, OG stands tall as the most hyped and eagerly awaited Indian film of the year.
 HBD OG - LOVE OMI - Glimpse HBD_OG_LOCK copy

‘Suvvi Suvvi’ from OG wins Hearts Instantly

హృదయాలను హత్తుకునేలా ‘సువ్వి సువ్వి’ గీతం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు.
సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’కి విశేష స్పందన లభించింది. సంగీత తుఫాను లాంటి ఈ పాట అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తాజాగా ‘ఓజీ’ నుంచి రెండవ గీతం ‘సువ్వి సువ్వి’ విడుదలైంది. ‘ఫైర్‌ స్టార్మ్’కి పూర్తి భిన్నంగా హృదయాలను హత్తుకునేలా ‘సువ్వి సువ్వి’ గీతం సాగింది. విడుదలైన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతల మనసులను గెలుచుకుంటోంది. తమన్ అద్భుతమైన సంగీత ప్రయాణంలో గొప్ప పాటలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది.
‘సువ్వి సువ్వి’ అనే ఈ ప్రేమ గీతాన్ని తమన్ ఎంత అందంగా స్వరపరిచారో.. గాయని శృతి రంజని అంతే మధురంగా ఆలపించారు. ఇక కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొని వచ్చింది. తక్షణమే శ్రోతల హృదయాలను దోచేలా ఉన్న ఈ పాట ఒక ఆత్మీయమైన లోతును కలిగి ఉంది. ప్రేమ పాటలను స్వరపరచడంలో దిట్టగా తమన్ ఎందుకు రాజ్యమేలుతున్నారో ఈ గీతం మరోసారి రుజువు చేసింది.
‘సువ్వి సువ్వి’ పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ జోడీ తెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరాన్ని సమతుల్యం చేసేలా కన్మణిగా ప్రియాంక మోహన్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ‘ఓజీ’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా పవన్, ప్రియాంక  జోడి నిలుస్తోంది. ఈ జంటను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘ఓజీ’ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిభగల సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రేక్షకులకు వెండితెరపై గొప్ప అనుభూతిని అందించే చిత్రంగా ‘ఓజీ’ రూపుదిద్దుకుంటోంది.
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటి ‘ఓజీ’ అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతి అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మాస్‌ను శ్రావ్యతతో మిళితం చేస్తూ స్వరపరిచిన ‘సువ్వి సువ్వి’ గీతం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
‘Suvvi Suvvi’ from OG wins Hearts Instantly
After setting the stage on fire with its first single, OG now delivers a completely different mood with its second song, “Suvvi Suvvi”, which has been released to a sensational response. The track is already capturing the hearts of listeners everywhere and is being hailed as the next chartbuster in Thaman’s stellar musical journey.
Composed by S Thaman, with heartfelt vocals by Shruthi Ranjani, and lyrics penned by Kalyana Chakravarthi Tipirneni, “Suvvi Suvvi” unfolds as a soothing love melody. The song carries a soulful depth that connects instantly, proving why Thaman continues to reign as the master of melodies and love songs.
The visuals of the song showcase the sparkling chemistry between Priyanka Arul Mohan and Pawan Kalyan, with the pair looking refreshing and striking on screen. Priyanka as Kanmani brings warmth and elegance to balance Pawan Kalyan’s enigmatic Gambheera, making their combination one of the highlights of OG. Their presence together in “Suvvi Suvvi” has left fans delighted, setting strong expectations for their on-screen bond in the film.
Directed by Sujeeth and produced by DVV Danayya and Kalyan Dasari under the prestigious DVV Entertainment banner, OG also stars Emraan Hashmi, Prakash Raj, and Sriya Reddy in key roles. With music by Thaman, cinematography by Ravi K Chandran ISC and Manoj Paramahamsa ISC, and editing by Navin Nooli, the film is designed to be a cinematic spectacle.
Slated for a worldwide release on September 25th, 2025, OG is without doubt the most hyped and eagerly awaited Indian film of the year. Every update from the film has created a storm across social media, and with “Suvvi Suvvi,” the makers have once again struck the right chord, blending mass with melody.



Priyanka Arul Mohan’s – First looks two posters as ‘Kanmani’ from OG Unveiled

‘ఓజీ’ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ విడుదల‘కన్మణి’గా ఆకట్టుకుంటున్న ప్రియాంక అరుల్ మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్‌ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు. ‘ఓజీ’ రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది. మరో పోస్టర్ ప్రశాంతత మరియు గృహ వాతావరణాన్ని సూచిస్తుంది.

ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ కూడా కట్టిపడేస్తోంది. సుజీత్ యొక్క విస్ఫోటన కథనానికి భావోద్వేగ లోతును, ఆకర్షణను పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ జోడిస్తున్నారు. ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని నిర్మాతలు అభివర్ణించారు.

ఇటీవల విడుదలైన ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’కు విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రోమో విడుదల కానుంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025లో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులుగా రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: డీవీవీ దానయ్య
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Priyanka Arul Mohan’s – First looks two posters as ‘Kanmani’ from OG UnveiledDVV Entertainment has dropped the much-awaited first look of Priyanka Arul Mohan from the action spectacle OG. Introducing her character Kanmani, the poster captures a refreshing contrast to the film’s gritty, high-voltage world showcasing grace, strength, and quiet resilience in one striking frame. The other poster symbolizes a calm and homely vibe.

Pawan Kalyan and Priyanka Arul Mohan promises to add emotional depth and charm to Sujeeth’s explosive narrative. The makers describe her role as the calm every storm needs.

After a blasting response to the first song from OG, the makers are now gearing up to release the second single. A promo will be out very soon.

With Pawan Kalyan, Emraan Hashmi, Arjun Das, Prakash Raj, Sriya Reddy, and Priyanka Arul Mohan in pivotal roles, OG is shaping up to be the biggest cinematic event of 2025. The film features music by S Thaman, cinematography by Ravi K Chandran ISC and Manoj Paramahamsa ISC, and editing by Navin Nooli. Produced by DVV Danayya and Kalyan Dasari under DVV Entertainment, and directed by Sujeeth, OG hits theatres worldwide on September 25th, 2025.

They Call Him OG and she is Kanmani.

OG - Kanmani_02_X_STILL_LW OG - Kanmani - 02 - INSTA_Lw KANMANI FINAL_STILL KANMANI FINAL_LW (1)

FIRESTORM IGNITES: PAWAN KALYAN’S OG KICKS OFF ITS MUSICAL CAMPAIGN WITH A BANGER

 అగ్ని తుఫాను వచ్చేసింది
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్‌ గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఓజీ’ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాకుడిగా రవి కె చంద్రన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తమన్‌ స్వరపరిచిన ‘ఫైర్‌ స్టార్మ్’ గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. ఓజాస్‌ గంభీర పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపేలా తమన్ సంగీతం ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. అదిరిపోయే ఎలక్ట్రానిక్ బీట్స్, భారీతనం, రా ఇంటెన్సిటీని మిళితం చేస్తూ సాగిన ఈ గీతం అగ్ని తుఫానుని తలపిస్తోంది.
పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వానికి నివాళి అన్నట్టుగా ధైర్యంతో నిండిన ఈ పాట సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ప్రముఖ నటుడు శింబు ఈ పాటకు తన శక్తివంతమైన గాత్రాన్ని అందించారు. ఉద్వేగం, ఉత్సాహంతో నిండిన ఆయన స్వరం.. ఈ పాటను మరోస్థాయికి తీసుకొనివెళ్ళింది.
‘ఓజీ’ ఫీవర్ కి ఒక అద్భుతమైన ఆరంభం
‘ఫైర్‌ స్టార్మ్’ గీతం ‘ఓజీ’ సినిమా ప్రమోషన్ కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఈ ట్రాక్‌ను అభిమానులు ‘బ్యాంగర్’ మరియు ‘సంగీత తుఫాను’గా అభివర్ణిస్తున్నారు. థియేటర్లలో అభిమానులు ఉత్సాహంతో ఈలలు వేసేలా ఫైర్‌ స్టార్మ్ గీతం యొక్క సంగీతం, సాహిత్యం ఉన్నాయి.
విడుదలైన క్షణం నుండే సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది ‘ఫైర్‌ స్టార్మ్’ గీతం. రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్, మాస్ సెలబ్రేషన్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది.
‘ఓజీ’ ఫీవర్ లో పవర్ స్టార్ అభిమానులు
సినిమాలోని గ్యాంగ్‌స్టర్ వైబ్‌ కి అద్దంపట్టేలా ఉన్న ‘ఫైర్‌ స్టార్మ్’ గీతంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో సంగీతం ఉందని ప్రశంసిస్తున్నారు. తమన్ ఇప్పటివరకు స్వరపరిచిన అత్యుత్తమ గీతాలలో ఒకటిగా దీనిని అభివర్ణిస్తున్నారు.
‘ఫైర్‌ స్టార్మ్‌’ గీతం విడుదలతో ‘ఓజీ’ సంగీత ప్రచారం అధికారికంగా ఘనంగా ప్రారంభమైంది. దీంతో సినిమా నుంచి తదుపరి రాబోయే కంటెంట్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో తెలిపేలా ‘ఫైర్‌ స్టార్మ్’ గీతం ఉంది. వెండితెరపై అద్భుతమైన ఓ భారీ యాక్షన్ సినిమాని చూడబోతున్నామనే హామీని ఈ పాట ఇచ్చింది.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: డీవీవీ దానయ్య
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
 
FIRESTORM IGNITES: PAWAN KALYAN’S OG KICKS OFF ITS MUSICAL CAMPAIGN WITH A BANGER 
The much-awaited first single from OG (They Call Him OG), titled “Firestorm,” has finally been unleashed, and it is nothing short of a musical inferno.
Directed by Sujeeth and produced by DVV Danayya under DVV Entertainment, OG stars Power Star Pawan Kalyan in a fierce gangster avatar alongside Emraan Hashmi, Priyanka Mohan, Arjun Das, and Prakash Raj in key roles.
Composed by the musical dynamite Thaman S, Firestorm is a high-octane anthem that blends hard-hitting electronic beats, cinematic grandeur, and raw intensity. The lyrics, packed with swagger and grit, celebrate the unrelenting power of the OG, making it a perfect tribute to Pawan Kalyan’s larger-than-life persona.
Adding to the hype is Silambarasan TR (Simbu), who has lent his powerful vocals to the track. His voice, packed with fire and emotion, elevates the song to a whole new level.
A Perfect Kickoff to #OG Fever
The launch of Firestorm marks a key milestone in OG’s promotions. The track has been described by fans as a “banger” and “musical storm” that captures the rebellious spirit of the film. The hook line and pulsating beats are tailor-made for fans to whistle, cheer, and chant along in theatres.
From the moment of release, social media has been flooded with reels, fan edits, and mass celebrations, proving that Firestorm is already a cultural phenomenon.
Fans Go Berserk: The OG Fever Takes Over
Pawan Kalyan fans have hailed the song as a battle cry, perfectly complementing the gangster vibe of the movie. The track has drawn comparisons to global anthems of rebellion, with many calling it one of Thaman’s finest works.
With Firestorm, the film’s musical campaign has officially kicked off in style, and expectations have skyrocketed for what’s to come next.
With the film set to hit theatres worldwide on September 25, 2025, Firestorm serves as the perfect appetizer to the high-voltage cinematic spectacle that OG promises to be.
Cast: Pawan Kalyan, Emraan Hashmi, Priyanka Mohan, Arjun Das, Prakash Raj, Sriya Reddy
Director: Sujeeth
Music Composer: Thaman S
Cinematography: Ravi K. Chandran
Editor: Navin Nooli
Production House: DVV Entertainment
Producer: DVV Danayya

MMM_45558 (1) OG RAIN POSTER FINAL WWM 2 (1)

*“OG” Wraps Shoot — Pawan Kalyan’s Action Spectacle Gears Up for Grand Release on 25th September 2025*

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ షూటింగ్ పూర్తి

సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ‘ఓజీ’ చిత్రీకరణ పూర్తయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. వర్షంలో తడుస్తూ కారు దిగి గన్ తో ఫైర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో అడుగు పెట్టనుంది.

ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ను నిర్మించిన డీవీవీ
ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ లో ఈ చిత్రం రూపొందుతోంది. డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2025లో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా ఇప్పటికే ‘ఓజీ’ ప్రశంసించబడుతోంది.

రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా మలిచేలా సాంకేతిక బృందం కృషి చేస్తోంది.

పవన్ కళ్యాణ్ సరైన యాక్షన్ సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సంచలన చిత్రంగా ‘ఓజీ’ రూపుదిద్దుకుంటోంది. యాక్షన్ ప్రియులతో పాటు మాస్ మెచ్చేలా ఈ చిత్రం ఉండనుంది.

*“OG” Wraps Shoot — Pawan Kalyan’s Action Spectacle Gears Up for Grand Release on 25th September 2025*

_“Finished Firing” — and now ready to detonate at the box office._

DVV Entertainment has unveiled a blazing new poster of OG, officially announcing the wrap of shoot for Power Star Pawan Kalyan, who returns in his most intense and enigmatic avatar yet — Gambheera. The poster, soaked in rain and loaded with attitude, has fans erupting online as it boldly declares: “Finished Firing.”

Directed by Sujeeth, OG now enters post-production, all set for a massive worldwide theatrical release on 25.09.25.

The film boasts a powerful ensemble with Emraan Hashmi, Priyanka Arul Mohan, Prakash Raj, and Sriya Reddy in key roles. Backed by a thumping score from S Thaman, and produced by DVV Danayya and Kalyan Dasari under the DVV Entertainment banner — the same powerhouse behind global phenomenon RRR — OG is already being hailed as the biggest cinematic event of 2025.

With cinematography by Ravi K Chandran ISC and Manoj Paramahamsa ISC, and sharp editing by Navin Nooli, every frame promises to be a visual explosion.

Titled after its cryptic lead, and carrying the tagline “They Call Him OG,” the film promises a full-blown assault of mass, mystique, and madness.

 PHOTO-2025-07-11-20-04-55