Uncategorized

“Thank you Telugu audiences for embracing Kotha Loka as your own cinema” – Dulquer Salmaan at the success celebrations

కొత్త లోక’ను తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: విజయోత్సవ వేడుకలో దుల్కర్ సల్మాన్ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన మలయాళ చిత్రం ‘లోకా చాప్టర్ 1: చంద్ర’. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ కె. గఫూర్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ‘కొత్త లోక 1: చంద్ర’ పేరుతో విడుదల చేశారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కొత్త లోక 1: చంద్ర’.. కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. భారీ వసూళ్ళను రాబడుతూ మలయాళ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటి వారంలోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, వెంకీ అట్లూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ కథానాయకుడు, చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మేము ఏడు సినిమాలు నిర్మించాము. కొత్త లోక కోసం ఇంత మంచి టీంతో పనిచేయడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం మనసుపెట్టి పనిచేశారు. ఉత్తమ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణుల మద్దతుతోనే ఇంత గొప్ప సినిమా చేయగలిగాము. నిర్మాతగా నేను వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. షూటింగ్ కి మహా అయితే ఒక్కసారి వెళ్ళి ఉంటాను. అంతలా నేను టీంని నమ్మాను. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి నాకు మంచి స్నేహితుడు. అతని వల్లే ఈ కథ నా దగ్గరకు వచ్చింది. కథ వినగానే నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ సినిమా బడ్జెట్ తక్కువని మీరు అనుకోవచ్చు. కానీ, మలయాళ పరిశ్రమలో ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే నేను బడ్జెట్ ఇవన్నీ ఆలోచించలేదు. అందరూ తమ డ్రీమ్ లా ఈ సినిమా కోసం పని చేశారు. మేము ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయలేదు. అదంతా ఇలాంటి అద్భుతమైన టీం వల్లే సాధ్యమైంది. డైరెక్టర్, డీఓపీ మధ్య బాండింగ్ బాగుంటే మంచి సినిమాలు చేయొచ్చు. డొమినిక్ అరుణ్, నిమిష్ రవి కలిసి అది నిజమని మరోసారి నిరూపించారు. మా సినిమాని తెలుగులో విడుదల చేసిన నాగవంశీ గారికి కృతఙ్ఞతలు. కళ్యాణి ప్రియదర్శన్ నాకు చెల్లి లాంటిది. మేమిద్దరం ఒకేలా ఉంటాము, ఒకేలా ఆలోచిస్తాము. చంద్ర పాత్ర కోసం కళ్యాణి తప్ప మా మైండ్ లోకి వేరే ఎవరి పేరు రాలేదు. కొత్త లోక సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నన్ను ఎలాగైతే మీ వాడిగా భావించారో, అలాగే కొత్త లోకను కూడా మీ సినిమాగా భావించి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.” అన్నారు.

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “ఒకసారి కళ్యాణి ప్రియదర్శన్ చెన్నైలో కలిసినప్పుడు.. మలయాళంలో ఒక చిన్న చిత్రం చేస్తున్నాను అని చెప్పింది. కట్ చేస్తే, ఇప్పుడు వంద కోట్ల పోస్టర్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ థింగ్ అయింది. చెన్నైలో నేను మొదటిరోజు మొదటి షో చూశాను. సినిమా చాలా బాగుంది. రచన అద్భుతంగా ఉంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. నిమిష్ రవి, జేక్స్ బెజోయ్ అద్భుతమైన పరితీరు కనబరిచారు. ఇలాంటి మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఇప్పటికే తెలుగులో మంచి స్పందన వస్తోంది. తెలుగు ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. అందరిలాగే నేను కూడా రెండవ భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దుల్కర్ సల్మాన్ గురించి చెప్పాలంటే.. కేవలం సినిమా మీద ప్రేమతోనే అప్పుడు మహానటి సినిమాలో నటించారు. ఇప్పుడు అదే ప్రేమతో 30 కోట్లతో ఈ సూపర్ హీరో ఫిల్మ్ ని నిర్మించారు.” అన్నారు.

ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “సినిమా నేను చూశాను. నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా బ్రిలియంట్ మూవీ. 30 కోట్లతో 300 కోట్ల రేంజ్ సినిమా తీశారని అందరూ అంటున్నారు. ఈ సినిమా ప్రారంభించినప్పుడు మలయాళ సినిమా పరంగా 30 కోట్లు అనేది చాలా ఎక్కువ. ఈ సినిమాని నమ్మి నిర్మాతగా ధైర్యం చేసిన దుల్కర్ సల్మాన్ గారిని ముందుగా అభినందించాలి. అలాగే సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి, ఆర్ట్ డైరెక్టర్ బంగ్లాన్ లను ప్రత్యేకంగా అభినందించాలి. మలయాళం పరిశ్రమలో అందరూ గొప్పగా నటిస్తారు. సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. కళ్యాణి ప్రియదర్శన్ గొప్పగా నటించింది. తాను నాకు తెలుసని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు తను చేసిన తీరుకి హ్యాట్సాఫ్. రచన అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఇంత గొప్పగా మలిచిన దర్శకుడు డొమినిక్ అరుణ్ ప్రతి ప్రశంసకు అర్హుడు. నాగవంశీ గారు ఈ సినిమాతో విజయం సాధించడం ఆనందంగా ఉంది.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా టీజర్ చూసి తెలుగులో నేనే విడుదల చేయాలి అనుకున్నాను. ఇలాంటి సూపర్ హీరో సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒక మంచి చిత్రం వచ్చింది. ఖచ్చితంగా థియేటర్లలో చూసి అనుభూతి చెందాల్సిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర కథానాయిక కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. “నాకు ప్రేమ చూపించిన మొదటి ప్రేక్షకులు తెలుగువారే. అది నేను ఎప్పటికీ మరచిపోను. ఇన్నిరోజులు తరువాత మళ్ళీ మిమ్మల్ని కలవడం, మీ ప్రేమ పొందడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. సరైన కథలు వస్తే నాకు తెలుగులో చాలా సినిమాలు చేయాలని ఉంది. కొత్తలోక సినిమాని తెలుగు సినిమాలా భావించి ఆదరిస్తున్నారు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమే మాకు బలం. మీ మద్దతుతో ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని వస్తాయి. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పెద్ద థాంక్యూ.” అన్నారు.

చిత్ర కథానాయకుడు నస్లెన్ కె. గఫూర్ మాట్లాడుతూ.. “నేను హైదరాబాద్ కి రావడం ఇది మూడోసారి. ఈరోజు మీ అందరితో ఇక్కడ ఉండటం చాలా సంతోషముగా ఉంది. కొత్తలోక సినిమా పట్ల ప్రేక్షకుల చూపిస్తున్న ప్రేమ గురించి మాట్లాడటానికి నాకు మాటలు కూడా సరిపోవట్లేదు. దుల్కర్ సల్మాన్ గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. తెలుగులో మా సినిమాని విడుదల చేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గారికి ధన్యవాదాలు. కళ్యాణి ప్రియదర్శన్ కలిసి నటించడం ఆనందంగా ఉంది.” అన్నారు.

చిత్ర దర్శకుడు డొమినిక్ అరుణ్.. “ఈ స్థాయి స్పందన అసలు ఊహించలేదు. మొదట ఒక చిన్న సినిమాగా ప్రారంభించాము. మంచి టీంతో ఒక గొప్ప సినిమాగా రూపొందింది. ఏ దర్శకుడికైనా ఇదొక పెద్ద కల లాంటిది. ఈ సినిమాని తమ సినిమాగా భావించి ప్రాణం పెట్టి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. నేను చెప్పిన ఈ కథని నమ్మి, ఈ సినిమాని నిర్మించిన దుల్కర్ సల్మాన్ గారికి ఎంతగా కృతఙ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. తెలుగులో మా సినిమాని భారీస్థాయిలో విడుదల చేసిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై కురిపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది.” అన్నారు.

సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ మాట్లాడుతూ.. “టాక్సీవాలా నుంచి సరిపోదా శనివారం వరకు నేను పని చేసిన తెలుగు సినిమాల అనుభవంతోనే మలయాళంలో మాస్ ఎలిమెంట్స్ తో మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. మలయాళంలో చేసిన ఈ పాత్ బ్రేకింగ్ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.” అన్నారు.

ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వైభవంగా జరిగిన ఈ వేడుకలో నటులు అరుణ్ కురియన్, చందు, ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి, కళా దర్శకుడు బంగ్లాన్, రచయిత్రి శాంతి, గీత రచయిత రాంబాబు తదితరులు పాల్గొని ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్ర విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సినిమాకి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

 
“Thank you Telugu audiences for embracing Kotha Loka as your own cinema” – Dulquer Salmaan at the success celebrationsThe Malayalam film Loka Chapter 1: Chandra, produced by Dulquer Salmaan’s production house Wayfarer Films and directed by Dominic Arun, stars Kalyani Priyadarshan and Naslen K. Gafoor in lead roles. In Telugu states, the film was released by producer Suryadevara Naga Vamsi under Sithara Entertainments with the title Kotha Loka 1: Chandra.

Promoted as India’s first female superhero film, Kotha Loka 1: Chandra has captured hearts not only in Kerala, Andhra Pradesh, and Telangana but also across the globe. The film is creating history in Malayalam cinema, grossing over ₹100 crores in its very first week and marching towards a sensational success.

Marking this achievement, the team hosted a grand success celebration in Hyderabad on Wednesday evening, attended by directors Nag Ashwin and Venky Atluri as chief guests.

Dulquer Salmaan (Lead actor & Producer):
“We have produced seven films under the Wayfarer Films banner. Working with such a brilliant team for Kotha Loka has been a joy. Everyone poured their heart into the project. Only with the support of great actors and technicians could we make a film of this scale. As a producer, I gave the team complete freedom. I probably visited the sets just once because I trusted them that much.

Cinematographer Nimish Ravi is a close friend, and it was through him that this story reached me. The moment I heard it, I came forward to produce it. You might feel the budget is modest, but for the Malayalam industry it’s actually huge. I never worried about numbers, though. Everyone worked as if it was their dream project, and not a single rupee was wasted.

If the director and DOP share a strong bond, the film automatically turns out well. Dominic Arun and Nimish Ravi proved that again. My thanks to Naga Vamsi garu for releasing the film in Telugu.

Kalyani Priyadarshan is like a sister to me. We think alike, we vibe the same way. For the role of Chandra, no other name ever came to mind. I’m so grateful to Telugu audiences. Just like you embraced me as your own with love, now you’re embracing Kotha Loka as your own Telugu cinema. That means a lot.”

Director Nag Ashwin:
“When I met Kalyani Priyadarshan in Chennai, she told me she was doing a small Malayalam film. Cut to now, it has become India’s biggest talking point with a 100 crore poster. I watched the first show in Chennai, and I loved it. The writing is fantastic, technically it’s brilliant. Nimish Ravi and Jakes Bejoy have done amazing work.

Telugu audiences always support such quality cinema, and they’re already giving great response. I believe they’ll embrace it even more. Like everyone else, I’m eagerly waiting for the second part. And speaking of Dulquer Salmaan, he acted in Mahanati purely out of love for cinema, and with that same love, he has now produced this superhero film with a 30 crore investment.”

Director Venky Atluri:
“I watched the film and was blown away. Technically brilliant. People are saying they made a 300-crore film on a 30-crore budget. Back when they started, 30 crores was massive for Malayalam cinema. Dulquer Salmaan garu deserves huge credit for having that courage as a producer. Special praise also to cinematographer Nimish Ravi and art director Banglan.

Everyone in Malayalam cinema acts so well, and in this film too every performance shines. Kalyani Priyadarshan has given a terrific performance. I feel proud to know her. Hats off to her action sequences. The writing is strong, and director Dominic Arun deserves every bit of appreciation. Very happy to see Naga Vamsi garu score success with this release.”

Producer Suryadevara Naga Vamsi:
“The moment I saw the teaser, I knew I had to release it in Telugu. I’m proud to distribute such a superhero film. Telugu audiences now have a grand cinematic experience on big screens. It’s a film that must be enjoyed in theatres, and I’m confident Telugu audiences will give it huge success.”

Kalyani Priyadarshan (Lead actress):
“My first fans were Telugu audiences, and I’ll never forget that. Meeting you all again after so long and receiving so much love feels amazing. If the right scripts come, I definitely want to do more Telugu films. What makes me happy is that audiences are treating Kotha Loka like their own Telugu cinema. Your love is our strength, and with your support, many more great films will come. Thank you for giving us this massive hit.”

Naslen K. Gafoor (Lead actor):
“This is my third time in Hyderabad, and I’m thrilled to be here today with all of you. Words aren’t enough to express the love audiences are showering on Kotha Loka. None of this would have been possible without Dulquer Salmaan sir. My thanks to Naga Vamsi garu and Sithara Entertainments for releasing our film in Telugu. It was wonderful acting alongside Kalyani Priyadarshan.”

Director Dominic Arun:
“I never expected such an overwhelming response. We began as a small film, but with a great team, it grew into something big. For any director, this is like a dream come true. I owe everything to Dulquer Salmaan sir, who trusted this story and produced the film. I’m equally grateful to Naga Vamsi garu for releasing it on such a big scale in Telugu. The love Telugu audiences are showing us means so much.”

Music director Jakes Bejoy:
“My work in Telugu films like Taxiwaala and Saripodhaa Sanivaaram gave me the confidence to add mass elements in Malayalam too. I’m happy to have been part of this path-breaking film. The audience response is overwhelming.”

The grand event, hosted by anchor Suma, was attended by actors Arun Kurian, Chandu, cinematographer Nimish Ravi, art director Banglan, writer Shanti, lyricist Rambabu, and others, all celebrating the success of Kotha Loka 1: Chandra. The team extended heartfelt gratitude to audiences showering love on the film.

 IMG_9380 IMG_9381 IMG_9382 IMG_9379

Dulquer Salmaan’s Wayfarer Films’ Daring Step – Lokah Writes a New Chapter in Indian Cinema

దుల్కర్ సల్మాన్ ‘వేఫేరర్ ఫిలిమ్స్’ సాహసోపేతమైన అడుగు.. భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘కొత్త లోక’

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. వేఫేరర్ పతాకంపై నిర్మించిన ఏడవ చిత్రం ఇది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మలయాళ చిత్రం కేరళ సరిహద్దులను దాటి విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. చిత్రానికి మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ మరియు వేఫేరర్ ఫిలిమ్స్ వారి దార్శనికతకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

మలయాళ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అత్యంత భారీస్థాయిలో, భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రాన్ని, ఇంత సాంకేతిక పరిపూర్ణతతో నిర్మించడం ద్వారా దుల్కర్ సల్మాన్ అసాధారణమైన అడుగు ముందుకు వేశారు. దీనిని ఓ మలయాళ నిర్మాత తీసుకున్న అత్యంత సాహసోపేతమైన మరియు దూరదృష్టితో కూడిన నిర్ణయాలలో ఒకటిగా వర్ణించవచ్చు. దీనితో ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైంది. మలయాళ సినిమా స్థాయిని పెంచడానికి, సరిహద్దులను దాటి విస్తరించేందుకు వేఫేరర్ ఫిలిమ్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గతంలో మలయాళ ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించిన ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు ‘కొత్త లోక 1: చంద్ర’తో పరిశ్రమలో ఒక మైలురాయిని నెలకొల్పింది. ఈ సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ వేసిన సాహసోపేతమైన అడుగు.. ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయింది. నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా మలయాళ సినిమాకు దుల్కర్ సల్మాన్ చేసిన కృషి.. ‘కొత్త లోక 1: చంద్ర’ ద్వారా వ్రాయబడుతున్న చరిత్రతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ఇంత గొప్పగా రూపుదిద్దుకోవడంలో డొమినిక్ అరుణ్ కీలక పాత్ర పోషించారు. రచయితగా, దర్శకుడిగా ఆయన సినిమాను అద్భుతంగా దృశ్యమానం చేసి, తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇది నిజంగా మలయాళ సినిమానేనా అని ఆశ్చర్యపోయేలా విజువల్స్ ఉన్నాయి. కళా దర్శకులు బంగ్లాన్, జితు సెబాస్టియన్ తమ అసాధారణ ప్రతిభతో కథకు తగ్గట్టుగా మనోహరమైన, శక్తివంతమైన మరియు రహస్యమైన ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మించారు. కథలోని భావోద్వేగ లోతును ప్రేక్షకులకు మరింత చేరువ చేసేలా గొప్ప నేపథ్య సంగీతం అందించిన స్వరకర్త జేక్స్ బెజోయ్ కి కూడా ప్రశంసలు అందుతున్నాయి. అలాగే చమన్ చాకో కూర్పు, అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.

ఈ చిత్రానికి కేరళలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. టైటిల్ రోల్ పోషించిన కళ్యాణి ప్రియదర్శన్ తన అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంటున్నారు. ఇతర ముఖ్య పాత్రలలో కనిపించిన నస్లెన్, శాండీ, చందు సలీం కుమార్, అరుణ్ కురియన్, విజయరాఘవన్, శరత్ సభతో పాటు అతిథి పాత్రలు పోషించిన నటులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి భాగంగా వచ్చిన ‘కొత్త లోక 1: చంద్ర’.. ప్రేక్షకుల హృదయాల్లో విజయవంతంగా బలమైన పునాది వేసింది.

‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేశారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ.. బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టిస్తోంది. మొదటి షో నుండే థియేటర్ల వద్ద భారీ జనసందోహం కనిపించింది. ఇది సినిమా పట్ల ప్రేక్షకుల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రం అన్ని వర్గాల నుండి విశేష స్పందనతో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఎన్నో ఘనతలు సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది.

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు – జోమ్ వర్గీస్, బిబిన్ పెరుంబల్లి, అదనపు స్క్రీన్ ప్లే – శాంతి బాలచంద్రన్, మేకప్ – రోనాక్స్ జేవియర్, కాస్ట్యూమ్ డిజైనర్లు – మెల్వీ జె, అర్చన రావు, స్టిల్స్ – రోహిత్ కె సురేష్, అమల్ కె సదర్, ప్రొడక్షన్ కంట్రోలర్స్ – రిని దివాకర్, వినోష్ సురేష్ కైమోల్, చీఫ్ అసోసియేట్ - సుజిత్ సురేష్

Dulquer Salmaan’s Wayfarer Films’ Daring Step – Lokah Writes a New Chapter in Indian Cinema

Dulquer Salmaan’s Wayfarer Films production “Lokah: Chapter One – Chandra” has been wholeheartedly embraced by audiences worldwide. This is the seventh film produced under the Wayfarer banner. Crafted to meet global standards, this Malayalam film has crossed the borders of Kerala to earn widespread acclaim, with applause directed not only at the film but also at Dulquer Salmaan and Wayfarer Films for their vision.

By producing a film with such technical perfection, and by placing a female character at its very center to narrate a story on such a massive canvas—something never before seen in Malayalam cinema—Dulquer has taken an extraordinary step forward. It can be described as one of the boldest and far-sighted decisions ever made by a Malayalam producer. With this, a new Superhero Cinematic Universe has begun, positioning Wayfarer Films as a catalyst for Malayalam cinema to break barriers and expand beyond boundaries. Known for gifting Malayalam audiences with remarkable films earlier, the banner has now set a milestone in the industry with Lokah. Dulquer Salmaan’s daring step through this film is now being etched into the history of Indian cinema itself. Not just as an actor, but also as a producer, Dulquer’s contribution to Malayalam cinema will forever be read alongside the history being written through Lokah.

Equally noteworthy is the name Dominic Arun. As a director and writer, he has brilliantly visualized and executed the film, astonishing audiences with his craft. Cinematographer Nimish Ravi has delivered visuals of such stunning quality that one might even question if this could truly be a Malayalam film. Production Designer Banglan and Art Director Jithu Sebastian have magnificently built the fascinating, vibrant, and mysterious world in which the story unfolds. Composer Jakes Bejoy has been praised for the rhythm, thrill, and emotional depth he infused through his background score. Chaman Chacko’s precise editing and Yannick Ben’s adrenaline-pumping action choreography stand out as highlights of the film.

The movie is receiving an overwhelming response both within Kerala and internationally, while also performing impressively at the box office. Kalyani Priyadarshan, who plays the title role, has earned high acclaim for her stellar performance. Alongside her, Naslen, Sandy, Chandu Salim Kumar, Arun Kurian, Vijayaraghavan, Sarath Sabha, and several guest stars have also captured the attention of the audience. As the first installment of a multi-part cinematic universe, Lokah has successfully laid a strong foundation in the hearts of viewers.

Sithara Entertainments’ latest distribution has taken the box office by storm, opening to terrific occupancies across Andhra Pradesh and Telangana. Right from evening shows, theatres have witnessed massive footfalls, reflecting the tremendous buzz and audience excitement. The film is showing a solid blockbuster trend with overwhelming response from all corners, promising a phenomenal run in the days ahead.

Executive Producers – Jom Varghese, Bibin Perumbally, Additional Screenplay – Shanthi Balachandran, Makeup – Ronax Xavier, Costume Designers – Melvy J, Archana Rao, Stills – Rohith K Suresh, Amal K Sadar, Production Controllers – Rini Divakar, Vinosh Kaimol, Chief Associate – Sujith Suresh

WhatsApp Image 2025-08-30 at 15.02.10_4218e022

Kotha Lokah 1: Chandra’ Trailer Unveils India’s First Female-Led Superhero Saga

భారతదేశపు మొట్ట మొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్ విడుదల 
భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక 1: చంద్ర’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. భారతదేశపు మార్గదర్శక సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం భారతీయ సంస్కృతి, జానపదాలు మరియు పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.
పురాణాలను ఆధునిక యాక్షన్‌తో మిళితం చేసిన దృశ్యకావ్యంలా ఈ చిత్ర ట్రైలర్ ఉంది. ఉత్కంఠభరితమైన యుద్ధభూమి దృశ్యాలతో ట్రైలర్ ప్రారంభమైన తీరు ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కళ్యాణి ప్రియదర్శన్‌ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఆమెతో పాటు, సన్నీగా నస్లెన్ కె. గఫూర్ మెప్పించారు.
డొమినిక్ అరుణ్ రచయితగా వ్యవహరించిన ఈ చిత్రానికి శాంతి బాలచంద్రన్ అదనపు స్క్రీన్ ప్లే అందించారు. ట్రైలర్ లో అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ సంగీతం, నిమిష్ రవి ఛాయాగ్రహణం ప్రధాన బలంగా నిలిచాయి. వెండితెరపై ఓ గొప్ప దృశ్యకావ్యాన్ని చూడబోతున్నామనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది.
‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు.
 
Kotha Lokah 1: Chandra’ Trailer Unveils India’s First Female-Led Superhero Saga
The much-anticipated telugu trailer for Lokah Chapter 1: Chandra is setting social media ablaze with excitement. Produced by Dulquer Salmaan’s Wayfarer Films and directed by Dominic Arun. Film Starring Kalyani Priyadarshan as Chandra, India’s trailblazing superheroine and marks the inception of a bold new cinematic universe rooted in Indian culture, folklore and mythology.
The trailer is a visual spectacle blending mythology with modern day action. It opens with fiery battlefield scenes showcasing Kalyani Priyadarshan in a fierce never before seen avatar. Alongside her, Naslen K. Gafoor shines as Sunny.
Written by Dominic Arun and additional screenplay by Santhy Balachandran. The trailer’s high octane action choreographed by international stunt expert Yannick Ben paired with Jakes Bejoy’s pulsating score and Nimish Ravi’s stunning cinematography sets the stage for a genre-defining experience in Telugu Cinema .
The film is scheduled for a pan-India release on August 29th, It will be presented by noted Tollywood producer Suryadevara Naga Vamsi under the banner of Sithara Entertainments, with distribution across Andhra Pradesh and Telangana.
TELUGU-THUMB_STILL

VENKATESH – TRIVIKRAM | THE MOST MAGICAL COMBO TAKES ITS FIRST STEP TOWARDS AN ENTHRALLING JOURNEY

సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్రానికి మొదటి అడుగు పడిందివిక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు ప్రసిద్ధులు ఎట్టకేలకు కొత్త సినిమా కోసం చేతులు కలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. దీంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే చిత్రానికి తొలి అడుగు పడింది.

సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకులలో కూడా వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమా పట్ల ఎంతో ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన కథా శైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేష్ ను చూడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రాలను అందించడంలో త్రివిక్రమ్ పేరుగాంచారు. ఇప్పుడు త్రివిక్రమ్ మరో ఆకర్షణీయమైన, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.

సుప్రసిద్ధ హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేయడం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇది అరుదైన, మాయాజాల కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. త్రివిక్రమ్ శైలి కథలో వెంకటేష్ ను వెండితెరపై చూడటానికి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

VENKATESH – TRIVIKRAM | THE MOST MAGICAL COMBO TAKES ITS FIRST STEP TOWARDS AN ENTHRALLING JOURNEYThe two most celebrated names of Telugu cinema Venkatesh and Trivikram Srinivas have officially joined forces. The much awaited project was launched today with a traditional pooja ceremony and it’s a beginning of what guarantees to be a memorable outing for audiences.

This collaboration has been the talk of the industry for a while and for good reason. Watching Venkatesh step into a character shaped by Trivikram’s unique storytelling arc is an exciting prospect for cinephiles. Known for his impeccable command over family entertainers that brings emotional depth, Trivikram is expected to bring yet another engaging and universally appealing film to the big screens..

Produced by S. Radha Krishna (Chinababu) under the prestigious Haarika & Hassine Creations banner. Film will go on floors soon.

Camera switch on by Suresh Babu added a special moment to the launch event.

With a combination as rare and magical as this, expectations are already sky high. Fans and film lovers alike will be eager to see what unfolds when Venkatesh’s Mark in Trivikram’s signature storytelling on the silver screen.


Venky77xTrivikram-2 Venky77xTrivikram-1

Ravi Teja’s Mass Jathara Teaser Guarantees a Blockbuster This August 27th

ఘన విజయానికి హామీ ఇస్తున్న రవితేజ ‘మాస్ జాతర’ టీజర్మాస్ అంశాలు, వినోదం మేళవింపుతో ఆకట్టుకుంటున్న ‘మాస్ జాతర’ టీజర్
ఆగస్టు 27న థియేటర్లలో మాస్ పండుగ

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న విడుదల కానున్న ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.

మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలు ‘మాస్ జాతర’ టీజర్ లో ఉన్నాయి. నిజానికి అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. రవితేజ శైలి యాక్షన్ మరియు వింటేజ్ ఎనర్జీతో నిండిన ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్టైనర్ ను చూడబోతున్నామనే హామీని టీజర్ ఇస్తోంది.

మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు వినోదాన్ని మేళవిస్తూ టీజర్ ను మలిచిన తీరు ఆకట్టుకుంది. అభిమానులు కోరుకునే అసలుసిసలైన మాస్ రాజా తెరపై ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రవితేజ తనదైన చురుకుదనం, కామెడీ టైమింగ్ తో కట్టిపడేశారు.

శ్రీలీల మరోసారి బలమైన పాత్రలో మెరిసిపోయారు. రవితేజ, శ్రీలీల ఎప్పుడు తెరను పంచుకున్నా అది స్వచ్ఛమైన మాయాజాలానికి హామీ ఇస్తుంది. ‘మాస్ జాతర’ టీజర్ లో ఈ జోడి మరోసారి మాయ చేసింది.

దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా అసలైన పండుగ సినిమాలా ‘మాస్ జాతర’ను మలుస్తున్నారు. వినాయక చవితి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచనుంది.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ కోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. టీజర్ లో నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ నవీన్ నూలి ఎప్పటిలాగే సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తున్నారు.

వరుసగా ప్రేక్షకులను మెప్పించే చిత్రాలను అందించడంలో ప్రసిద్ధి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ‘మాస్ జాతర’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆగస్టు 27న థియేటర్లలో మాస్ జాతర
‘మాస్ జాతర’ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ చిత్రం.. అభిమానుల ఈలలు, గోలలతో మాస్ పండుగను తీసుకురాబోతుంది. అప్పటి వరకు ఈ టీజర్ మాస్ మహారాజా తిరిగి వచ్చాడని అందరికీ గుర్తు చేస్తుంది. మొత్తానికి ‘మాస్ జాతర’ రూపంలో విందు భోజనం లాంటి సినిమా చూడబోతున్నాం.

తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Ravi Teja’s Mass Jathara Teaser Guarantees a Blockbuster This August 27thMass Jathara teaser is out now and it’s everything fans hoped for and more. A full meals mass entertainer loaded with action and vintage energy of Mass Maharaja Ravi Teja.

Teaser sets the tone of high voltage mass mixed with full on entertainment. Ravi Teja’s screen presence is magnetic serving up his trademark swagger and timing.

Sreeleela once again shines in another strong role. Whenever Ravi Teja and Sreeleela share the screen it guarantees pure magic.

Director Bhanu Bhogavarapu seems to have cracked the formula for a festival blockbuster delivering mass moments with family appeal.

Bheems Ceciroleo has once again delivered his best for Ravi Teja. The background score sounds high on impact and with two songs already released to a great response. DOP Vidhu Ayyanna did a great job. With Navin Nooli handling the editing part you are in for a treat.

On the production front Naga Vamsi and Sai Soujanya under the banners Sithara Entertainments, Fortune Four Cinemas are leaving no stone unturned. Known for delivering back to back crowd pleasers. Presented by Srikara Studios.

Come August 27th
Mass Jathara is set to take over theatres, guaranteeing whistles and madness. Until then Teaser will remind everyone Mass Maharaja is back and this time it’s a full meals feast.

MASS JATHARA - Teaser - STILL MASS JATHARA - Teaser Out Now Mass Jathara Teaser announcement WWM Mass Jathara Teaser Tmr Twtr WWM