Uncategorized

‘బ్యాంకాక్’ లో భారీ పతాక సన్నివేశాల చిత్రీకరణలో మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ‘శ్రీను వైట్ల’ ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం :

DGA_2318 DGA_2322 DGA_2335 DGA_2340 విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ  నిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం గత నెల (జులై)  27 నుంచి బ్యాంకాక్ లో జరుగుతోంది. 
ఈ చిత్రం గురించి  బ్యాంకాక్ నుంచి నిర్మాత దానయ్య డి .వి.వి మాట్లాడుతూ …’  మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో  భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ నుంచి  ఈ నెల 12న హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య. 
మరల హైదరాబాద్ లో ఈ నెల 13 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ‘శ్రీను వైట్ల’ మాట్లాడుతూ ” ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ ‘కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని  ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో,  అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అన్నారు. 
ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ 
 
లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , 
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ 
సమర్పణ : డి. పార్వతి 
నిర్మాత : దానయ్య డి.వి.వి.
మూలకథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీను వైట్ల

భీమనేని, బెల్లంకొండ శ్రీనివాస్ ల చిత్రం ప్రారంభం :

ఎన్నో రీమేక్ చిత్రాలని సక్సెస్ ఫుల్ చిత్రాలుగా మలచిన భీమనేని దర్శకత్వంలో, అల్లుడుశీను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో నూతన చిత్రం పూజ కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో  జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ చేయగా షిర్డి సాయిబాబా విగ్రహంపై తొలిషాట్ చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరై యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.  దర్శకుడు భీమనేని సొంత సంస్థ ‘గుడ్ విల్ సినిమా’ బ్యానర్ పై నిర్మాణం కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 16 నుండి మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి మే, జూన్ , జులై నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేస్తామని, ఆగస్ట్ 28న చిత్రాన్ని విడుదల చేయనున్నామని  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  వివేక్ కూచిభొట్ల తెలియజేశారు.
తమిళ్ లో ‘సుందర్ పాండియన్’ గా, కన్నడలో ‘రాజహులి’ గా విడుదలై రెండు భాషల్లోనూ శతదినోత్సవాలు జరుపుకుని నిర్మాతలకి, పంపిణిదారులకి కనక వర్షం కురిపించిన కథకి ఇది తెలుగు రీమేక్ అని, మన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మలిచామని, ‘సుడిగాడు’ తర్వాత తనకిది మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే చిత్రమని దర్శకుడు భీమనేని తెలియజేశారు.
ఈ చిత్రానికి కథ-ఎస్.ఆర్. ప్రభాకరన్ , మాటలు- భీమనేని శ్రీనివాస్ రావు ,ప్రవీణ్ , కెమేరా -విజయ్ ఉలగనాథ్ ,
సంగీతం- శ్రీ వసంత్ , ఎడిటింగ్- గౌతంరాజు , ఆర్ట్ – కిరణ్ కుమార్
పబ్లిసిటి డిజైనర్ – ధని ఏలె, కాస్టూమ్స్ -శివ ,ఖాదర్,  స్టిల్స్ – కటారి,  కో డైరెక్టర్ -రాంగోపాల్ చౌదరి,  ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – బండిశేషయ్య, 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల, సమర్పణ- భీమనేని రోషితా సాయి

మాటలు-స్ర్కీన్ ప్లే -దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్ రావు, నిర్మాత- భీమనేని సునీత

IMG-20150331-WA0001 IMG-20150331-WA0007 IMG-20150331-WA0002 IMG-20150331-WA0014 IMG-20150331-WA0003 IMG-20150331-WA0004 IMG-20150331-WA0005 IMG-20150331-WA0006 IMG-20150331-WA0008 IMG-20150331-WA0009 IMG-20150331-WA0010 IMG-20150331-WA0011 IMG-20150331-WA0012 IMG-20150331-WA0013

Thaman for Megapower star RamCharan’s film

It was Anirudh (Klaveri Di fame) who is signed for Megapower star Ram Charan’s latest film in the direction of super director Sreenu Vytla. The shoot of the film was started on 16 of March and is going on a full swing. The release date of the movie is going to be 15 October 2015. Currently Anirudh is busy with Tamil projects and expressed his inability to give music at the pace the film is being made. With a friendly understanding with Anirudh, producer DVV Danayya has decided to sign Thaman as music director. SS Thaman will be composing music for Ram Charan – Sreenu Vaitla combo film. He has also given music for Ram Charan – Danayya combo film Naayak in the past.

Rakul Preet Singh plays female lead. Manoj Paramahamsa handles cinematography. Gopi Mohan and Kona Venkat contribute in writing department.

 

DGA_2335

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ‘శ్రీను వైట్ల’, ప్రముఖ నిర్మాత ‘దానయ్య డి.వి.వి.’ల చిత్రం ప్రారంభం.

                        DGA_2308 DGA_2304 DGA_2322 DGA_2303 DGA_2324 DGA_2318 DGA_2320 DGA_2311 DGA_2312 DGA_2316 DGA_2238 DGA_2239 DGA_2241 DGA_2264 DGA_2267 DGA_2270 DGA_2273 DGA_2275 DGA_2276 DGA_2278 DGA_2281 DGA_2292 DGA_2301 DGA_2309 DGA_2310 DGA_2333 DGA_2335 DGA_2338 DGA_2340 DGA_2342 DGA_2346 DGA_2192 DGA_2195 DGA_2206 DGA_2217 DGA_2218 DGA_2221 DGA_2227 DGA_2236
మార్చి 5, గురువారం  
ఉదయం 6 గంటల 24 నిమిషాలు
మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సెన్సేషనల్ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథులు..
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ‘శ్రీను వైట్ల’ల పవర్ ఫుల్   కాంబినేషన్
ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దానయ్య డి.వి.వి. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఈ రోజు (మార్చి 5) ఉదయం 6 గంటల 24 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో  వైభవంగా ప్రారంభమైంది.
దేవుని ఫోటోలపై మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ గారు క్లాప్ ఇవ్వడం జరిగింది. చిత్రం  స్రిప్ట్ ను మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత దానయ్య డి.వి.వి.లకు అందజేశారు . దర్శకుడు వి.వి.వినాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. 
ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ‘శ్రీను వైట్ల’ మాట్లాడుతూ “ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. . కథ చాలా బాగా వచ్చింది. రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ లతో నా కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. మళ్ళీ మా కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందటం ఎంతో ఆనందాన్నిస్తోంది. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎంతో అంకితభావంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో,  అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది” అన్నారు.
రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ ” మా శ్రీను చెప్పినట్టు ఒక అద్భుతమైన కథ ఈ సినిమాకి కుదిరింది. కొంత గాప్ తర్వాత మళ్ళీ మేము ఈ ప్రాజెక్ట్ కోసం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా మొత్తం చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. పని చేసేటప్పుడు ఎంత జోష్ గా ఫీల్ అయ్యామో రేపు థియేటర్ లో కూడా అదే జోష్ కనిపిస్తుంది. మేము, శ్రీను వైట్ల  - కామెడీ,  ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ కథలనే నమ్ముతాం. అవే మమ్మల్ని ఈ స్థాయి కి తీసుకొచ్చాయి. ఈ సినిమా మా శ్రీను మార్క్ తో ఉండబోతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను.” అన్నారు. గోపి మోహన్ మాట్లాడుతూ ” మా శ్రీను గారితో మళ్ళీ కలిసి పని చెయ్యటం చాలా  ఆనందంగా ఉంది” అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ” నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు.” అన్నారు. “శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ లు ఈ సినిమాకి కలిసి పని చెయ్యటం ఎంతో ఆనందంగా ఉంది. అద్భుతమైన స్రిప్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది.” అన్నారు. ‘ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ ‘కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. 
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’, నాయిక ‘రకుల్ ప్రీత్ సింగ్’ ల తో పాటు భారీ తారాగణం , అత్యున్నత సాంకేతిక విలువలతో తమ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభమౌతుంది. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చక్కని ప్లానింగ్ తో జరుగుతాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.  
 ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ 
సంగీతం: “కొలవేరి డి” ఫేం  అనిరుధ్ , కెమెరా : మనోజ్ పరమహంస , ఎడిటింగ్: ఎం. ఆర్. వర్మ, ఆర్ట్ : నారాయణ రెడ్డి , ఫైట్స్: అనల్ అరసు, చీఫ్ కో డైరెక్టర్: చలసాని రామారావు, చీఫ్ ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సూర్నెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్ : సత్యనారాయణ గుజ్జెళ్ళ, 
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బాబు కె.,
 ప్రొడక్షన్ మేనేజర్స్ : కె. కళ్యాణ్ , రాము. 
 
లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ ,
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ 
సమర్పణ : డి. పార్వతి 
నిర్మాత : దానయ్య డి.వి.వి.
మూలకథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ్రీను వైట్ల

మెగాపవర్ స్టార్ ‘రాం చరణ్’, సూపర్ డైరెక్టర్ ‘శ్రీనువైట్ల’ ప్రముఖ నిర్మాత ‘దానయ్య డి.వి.వి’ ల చిత్రం మార్చి 5 న ప్రారంభం

5 copyFullSizeRenderFullSizeRender (2)