Uncategorized

Sithara Entertainments is shifting gears with its ambitious Production No.36 starring the Divine star Rishab Shetty.

డివైన్ స్టార్ రిషబ్ శెట్టితో భారీ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్ నెం.36 లో కథానాయకుడిగా రిషబ్ శెట్టి

అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా

ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది.

‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘కాంతార 2′ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో చేతులు కలిపారు. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది.

మంచి కథకుడిగా పేరు గాంచిన, ప్రతిభావంతులైన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన ఓ అద్భుతమైన కథతో ప్రేక్షుకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించబడుతుంది. తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ప్రొడక్షన్ నెం.36 గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు.

కేవలం ప్రకటనతోనే భారతీయ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.

తారాగణం: రిషబ్ శెట్టి
దర్శకత్వం: అశ్విన్ గంగరాజు
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

 
Sithara Entertainments is shifting gears with its ambitious Production No.36 starring the Divine star Rishab Shetty.Sithara Entertainments Known for delivering some of the biggest blockbusters in recent times and continues to push boundaries with the kind of films it brings to audiences. Now they are back with another magnum opus.

The makers have officially announced this grand project with versatile Rishab Shetty who’s one of the most celebrated stars in Kannada cinema and the face behind the phenomenon Kantara. As he gears up for Kantara 2, Rishab joins hands with Sithara Entertainments for a fictional historical action drama set in the turbulent Bengal province of 18th century Bharat a time when a rebel began to rise.

The film will be directed by the talented Ashwin Gangaraju widely appreciated for his gripping storytelling. This time he is set to present an even larger than life saga.

The film will be shot simultaneously in Telugu & Kannada and will release in Telugu, Kannada, Tamil, Hindi and Malayalam.

Production No.36 is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners Sithara Entertainments and Fortune Four Cinemas. Presented by Srikara Studios. With such a stellar team coming together it’s going to be a crazy adventure.

Anticipation is already sky high for what promises to be one of the most talked about projects in Indian cinema. Stay tuned for more updates coming in the future.

PROD_36_TWTR PROD_36_TWTR_PLAIN

*Suriya’s next Film, #Suriya46 written & directed by Venky Atluri Shoot Begins: The First Step Towards Celebration*

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #Suriya46 షూటింగ్ ప్రారంభం

వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన తమిళ అగ్ర కథానాయకుడు సూర్య, తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. సూర్య 46వ చిత్రంగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్ర షూటింగ్ ను నేడు ప్రారంభించారు.

ప్రతిభావంతులు సూర్య, వెంకీ అట్లూరి మొదటిసారి చేతులు కలపడంతో.. కేవలం ప్రకటనతోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా “వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు” అంటూ సూర్య ముందుకి అడుగు వేస్తున్న అద్భుతమైన పోస్టర్‌ ను చిత్ర బృందం పంచుకుంది.

తమిళ కథానాయకుడు అయినప్పటికీ పలు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకుల ప్రేమను కూడా పొందుతున్న సూర్య.. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.33 తో తమిళ మరియు తెలుగు అభిమానులను మరింతగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. మొదటి నుంచి పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ఎప్పటికప్పుడు సృజనాత్మక సరిహద్దులను చెరిపేస్తున్న సూర్య.. ఇప్పుడు ‘సూర్య 46′తో మరో వైవిద్యభరితమైన చిత్రాన్ని అందించబోతున్నారు.

లోతైన భావోద్వేగాలను, వాణిజ్య అంశాలను మిళితం చేస్తూ ప్రస్తుత తరంలో గొప్ప కథకులతో ఒకరిగా పేరు పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. గత రెండు చిత్రాలు సార్(వాతి), లక్కీ భాస్కర్ ఘన విజయాలను సాధించి.. దర్శకుడిగా వెంకీ అట్లూరి స్థాయిని మరింత పెంచాయి. సార్, లక్కీ భాస్కర్ తరహలోనే మరో గొప్ప కథను అందించబోతున్నారు వెంకీ అట్లూరి.

‘సూర్య 46′పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘ప్రేమలు’తో ఆకట్టుకున్న యువ సంచలనం మమిత బైజు కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినీ పరిశ్రమకు తిరిగి వస్తున్నారు. రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సార్(వాతి), లక్కీ భాస్కర్ చిత్రాలతో తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన జి.వి. ప్రకాష్ కుమార్.. మరోసారి వెంకీ అట్లూరితో చేతులు కలిపి, తన సంగీతంతో మాయ చేయబోతున్నారు.

ఈ చిత్ర కోసం ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. ఛాయాగ్రాహకుడిగా నిమిష్ రవి, కళా దర్శకుడిగా బంగ్లాన్ వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నిబద్ధత గల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వర్కింగ్ టైటిల్: #సూర్య46 – ప్రొడక్షన్ నెం. 33
తారాగణం: సూర్య, మమిత బైజు, రవీనా టాండన్, రాదిక శరత్ కుమార్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
కళ: బంగ్లాన్
ఫైట్ మాస్టర్: వి. వెంకట్
కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యలమంచిలి గోపాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వరరావు
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

*Suriya’s next Film, #Suriya46 written & directed by Venky Atluri Shoot Begins: The First Step Towards Celebration*

The much-anticipated project #Suriya46 ~ Sithara Entertainments’ Production No. 33 has officially hit the floors. The film was recently launched with a grand pooja ceremony in Hyderabad, and today, the makers commenced the shoot for this highly ambitious bilingual project.

With Suriya leading the way, this collaboration with Venky Atluri has already generated excitement across both the Tamil and Telugu film industries. The team announced the commencement with a striking poster featuring Suriya in a stylish back pose. The caption, “And the Celebration Begins,” adds a special vibe to the project.

Suriya, who enjoys massive love from the Telugu audience, is now ready to captivate both Tamil and Telugu fans with Sithara Entertainments’ Production No. 33 – his 46th film. Over the years, his choice of roles has reflected depth and variety, consistently pushing creative boundaries.

Director Venky Atluri is a storyteller known for seamlessly blending emotional depth with commercial appeal. His recent back-to-back successes – Sir/Vaathi and Lucky Baskhar – have cemented his status as a blockbuster filmmaker who consistently delivers stories that resonate on multiple levels.

Everything about this extraordinary project amplifying expectations. Mamitha Baiju, the Premalu sensation, joins as the female lead, Raveena Tandon makes her much awaited return to Telugu cinema, while Radhika Sarathkumar plays a crucial role. GV Prakash Kumar, known for his work in Vaathi/Sir, Lucky Baskhar reunites with Venky Atluri for another musical sensation.

The film’s technical team includes Nimish Ravi for cinematography, National Award-winner Navin Nooli for editing, and Banglan for production design. It is produced by S. Naga Vamsi and Sai Soujanya, known for their successful projects and commitment to quality filmmaking. The film aiming for a Summer 2026 release.

Working Title: #Suriya46 – Production No. 33
Starring: Suriya, Mamitha Baiju, Raveena Tandon, Radhika Sarathkumar

Crew:
Writer & Director: Venky Atluri
Producers: S. Naga Vamsi & Sai Soujanya
Music Director: GV Prakash Kumar
DOP: Nimish Ravi
Editor: Navin Nooli
Production Designer: Banglan
Fight Master: V. Venkat
Choreographer: Vijay Binni
Executive Producer: Yalamanchili Gopala Krishna
Line Producer: Uma Maheshwar Rao
Banners: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios

S46 -Shoot Begins S46-Still

*Retro Telugu Pre Release Event: A Night of Love and Celebrations*

ఘనంగా సూర్య ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక

‘రెట్రో’ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: విజయ్ దేవరకొండ

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కొత్త చిత్రం ప్రకటన

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సినిమా గురించి మాట్లాడేముందు.. ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు. సూర్య అన్న మూవీ ప్రమోషన్ కోసం నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేను గజిని సినిమా చూసి సూర్య అన్నతో ప్రేమలో పడిపోయాను. ఎవర్రా ఈయన, ఇంత బాగా నటిస్తున్నాడు అనుకొని.. సూర్య అన్న నటించిన మిగతా సినిమాలన్నీ చూశాను. సూర్య సన్నాఫ్ కృష్ణన్ నా మనసుకి బాగా నచ్చిన సినిమా. చంచల సాంగ్ చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఆ పాట నాకెప్పటికీ ఓ మంచి జ్ఞాపకం. సూర్య అన్నను తెరమీద చూసి.. అసలు ఈ మనిషి బాడీ ఏంటి, యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి? ఒక్కసారైనా జీవితంలో కలవాలి అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో వేదిక పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. నటుడిగా సూర్య అన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన సినిమాల ఎంపిక మిగతా నటుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. విభిన్న జానర్స్ లో సినిమాలు చేస్తుంటారు. రెట్రోతో సూర్య అన్న మరో ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య అన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా విద్యార్థులకు సాయం చేయాలి అనుకుంటున్నాను. మే 1న విడుదలవుతున్న రెట్రో సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ, “ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు. రెట్రో వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై కురిపిస్తున్న ప్రేమ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ గారి సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. రెట్రో ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సంతోష్ నారాయణన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే తెలుగులో శ్యామ్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్రకాష్ రాజ్ గారు, జోజు జార్జ్ గారు, జయరామ్ గారు, నాజర్ గారు లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. పూజ హెగ్డే నాకంటే ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తోంది. మీరు ట్రైలర్ లో చూసినట్టుగానే.. లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ అన్నీ సినిమాలో ఉంటాయి. మే 1న విడుదలవుతున్న రెట్రో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాగవంశీ గారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. ఆయనతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీ గారి నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్-3′ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విజయ్ నా సోదరుడు లాంటివాడు. విజయ్ జర్నీ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కింగ్ డమ్’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా అగరం ఫౌండేషన్ కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు. నాకు ఇన్నేళ్ళుగా సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

అతిథి, ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, “ఇక్కడ చాలామంది సూర్య గారి అభిమానులున్నారు. వారిలో నేను కూడా ఉన్నాను. నా కాలేజ్ లైఫ్ లో సూర్య గారి సినిమా ఒక పాఠం లాంటిది. గజినీ సినిమా చూసి.. ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా? ఒక నటుడు ఇంత కష్టపడతారా? అనుకున్నాను. నేను సినీ పరిశ్రమలోకి రావాలి అనుకుంటున్నప్పుడు చూసిన సినిమా అది. నాకెప్పుడూ ప్రత్యేకమైనదే. ఇక ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ అయితే.. అది సినిమా కాదు, అదొక టెక్స్ట్ బుక్. ప్రేమలో ఎలా పడాలో నేర్పింది, విఫలమైతే దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పింది, క్రమశిక్షణ కూడా నేర్పింది. సూర్య గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకున్నాము. ఇప్పుడు రెట్రోతో వస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ గారి మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఇలాంటి ట్రైలర్ కట్ నేనెప్పుడూ చూడలేదు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. సూర్య గారు, విజయ్ గారు బ్రదర్స్ లా ఉన్నారు. ఇద్దరూ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మే 1న విడుదలవుతున్న రెట్రో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “తెలుగులో రెట్రో సినిమాని విడుదల చేసే అవకాశమిచ్చిన సూర్య గారికి ధన్యవాదాలు. మిమ్మల్ని ఈ తరహా సినిమాలో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో మీరు ఘన విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి, సోదరుడు వెంకీ అట్లూరికి థాంక్స్.” అన్నారు.

చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ, “2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ తో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మా టీం అందరికీ ఈ సినిమా ప్రత్యేకమైనది. అందరం ఎంతో కష్టపడి పనిచేశాము. సూర్య గారు చాలా మంచి మనిషి. ఆయన నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి, వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు.” అన్నారు.

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “సూర్య గారికి తెలుగులో ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో ఉన్న ఆరు పాటలూ నేను రాయడం జరిగింది. కార్తీక్ సుబ్బరాజ్ గారితో నాకిది రెండో సినిమా. తమిళ నుంచి అనువాదం లాగా కాకుండా, పక్కా తెలుగు లాగా రాశారని ఎందరో సూర్య గారి అభిమానులు నాకు మెసేజ్ లు చేయడం సంతోషం కలిగించింది.” అన్నారు.

నటుడు కరుణాకరన్ మాట్లాడుతూ, “నేను ఎంతగానో అభిమానించే సూర్య గారి సినిమాలో నటించడం అనేది నా కల నిజమైనట్టుగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గారికి కృతఙ్ఞతలు.” అన్నారు.

*RETRO will entertain everyone: Suriya at Telugu pre release event**”I wish for the grand success of the film ‘Retro’: Vijay Deverakonda at RETRO pre Release event*

*Suriya’s upcoming film has been officially announced under the Sithara Entertainments banner, directed by Venky Atluri*

Kollywood star Suriya plays the lead role in the film ‘Retro,’ directed by Karthik Subbaraj, with Pooja Hegde as the female lead. Produced under the 2D Entertainment banner led by Suriya and Jyothika, the film is set for a grand worldwide release on May 1. Notably, prominent Telugu production house Sitara Entertainments is distributing the film in the Telugu states. On Saturday evening, a grand pre-release event was held at JRC Convention in Hyderabad, where popular actor Vijay Deverakonda attended as the chief guest.

Speaking at the event, Vijay Deverakonda said, “Namaste to everyone. I hope you’re all doing well. Before talking about the film, I would like to pay my respects to the victims of the Pahalgam incident. I’m happy to be here to promote Suriya anna’s movie. I fell in love with his acting after watching Ghajini. I was curious to know who he was and watched all his other films. Suriya Son of Krishnan was especially close to my heart. The ‘Chanchala’ song moved me emotionally and has remained a beautiful memory. Watching Suriya anna on screen, I was in awe of his physique, acting, and dance. I once dreamed of meeting him, and now sharing the stage with him is an unforgettable moment. I truly admire him as an actor. His choice of films inspires others in the industry, and he always explores different genres. I wish him a huge success with ‘Retro’. Through the Agaram Foundation, Suriya anna has supported countless students, and he inspires me to do the same. I hope everyone enjoys ‘Retro’ when it releases on May 1.”

Suriya said, “First, I offer my condolences to the victims of the Pahalgam tragedy. Thank you to everyone who came to the Retro event. I’m overwhelmed by the love you’ve been showing me. Karthik Subbaraj’s films are always unique and innovative. It was a joy to work with him. I hope you all liked the Retro trailer. Santhosh Narayanan has composed amazing music, and in Telugu, Shyam has penned beautiful lyrics. I’m happy to share the screen with senior actors like Prakash Raj, Joju George, Jayaram, and Nassar. Pooja Hegde is promoting the film even more than I am. Just like you saw in the trailer, the movie has love, comedy, action, and intensity. I believe ‘Retro’ will win your hearts on May 1. People say Naga Vamsi has a lucky hand, and I’m glad to be working with him. I’m also happy to share that my next film will be under Naga Vamsi’s production and directed by Venky Atluri. I hope Nani’s ‘HIT-3′, also releasing on May 1, will be successful. Vijay is like a younger brother to me, and I feel proud seeing his journey. I wish his film ‘KINGDOM’ becomes a big success. Vijay mentioned the Agaram Foundation today, but I must say that Chiranjeevi garu’s Blood Bank has always been my inspiration for social service. Many Telugu people have supported our Agaram Foundation over the years. I’m deeply grateful to all my beloved fans who have stood by me for so long.”

Talented director Venky Atluri said, “There are many fans of Suriya garu here, and I’m one of them. During my college days, Suriya’s films were like lessons to me. After watching Ghajini, I was amazed and thought, can a movie be like this? Can an actor work this hard? It was one of the films that made me want to join the industry. ‘Soorarai Pottru’ wasn’t just a film – it was a textbook. It taught how to fall in love, how to deal with heartbreak, and even discipline. We’ve learned something from each of Suriya’s films. Now he’s coming with ‘Retro’, and Karthik Subbaraj’s making style is always unique. I’ve never seen a trailer cut like this before, so I believe the film will be on the same level. Suriya and Vijay are like brothers. I feel they should do a multistarrer together. Wishing ‘Retro’, releasing on May 1, to become a huge blockbuster and all the best to the entire team.”

Renowned producer Suryadevara Naga Vamsi said, “I thank Suriya garu for giving us the opportunity to release ‘Retro’ in Telugu. Telugu audiences have long awaited to see you in a film like this. I’m confident you’ll achieve great success with this project. Thanks to Vijay Deverakonda and my brother Venky Atluri for gracing this event.”

Co-producer Kartikeyan Santhanam said, “I’m happy to be a part of this film’s production in association with the 2D Entertainment banner. This film is special to all of us on the team. We all worked very hard on it. Suriya sir is a wonderful person, and I’ve learned many valuable things from him. I sincerely thank Vijay Deverakonda and Venky Atluri for attending this event. Special thanks to Naga Vamsi of Sithara Entertainments for releasing the film in Telugu.”

Lyricist Kasarla Shyam said, “Suriya sir has a huge fan base in Telugu. I had the opportunity to write all six songs in this film. This is my second collaboration with director Karthik Subbaraj. I’ve received messages from many Suriya fans appreciating that the lyrics don’t feel like Tamil translations but sound like native Telugu, which makes me very happy.”

Actor Karunakaran said, “Acting in a film with Suriya sir, whom I deeply admire, feels like a dream come true. I’m grateful to director Karthik Subbaraj for giving me this opportunity.”

 

GANI7612 DSC784 DSC_7647 DSC_7532 DSC_7642

*Sithara Entertainments, a powerhouse in Telugu cinema, is bringing a cinematic spectacle “RETRO” starring Suriya for Telugu audiences*

సూర్య నటిస్తున్న ‘రెట్రో’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతికి సూర్య ‘రెట్రో’ తెలుగు హక్కులు

విభిన్న చిత్రాలు, పాత్రలలో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు విజేత సూర్య. ప్రస్తుతం సూర్య నటిస్తున్న రెట్రో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.

ఒక వైపు వరుస సినిమాలను నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంటున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మరోవైపు పంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. లియో (తమిళం), దేవర (తెలుగు), భ్రమయుగం (మలయాళం) వంటి చిత్రాలను తెలుగునాట విజయవంతంగా పంపిణీ చేసింది. ఇప్పుడు తెలుగులో రెట్రో చిత్రాన్ని విడుదల చేస్తుంది. సితార పంపిణీ చేస్తుందంటే, తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య తెలుగు అభిమానులు థియేటర్లలో పండుగ జరుపుకునేలా ఘనంగా రెట్రో విడుదల ఉండనుంది.

ప్రతిభగల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో రూపొందుతోంది. భారీ తారాగణంతో, అద్భుతమైన సాంకేతిక బృందంతో, కార్తీక్ సుబ్బరాజ్ శైలి విలక్షణమైన దర్శకత్వ ముద్రతో.. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించేలా రెట్రో రూపుదిద్దుకుంటోంది. ప్రచార చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా రెట్రో నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.

సూర్య, జ్యోతిక నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రెట్రో రూపొందుతోంది. ఈ చిత్రంతో కార్తీక్ సుబ్బరాజ్, తన అసాధారణ ప్రతిభతో వెండితెరపై అద్భుతం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.

రెట్రో తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సొంతం చేసుకోవడంతో తెలుగునాట ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో రెట్రోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు సితార సంస్థ తెలిపింది.

*Sithara Entertainments, a powerhouse in Telugu cinema, is bringing a cinematic spectacle “RETRO” starring Suriya for Telugu audiences*

The highly anticipated film “RETRO,” featuring acclaimed national award-winning actor Suriya, is poised to make a massive impact. The film captured everyone’s attention with the powerful teaser and is all set to release on May 1st. The much-awaited film is releasing in Telugu states, with Telugu theatrical rights acquired by Sithara Entertainments.

Known for delivering blockbuster theatrical experiences, Sithara Entertainments has successfully distributed films like Leo (Tamil), Devara (Telugu), and Brahmayugam (Malayalam) across industries. Now, they are releasing RETRO in Telugu. A massive release in Telugu states is guaranteed, and Suriya Telugu fans are ready to celebrate RETRO on the next level in theaters.

With its captivating premise, stellar cast, and Karthik Subbaraj’s distinctive directorial touch, the film promises to offer an electrifying retro ride. With every content, RETRO is shaping up to be one of the most awaited releases of the year. The post-production work for the film is happening firmly.

The film has impressive ensemble cast, including, Pooja Hegde, Joju George, Jayaram, Nassar, and Prakash Raj among others in pivotal roles. The music for the film has been composed by the acclaimed Santhosh Narayanan.

Backed by 2D Entertainment, the prestigious banner led by Suriya and Jyotika, RETRO is set to redefine cinematic brilliance with the dynamic vision of Karthik Subbaraj at the helm.

The buzz around RETRO is soaring high, and with Sithara Entertainments on board, the Telugu theatrical release promises to be massive!
RETRO-TELUGU-SitharaEnts-PLAIN RETRO-TELUGU-SitharaEnts

Gratitude and Acknowledgment

కృతజ్ఞతాభివందనాలు
నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా, ఈ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా ధన్యవాదాలు.

నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు మరియు యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నా తండ్రిగారైన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుండి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉండగలనని తెలియజేస్తున్నాను.

ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు అందిస్తున్నాను.

అప్పుడు… ఇప్పుడు… ఎల్లప్పుడూ…

సదా మీ
నందమూరి బాలకృష్ణ

Gratitude and Acknowledgment

On the occasion of being honored with the Padma Bhushan Award, I extend my heartfelt gratitude to the Government of India for bestowing this prestigious recognition upon me.

I am deeply thankful to everyone who has conveyed their wishes and blessings on this occasion.

I express my gratitude to my fellow actors, technicians, producers, distributors, exhibitors, family members, and the entire film fraternity who have been a part of this long and eventful journey.

I am forever indebted to my fans, who have stood by me as the proud successor of my father, the late Nandamuri Taraka Rama Rao garu, and to the countless audiences who continue to shower their unwavering love and support upon me.

I also extend my congratulations to my fellow Padma awardees on this joyous occasion.

Then… Now… Forever…

Always yours,
Nandamuri Balakrishna

PHOTO-2025-01-26-11-36-37