Uncategorized

“Dhira Dhirana” from “Raju Gari Ammayi, Naidu Gari Abbayi”, out now!

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” నుండి శృంగార గీతం “ధిర ధిరన” లిరికల్ వీడియో విడుదల

తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు.

యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన “ఐ లవ్ యు” గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి శృంగార గీతం “ధిర ధిరన” లిరికల్ వీడియో విడుదలైంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. రోషన్ సాలూరి స్వరపరిచిన “ధిర ధిరన” గీతం ఆకట్టుకుంటోంది. సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించారు. రోషన్ సాలూరి మధురమైన సంగీతానికి సాహితి చాగంటి గాత్రం, రెహమాన్ సాహిత్యం తోడై పాట మరింత అందంగా మారింది. లిరికల్ వీడియోలో నాయికా నాయకుల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. థియేటర్లలో ఈ సాంగ్ యువత మనసు దోచుకోవడం ఖాయమనిపిస్తోంది.

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ‘రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’ టీజర్ మెప్పించింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో  థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి  సిద్ధమవుతోంది.

తారాగణం:
కథానాయకుడు: రవితేజ నున్నా
కథానాయిక: నేహా జురెల్
ఇతర ప్రధాన పాత్రలలో నాగినీడు,ప్రమోదిని
జబర్దస్త్ బాబీ,జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజి
యోగి ఖత్రి , అజిజ్ భాయ్, వీరేంద్ర
గిద్ద మోహన్, అప్పిరెడ్డి, కంచిపల్లి అబ్బులు
శ్రావణి

సాంకేతిక బృందం:
సంగీతం: రోషన్ సాలూరి
ఛాయాగ్రహణం: మురళి కృష్ణ వర్మ
కూర్పు: కిషోర్ టి
దర్శకత్వం: సత్య రాజ్
నిర్మాతలు: రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాస్


“Dhira Dhirana” from “Raju Gari Ammayi, Naidu Gari Abbayi”, out now!

‘Raju Gari Ammayi-Naidu Gari Abbayi’, starring debutants Ravi Teja and Neha Jurel, is directed by Satya Raj and is produced by Ramisetty Subbarao and Mutyala Ramadasu under the banner Tanvika and Mokshika Creations.

The already-released song “I Love You” from the young talent’s film has hooked the audience. Now, the lyrical video of the romantic song “Dhira Dhirana” from this film has been released.

Roshan Saluri, the son of popular music director Koti, has composed the music for this film. The song “Dhira Dhirana,” composed by him, is impressive. Sung by Sahithi Chaganti, this song is penned by Rahman. Roshan Saluri’s melodious music, accompanied by Sahithi Chaganti’s voice and Rahman’s lyrics, makes the song even more beautiful. In the lyrical video, the chemistry between the lead pair is well-established. It seems that this song is sure to steal the hearts of the youth in theaters.

According to the movie’s team, the plot of “Raju Gari Ammayi, Naidu Gari Abbayi” will bring a new experience to this generation of moviegoers. The teaser of the movie released sometime back was impressive. The trailer for the movie is going to be released soon to double the interest in the movie among the audience. The film is all set to hit theaters in a few days to entertain the family audience.

Cast: Raviteja Nunna, Neha Jurel, Nagineedu, Pramodini, Jabardast Bobby, Jabarsat Ashok, Pushp Durgaji Yogi Khatri, Ajiz Bhai, Veerendra, Gidha Mohan, Appi Reddy, Kanchipalliu Abbulu, Sravani

Music: Roshan Saluri; Cinematography: Murali Krishna Varma; Editor: Kishore T.
Direction: Satya Raj; Producers: Ramisetty Subbarao, Mutyala Ramadas

IMG_8922

There is more to ‘Saptha Sagaralu Dhati: Side B’ than the first part: Actor Rakshith Shetty

‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ చిత్రం ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది: చిత్ర బృందం

ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు కేవీ అనుదీప్, శ్రీనివాస్ అవసరాల పాల్గొన్నారు.

చిత్ర కథానాయకుడు రక్షిత్ శెట్టి మాట్లాడుతూ, “నా సినిమాల నేను ఇక్కడికి రావడం ఇది నాలుగోసారి. గతంలో ‘అతడే శ్రీమన్నారాయణ’, ’777 చార్లీ’, ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ చిత్రాల కోసం వచ్చాను. ఇప్పుడు సైడ్ బి కోసం వచ్చాను. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీడియా కూడా ఎంతో సపోర్ట్ గా ఉంది. తెలుగులో ఇంత ఘనంగా విడుదల చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, వివేక్ గారికి కృతఙ్ఞతలు” అన్నారు.

చిత్ర కథానాయిక రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ, “సప్త సాగరాలు దాటి సైడ్ ఎ చిత్రాన్ని ఆదరించి, మాకు ఇంత ప్రేమ పంచిన తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. మను, ప్రియల కథ మీ హృదయాల్లో చోటు సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. సైడ్ బి లో మరిన్ని అందమైన పాత్రలు ఉంటాయి. సైడ్ బి కూడా మిమ్మల్ని మెప్పిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, వివేక్ గారికి థాంక్స్” అన్నారు.

చిత్ర కథానాయిక చైత్ర జె. ఆచార్ మాట్లాడుతూ, “సైడ్ ఎ కి మీరిచ్చిన సపోర్ట్ కి చాలా హ్యాపీ. సైడ్ బి కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా సినిమాకి ఇక్కడ ఇంత ప్రేమ దొరకడానికి కారణమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు” అన్నారు.

చిత్ర దర్శకుడు హేమంత్ రావు మాట్లాడుతూ, “తెలుగు రాష్ట్రాల్లో సైడ్ ఎ కి వచ్చిన స్పందన పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. సైడ్ ఎ కి కొనసాగింపుగా సైడ్ బి కథ ఉంటుంది. అయితే సైడ్ ఎ తో పోలిస్తే, సైడ్ బి షేడ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎన్నో ఫోన్లు, మెసేజ్ లు చేసి ప్రశంసిస్తున్నారు. సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ధన్యవాదాలు. హైదరాబాద్ లో సైడ్ ఎ కన్నడ వెర్షన్ మంచి స్పందన రావడం చూసి, తెలుగులో విడుదల చేయాలి అనుకున్నాం. తక్కువ సమయమే ఉన్నప్పటికీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఘనంగా విడుదల చేసి, మా చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేశారు” అన్నారు.

నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ, “సైడ్ ఎ విడుదల సమయంలో ప్రమోషన్స్ కి కావాల్సినంత సమయం లేదు. కేవలం విడుదలకు మూడు నాలుగు రోజుల ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేశాం. అయినప్పటికీ చాలా చోట్ల మొదటి రోజు నుంచే హౌస్ ఫుల్స్ పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించిదానికంటే మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు 17వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి, పబ్లిసిటీ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సైడ్ ఎ కంటే సైడ్ బి పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.

నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ, “ఈ సినిమా చూస్తున్నాడు నాకు జో అచ్యుతానంద చిత్రంలో చిన్న సీన్ గుర్తుకొచ్చింది. అందులో నారా రోహిత్ పాత్ర.. నాకు జీవితంలో పెద్దగా కోరికల్లేవు, చిన్న చిన్న ఆనందాలతో జీవితం సాగిపోతే చాలు అని ఒక సన్నివేశంలో చెప్తాడు. మనకు జీవితంలో చాలా ఆనందాలు కేవలం ఇంత ఉంటే చాలు అనుకునేలా ఉంటాయి. కానీ కొన్నిసార్లు మాత్రం అవి ఎంతో దూరాన సప్త సాగరాలు దాటితే గాని అందవు అనేలా మారుతుంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం చేసే ప్రయత్నాలు.. విధి కారణంగా ఎలా మారిపోతాయి అనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు. పరిస్థితులకు తగ్గట్టుగా పాత్రలు ఎలా మారుతుంటాయో ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఇలాంటి చిత్రాలకు రచన చాలా చాలా బాగుండాలి. నటన సహజంగా ఉండాలి. ఈ చిత్రంలో ఆ రెండూ ఉన్నాయి. సైడ్ ఎ, సైడ్ బి అని పేర్లు పెట్టిన విధానాం నాకు చాలా నచ్చింది. ప్రతి కథకి ఎన్నో కోణాలు ఉంటాయి. సైడ్ ఎ లో కనిపించని కోణాలు ఏమైనా సైడ్ బిలో కనిపిస్తాయా అని నేను ఎదురుచూస్తున్నాను. మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.

దర్శకుడు కేవీ అనుదీప్ మాట్లాడుతూ, ” మీరందరూ సప్త సాగరాలు దాటి సైడ్ ఎ చూసే ఉంటారు. చాలా మంచి స్పందనను తెచ్చుకుంది. అలాగే సైడ్ బి ని కూడా మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. రక్షిత్ శెట్టి గారి సినిమాలన్నీ చూస్తుంటాను. ఆయనతో పాటు టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

చిత్రం: సప్త సాగరాలు దాటి
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్
రచన– దర్శకత్వం : హేమంత్ ఎం రావు
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల

There is more to ‘Saptha Sagaralu Dhati: Side B’ than the first part: Actor Rakshith Shetty

Following a massive reception received for ‘Sapta Sagaralu Dhaati – Side A’ at the Telugu box office, People Media Factory is all set to release the second part — ‘Sapta Sagaralu Dhaati – Side B’ in theatres on November 17.

Starring actor Rakshit Shetty and Rukmini Vasanth in the lead roles, ‘Sapta Sagaralu Dhaati – Side B’ is directed by Hemanth M. Rao. The film is about a young couple who try to fulfill their romantic aspirations while facing the harsh realities of life. The film was directed by Hemanth M. Rao and produced by Rakshit Shetty. As part of the promotions, the movie team held a press meet here at Ramanaidu Studios on Thursday.

Actor Rakshith Shetty, who played Manu, said, “This is the fourth time I visited Hyderabad — first one was for Avade Srimannarayana, 777 Charlie, ‘Saptha Sagaralu Dhati: Side A’ and now I am here for Side B. First I would like to thank Vivek sir for the love and support. The first part was received very well by the Telugu audiences. I thank my director Hemanth Rao, and big thanks to the media for their support. Side B – the element of revenge is the part of the story. Definitely, there is much more to it. The love that Manu had for Priya will continue in different formats. The love that was there in Side A will also be in Side B.

Producer Vivek Kuchibhotla: When she started promoting ‘Sapta Sagaralu Dhaati – Side A’ three days before the release date, there was a massive response from the crowd on day one itself. Initially when we thought of releasing the film in Telugu, I was sceptical that we might not even recover the money. The collections were good, we even got overflows from the first part. The response was also good. Since there is ample time for the release of Side B, we resolved to kickstart the promotions early. Thanks to the media because of their support, the film could reach out to wider audiences.

Hemanth Rao said, “Very happy to be here after Side A. We received terrific responses from Andhra Pradesh and Telangana. We’re very happy to take the film from Karnataka to different States. It is a matter of great pride. I am very excited. If you can see the trailer, the shades of the film are slightly different from Side A. The story continues from the first part. There are a lot of messages that I keep getting from audiences about the trailer. I am very excited and I can’t wait to watch it on the screen on November 17. Thanks to the People’s Media Factory.

Chaitra: We are immensely happy for the support that ”Side A’ from you all. I am thankful to the producers of People Media Factory. Because they are bringing our story to Telugu people here in Hyderabad. Now we’re coming with ‘Side B’.

Rukmini Vasanth: First of all, I would like to thank everybody for being here today. I would also like to thank you all for the response that you have given for Side A. Saptha Sagaralu Dhaati got a lot of love from everywhere, especially from the people of Telangana. Thank you for so much love. It means a lot that Manu and Priya have found a place in your hearts. And now, you will get to see them again after 10 years with many more beautiful characters. It’s a matter of great pride to bring the story to you. Thanks to Vivek Kuchibhotla garu and People Media Factory.

Anudeep KV: As you all know ‘Saptha Sagaralu Dhaati: Side A’ earned the name from both critics and audiences. I keep following Rakshith Shetty’s work. Great to see Rukmini Vasanth garu pulling off a powerful role, and Chaitra who is getting introduced in the Side B. I wish the director Hemanth Rao and the entire cast and crew all the very best, and I hope the film will reach the audience.

Avasarala Srinivas: When I started watching the film Saptha Sagaralu Dhati: ‘Side A’, I wondered what the content was about. Ten minutes later, I recalled a small scene from ‘Jyo Achyutananda’. The character Achyuth played by Nara Rohith says that he doesn’t have lofty dreams in his life — he only needs a small job, small pay and a small wife. I don’t know why I had to write the word “small wife”. Usually, we need fewer things to be happy in life. But they eventually turn into challenging ones where you could only achieve them if you sail ‘Saptha Sagaralu’ (seven seas). When I watched the film, the protagonist had very few dreams. He would get a Rs 12,000 salary per month. When we need something in life, we tend to run faster and faster. The greed in life was beautifully explored by the director Hemanth. The way how situations make people forced to behave in certain ways was aptly shown. Not just realistic, but the portrayal of each and every individual character was terrific.

IMG_0865 (1)

Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ NBK109 shooting starts!


నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘NBK109′ షూటింగ్ ప్రారంభం

నటసింహం నందమూరి బాలకృష్ణ తన అద్భుతమైన 49 ఏళ్ళ సినీ ప్రయాణంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు మరియు భారీ బ్లాక్‌బస్టర్ విజయాలకు పర్యాయపదంగా మారారు. తనదైన విలక్షణ శైలితో ఎన్నో గుర్తుండిపోయే అత్యంత శక్తివంతమైన పాత్రలకు ప్రాణం పోశారు.

నందమూరి బాలకృష్ణ తెరపై గర్జించినప్పుడల్లా, చిరకాలం నిలిచిపోయే బాక్సాఫీస్ రికార్డులు ఆయన సొంతమయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మరో భారీ యాక్షన్ చిత్రంతో రాబోతున్నారు.

ఇటీవలి సంవత్సరాలలో తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలు నిర్మిస్తూ, దూసుకుపోతున్న విజయవంతమైన నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ యాక్షన్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించుకుంది.

బాబీ కొల్లి తన అద్భుతమైన విజువల్స్ మరియు ప్రధాన నటుల గొప్ప ప్రదర్శనకు ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో రక్త పాతానికి హామీ ఇస్తున్నారు.

‘NBK109′ చిత్రీకరణ ఈరోజు(నవంబర్ 8) నుంచి ప్రారంభమైనట్లు తెలుపుతూ మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై  నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు.

ఇప్పటికే బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా విడుదలైన సృజనాత్మక పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి #NBK109 అనే టైటిల్ పెట్టారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ NBK109 shooting starts!

Nandamuri Balakrishna has become a synonym for action entertainers and big blockbuster successes over 49 years of his legendary career. He gave life to larger-than-life and memorable characters on big screen in his typical style.

Whenever he roars on screen, box office records have been broken to remember for a long time. Now, Nandamuri Balakrishna is coming with another huge action spectate in the direction of Blockbuster director, Bobby Kolli.

Sithara Entertainments, who have been the busiest production house of Telugu Cinema, in recent years, have decided to produce this action spectacle on a grand scale.

Bobby Kolli, is known for his stunning visuals and grand presentation of his lead actors. He is promising Blood Bath with Nandamuri Balakrishna in the lead.

In a creative poster, he showcased “Lord Hanuman” Amulet or Talisman with spects reflecting “Lord Narasimha” hitting Demon or Asuras! With the poster the makers have announced that NBK109 shooting has started.

The poster creativity itself is increasing buzz for already eagerly awaited Combination. Movie is currently Titled as #NBK109.

Suryadevara Naga Vamsi and Sai Soujanya are producing the film on Sithara Entertainments and Fortune Four Cinemas, respectively. Srikara Studios is presenting the film. More updates will be announced soon.

 

NBK-109-twitter

Samantha for “Sapta Sagaralu Dhaati Side B” – People Media Factory Proudly Presents the film to Telugu Audience on November 17th

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు సగర్వంగా అందిస్తున్న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” కోసం సమంత

ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

నవంబర్ 4న సాయంత్రం 06:06 గంటలకు అగ్ర కథానాయిక సమంత ఈ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్, దానిలోని ఆసక్తికరమైన మరియు ప్రత్యేక లక్షణాల కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల మేకర్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు. నవంబర్ 17 నుండి థియేటర్‌లలో ప్రేక్షకులు ఈ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఆస్వాదిస్తారని విశ్వసిస్తున్నారు.

తెలుగులో “సైడ్ ఎ” ఘనవిజయం సాధించినట్లుగానే, “సైడ్ బి” కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ప్రతిభావంతుడైన హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి తన కెమెరా పనితనంతో కట్టి పడేయగా, చరణ్ రాజ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు.

ట్రైలర్ లాంచ్ ఈ ఆకర్షణీయమైన ప్రయాణంలో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ అద్భుతమైన సినిమా ప్రయాణాన్ని తెలుగు ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర బృందం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

నవంబర్ 17న “సప్త సాగరాలు దాటి సైడ్ బి” ఘనంగా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిత్రం: సప్త సాగరాలు దాటి
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్
రచన– దర్శకత్వం : హేమంత్ ఎం రావు
బ్యానర్ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల

Samantha for “Sapta Sagaralu Dhaati Side B” – People Media Factory Proudly Presents the film to Telugu Audience on November 17th

November 4th: T.G. Vishwa Prasad & Vivek Kuchibhotla of People Media Factory are delighted to announce the highly-anticipated trailer for “Sapta Sagaralu Dhaati Side B,” promising another remarkable cinematic experience for Telugu film enthusiasts on November 17th.

The trailer was digitally launched by Samantha Garu on November 4th at 06:06 PM. This eagerly awaited trailer has garnered significant attention due to its intriguing and unique qualities, setting it apart from Part A. We’re enthusiastic about the audience’s response, and we are confident that they will thoroughly enjoy the film in theaters starting from November 17th.

Following the immense success of Side A in Telugu, we are certain that “Side B” will once again capture the hearts of Telugu audiences. The film, directed by the talented Hemanth Rao, boasts an impressive cast featuring Rakshit Shetty, Rukmini Vasanth, and Chaithra J Achar in the lead roles. Advaitha Gurumurthy, renowned for his remarkable cinematography, serves as the Director of Photography, while the music, an integral part of this film, is composed by Charan Raj.

The trailer launch marks the beginning of an exciting new chapter in this captivating saga, and we eagerly anticipate sharing this incredible cinematic journey with you.

Stay tuned for more updates and mark your calendars for the grand release of “Sapta Sagaralu Dhaati Side B” on November 17th.

 

19 - Trailer Announcement PLAIN 27 - 3 hours to go PLAIN SSE SIDE B ANNOUNCEMENT

Leo will be released in Telugu States as per schedule on October 19: Producer S. Naga Vamsi

తెలుగునాట అక్టోబర్ 19వ తేదీనే లియో విడుదల: నిర్మాత సూర్యదేవర నాగవంశీ

దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘లియో’. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లియో విడుదలకు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ కీలక విషయాలను పంచుకున్నారు.

- అక్టోబర్ 19న ఉదయం 7 గంటల షోలతో లియో విడుదలవుతుంది. దసరా సెలవుల్లో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను.

- తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది.

- లియో తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించి ఉన్నారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటాం.

- ఈ సినిమా బాగుంటుంది అనే నమ్మకంతోనే తెలుగు హక్కులు తీసుకోవడం జరిగింది. దర్శకుడు లోకేష్ నిరాశపరచరు అని అనుకుంటున్నాను.

- థియేటర్ల సమస్య లేదు. ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా విడుదలవుతుంది. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. భగవంత్ కేసరి ఘన విజయం సాధించాలని, అంతకంటే పెద్ద హిట్ సినిమా బాలకృష్ణ గారితో మేము తీయాలని కోరుకుంటున్నాను.

- మేము నిర్మించిన వాతి(సార్) చిత్రాన్ని తమిళ్ లో లలిత్ కుమార్ గారు విడుదల చేశారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో ఇప్పుడు తెలుగులో మేము లియో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

- ఈ ఆదివారంలోపు హైదరాబాద్ లో లియో వేడుక నిర్వహించాలి అనుకుంటున్నాం. లోకేష్ కనగరాజ్ గారు, అనిరుధ్ గారు, త్రిష గారు వస్తారు.

- గుంటూరు కారం మొదటి పాట విడుదల ఎప్పుడనేది దసరా సమయంలో తెలియజేస్తాం.

Leo will be released in Telugu States as per schedule on October 19: Producer S. Naga Vamsi

Following the restraining orders issued by the City Civil Court in Hyderabad to stop the screening of actor Vijay’s much-awaited movie Leo on October 19 in Telugu States, producer Suryadevara Naga Vamsi responded on it stating that the issue is being amicably sorted and the Telugu version will be released in the Telugu States as per schedule.

Speaking to media persons on Tuesday, producer Naga Vamsi, who acquired the distribution rights of ‘Leo’ in Andhra Pradesh and Telangana, said optimism that ‘Leo’ would entertain audiences in theatres until Dasara. “Today at noon, there was a slight miscommunication took place when a person approached the court instead of approaching us. He claimed that the title Leo was already registered somewhere in Vijayawada. We’ve identified the problem and it is being sorted in an amicable manner. The title has been registered and the film has been censored too. We’ve mutually agreed to sort out the issue because the person who registered it shouldn’t be at a loss and the film should arrive in theatres as per the schedule. So, there will be no further impediment for the release of the Telugu version of Leo,” he added.

Can we see a collaboration with Tamil star Vijay soon in the future?
“Leo was not planned with a view of a film collaboration with Vijay. I will definitely make a movie with Vijay in the future. I took a shot thinking that Leo would be a hit given his mass fanbase all across the regions. Definitely, Lokesh Kanagaraj won’t disappoint us.”

Do you have any issues with theatres as two Telugu movies Bhagavanth Kesari and Tiger Nageswara Rao are being released on the same dates?
“I already told this during the press meet of ‘Mad’. I have no issues with the theatres in the Telugu States. Theatres have been sorted for Nandamuri Balakrishna’s film Bhagavanth Kesari, there are plenty for Ravi Teja garu’s film. And Leo too has considerable theatres. I hope Telugu films will become a massive hit.”

Produced by Lalit Kumar and Jagadish Palanisamy, Leo is helmed by Lokesh Kanagaraj, and the screenplay was co-written by Lokesh, Rathna Kumar, and Deeraj Vaidy. Starring Bollywood star Sanjay Dutt, actress Trisha Krishnan, Arjun, Gautham Vasudev Menon, Mysskin, Priya Anand, Babu Antony, Manobala and George Maryan among other actors in key roles, the film raised massive expectations among fans. The runtime of Leo is 2 hours and 44 minutes.

If you recall, the Film Chambers has once resolved that dubbed films should be given second priority. Will Leo be considered a dubbed film in this case?
“See, post-COVID-19, the scenario has been changed. There are no limitations in place. There is no Telugu film or Tamil film as such. Audiences welcome any film that has great content. If you observe, LeoTelugu is trending on Twitter. The advance bookings of Leo in the Telugu States have surpassed the Telugu flicks. You can imagine the craze.”

Naga Vamsi said that Leo cast Trisha, Anirudh and director Lokesh Kanagaraj are expected to arrive in Hyderabad for the film promotions soon this week.

WhatsApp Image 2023-10-17 at 16.58.32_e3a41bfd