DJ Tillu’s success has motivated us to introduce younger talents into the industry: Producer Suryadevara Naga Vamsi

“డిజె టిల్లు” విజయం కొత్త వాళ్లను మరింత ప్రోత్సహించే ధైర్యాన్నిచ్చింది – నిర్మాత సూర్యదేవర నాగవంశీ*
* డిజె టిల్లు సీక్వెల్ సినిమా సిద్ధు తోనే త్వరలో…

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డిజె టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు చిత్ర నిర్మాత, హీరో, దర్శకుడు. అదేమిటో వారి మాటల్లోనే….

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…నేను ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు డిజె టిల్లుతో వింటున్నా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇవాళ తెలిసింది. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము థియేటర్ లో 10శాతం వర్కవుట్ అవుతుంది అని అనుకున్న సీన్స్ అంతకు ఎన్నో రెట్లు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. తమన్ గారి నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. నేను ఇక్కడి వాడినే అందుకే ఆ బాడీ లాంగ్వేజ్, మాటతీరు అన్నీ సహజంగా వచ్చాయి. స్వయంగా రాసుకున్న డైలాగ్స్ కాబట్టి సులువుగా డిజె టిల్లులా మాట్లాడగలిగా. ఇందాకే త్రివిక్రమ్ గారిని కలిసి వచ్చాం. ఆయన స్క్రిప్టు చూసి ఎక్కడ ఎంత రెస్పాన్స్ వస్తుందని చెప్పారో ఇవాళ థియేటర్ లో అదే రిపీట్ అవుతోంది. ఇది ఆయనకు సినిమా మీదున్న అవగాహనకు నిదర్శనం. ఆయన పరిచయం మా అదృష్టం.  నిర్మాతకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..డిజె టిల్లు కథ విన్నప్పుడే ఈ రకమైన స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించాం. ఇవాళ మా అంచనా నిజమైంది. సినిమా విజయం సాధిస్తుందని తెలుసు. అంతకంటే పెద్ద విజయాన్ని అందించారు. ఇలాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నప్పుడే రిస్క్ చేయాలనే ధైర్యం కలుగుతుంది. ఇంకా కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారని గతంలో అడిగారు. ఇలాంటి ప్రాజెక్టులే ఎక్కువ సంతృప్తినిస్తాయి. ఏ స్థాయి సినిమా చేసినా మా సంస్థకున్న పేరును కాపాడుకోవాలి. రేపు భీమ్లా నాయక్ వస్తోంది. అది చూసిన వాళ్ళు డిజె టిల్లును ఏదో చుట్టేశారు అనుకోకూడదు. ఏ సినిమా అయినా మా సంస్థ గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి. మేము అలాగే ప్లాన్ చేసుకుంటాం. డిజె టిల్లు సీక్వెల్ సినిమానే సిద్ధు నెక్ట్ పిక్చర్ గా చేస్తున్నాం. అన్నారు.

దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ…ఇవాళ థియేటర్ లకు వెళ్తి అక్కడ ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం. డిజె టిల్లు కు మేము ఇంత క్రేజ్ సృష్టించామా అనిపించింది. సినిమాలో సంభాషణలకు వస్తున్న స్పందన,ఈ క్రెడిట్ అంతా నేను సిద్ధుకు ఇస్తాను. నిర్మాత నాగవంశీ గారి నమ్మకం, మా కష్టం అంతా ఇవాళ ఈ విజయానికి కారణం అంటూ ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను అన్నారు.

 
DJ Tillu’s success has motivated us to introduce younger talents into the industry: Producer Suryadevara Naga VamsiSiddhu Jonnalagadda, Neha Shetty starrer DJ Tillu, directed by Vimal Krishna, has opened to a terrific response and is running to packed houses across the globe upon its release today i.e. February 12. The film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, in collaboration with Fortune Four Cinemas. The producer Naga Vamsi, actor Siddhu Jonnalagadda and director Vimal Krishna expressed their happiness on the blockbuster reception for the film.

“I’ve never come across the word blockbuster in my career and I only got to experience that high today. I’m flooded with calls and messages. The crowd responses are way beyond what we expected. S Thaman’s background score played a key role in enhancing the impact of the film. Having grown up in Hyderabad, the body language, dialogue delivery of a character like DJ Tillu came to me quite naturally. The fact that I also wrote the dialogues made the job easier for me,” actor Siddhu Jonnalagadda said.

“We had just met Trivikram garu and the box office response is exactly like what he had predicted. It truly shows us the trust he had in the film and a team like ours. It was a privilege to associate with him and I’m thankful to audiences for making DJ Tillu a huge success,” he further added.

“I foresaw the reception for DJ Tillu right when I heard the story. Our prediction has come true. We’ve always been confident of its success but this unanimous response has left us overjoyed. This has motivated us to take up many more challenging scripts, encourage new talents to the industry. It’s extremely satisfying to see a film made on a small scale achieving such a monumental success. Regardless of the budget, our only aim was to make a good film, live up to the reputation of our banner and we never compromised on the quality of DJ Tillu. We’ll once again be collaborating with Siddhu for the sequel to DJ Tillu,” producer S Naga Vamsi shared.

“I couldn’t believe my eyes when I saw crowds roaring in laughter at the theatres. As a team, we’ve managed to do the impossible with DJ Tillu. Siddhu deserves a major share of the credit for the film’s dialogues. It’s our team effort and the trust of S Naga Vamsi (garu) that we managed to create such an impact among audiences,” director Vimal Krishna stated.

IMG_20220212_161122 DSC_6588 IMG_20220212_161104 DSC_6590_1 IMG_20220212_161013 DSC_6582