*It’s a wrap for the first schedule of Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh

పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’  మొదటి షెడ్యూల్ పూర్తి
*యాక్షన్ మరియు ఎంటర్ టైన్ మెంట్ సన్నివేశాల  చిత్రీకరణ
పవన్ కళ్యాణ్ తన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ వారంలో ముగిసింది.
ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు
మరియు పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు తెరకెక్కించారు. అలాగే రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.నాయిక శ్రీలీల తో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.
మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం ఎంతో సంతృప్తిగా ఉంది. బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు మించి అలరిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదిరిపోయే డైలాగ్స్ మరియు స్పెల్-బైండింగ్ మ్యానరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో ఈ చిత్రం భారీస్థాయిలో రూపొందుతోంది. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయనంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ ఇలా అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది.
గబ్బర్ సింగ్ కోసం మెమరబుల్ ఆల్బమ్‌ ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు
రచన-దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సీఈవో: చెర్రీ
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్
ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రావిపాటి చంద్రశేఖర్, హరీష్ పాయ్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
 
Ustaad Bhagat Singh to present Pawan Kalyan in a never-seen-before action avatar, a massive sequence with over 1000 junior artistes canned 
 
*It’s a wrap for the first schedule of Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh
Pawan Kalyan is reuniting with his blockbuster Gabbar Singh director Harish Shankar for yet another mass entertainer Ustaad Bhagat Singh. Sreeleela plays the female lead in the film produced by Naveen Yerneni and Y Ravi Shankar under the leading Telugu banner Mythri Movie Makers. The first schedule of the much-awaited collaboration, where sequences featuring the lead pair and other key actors, was wrapped up this week.
In the schedule spanning eight days, the makers filmed a wide range of sequences. While high-voltage action scenes were choreographed under the supervision of the stunt director duo Ram-Lakshman involving over 1000 junior artistes and several kids, a series of entertainment-driven segments and the romance portions were shot in a police station set as well. Several actors like Narra Srinu, Chammak Chandra, Giri, Temper Vamsi, Nawab Shah KGF fame Avinash, took part in the schedule too.
It is believed that the various scenes shot in the first schedule were received with roaring applause by the entire crew and other members of the set. The makers, thrilled with the energetic vibe on the set, are already quite confident of surpassing expectations from the masses, who expect nothing short of a blockbuster from the Gabbar Singh combo. Harish Shankar has taken adequate care with the pre-production and also to project Pawan Kalyan in a different light with the dialogues and spell-binding mannerisms, guaranteeing a feast for audiences.
The effortlessly stylish posters of Pawan Kalyan from Ustaad Bhagat Singh are a hit with his fans. The film is being made on a lavish scale and the story has all ingredients in the right mix to leave crowds in awe. Ashutosh Rana, Gauthami, Naga Mahesh and Temper Vamsi essay other important roles. Beyond cinematographer Ayananka Bose and art director Anand Sai, the film comprises a top-notch technical team, including editor Chota K Prasad.
Composer Devi Sri Prasad, who came up with a memorable album for Gabbar Singh and set a high standard for mass numbers, is leaving no stone unturned to come up with another foot-tapping, blockbuster album. Other details surrounding the film and the upcoming schedule will be out shortly.
Ustaad-Still-1 Ustaad-Still-2 (1)